సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత అందులోనూ కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చోటుచేసుకోవడంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రముఖుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. వైజాగ్ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్‌ను చెన్నై ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment