
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడ్ని ఎయిర్‌పోర్టు పోలీసులు శుక్రవారం విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకురానున్నారు.
నిందితుడి తరఫు న్యాయవాది సలీం వేసిన బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో శ్రీనివాసరావుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment