ఫైల్ ఫోటో
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే ఆయనకు ఏం జరిగిందని ఆరా తీయడం, యోగ క్షేమాలు తెలుసుకోవటం కంటే.. ఆ సంఘటనను ఎలా వాడుకోవాలి అన్న కోణంలోనే ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ ఆలోచించాయి. సంఘటన జరిగిన గంటలోపు రాష్ట్ర హోంమంత్రి మాట్లాడిన తీరు చూస్తే.. జగన్ పట్ల వారికి ఉన్న అసహనం ఉందో తెలు స్తోంది. అదే తీరున రాష్ట్ర డీజీపీ సైతం మాట్లాడారు. ఇక సీఎం చంద్రబాబు ప్రజలంతా తనపట్ల సానుభూతి చూపాల్సిందే అన్నట్లు వ్యవహరించారు.
పదేళ్ల పాటు అధికారానికి దూరమైన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు తొలి రోజు నుంచీ ఒకే పనిలో ఉన్నారు. అదేమంటే.. ఈ పదవిని శాశ్వతంగా తాను, తన కుమారుడే అనుభ వించేలా చూసుకోవడం.. ఇదేదో నేను చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా ఆయనే పార్టీ కార్యక్ర మాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పదేపదే ప్రక టించిన వాస్తవం. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉంటేనే ఎంతటివారైనా అధికా రంలోకి రాగలరు, కొనసాగగలరు. దురదృష్టవ శాత్తూ చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వా నికి ప్రజల ఆదరాభిమానాలు ఎంత ప్రయత్నించినా దక్కట్లేదు.
దీంతో చంద్రబాబు తనకు, తన ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన వారిపై, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న వారిపై దాడులు చేసేందుకు పూనుకు న్నారు. అక్రమాలను అడ్డుకున్న ఒక మహిళా ఎమ్మా ర్వోపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన అప్పట్లో అధికారులనూ, ప్రజలనూ భయభ్రాంతులకు గురి చేసింది. అయి నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేపైన సీఎం చంద్ర బాబు ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
రాజధాని నగరంగా భావిస్తున్న విజయవాడలో ఒక మంత్రి, ఒక ఎంపీ, తెలుగుదేశం నాయకులు పట్టపగలు ఒక రవాణా కమిషనర్‌పై దాడి చేశారు. తాను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు చాలవ న్నట్లు.. న్యాయంగా, నిజాయితీగా వ్యవహరించిన అధికారిపై విరుచుకుపడ్డారు ఆ ఎంపీ. హైకోర్టు జోక్యం చేసుకుందే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎంపీపైన కానీ, మంత్రిపైన కానీ ప్రజలు ఆశించిన రీతిలో చర్యలు తీసుకోలేదు. అదే నగ రంలో మరొక ఎమ్మెల్యే భూముల్ని ఆక్రమిస్తూ.. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ రచ్చకెక్కారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ప్రజలూ, అధికారులే కాదు.. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, ఆ పార్టీల ముఖ్య నాయకులనూ టీడీపీ వదిలిపెట్టలేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు దైవ దర్శనం కోసం తిరుమలకు వస్తే టీడీపీ నాయ కులు, కార్యకర్తలు అమిత్ షాపై దాడి చేయాలని ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్షీ్మ నారాయణపై టీడీపీ తమ్ముళ్లు బరి తెగించి దాడి చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ తప్పు బీజేపీదే అన్నట్లుగా చిత్రీకరించడానికి బాబు, ఆయనకు బాకాలూదే మీడియా విఫలయత్నాలు చేశాయి.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, ప్రజల్లో తిరుగుతున్న పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన వైఎస్ జగన్‌పై ఏకంగా హత్యాయత్నమే జరిగింది. ఇన్ని కళ్లముందు జరుగుతున్నా చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు అంతా తామే బాధి తులమన్నట్లుగా నటించటం, ప్రజ లంతా తమపట్ల సానుభూతి చూపాలన్నట్లుగా మొసలి కన్నీళ్లు కార్చడం, దీన్నంతా వారి అనుకూల మీడియా ప్రజ లపై రుద్దటం ఎంత వరకు సమంజసం?
పైన పేర్కొన్న అన్ని దాడుల్లోనూ, అన్ని సంద ర్భాల్లోనూ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? కేసులు నమోదు చేయాల్సింది ఎవరు? దోషుల్ని పట్టుకోవాల్సింది, వారికి శిక్ష పడేలా చేయాల్సింది ఎవరు? దొంగ నాటకాలు ఆడుతోంది ఎవరు? చంద్రబాబు స్టైల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని నిందిస్తారు. ఆఖరికి ప్రజల్ని కూడా వదిలిపెట్టరు. తాను వేసిన రోడ్లపై తిరగొద్దం టారు. ఇదంతా ఘనకార్యంలాగా ఆయనకు బాకా లూదే మీడియా ప్రజలపై రుద్దుతుంది. హత్యాప్రయత్నం జరిగిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు జగన్‌ని పలకరించారు తప్పితే.. ఏపీ సీఎంగానీ, ఆయన సహచ రులుగానీ మర్యాదకైనా జగన్‌తో మాట్లాడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం?
వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com
Comments
Please login to add a commentAdd a comment