Purighalla Raghuram
-
వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటీ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. 1998 మే నెలలో పోఖ్రాన్2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాలా సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపివేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ, అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్‌పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో.. మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు.. ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్‌పేయి ప్రభుత్వం.. ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు. బీజేపీకి కావాల్సింది ఏంటి? ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని, స్వేచ్ఛను అందించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అన్నివిధాలా దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరింపచేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్తా, నాయకుడూ పఠించే, పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్‌పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రెండంకెలు, మూడంకెల సీట్లను సాధించి, క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. రెండున్నర దశాబ్దాలపాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో.. ఇక భారతదేశంలో ఏక పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లు, 300లకు పైగా సీట్లు సాధించింది. భారతదేశంలో నలు దిక్కులా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధించిన, సాధిస్తున్న విజయం ఇది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పటి వరకూ అధికారం చేపట్టని, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులకు సరితూగే స్థాయిలో ప్రజాకర్షక నాయకులు లేని కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని, జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం. స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య ప్రభుత్వ పోకడలకు ప్రభావితమైన నాయకులు భారతీయ ఆత్మతో సంబంధంలేని పోకడలను బలంగా నమ్మి, దేశంపైన బలవంతంగా రుద్దుతున్న సమయంలో భారతీయతత్వంతో ‘సమగ్ర మానవతావాదం’ పేరిట మనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ ‘అంత్యోదయ’ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ, సహకారాలు అందేలా మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి, అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్తపుంతలు తొక్కించి, మధ్య దళారులను, లీకేజీలను అరికట్టింది. భారతీయ చారిత్రక సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ‘దేశం ముందు, పార్టీ తర్వాత, స్వప్రయోజనాలు చివరాఖరున’ అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు.(నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం) వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్ బీజేపీ సీనియర్ నాయకులు -
జన భాగస్వామ్యంతో అయోధ్య మందిరం
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారం కాబో తోంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. అత్యంత ఉన్నతమైన నిర్మాణ విలువలతో మరో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. శ్రీరాముడు వనవాసం చేసింది 14 సంవత్సరాలైతే.. అయో ధ్యలోని రామ్ లల్లా 28 ఏళ్లకుపైగా గుడార వాసం చేశారు. శ్రీరాముడి కోసం నిర్మిస్తున్న ఈ ఆలయం అఖండ భారతదేశంలోని హిందువుల చైతన్యానికి, స్వాభిమానానికి కూడా ప్రతీకగా నిలిచిపోనుంది. ఈ ఆలయ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఖర్చు కానుంది. దేశంలోని ప్రతి ఒక్క హిందువుకూ ఈ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యే హక్కును దృష్టిలో ఉంచుకుని విరా ళాలు సేకరించే కార్యక్రమం మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ పూర్తి చేయనుంది. విరాళాలు స్వీకరించేందుకు వీహెచ్‌పీ కార్య కర్తలు ఇంటింటికీ వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 15 నుంచి 31 వరకు ఈ విరాళాల స్వీకరణ జరుగుతుంది. హిందు వులందరూ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యేలా కనీస విరాళం 10 రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు ఇచ్చే విరా ళాలను అత్యంత పారదర్శకంగా ట్రస్టుకు జమ చేస్తారు. రాముడు పుట్టింది అయోధ్యలోనే. రాముడు అవతారం చాలించిన తర్వాత హిందూరాజులు ఈ ప్రదేశాన్ని పాలిం చారు. తదనంతర కాలంలో ముస్లింలు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి దండయాత్రలు చేశారు. అయోధ్యలోని రాముని ఆలయాన్ని ధ్వంసం చేస్తే హిందువుల మనోబలం దెబ్బతీసినట్లేనని భావించిన బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ 1528లో అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే మూడు గుమ్మటాలు నిర్మించాడు. ఇది ఉన్న కొండపేరు రామ్ కోట్. దీనిని బట్టే ఇది శ్రీరాముడి జన్మస్థానం అని స్పష్టమవు తోంది. ఆ తర్వాత మూడు గుమ్మటాల కూల్చివేత, ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ చేసిన, చేస్తున్న అలు పెరుగని పోరాటం అంతా ఒక అద్భుత చరిత్ర. 1990లో మొదటి కరసేవ జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 వేల మంది కరసేవకులు ఆ కార్య క్రమంలో పాల్గొనగా, వీరిలో 2 వేల మంది మహిళలు. చాలా మంది వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అయోధ్య చేరుకున్నారు. ఎల్కే అడ్వాణీ, అశోక్ సింఘాల్ వంటి ఎందరో ప్రముఖులు రాముని ఆలయం కోసం దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశానికి అతిపెద్ద సమస్య అయోధ్య రామ మందిర నిర్మాణమేనని దశాబ్దాలుగా ఎంతో మంది అభివర్ణిస్తూ వచ్చారు. హిందువులు రాత్రికి రాత్రే గుడి కట్టేస్తారని కూడా కొందరు ప్రచారం చేశారు. అలా చేస్తే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువుపోతుందంటూ ఇంకొందరు చర్చలు లేవనె త్తారు. అయితే రాముని మందిర నిర్మాణం ఎటువంటి వివా దాలకు, భవిష్యత్ లిటిగేషన్లకు తావులేకుండా వైభవోపేతంగా జరుగుతుందని అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా రాతి శిలలు చెక్కు తున్న వారి దగ్గరి నుంచి సాధువులు, సంతుల వరకు అంతా విశ్వసించారు. వారు నమ్మినట్లుగానే ఈ వ్యవహారం 492 ఏళ్ల తర్వాత వివాదాలకు తావివ్వకుండా పరిష్కారం అయ్యింది. ఎటువంటి హింస, రక్తపాతాలు లేకుండానే తుది నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత కూడా దేశంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. శాంతియుత వాతావరణంలో ఆలయ నిర్మాణం గురించి దేశం చర్చించుకుంటోంది. ఒకప్పుడు ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన చాలామంది.. నిజమైన పరిష్కారం లభించిన రోజు దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంటుందని, హింసకూ ఆస్కారం ఉంటుందని భావించారు. కానీ, అందుకు భిన్నమైన వాతావరణం ఈ రోజు ఉంది. ఇన్నేళ్ల పాటు ఇంతటి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలోను, ఇప్పుడు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ వీహెచ్‌పీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. బలమైన నాయకత్వంతో పాటు విలువలతో కూడిన ఆలోచనలు, వాటికి తగ్గ ఆచరణ, దేశవ్యాప్తంగా అంద రినీ కదిలించగలిగేంత సమర్థత ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమ వుతాయి. వీహెచ్‌పీ సంస్థ పరంగానూ, కరసేవకుల పరం గానూ మెచ్చుకోదగ్గ రీతిలో వ్యవహరించిందని చెప్పాలి. అయోధ్యలో నిర్మించేది కేవలం ఆలయం మాత్రమే కాదు. అది రాముడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, న్యాయం చేయడం. దాదాపు మూడు దశాబ్దాలుగా గుడారానికే పరిమి తమైన రాముడికి సముచిత గౌరవం ఇవ్వడం. హిందువుల మనోబలాన్ని దెబ్బతీయాలని ఆనాడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. ఆ భావన తప్పు అని రుజువు చేయడం. నిజాన్ని పూడ్చిపెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందని చాటి చెప్పడం. అఖండ భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం, స్ఫూర్తి నింపడం. -పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు, ఢిల్లీ -
లోక నాయకుడు నరేంద్ర మోదీ
ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్న జీ7 గ్రూపులోకి భారతదేశాన్ని ఆహ్వా నించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా వైరస్ దేశంలో 20 నుంచి 30 కోట్ల మందికి సోకుతుందనీ, 50 లక్షల మంది దాకా చనిపోతారనీ ఎంతో మంది ప్రచారం చేసీ, చేసీ అలసిపోయారు. కానీ, కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కోగలిగిన దేశం భారత్. దీనికి కారణం నరేంద్ర మోదీ. ఏ క్షణమైనా చైనా భారతదేశం మీద యుద్ధానికి దిగొచ్చు అన్న రీతిలో వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండి చైనా సైలెంట్ అయింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. దీనికి కారణం నరేంద్ర మోదీ. కేవలం జనాకర్షణ మాత్రమే కాకుండా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడుగా, ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పొందిన నాయకుడుగా నరేంద్ర మోదీ గతంలో భారతదేశం ఎన్నడూ చూడని బలమైన ప్రధాన మంత్రిగా మన్ననలు పొందుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఏడో ఏట అడుగుపెట్టకముందే పరిష్కారాలు చూపించారు. దశాబ్దాలుగా ప్రజల్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాల బూజు దులిపిన మోదీ పార్లమెంటు వేదికగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన చట్టాలను అమల్లోకి తెచ్చారు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతి అనాగరికం అంటూ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, ఒకే దేశంలో ఒకే పన్ను వ్యవస్థ ఉండాలంటూ ఆర్థిక ప్రగతి కోసం జీఎస్టీ చట్టాన్ని, దేశం మొత్తం ఒక్కటే అంటూ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేయడం, బ్యాంకుల విలీనం... కాంగ్రెస్ పార్టీ తన రాజ కీయాల కోసం, తమ నాయకుల అసమర్థతను కప్పి పుచ్చు కునేందుకు ఎన్నో తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నరేంద్ర మోదీ సరిచేస్తూ వస్తున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే నేతగా కూడా మోదీ పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. దిల్లీ నుంచి రూపాయి పంపిస్తే పది పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని ఒకప్పుడు రాజీవ్ గాంధీ అంటే... దాన్ని చక్కదిద్దేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వ పథకాల లబ్ధిని జమ చేస్తున్నారు మోదీ. చిన్న, సన్నకారు వ్యాపారులు, యువతను రాయితీలు, రుణాలు ఇచ్చి ప్రోత్సహి స్తున్నారు. కరెంటు సదుపాయం లేని గ్రామాల్లో వెలుగులు నింపి, పొగగొట్టం దగ్గర దగ్గిదగ్గి అలసిపోయిన మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇచ్చి, 50 కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సదుపాయాలు అందించి, దేశ వ్యాప్తంగా రైతులకు పంటల బీమా కల్పించి అండగా నిలుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించిన చైతన్యం పెంచారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఎగుమతులు పెరిగాయి. రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల కల్పనా సామర్థ్యం పెరిగింది. పెరిగినవే కాదు, తగ్గినవీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఏదో ఒక వర్గాన్ని, మతాన్ని, గ్రూపుని సంతోషపెట్టడం కోసం ఈ దేశంలో చాలాకాలంగా రాజకీయాలు నడిచాయి. మోదీ ఈ తరహా రాజకీయాలకు దిల్లీ స్థాయిలో స్వస్తి పలికారు. అవినీతికి కళ్లెం వేశారు. దిల్లీ అధికార కారిడార్లలో పైరవీకారులు కాలు పెట్టకుండా చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే విధానాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవకుండానే వారికి జరగాల్సిన పనులు జరిగేలా, రావాల్సిన నిధులు వచ్చేలా చూశారు. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రణాళికలో భాగం చేశారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని రగిలించారు. కరోనా కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఉన్న దేశాలే కుప్పకూలిపోతున్న తరుణంలో భారతదేశం గట్టిగా నిలవగలిగిందంటే దానికి మోదీ ముందుచూపు, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకత్వ పటిమ, దేశ ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకురాగలిగిన ఆయన సామర్థ్యాలే కారణం. బ్రిటన్ వంటి అగ్రరాజ్యం, తక్కువ జనాభా ఉన్న దేశం కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోలేక, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చి రక్షించుకోలేక నానా అవస్థలు పడుతోంటే, భారతదేశం మాత్రం ఇరుగుపొరుగు దేశాలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అడ్డుపుల్లలు వేసే రాజకీయ నాయ కులు, కుట్రలు, కుతంత్రాలు చేసే గ్రూపులు, అపనమ్మ కాలను పెంచేలా అవాస్తవాలను ప్రచారం చేసే నిపుణులు పుష్కలంగా ఉన్నప్పటికీ; కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్‌లోకి వెళ్లిపోతుందని కొన్ని రేటింగ్ సంస్థలు నివేదికలు ఇస్తున్నప్ప టికీ; భవిష్యత్‌లో అగ్రరాజ్యం కాగల సత్తా భారత దేశానికి మాత్రమే ఉందని ప్రపంచం యావత్తూ ఏకాభిప్రాయా నికి వచ్చేలా చేయగలిగిన నాయకుడు నరేంద్ర మోదీ. పురిఘళ్ల రఘురామ్ (వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ) -
మోదీ.. ప్రజల్ని గెలిపించగల నాయకుడు
కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్ మాత్రమే. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచంలోనే గొప్పది అని పేరుపడిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) నివేదిక చెప్పిన మాట. కరోనా వైరస్ మహమ్మారిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారత్. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా అంటున్న మాట. ఎందుకంటే.. వందవ కేసు నమోదైన రోజు నుంచి ముప్పై రోజుల్లో భారత్‌లో నమోదైన మొత్తం కేసులు 15 వేలు కూడా దాటలేదు. కానీ, ప్రపంచానికే పెద్దదిక్కుగా పరిగణించే అమెరికాలో ఏడు లక్షలు దాటితే, బ్రిటన్, చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సైతం భారత్‌కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మనకంటే ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ మాత్రమే. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ కరోనాపై యుద్ధంలో చేతులెత్తేశాయి. ఆయా దేశాధినేతలంతా తలలు పట్టుకుంటే, ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. కొన్ని దేశాధినేతలకూ, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకింది. దేశాల సరిహద్దులు ఆపలేని, చిన్నా, పెద్దా.. పేద, ధనిక అన్న భేదం లేని వైరస్ ఇది. ఇలాంటి వైరస్‌ను భారత్ చాలా చక్కగా కట్టడి చేసింది. కానీ, ఒకే ఒక్క మతపరమైన కార్యక్రమం కారణంగా దేశంలో కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. కరోనా కేసుల్లో సగానికి పైగా ఆ మత కార్యక్రమ సంబంధమైనవే. ఇక్కడ మతాన్ని కానీ, ఆ మత విశ్వాసాలు పాటించే వారిని కానీ నిందించాల్సిన పనిలేదు. వారి తప్పూ లేదు. కానీ, అందులో ఉన్న కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారికి మంచి చెడ్డలు చెప్పేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే విషాదం. ఇప్పుడు భారత్ ఆర్థికంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా చాలా భద్రమైన చేతుల్లో ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నప్పుడు అమెరికా సహా ఏ దేశమూ నేనున్నానంటూ ఒక పెద్దన్న పాత్ర పోషించలేదు, ఒక్క భారత్ తప్ప. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ సార్క్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత చొరవతో, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా కోటి అమెరికన్ డాలర్లతో నిధిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో మోదీ ఫోన్లో మాట్లాడారు. కరోనాపై పోరాటానికి భారత్ తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. మోదీ చొరవను, నాయకత్వ ప్రతిభను అమెరికా, రష్యాలు ప్రశంసించాయి. ‘ప్రపంచం విపత్తుల్లో ఉన్నప్పుడు కావాల్సింది ఇలాంటి నాయకత్వమే’ అని అమెరికా మోదీని అభినందించింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది. కరోనా కేసుల్ని, అనుమానితుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిక్షణం సమీక్షిస్తోంది. మహమ్మారి ఉధృతిని తట్టుకునేందుకు అవసరమైనన్ని వైద్య సామగ్రిని, యంత్రాలను సిద్ధం చేసింది. అవసరానికి తగ్గట్టుగా మందుల్ని కూడా దగ్గర ఉంచుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్‌లో లాగా వైద్యులు డస్ట్‌బిన్ కవర్లను కప్పుకునే దుస్థితి భారతదేశంలో లేదు. ధీమానే కాదు బీమాను కూడా అందించి అభివృద్ధి చెందిన దేశాలు సైతం తనవైపు చూసేలా చేస్తోంది. ఇది ఒక యుద్ధం. ప్రపంచ దేశాలన్నీ ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. ఇలాంటి యుద్ధ సమయంలో మోదీ నాయకత్వాన్ని అన్ని దేశాలూ అభినందిస్తోంటే విమర్శలు మాత్రం ఒక దేశం నుంచే వినబడుతున్నాయి. అది మన శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ విమర్శలు వినిపిస్తోంది మన సొంత దేశం నుంచే. ఇలాంటి విపత్తులోనూ రాజకీయం చేయాలని చూసే కాంగ్రెస్ పార్టీ నాయకులే నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు మోదీపై పోటీకి దిగి, రోడ్డెక్కి ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సైతం మోదీ సమయానుకూల నిర్ణయాల వల్లే దేశంలో కరోనా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని బహిరంగంగా ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం కోడిగుడ్డుపై కూడా ఈకలు పీకుతున్నారు. దేశంలో లాక్డౌన్ విధించి 21 రోజులు గడుస్తున్నాయి. తొలిదశ పూర్తయ్యింది. రెండో దశ మొదలు కానుంది. ఈ రోజు వరకూ దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క ఆకలి చావు కూడా లేదు. నిజమే, కొంతమంది వలసకార్మికులు కాలి నడకన వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టి, మార్గమధ్యంలో చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. కానీ, వారు అప్పుడు ఉంటున్న నగరాలను వదిలిపెట్టాల్సిన పనిలేదు. సొంతూళ్లకే వెళ్లాల్సిన పనీ లేదు. ఎక్కడివారక్కడ ఉండటం వల్ల నష్టం కూడా ఏమీ లేదు. అందరికీ ఆహారం, మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రయాణాలను రద్దు చేసినా, రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేసినా, నియమాలను, నిబంధనలను అతిక్రమించి ఇంకా కొందరు సొంతూళ్లకు వెళ్లాలనే తపనతో ఆపదల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తన బాధ్యత ప్రకారం ప్రభుత్వం ప్రజలందరికీ భరోసా కల్పిస్తోంది. నూటముప్పై కోట్ల మంది ప్రజల్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. కనీవినీ ఎరుగని మానవ విపత్తును ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో ఈ విశ్వంలో ఎన్నడూలేనంత మందిని లాక్డౌన్ చేసి, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. భారత్‌లోని ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చాటిచెప్పేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేందుకు, మనోధైర్యాన్ని నూరిపోసేందుకు పలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ‘దేశం ముందు.. వ్యక్తిగతం ఆఖరికి’ అన్నది భారతీయ జనతాపార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా రుజువు చేసి, కరోనాపై యుద్ధంలో భారతదేశాన్ని గెలిపించడమే కాదు, తమ దేశాలనూ గెలిపించగల సత్తా ఉందని ప్రపంచదేశాల నాయకులు, ప్రజలు అనుకునేంత ధైర్యాన్ని నింపిన వ్యక్తి మోదీ. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస, అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. ఈ హింసాత్మక ఘటనల్లో ఒక మతం వారిని, కేంద్ర ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా హోం శాఖను అనుమానించేలా చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఘర్షణల్లో మూడు మతాలకు చెందినవాళ్లు బాధితులయ్యారు. రెండు వర్గాల మధ్య అపోహలు సృష్టించి, అనుమానాలు రేకెత్తించి, సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టారు. అల్లర్లకు, ఆస్తి నష్టానికి సంబంధించి చట్టం తనపని తాను చేస్తుంది. పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను పట్టుకున్నారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. కానీ, అనుమానాలు రేకెత్తించి, అపోహలు సృష్టించిన వారి సంగతి ఏంటి? గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సీఏఏ నిరసన కార్యక్రమాలకు హాజరై ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతి ఒక్కరిచేతా జాతీయ జెండా పట్టించి, రాజ్యాంగ పీఠికను చదివిస్తూ, అంబేడ్కర్ ఫొటోలను ప్రదర్శిస్తూ పైకి చాలా పద్ధతిగల వ్యక్తిలాగా కని పించాలని ప్రయత్నించారు. కానీ, ఆయన పార్టీ నాయకుడైన వారిస్ పఠాన్ మాత్రం ఫిబ్రవరి 16వ తేదీన ‘(సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో) మహిళల్ని ముందుపెట్టామని అంటున్నారు. ఆడ సింహాలు బయటికొస్తేనే చెమటలు కక్కుతున్నారు. ఇక మనమంతా బయటికొస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరు. 100 కోట్ల మంది (హిందువుల) కంటే 15 కోట్ల మంది (ముస్లింలు) శక్తివంతులు. దీన్ని గుర్తు పెట్టుకోండి’ అని అసదుద్దీన్ సమక్షంలోనే రెచ్చగొట్టారు. ఒకప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న వారిస్ పఠాన్ అసెంబ్లీ సాక్షిగా ‘భారత్ మాతాకీ జై’ అని నినదించనని చెప్పి సస్పెండ్ అయ్యారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆయన తన సమక్షంలో బహిరంగ సభలో, మీడియా ముందు హిందువులను రెచ్చగొట్టేలా, ముస్లింలను హింసవైపు ప్రేరేపించేలా మాట్లాడితే అసదుద్దీన్ ఏం చేశారు? దేశానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు ప్రవర్తించినా వాళ్లు ముస్లిం వ్యతిరేకులేనని చెప్పిన ఒవైసీ వారిస్, పఠాన్ విషయంలో మౌనంగా ఉన్నారెం దుకు? హిందువుల్ని హీనంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నాయకులకు కొత్తేమీ కాదు. ఇలా ఎదుటివారిని తక్కువ చేయమని ఏ మతమూ చెప్పదు. తన మతం గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం తప్పు కాదు. కానీ, ఎదుటివారి మతాన్ని కించపర్చడం మాత్రం క్షమార్హం కాదు. అయితే, వారిస్ పఠాన్ మాత్రం ఒక విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అదేంటంటే.. మహిళల్ని ముందుపెట్టి సీఏఏ నిరసన ప్రదర్శనలు చేయడం. దీనిని ఒక వ్యూహంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన కూడా ఈశాన్య ఢిల్లీలో వందలాది మంది ముస్లిం మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇది కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగింది. ఎందుకంటే మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ వస్తున్నారని, ఆ సందర్భంగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని, పోలీ సులు, కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం ఆ పర్యటన సజావుగా జరిగేలా చూడటంపైనే ఉంటుందని అందరికీ తెలుసు. మీడియా కవరేజీ కూడా ఈ విషయాలపైనే ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చిన ఈ ముస్లిం మహిళలంతా జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఏకమై సీలంపూర్, మౌజాపూర్, యమునా విహార్‌లను కలిపే రోడ్లను దిగ్బంధించారు. సీఏఏను వెనక్కు తీసుకునేవరకూ తాము అక్కడినుంచి కదలబోమని మంకుపట్టుపట్టారు. అదే సమయంలో సీఏఏ అనుకూల ప్రదర్శనకారులపై కూడా రాళ్లదాడులు జరిగాయి. ఆ తర్వాత రాళ్లదాడులు కాస్తా పెట్రోలు బాంబులతో దాడులుగా మారాయి. అసలు అప్పటికప్పుడు వేలా దిమందికి రాళ్లు, పెట్రోలు బాంబులు ఎక్కడినుంచి వచ్చాయి? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అల్లర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌తో తాహిర్ హుస్సేన్ అల్లర్లకు ముందు మూడు రోజులపాటు జరిపిన మంతనాలు, అమనతుల్లా ఖాన్ ఆ మూడు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో జరిపిన 18 ఫోన్ సంభాషణలు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో జరిపిన 9 ఫోన్ సంభాషణలు ఏంటో కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా సీఏఏ వల్ల ఒక్కరి పౌరసత్వం కూడా పోదు. పొరుగుదేశాల్లో మతం పేరుతో ఇబ్బందులు పడుతున్న మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చారు తప్ప భారతదేశంలో ఎన్నో దశాబ్దాలుగా నివసిస్తున్న, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలను వెళ్లగొట్టేందుకు కాదు. పార్లమెంటులో అన్ని పార్టీలూ సమగ్రమైన చర్చలు జరిపి, సెలక్ట్ కమిటీకి పంపించి, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత చేసిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. ఇందులో ఎలాంటి తప్పులూ లేవు. దీన్ని అడ్డం పెట్టుకుని, అమాయకుల్ని మోసం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో నివసిస్తూ, సమాజంలో అంతర్భాగమైన ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నష్టమూ జరగదు. కానీ, ముస్లింల పేరుతో దేశంలోకి చొరబడాలని చూసే అసాంఘిక శక్తులకు, ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయాలను చేయాలనుకునే పార్టీలకు, మైనార్టీల జపం చేసే సూడో సెక్యులరిస్టులకు మాత్రం మోదీ అంటే ఏమాత్రం గిట్టదు. అందుకే వాళ్లు అమాయకులైన ప్రజల్ని రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ, అలాంటి వారు కూడా చట్టం ముందు చేతులుకట్టుకుని నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. వ్యాసకర్త: పురిఘళ్ల రఘురాం బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
కశ్మీరంలో పారిశ్రామిక శకం
ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్న ప్రజల నైపుణ్యాలను ఉపయోగించుకుని, వారికి సరైన ఉపాధి అవకాశాలను చూపించి, వారు ఆర్థికంగా ఎదిగేలా చేయాలి. ఒక ప్రాంతం లోని వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే వారు ఆ సొమ్మును ఆ ప్రాంతంలోనే తిరిగి పెడతారు. కాబట్టే ఆర్థిక రంగంలో మంద గమనం వస్తే.. ప్రజల వద్ద వీలైనంత ఎక్కువ నగదు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతుంటాయి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా ఎదగాల్సిందే. పరిశ్రమలు వస్తేనే స్థానికులకు ఉపాధి లభిస్తుంది, అలా వారి ఆర్థిక పరిస్థితులతో పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. గాంధీ పేరు పెట్టుకున్న నెహ్రూ కుటుంబ సుదీర్ఘ పాలనలో దేశం ఎంతగా వెనుకబడిందో.. కశ్మీర్ అంతకంటే ఎక్కువ వెనుకబడింది. వాస్తవానికి నెహ్రూ కూడా కశ్మీరీ పండిటే. బహుశా ఆ ఉద్వేగంతోనే తనకు చేతకాకపోయినా కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని భావించి, పటేల్‌ను దూరంగా పెట్టి పెద్ద తప్పు చేశారు. ఆ తర్వాత దేశాన్ని పాలించిన ఆయన వారసురాలు ఇందిరాగాంధీ కానీ, ఆమె వారసుడు రాజీవ్ గాంధీ కానీ, దశాబ్దకాలం పాటు ప్రధాని కంటే ఎక్కువ అధికారదర్పాన్ని ప్రదర్శించిన ఆయన భార్య కానీ కశ్మీర్‌ను, కశ్మీరీ పండిట్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వీరి హయాంలో కశ్మీర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడి నట్లు అయింది. కశ్మీర్లో చివరిసారిగా ఒక పెద్ద పరిశ్రమను పెట్టి 50 ఏళ్లవుతోంది. ఆ పరిశ్రమ పేరు చీనాబ్ టెక్స్ టైల్స్. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ ప్రభుత్వం కశ్మీర్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించింది. కశ్మీరీ పండిట్లను కూడా తిరిగి వారివారి స్వస్థలాలకు సగర్వంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. కశ్మీర్ మెడకు గుదిబండగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుల్ని వదిలించడంతోనే హోం శాఖ తన చేతులు దులుపుకోలేదు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా మెరుగుపర్చింది. కాంగ్రెస్ హయాంలో మిలిటెన్సీకి పెట్టనికోటగా మారిన కశ్మీర్లో ఇప్పుడు మిలిటెంట్ల ప్రభావం కేవలం 10 శాతానికి పరిమితమైంది. పారిశ్రామికంగా కశ్మీర్ అభివృద్ధి చెందేందుకు ప్రధానమంత్రి కార్యాలయం, హోం శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఇప్పటికే 43 సంస్థలు అంగీకారం తెలిపాయి. గత ఆరు నెలల కాలంలోనే దాదాపు రూ.15 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాల్లో ఈ కంపెనీలు ప్రారంభం కానున్నాయి. కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం కేవలం ప్రైవేటు పెట్టుబడులకే పరిమితం కాలేదు. రైల్వే, పెట్రోలియం, సహజవాయువు, వాణిజ్యం మొదలైన శాఖల ద్వారా కూడా భారీగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెడుతోంది. కశ్మీర్లో భారీగా రైల్వే పనులు జరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి కోచి వరకు గ్యాస్ పైపులైన్ పనులు ప్రారంభం కానున్నాయి. కశ్మీర్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా గత ఆరు నెలలుగా పట్టుమని పదిమందిని తమతమ ఇళ్లల్లోనే ఉండమని చెబితేనే పార్ల మెంటు దద్దరిల్లిపోయింది. మరి కశ్మీరీ పండిట్లది వేల సంవత్సరాల చరిత్ర. అంత గొప్ప చరిత్ర ఉన్న లక్షలాది మంది పండిట్లను 1990లో కశ్మీర్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 లక్షలమంది. అంతమందిని కట్టుబట్టలతో తన్నితరిమేస్తే ఏం జరగాలి? పార్లమెంటు ఎంతగా స్పందించాలి? కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? కానీ.. గత 30 ఏళ్లుగా ఏమీ చేయలేదు. ఆఖరికి పాండవులది పద్నాలుగేళ్ల వనవాసమే. కానీ, కశ్మీరీ పండిట్లది అంతకు రెండింతలు ఎక్కువ. ఒకవైపు వారంతా దేశం నలుమూలల్లో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్ లోని వారి ఇళ్లు, దేవాలయాలు పాడుబడిపోయాయి. ఇలాంటి చారిత్రక తప్పిదాలను నరేంద్ర మోదీ తన నాయకత్వ ప్రతిభతో పరిష్కరిస్తు న్నారు. హోం మంత్రి అమిత్ షా తన పరిపాలనా చాతుర్యంతో, సమర్థతతో సరిదిద్దుతున్నారు. ఇది కశ్మీర్‌కు కొత్త ప్రారంభం. కశ్మీర్ భూతల స్వర్గం అనేమాట ఇప్పుడు నినాదం కాదు, వాస్తవం. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి -
అప్పుడే బీజేపీలో చేరుతా; అలా అయితే వద్దు
సాక్షి, అనంతపురం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనంతరపురంలో సోమవారం పర్యటించారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కిషన్ రెడ్డిని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకున్న మరుక్షణం బీజేపీలో చేరుతానని ఆయన వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా దివాకర్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసులతో సతమతమవుతున్న జేసీ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అందుకనే బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇక అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ ఆదివారం కలిశారు.‘‘బీజేపీ మన పార్టీ....అందుకే నాకు అభిమానం’’ అని అన్నారు. సత్యకుమార్‌కు బొకే అందించి మాట కలిపారు. (చదవండి : పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి) బీజేపీ పునరావాస కేంద్రం కాదు.. సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎవరికీ పునరావాస కేంద్రం కాదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం అన్నారు. ‘మోదీ, అమిత్‌షా నాయకత్వం నచ్చితేనే.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి.అంతేగాని కేసుల్నించి తప్పించుకోవడానికి, మీ సొంత ప్రయోజనాలకోసమో, షరతులు పెట్టి మాత్రం బీజేపీలో చేరకండి’అని హితవు పలికారు. (చదవండి : జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ ) -
నిరాశానిస్పృహల్లో బాబు పార్టీ!
అధికారం కోల్పోయి అయిదు నెలలు కూడా గడవకముందే తెలుగుదేశం నాయకత్వంలో ముసలం పుట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారే అది పోయిన వెంటనే అధినేత చంద్రబాబుపై, అతని కుమారుడు లోకేశ్‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఎన్నడూ లేనంత నిస్తేజంలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు ఉన్నారు. నేను చాలాసార్లు టీవీ చర్చల్లో చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది. ఎన్నికల ముందు నేను చాలాసార్లు తెలుగుదేశం ఘోరంగా ఓటమి చెందుతుందని, భవిష్యత్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని, ఇదే చివరిసారని గట్టిగా చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు నేను చెప్పింది నిజమే అన్నట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం అధికార ప్రతినిధులు ఒక్కరొక్కరిగా బీజేపీవైపు వచ్చేశారు. ముందుగా కరుడుగట్టిన తెలుగుదేశం వాది, పార్టీని అత్యంత సమర్థవంతంగా సమర్థించిన లంకా దినకర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మేధావి, మితభాషి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న చందు సాంబశివరావు, అలాగే స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ వెంకటరావు, మరో తెలుగుదేశం ప్రతినిధి యామిని కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా అనేకమంది నాయకులు తెలుగుదేశంలో భవిష్యత్ లేదని, ఇక ఆ పార్టీ తిరిగి కోలుకోలేదని తెలుసుకుని ఇతర పార్టీల్లో చేరుతున్నారు. జిల్లాల్లో కిందిస్థాయి నాయకులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీ, బీజేపీల్లో చేరుతున్నారు. ఒకపక్క చంద్రబాబు వయస్సు మీద పడుతోంది. మరోపక్క తన కుమారుడు లోకేశ్ సమర్థతపై అనేక అనుమానాలు, మొన్న ఎన్నికల్లో స్వయంగా ఓటమి పాలవడం, అనేక విమర్శలు ఎదుర్కొనడం ఇవన్నీ బాబుని కలచివేస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో చాలామంది శాసనసభ్యులకు డబ్బులు ఇవ్వలేదని నాతో చాలా మంది వాపోయారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్‌కి 70 ఏళ్ల వయసులో వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకుని బాబు ఆయన్ను ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడు సరిగ్గా తాను కూడా అదే వయసులో అలాంటి బాధనే ఎదుర్కొంటున్నారు. పార్టీపైనా, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై వల్లభనేని వంశీ, ఆమంచి, అన్నం సతీశ్ లాంటివాళ్లు చేసిన విమర్శలు, తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కాదు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష...’ అన్నట్టు చంద్రబాబు గతంలో చేసినవన్నీ ఇప్పుడాయనకు చుట్టుకుంటున్నాయి. ఒకపక్క గంటా శ్రీనివాసరావు పార్టీని వీడుతున్నట్లు ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్తున్నట్టు వినబడుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు కూడా తాను పార్టీ మారుతున్నట్టు సన్నిహితులతో చెప్పారంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని చంద్రబాబు ఇప్పుడు మథనపడుతున్నారు. బీజేపీతో స్నేహం వీడి తప్పు చేశానని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. మళ్లీ కలిసి పనిచేద్దామని తహతహలాడుతున్నారు. బీజేపీ అధినాయకత్వం అందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే మూడుసార్లు టీడీపీతో జతకట్టి మోసపోయామని, దానితో చెలిమి వల్ల రాష్ట్రంలో పార్టీ దెబ్బతిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైందని గ్రహించిన టీడీపీ నేతలు అనేకమంది బీజేపీవైపు చూస్తున్నారు. మరికొంతమంది అటు వైఎస్సార్సీపీ వైపు వెళ్లలేక, ఇటు పార్టీలో ఉండలేక అయోమయంలో పడుతున్నారు. లోకేశ్‌కు తెలిసీ తెలియక పార్టీలో సీనియర్లని ఎన్నో రకాల అవమానాలకు గురిచేసి తనకు నాయకత్వ లక్షణాలు లేనేలేవని నిరూపించుకున్నారు. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు పుత్రవాత్సల్యంతో మౌనంగా ఉండిపోయి భార తంలో ధృతరాష్ట్రుడిని తలపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేగానీ పార్టీకి భవిష్యత్తు లేదని అనేకమంది టీడీపీ నేతలు అనుకోవడానికి వెనకున్న కారణం ఇదే. అది జరగకపోతే పార్టీ నుంచి శాసన సభ్యుల వలసలు ఖాయం. అప్పుడు తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
‘పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. -
‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. అధికారమే పరమావధిగా గంటా పనిచేస్తారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు గంటా పార్టీ మారుదామని అనుకుంటే సిట్ దర్యాప్తులో ఆయన పేరు ఉందని చంద్రబాబు బెదిరించారట. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటివారు విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన అపరాధి గంటా శ్రీనివాసరావే అని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు, మచ్చ లేనోళ్లు ఎవరైనా బీజేపీ లోకి రావచ్చు. గంటా శ్రీనివాసరావు ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులను కలుస్తున్నారు. అధికారమే పరమావధిగా ఆయన పని చేస్తున్నారు. అధికారం మాత్రమే కావాలా? సిద్ధాంతాలు వద్దా? వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు క్షమించరు. అమిత్ షా, సీఎం జగన్ మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది’అని రఘురాం అన్నారు. -
‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’
సాక్షి, విజయవాడ: టీడీపీలో కోడెల శివప్రసాదరావును చంద్రబాబు నాయుడు తీవ్ర అవమానాలకు గురిచేశారని బీజేపీ అధికార ప్రతినిధి కేవీ లక్ష్మీపతి రాజా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. టీడీపీలో చంద్రబాబు అవమానాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలతో కోడెల చెప్పారని, తనను కలవడానికి కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందినట్టు వెల్లడించారు. అమిత్ షాను కలిసేందుకు ఏర్పాటు చేయాలని కోడెల బీజేపీ నాయకులను కోరారని, కోడెల బీజేపీలో చేరికపై పార్టీలో చర్చ కూడా జరిగిందన్నారు. కోడెల చనిపోయిన తర్వాత చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని, గతంలో కోడెల ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చంద్రబాబు కనీసం పరమర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో కోడెలను వర్ల రామయ్యతో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. శవ రాజకీయాలతో కోడెల ప్రతిష్ఠను మరింత దిగజార్చవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని చూసైనా మిగిలిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వదలి బయటకు రావాలని లక్ష్మీపతి రాజా అన్నారు. కోడెల మరణంపై అనుమానాలు: రఘురామ్ టీడీపీలో కోడెల శివప్రసాదరావు అభద్రతా భావానికి గురయ్యారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కష్టకాలంలో కోడెలకు చంద్రబాబు అండగా నిలబడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయనను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. జీవితాంతం పార్టీ కోసం కష్టపడితే తనను చంద్రబాబు కాపాడలేదని కోడెల అన్నట్టు వెల్లడించారు. కోడెల మరణంపై అనేక అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత కథనాలు.. బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారని.. దీనికి సంబంధించి ఆయన అమిత్ షాను కూడా కలవాలనుకున్నారని రఘురామ్ వెల్లడించారు. చంద్రబాబు తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. నిజాయితీ గల వారికి పార్టీలో విలువ లేదని తనతో నెల రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు కోడెల చెప్పారని రఘురాం తెలిపారు. ఈ విషయమై ‘సాక్షి’ టీవీతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నెలరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు ‘నెల రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు నాకు ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. అమిత్ షాని కలువాలని నాతో చెప్పారు. దీంతో హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. సమయం చూసుకొని ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో కలుస్తాననని ఆయన చెప్పారు. అందుకు నేను సరే సర్ అని చెప్పాను. కోడెల సుదీర్ఘంగా రాజకీయ అనుభవం గల వ్యక్తి. పల్నాటి రాజకీయాల్లో పెద్దమనిషి, పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి. డాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయనను కోల్పోవడం ప్రజలకు బాధ కలిగించింది. మృతిని రాజకీయం చేయరాదు కోడెల మృతిని రాజకీయం చేయరాదు. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వారం రోజుల కిందట బీజేపీలో నా కంటే సీనియర్ నాయకుడితో ఆయన టచ్‌లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్ స్ట్రోక్ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. కష్టసమయంలో పార్టీ తనను ప్రొటెక్ట్ చేయలేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన పార్థీవదేహం ఉండగానే ఆయన మృతి పట్ల రాజకీయాలు చేయడం మంచి విషయం కాదు. చంద్రబాబు పట్టించుకోలేదు రాజకీయాల్లో కేసులు కొత్తకాదు. చిదంబరం, లాలూ, జయలలిత లాంటి వ్యక్తులు కేసులు ఎదుర్కొన్నారు. కేసులు పెట్టినంతమాత్రాన కోడెల భయపడతారని నేను అనుకోవడం లేదు. కష్ట సమయంలో పార్టీ నన్ను ఒంటరివాడిని చేసింది.. మద్దతు ఇవ్వలేదన్న ఆవేదన కోడెల మాటల్లో కనిపించింది. అందుకే బీజేపీలో చేరాలని అనుకున్నారేమో.. ఆరోపణలు వచ్చిన కష్టసమయంలో అండగా నిలబడకుండా చంద్రబాబు, అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని, పట్టించుకోలేదని ఆయన భావించారు. పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేయడం ఆయనను బాధించింది. కోడెల విషయమై నేను చేసిన ట్వీట్ చూసి ఓ సీనియర్ జర్నలిస్టు కూడా నాతో మాట్లాడారు. మీరు చెప్పిన విషయం వాస్తవమేనని, పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని కోడెల తనతో బాధపడినట్టు ఆ జర్నలిస్టు చెప్పారు. పార్టీ అధినాయకత్వం తీరుతో ఆయన అభద్రతాభావానికి లోనయ్యారు. నిజాయితీపరులకు టీడీపీలో స్థానం లేదని కోడెల చెప్పారు. పార్టీ తనను ఏ విధంగానూ ప్రొటెక్ట్ చేయలేదని కోడెల అన్నారు. ఆయన మృతిపై దర్యాప్తు జరపాలి కోడెల పార్థీవదేహం ఉండగానే రాజకీయంగా రచ్చ చేయడం సరికాదు. ఇరురాష్ట్ర ప్రభుత్వాలు కోడెల మృతిపై సమగ్రమైన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కోడెల పర్సనల్ సెల్‌ఫోన్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ తీరుతో ఒంటరి భావనకు లోనైన కోడెల ఒక నెల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యారని గతంలో కథనాలు వచ్చాయి. కోడెల మృతి విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముంది. -
కోడెల మృతి.. రఘురామ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఢిల్లీలో ఆ పార్టీ కో–ఆర్డినేటర్ పురిఘళ్ల రఘురామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం పట్ల కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని, నెలరోజుల క్రితం ఆయన తనకు ఫోన్ చేసి మనసులోని ఆవేదనను తనతో పంచుకున్నారని, ఇంతలోనే ఆయన ఇలా మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని రఘురాం అన్నారు. కోడెల మృతిపై రఘురామ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తనతో మాట్లాడిన సందర్భంగా మాజీ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని చెప్పారని బీజేపీ నేత తెలిపారు. పార్టీలో తనను పూర్తిగా ఒంటరిని చేయడం మానసిక క్షోభను కలిగిస్తోందని ఆయన చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్ వివరించారు. అయితే అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మాజీ స్పీకర్ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని పురిఘళ్ల డిమాండ్ చేశారు. -
మోదీ, షాలకు కుడిభుజం జైట్లీ
అపార అనుభవానికి సౌహార్ద్రత తోడైతే అది అరుణ్ జైట్లీ. అందుకే పదవులు ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి గానీ, పదవుల కోసం ఆయన పోటీ పడలేదు. ఎక్కడ సమస్య వచ్చినా దాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో అరుణ్ జైట్లీ అగ్రగణ్యుడు. వాజపేయి, అద్వానీల తర్వాత పార్టీలో యువతకు జైట్లీయే మార్గదర్శకుడు. పార్లమెంటులోనైనా, పార్టీ కార్యక్రమాల్లో అయినా, బహిరంగసభల్లోనైనా ఆయన చేసే ఉపన్యాసాలు నభూతో నభవిష్యతి. ఆయనొక విజ్ఞానభాండాగారమని ఆ ఉపన్యాసాలు చాటి చెబుతాయి. అరుణ్ జైట్లీ ఐదక్షరాలు... దేశ రాజకీయానికి సరికొత్త భాష్యాన్ని చెప్పిన ఘనాపాటి. అందరూ రాజకీయాలు చేస్తారు. ఆయన కూడా చేస్తారు. అయితే ఆయన మిగతా వారందరికీ భిన్నమైన వ్యక్తి. ఎవరినీ కూడా తనకు పోటీ అనుకోరు. రావాల్సింది వస్తుంది... వచ్చేదాన్ని ఎవరూ ఆపలేరన్న సిద్ధాంతమే ఆయన రాజకీయం. దేశంలోని దిగ్గజ నాయకులు ఆయనకు సహచరులు. తనకు తెలిసింది అందరికీ చెప్పడం... దేశ అభివృద్ధి, పార్టీ లక్ష్యాలపైనే ఆయన దృష్టింతా ఉండేది. తనతో సమాన వయసున్నవారితోనూ సఖ్యతతో మెలగడం ఒక్క జైట్లీ దగ్గరే మనం చూడగలం. సుష్మా స్వరాజ్, అనంతకుమార్, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పారికర్, మోదీ... ఇలా అందరితోనూ ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు నెరిపారు. సమస్యలు వచ్చినప్పుడు జైట్లీ స్పందించే తీరు ఆయా రాష్ట్రాల సీఎంలను ఆయనకు ప్రీతిపాత్రులను చేసింది. అపార అనుభవాన్ని జోడించి రాజకీయాల్లో రాణించిన అతికొద్దిమంది నాయకుల్లో జైట్లీ ఒకరు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి తర్ఫీదు పొందిన ఆణిముత్యాల్లో జైట్లీ ఒకరు. విద్యార్థి నాయకుడిగా, ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా న్యాయవాదిగా సొలిసిటర్ జనరల్‌గా ఆయన దేశానికి పరిచయమయ్యారు. అనేక అంశాలపై స్పందించే తీరు జైట్లీకి మిగతా వారికి మధ్య తేడా ఏంటో ఇట్టే తెలియజేసేది. ఎమర్జెన్సీ సమ యంలో జైలుకెళ్లి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. చిన్న వయసులోనే సొలిసిటర్ జనరల్‌గా ఎంపికై సంచలనం సృష్టించారు. జనసంఘ్ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత బీజేపీలో అతి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. జైట్లీ బహు ముఖ ప్రజాశాలి. కాగితాలు చూడకుండానే ప్రపంచంలోని కీలక అంశాలపై ధారాళంగా ఉపన్యసించగల దిట్ట ఆయన. భారత ప్రతిపక్షనేతగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్ర రక్షణ మంత్రి, కార్పొరేట్ ఎఫైర్స్ మినిస్టర్‌గా న్యాయశాఖ మంత్రిగా, అదేవిధంగా సమాచారశాఖ మంత్రిగా చివరిగా ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి సమర్థవంతమైన నాయకత్వం వహించారు. తన వ్యక్తిత్వంతో ఆహర్యంతో ప్రతిపక్ష నేతలను కూడా ఆకర్షించిన మహానేత జైట్లీ. అటల్ బిహారి వాజ్‌పేయి తర్వాత అంతటి చతురత ఉన్న నేత ఒక్క అరుణ్ జైట్లీ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నేతల్లో ఒకరు. ఎప్పుడూ ఫలానా పదవి కావాలని ఆరాటపడలేదు. ఎప్పుడూ పదవులు వెదుక్కుంటూ వచ్చాయి తప్పించి ఆయన పదవులను ఎప్పుడూ కోరుకోలేదు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నాయకత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. యూపీఏ 1, యూపీఏ 2లో ప్రతిపక్ష నేతగా దేశానికి దిశానిర్దేశం చేశారు. బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన సంక్షోభాలను నివారించి... ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు. పార్టీలో వాజ్‌పేయి, అద్వానీ తర్వాత ముఖ్యనేతగా ఎదిగారు. ట్రబుల్షూటర్గా జైట్లీని పార్టీ నేతలు పిలుచుకుంటారు. వాజ్‌పేయి తర్వాత పార్టీలో యువతకు మార్గనిర్దేశకుడిగా మారారు. మరీ ముఖ్యంగా మీడియాతో అనేక మంది సీనియర్ జర్నలిస్టులతో సత్సంబంధాలు నెరిపేవారు. ఆయా అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కలిగించేవారు. పార్టీ కార్యాలయంలో, పార్లమెంట్లో, బహిరంగ సభల్లో ఆయన చేసే ఉపన్యాసాలు న భూతో న భవిష్యతి. ఆయా అంశాలపై ఆయన స్పందించే తీరు చూస్తే ఆయననో విజ్ఞాన భాండాగారంగా చెప్పు కోవాల్సిందే. అటల్ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీతో జైట్లీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 1996 నుంచే మోదీ, జైట్లీ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. గుజరాత్ రాజకీయాల్లో ఇన్చార్జిగా పనిచేసిన సమయంలో మోదీతో జైట్లీ అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించేవారు. నాటి నుంచే నరేంద్రమోదీకి కుడిభుజంగా జైట్లీ నిలిచారు. అందరూ అమిత్ షాను మోదీకి కుడిభుజం అనుకుంటారు కానీ, అమిత్ షాకి, మోదీకి కూడా జైట్లీ కుడి భుజంగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా జైట్లీగారితో నా అనుబంధం 26 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఎప్పుడు కన్పించినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. పార్టీ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాతో చర్చించేవారు. అలాంటి ధీశాలిని కోల్పోవడం యావత్ భారత్ దేశానికి తీరని లోటు. సీనియర్ నాయకుడిగా అనేక విషయాల్లో జైట్లీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణల గురించి చాలా మంది చెప్పుకుంటారు కానీ, దేశానికి అసలు సిసలు సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి జైట్లీ. ఇక జైట్లీకి క్రికెట్ అంటే అమితంగా ఇష్టం. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. అనేక అంశాలపై నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఒక్క జైట్లీకే సాధ్యం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం. పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
చంద్రబాబు తీరు సమంజసమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే ఆయనకు ఏం జరిగిందని ఆరా తీయడం, యోగ క్షేమాలు తెలుసుకోవటం కంటే.. ఆ సంఘటనను ఎలా వాడుకోవాలి అన్న కోణంలోనే ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ ఆలోచించాయి. సంఘటన జరిగిన గంటలోపు రాష్ట్ర హోంమంత్రి మాట్లాడిన తీరు చూస్తే.. జగన్ పట్ల వారికి ఉన్న అసహనం ఉందో తెలు స్తోంది. అదే తీరున రాష్ట్ర డీజీపీ సైతం మాట్లాడారు. ఇక సీఎం చంద్రబాబు ప్రజలంతా తనపట్ల సానుభూతి చూపాల్సిందే అన్నట్లు వ్యవహరించారు. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు తొలి రోజు నుంచీ ఒకే పనిలో ఉన్నారు. అదేమంటే.. ఈ పదవిని శాశ్వతంగా తాను, తన కుమారుడే అనుభ వించేలా చూసుకోవడం.. ఇదేదో నేను చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా ఆయనే పార్టీ కార్యక్ర మాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పదేపదే ప్రక టించిన వాస్తవం. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉంటేనే ఎంతటివారైనా అధికా రంలోకి రాగలరు, కొనసాగగలరు. దురదృష్టవ శాత్తూ చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వా నికి ప్రజల ఆదరాభిమానాలు ఎంత ప్రయత్నించినా దక్కట్లేదు. దీంతో చంద్రబాబు తనకు, తన ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన వారిపై, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న వారిపై దాడులు చేసేందుకు పూనుకు న్నారు. అక్రమాలను అడ్డుకున్న ఒక మహిళా ఎమ్మా ర్వోపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన అప్పట్లో అధికారులనూ, ప్రజలనూ భయభ్రాంతులకు గురి చేసింది. అయి నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేపైన సీఎం చంద్ర బాబు ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధాని నగరంగా భావిస్తున్న విజయవాడలో ఒక మంత్రి, ఒక ఎంపీ, తెలుగుదేశం నాయకులు పట్టపగలు ఒక రవాణా కమిషనర్‌పై దాడి చేశారు. తాను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు చాలవ న్నట్లు.. న్యాయంగా, నిజాయితీగా వ్యవహరించిన అధికారిపై విరుచుకుపడ్డారు ఆ ఎంపీ. హైకోర్టు జోక్యం చేసుకుందే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎంపీపైన కానీ, మంత్రిపైన కానీ ప్రజలు ఆశించిన రీతిలో చర్యలు తీసుకోలేదు. అదే నగ రంలో మరొక ఎమ్మెల్యే భూముల్ని ఆక్రమిస్తూ.. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ రచ్చకెక్కారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ప్రజలూ, అధికారులే కాదు.. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, ఆ పార్టీల ముఖ్య నాయకులనూ టీడీపీ వదిలిపెట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు దైవ దర్శనం కోసం తిరుమలకు వస్తే టీడీపీ నాయ కులు, కార్యకర్తలు అమిత్ షాపై దాడి చేయాలని ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్షీ్మ నారాయణపై టీడీపీ తమ్ముళ్లు బరి తెగించి దాడి చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ తప్పు బీజేపీదే అన్నట్లుగా చిత్రీకరించడానికి బాబు, ఆయనకు బాకాలూదే మీడియా విఫలయత్నాలు చేశాయి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, ప్రజల్లో తిరుగుతున్న పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన వైఎస్ జగన్‌పై ఏకంగా హత్యాయత్నమే జరిగింది. ఇన్ని కళ్లముందు జరుగుతున్నా చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు అంతా తామే బాధి తులమన్నట్లుగా నటించటం, ప్రజ లంతా తమపట్ల సానుభూతి చూపాలన్నట్లుగా మొసలి కన్నీళ్లు కార్చడం, దీన్నంతా వారి అనుకూల మీడియా ప్రజ లపై రుద్దటం ఎంత వరకు సమంజసం? పైన పేర్కొన్న అన్ని దాడుల్లోనూ, అన్ని సంద ర్భాల్లోనూ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? కేసులు నమోదు చేయాల్సింది ఎవరు? దోషుల్ని పట్టుకోవాల్సింది, వారికి శిక్ష పడేలా చేయాల్సింది ఎవరు? దొంగ నాటకాలు ఆడుతోంది ఎవరు? చంద్రబాబు స్టైల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని నిందిస్తారు. ఆఖరికి ప్రజల్ని కూడా వదిలిపెట్టరు. తాను వేసిన రోడ్లపై తిరగొద్దం టారు. ఇదంతా ఘనకార్యంలాగా ఆయనకు బాకా లూదే మీడియా ప్రజలపై రుద్దుతుంది. హత్యాప్రయత్నం జరిగిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు జగన్‌ని పలకరించారు తప్పితే.. ఏపీ సీఎంగానీ, ఆయన సహచ రులుగానీ మర్యాదకైనా జగన్‌తో మాట్లాడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం? వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
ఆదర్శంలో ఆణిముత్యం అటల్జీ
అటల్ బిహారీ వాజపేయిని అభిమానించని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశ కీర్తిని ఖండాం తరాలకు వ్యాపింప చేసిన మహా నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అటల్జీ. జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, ఎడిటర్‌గా, శాంతిదూతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ఆధునిక భారతదేశ నిర్మాతగా ప్రతి భారతీ యుడి హృదయంలో తనదైన ముద్రను వేసుకున్న నిజమైన నాయకుడు అటల్జీ. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో చురుకైన పాత్రను పోషిస్తూ.. జనసంఘ్ విస్తరణలో, భారతీయ జనతాపార్టీ విస్తరణలో కీలక పాత్ర వహించారు. తన వాక్పటిమతో నిజాయితీ, నిబద్ధతలతో, వ్యాసాలతో, రచనలతో, కవితలతో, స్నేహంతో లక్షలాది కార్యకర్తలకు మార్గదర్శకుడిగా దిశానిర్దేశకుడిగా ప్రేరణనిచ్చారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ప్రతిపక్షంలో ఉన్న అటల్‌జీని పంపడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. అలాగే ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి మన దేశ ఔన్నత్యాన్ని చాటిన నాయకుడు అటల్జీ. చిన్నవయసులోనే భావి ప్రధాని అని నెహ్రూతోనే కితాబు అందుకున్న వ్యక్తి అటల్జీ. ప్రధానులతో, సమకాలీన నేతలతో రాజకీయాలకు అతీతంగా పనిచేసిన నేత. ప్రధానిగా ఒక్క ఓటుతో పదవీచ్యుతుడైనా, హుందాగా ఓటమిని అంగీకరించి ప్రజాస్వామ్య విలువలను పెంచిన నాయకుడిగా వేనోళ్ళ ప్రశంసలు అందుకున్నారు అటల్జీ. ప్రధానిగా 23 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు నడిపించిన కాంగ్రెస్సేతర ప్రధానిగా చరి త్రలో నిలిచారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాధ్యతలు చేపట్టి నూతన భారతదేశ ఆవి ష్కరణకు కృషిచేశారు. పొరుగుదేశాలకు స్నేహహస్తం అందించి నూతన విదేశీ విధానానికి తెరలేపారు. కార్గిల్ ద్వారా పాకిస్తాన్‌కి గట్టి సమాధానం చెప్పినప్పటికీ ఆ దేశానికి స్నేహహస్తం అందించి శాంతి చర్యలకు పూనుకున్నారు. 1998 వరకు సామాన్యులకి దూరంగా ఉన్న టెలిఫోన్, గ్యాస్ వంటి వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత అటల్జీదే. అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటిని అధిగమించి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన దృఢమైన నాయకుడు అటల్జీ. ఆధునిక భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడిపించడానికి, ఉద్యోగకల్పనకు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి అనేక కంపెనీలను ప్రారంభింపజేశారు. పట్టణ ప్రాంత ప్రజల కోసం వాంబే గృహనిర్మాణ పథకం లాంటివి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల కోసం గ్రామీణ సడక్ యోజనను ప్రారంభించారు. స్వర్ణ చతుర్భుజి పేరున దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అనుసంధానం చేశారు. జాతీయ రహదారుల ద్వారా ఆటోమొబైల్ రంగం, సిమెంట్ రంగం, ఇనుము మొదలైన రంగాలను విస్తరింప చేసి వాటి ద్వారా కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ, ప్రైవేటు రంగాల ప్రవేశం ద్వారా వాటిని పురోగమింపజేసి ఆ రంగంలో ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల కల్పన చేశారు. రైల్వేల ఆధునీ కరణ, రైలు ప్రయాణ వేగం పెంచడం, రైలుస్టేషన్ల అభివృద్ధి ఈయన హయాంలోనే జరిగింది. పంచాయతీలను పటిష్టపరిచారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించినది వాజ్‌పేయి. పోఖ్రాన్ అణు పరీక్ష ద్వారా ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటిచెప్పారు. దేశంలో మెట్రోరైలును ప్రవేశపెట్టిన ఘనత వాజ్‌పేయిది. మొట్టమొదటి ఢిల్లీ మెట్రోని ప్రారంభించారు. దేశంలో పట్టణాలు పెరగడం, పట్టణ రహదారుల సమస్య, నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ప్రజలకు మెట్రో రైలు ద్వారా పట్టణ రవాణా వ్యవస్థల తీరును మార్చారు అటల్జీ. అటల్జీ చిన్ననాడు క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లినా, 1977 ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లినా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం మాత్రమే. జీవితాంతం ఆదర్శంగానే జీవించారు. ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యే ఉండేవారు. తన మంత్రివర్గంలో ఉన్న అందరు మంత్రులకు స్వేచ్ఛనిచ్చారు వాజ్‌పేయి. ముఖ్యంగా అద్వానీతో కలిసి పని చేసిన తీరు అద్భుతం. వీరిద్దరూ 50 ఏళ్లకు పైగా కలిసి సహచరులుగా పనిచేసి ఏనాడూ ఎలాంటి స్పర్ధలు, మనస్పర్ధలు రానీయకుండా పార్టీలోని మిగతావారికి, తర్వాతి తరానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. అవినీతి మచ్చలేని ప్రధానిగా, రాజకీయ నాయకుడిగా ప్రజాజీవితం సాగించారు అటల్జీ. భారతదేశ రాజకీయాల్లో కలియుగ భీష్మాచార్యులు అటల్ బిహారీ వాజ్‌పేయి. (మాజీ ప్రధాని, బీజేపీ అత్యున్నత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తమయం సందర్భంగా) పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ :raghuram.delhi@gmail.com -
హమ్మయ్య.. పీడ విరగడైంది
కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంచలేదన్నదే బీజేపీకి బాబు కటీఫ్ చెప్పడానికి వెనుక ఉన్న వ్యూహమని ఇప్పుడందరికీ తెలిసిపోయింది. కానీ ఈ పరిణామాలు బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. బీజేపీ శ్రేణుల్లో ఉగాది ముందుగా వచ్చింది. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోవడం.. బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించాయి. బీజేపీ శ్రేణులు రెండు దశాబ్దాల తర్వాత ఆనందంతో ఉప్పొంగాయ్. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండుసార్లు గెలవడం బీజేపీ వల్లనేనని అందరికీ తెలిసిన విషయమే. కేవలం అధికార దాహంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 1999, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. బాబు గతంలో కూడా అటల్జీతో చెలిమి చేశారు. అటల్జీ చరిష్మాను ఉపయోగించుకొని సీఎం అయ్యారు. మరోసారి మోదీ వల్లే సీఎం అయ్యారు. బాబు రెండుసార్లు బీజేపీని మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం రాజకీయ ప్రయోజనాల కోసమన్నది తెలిసిన విషయమే. అయితే లేనిది ఉన్నట్టుగా... ఉన్నది లేనట్టుగా ప్రచారం చేస్తూ బీజేపీని దెబ్బతీయాలని బాబు కుట్రపన్నారు. ఏపీకి బీజేపీ నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి నిధులిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నాలుగు ఎయిర్ పోర్టులు మంజూరు చేసింది. కేంద్ర సంస్థలను ఇస్తోంది. ఇచ్చిన సంస్థలకు నిధులను దఫదఫాలుగా అందిస్తోంది. ఉమ్మడి రాజధానిని వదిలేయడానికి ప్రధాన కారణం ఓటుకు కోట్లు కేసే. సరే అమరావతి వచ్చారు. ఇక్కడన్నా ఏదైనా చేశారంటే అదీ లేదు. దేశంలోని ఏ సీఎం తిరగనంతగా... 28 దేశాలు తిరిగి వచ్చారు. 18 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. బాబు పర్యటనలతో ఏపీకి నిధులు వస్తాయని, కంపెనీల రాకతో నిరుద్యోగం తగ్గుతుందని భావించి కేంద్రం ముందుండి సహకరిం చింది. 28 దేశాలు తిరిగి వచ్చి.. బాబు ఏం సాధించారు. విదేశీ పర్యటనలన్నింటికీ ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్లో వెళ్లారు. ఇతర సీఎంలు ప్యాసింజర్ విమానాల్లో వెళ్తే... బాబు ఢిల్లీ పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాలనే వాడారు. నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగపర్చారు. బాబులో మార్పు రావడానికి ప్రధాన కారణం ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి. నాలుగేళ్లుగా జగన్ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతున్నారు. కాలేజీల్లో విద్యార్థులతో మాట్లాడటం దగ్గర్నుంచి, ఢిల్లీ వేదికగా ఆందోళనలు, జిల్లాల్లో ధర్నాలన్నీ కూడా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగాయ్. అప్పుడు బాబు హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ప్రత్యేక హోదా అన్నారు. ఆ తర్వాత హోదా వద్దులే... ప్యాకేజీ చాలన్నారు. కేంద్రం, దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా సాయం చేసిందన్న బాబు... అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. ఏపీలో తన పాలనపై వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష నేత జగన్‌కి ఆదరణ పెరుగుతోందన్న రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలతో హోదా పల్లవి అందుకున్నారు. జగన్‌ది రాజకీయంగా పైచేయి అవుతున్న తరుణంలో రంగంలోకి దిగి... మొన్నటి వరకు కేంద్రంపై ప్రేమ ఒలకబోసిన బాబుగారు ఇప్పుడు మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా బాబు రాజకీయంగా తనకు మేలు జరిగేది చేయాలని భావిస్తున్నారు తప్పించి... ఏపీకి మేలు జరిగే ఎలాంటి అంశాన్నీ టేకప్ చేయలేదు. ఏపీకి సాయం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్... ఎస్పీవీ ద్వారా రాష్ట్రానికి నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధమైతే అందుకు సహకరించకపోగా, కేంద్రం నిధులివ్వడం లేదంటూ విమర్శలు గుప్పిస్తారు. విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లైఓవర్ కోసం మూడు వందలకోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే వైఫల్యం ఎవరిదో ఇంకా చెప్పాలా? పోలవరం ప్రాజెక్టు కోసం వంద శాతం నిధులిస్తామని కేంద్రం ముందుకు వచ్చినా, నిధులివ్వడం లేదంటూ కబుర్లు చెప్తారు. డబ్బుల కోసం, కమిషన్ల కోసమే ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొని తాత్సారం చేస్తూ వచ్చారు. బీజేపీని అల్లరి చేసి, రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా తనపై అన్ని పార్టీలూ పగబట్టాయంటున్నారు. అయితే ప్రజలే ఆయనపై ద్వేషంతో ఉన్నారనేది సుçస్పష్టం. ఉదయం ఒక మాట, మ«ధ్యాహ్నం మరో మాట మాట్లాడతారు. రాత్రి ఇంకో మాట మాట్లాడుతూ తనదే పైచేయి అంటారు. ఓవైపు జనసేన అధినేత పవన్... రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడ్తున్నారు. సాక్షాత్తూ సీఎం తనయుడి అవినీతిని ప్రశ్నించారు. గతంలో బాబు పాలన బాగా చేస్తారని చెప్పిన పవన్... ఇప్పుడు మంత్రులంతా అవి నీతితో పొంగిపొర్లుతున్న విషయం తెలుగు ప్రజలకు అసలు తెలియంది కాదు. లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నారంటే బాబు పాలన తీరును అర్థం చేసుకోవచ్చు. కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంచలేదన్నదే బీజేపీకి బాబు కటీఫ్ చెప్పడానికి వెనుక ఉన్న వ్యూహమన్నది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రతిపక్షం నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు సీట్ల పెంపు కోసం ఢిల్లీ పర్యటనల్లో మాట్లాడారు తప్పించి... ఒక్కసారి కూడా ఏపీ సమస్యల విషయాన్ని ప్రస్తావించలేదన్నది వంద శాతం నిజం. బాబు దుష్ప్రచారాన్ని ప్రజలు ఎంత నమ్ముతారో కాలమే నిర్ణయిస్తుంది. అభివృద్ధికి పట్టం కడ్తారో... అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ఓటేస్తారో కాలమే చెప్తుంది. వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ పురిఘళ్ల రఘురాం ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
డిపాజిట్లపైనా అపోహలేనా?
అభిప్రాయం డిపాజిట్‌దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి కూడా మోదీపైన బురద చల్లటం ఏమిటి? వరదలో కొట్టుకుపోతున్న ప్పుడు తెడ్డు దొరికినా చాలనిపి స్తుంది. దాన్ని వాడుకుని ఎలా గైనా బయటపడాలనిపిస్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రమాదం నుంచి గట్టెక్కాలనే ఆతృత సహజం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక తప్పును పట్టాలని, దాన్ని అడ్డం పెట్టుకుని బతకాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది. భారీ మెజార్టీతో ఎన్నికల్లో ప్రజామోదం పొంది, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదురుచూపులు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన చారిత్రక చర్య దగ్గర్నుంచి, సరిహద్దు వెంబడి మెరుపుదాడుల వంటి సున్నితమైన చర్యల వరకు ప్రతిదాన్నీ వివాదాస్పదం చేయాలని, ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని చూసింది. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అభినందించాలని, ఆమోదించాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ, ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా చెడ్డగా చిత్రీకరించే ప్రతి పక్షాలు ఉండటం మాత్రం సరికాదు. నల్లధనం అదుపు చేసే క్రమంలో వ్యక్తిగత బంగారంపై పకడ్బందీ నిబంధ నల్ని ప్రభుత్వం రూపొందిస్తే.. మహిళల బంగారాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుందని పుకార్లు పుట్టించటం ఎంత వరకు సమంజసం? దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు చట్టం తీసుకురావాలని పార్లమెంటు ముందుకు వస్తే.. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే సొమ్మును వాడేసుకుంటారంటూ వదంతులు ప్రచారం చేయటం ఎంతవరకు సబబు? వ్యక్తిగత బంగారం విషయానికొస్తే.. పెళ్లైన మహిళ అరకిలో బంగారం తన వద్ద ఉంచుకోవచ్చు. వారసత్వంగా వచ్చినదైతే ఎంతైనా అట్టిపెట్టుకోవచ్చు. వారస త్వంగా వచ్చిన బంగారాన్ని పక్కనబెడితే దేశంలో సామాన్య మహిళలు ఎంతమందికి అరకిలో బంగారం ఉంటుంది? అక్రమంగా ఆస్తులు కూడబెట్టే వాళ్లని పట్టుకునేందుకు ఉద్దేశించిన ఇలాంటి చర్యలను కూడా ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి వాడుకున్నాయి. ఇప్పుడు బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, వాటిలో దాచుకున్న నగదు విషయానికొద్దాం. ప్రతిపక్షాల పుణ్యమా అని చాలామంది ఈ అపోహల్ని నమ్మి బ్యాంకుల ఎదుట బారులుతీరి మరీ తమ నగదును వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అంటే కొంతవరకూ ప్రతిపక్షాలు విజయవంతమైనట్లే. ఎఫ్ఆర్డీఐ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ అనే అంశం పైనే ప్రతిపక్షాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తు న్నాయి. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే నగదులో రూ. లక్షకు మాత్రమే ప్రభుత్వం బీమా చేస్తుంది. ఆపై నగ దుకు బీమా సదుపాయం ఉండదు. అంటే.. ఒకవేళ బ్యాంకు దివాళా తీస్తే.. రూ. లక్ష లోపు ఉన్న డిపాజిట్ దారులందరికీ నగదు సర్దుబాటు చేసి, ఆ తర్వాత రూ. లక్షపైన మొత్తాలకు నగదును సమకూరుస్తారు. అయితే, ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా చేర్చలేదు. 1961లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ చట్టం చేసింది. డిపాజిట్‌దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం. దీనికి మోదీపైన బురద చల్లటం ఏమిటి? ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయటమే తప్ప నీరుగార్చటం కాదు. దీనికీ డిపాజిటర్ల డబ్బులకు, మరీ ముఖ్యంగా రూ. లక్ష నగదుపై బీమాకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. రూ. లక్ష నగదుపైన బీమా నిమిత్తం దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 3వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నాయి. అసలు 1961లో చట్టం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా దివాళా తీయటం కానీ, ఈ చట్టాన్ని ఉప యోగించటం కానీ జరగలేదు. అలాంటిది.. కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా కాంగ్రెస్ హయాంలో బ్యాంకులకు టోపీ పెట్టిన మోసగాళ్ల నేరాలకు, రూపాయి.. రూపాయి కూడబెట్టుకునే సామాన్య ప్రజల డిపాజిట్లకు ముడిపెట్టి, అపోహలు సృష్టించి, ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటం క్షమించరాని నేరం కాదా? కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్ని అపవాదుల్ని సృష్టించినా, అపోహల్ని ప్రచారం చేసినా, అమాయకుల్ని చేసి ప్రజల్ని రెచ్చగొట్టినా.. నిజం నిలకడమీద తెలుసుకుని నరేంద్ర మోదీ చర్యల్ని సమర్థిస్తోంది ఈ దేశం. నిజాయితీగా దేశం కోసం మోదీ పడుతున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలను తిప్పికొట్టి, బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొత్త సంవత్స రంలో, కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనైనా కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ఆశిద్దాం. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
విపక్షం భ్రమలు వీడాలి
సందర్భం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా పరిణతి సాధించలేదేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఆయన మానాన ఆయన్ని వదిలేద్దామని ఊరు కున్నా కూడా ఆయనంతట ఆయనే ఏదో ఒక తలాతోకా లేని వ్యాఖ్య చేసి ఇరుక్కుంటారు. ‘గుజరాత్ ప్రభుత్వాన్ని గుజరాతీలే నడపాలి. న్యూఢిల్లీలోని రిమోట్ కంట్రోల్ కాదు’ అని ఆయన ఆ రాష్ట్ర పర్యటనలో అన్నారు. గుజరాత్ ప్రభుత్వంలో ఉన్నది గుజ రాతీలు కాక విదేశీయులా? పోనీ ఆయనేదో మోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని కాంగేయులు వాదించినా... మోదీ షా ద్వయం కూడా గుజరాతీయులే కదా! ఇక రిమోట్ కంట్రోల్ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటంతో సమానం. మోదీపై ద్వేషాన్ని రాహుల్ అమితంగా ప్రేమిస్తున్నారని నాకనిపిస్తోంది. ఆ అతివల్లనే ఆయన వాస్తవాలు సరిచూసుకోలేక పోతున్నారు. కాకపోతే మరేంటి? ఈ పరిస్థితి రాహుల్ ఒక్కరిదే కాదు. ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. గత మూడేళ్లుగా ప్రధాని తన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజ లతో మమేకమయ్యారు. మెరుగైన పాలన, పదునైన వ్యూహాలతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. దీంతో సహజంగానే ఆయనపైన ఎలాగోలా మచ్చ వేయా లని, ప్రతిదాన్నీ భూతద్దంలో పెట్టి చూపించాలని ఉబలాటపడే ఒక వర్గానికి, అలాంటి భావజాలమే ఉన్న కొన్ని మీడియా సంస్థలు తోడయ్యాయి. దీంతో కనిపించిన ప్రతి అంశాన్నీ వారు వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు తాము ఆశిస్తున్న దాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారనే భ్రమలో పడిపోతున్నారు. ఇందుకు పెద్దనోట్ల రద్దు విఫలమైందంటూ జరుగుతున్న ప్రచారం ఒక ఉదాహరణ. వాస్తవానికి పెద్దనోట్ల రద్దు జరగ్గానే వీళ్లంతా ‘ఇదొక్కటి చాలు, మోదీ నాశనం అయిపో వటానికి’ అనుకున్నారు. కానీ, ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టే సరికి వీళ్లకు మతిపోయి, గట్టిగా గొంతెత్తలేకపోయారు. ప్రభుత్వాధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచే మోదీ అవినీతి ప్రక్షాళన, నల్లధనం వెలికితీతకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలూ గుర్తించని, పట్టించుకోని చాలా పనులు చేశారు. మోదీ హయాంలో చేనేత వస్త్రాల అమ్మకాలు 86 శాతం మేర పెరిగాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 41.63 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా సాయం అందించేందుకు 314 పథకాల ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లు అందించారు. తద్వారా జాతికి రూ. 57 వేల కోట్లు ఆదా చేశారు. కాంగ్రెస్ హయాంలో అట్టడుగు వర్గాలకు సాయం అందిం చటమే పెద్ద పనిగా ఉండేది. కానీ, మోదీ మాత్రం అట్టడుగు వర్గాలు కూడా పదిమందికి సాయపడేలా చేస్తున్నారు. వారి పురో భివృద్ధి కోసం ముద్ర యోజన ద్వారా 8.6 కోట్ల మంది వ్యాపారు లకు రూ. 3.72 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎలాంటి తనఖా లేకుండానే కావటం గమనార్హం. ఇందులో 70 శాతం మంది మహిళలు ఉండటం గుర్తించాల్సిన విషయం. అటల్ పెన్షన్ యోజన కింద అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షే మం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథ కాల ద్వారా ప్రతి భారతీయుడికి బీమా ధీమా కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 50 వేల కిలోమీటర్ల రోడ్లపై దీపాలు వెలిగిం చారు. లెడ్ దీపాల ఉద్యమాన్ని తీసుకొచ్చి పర్యావరణానికి మేలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఎన్నో పథకాలు అమలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగంలో మన దేశం ముందడుగు వేసేది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. ఈ దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలని, ప్రజలందరి సహకారంతో దేశాన్ని అగ్రరాజ్యం చేయాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారు. ఆయన ప్రతి పథకం, ప్రతి ఆలోచనా ప్రజలతో ముడిపడే ఉంటాయి. ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడికి ప్రజలే అండ. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మోదీ ముందుకు సాగిపోతున్నారు. ‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు..’ అని వేమన్న అన్నట్టే.. అవినీతిని అంతం చేయాలని, నల్లధనాన్ని వెలికితీయాలని, మెరు గైన పాలన ఇవ్వాలని, ప్రజలకు మేలు చేయాలని మోదీ పట్టు బట్టారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ ప్రజా సంక్షేమం, దేశాభి వృద్ధి చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రజలకు, మోదీకి మధ్య నెల కొన్న ఈ బంధం చాలా దృఢమైంది. గెలుపు, ఓటమికి మధ్య ప్రజలే మ్యాచ్ రిఫరీలు. అలా మోదీ విజయపరంపర కొనసాగిం చటానికి ప్రజలు పట్టంకడుతూనే ఉన్నారు. గుజరాత్, హిమా చల్ప్రదేశ్లతో పాటు కర్ణాటకలో కూడా ప్రజలకు, మోదీకి మధ్య ఉన్న బంధమే విజయం సాధించనుంది. దాన్ని దెబ్బ తీయాలని ఎన్ని కువిమర్శలు చేసినా ఎదురు దెబ్బలు తినక తప్పదు. సద్వి మర్శలు చేయాలని, తప్పులు ఎత్తి చూపాలని భావిస్తే మాత్రం ‘అతి’ని పక్కనపెట్టి, వాస్తవాల్లోకి రావాలి. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
అగ్రస్థానాల్లో ఆ నలుగురూ..!
సందర్భం ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యంలేని నలుగురు నేతలు కోవింద్, వెంకయ్య, నరేంద్ర మోదీ, సుమిత్రా మహాజన్ నేడు నాలుగు అత్యున్నత రాజ్యాంగ పదవులను అలంకరించడం బీజేపీ చరిత్రలో మేలిమలుపు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటలు మోదీ, షా నాయకత్వంలో బీటలువారాయి. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నిలిస్తే... కమ్యూనిస్టులు తొలి సారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరోవైపు దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహించిన నలుగురు సామాన్యులు దేశ అత్యున్నత పీఠాలను అధిరోహిస్తున్నారు. కాంగ్రెస్ ముక్తి భారత్ అంటున్న బీజేపీ ఇప్పుడు ఆ దిశగా తొలి అడుగు వేసిందని చెప్పవచ్చు. తొలిసారి నాలుగు అగ్ర స్థానాల్లో నలుగురు బీజేపీ నేతలు ఇమిడిపోయారు. గతంలో పూర్తి మెజార్టీ రానందున భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలిపి పనిచేయాల్సిన తరుణంలో వాజ్ పేయి తన అనుభవాన్ని రంగరించి సుపరిపాలన అందించారు. అయితే నేడు ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ లోక్‌సభలో పూర్తి మెజార్టీ సాధించగా.. త్వరలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ సాధించబోతోంది. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి అభ్యర్థికి న్యాయకోవిదుడు రామ్‌నాథ్ కోవింద్ వచ్చారు. న్యాయశాస్త్ర కోవిదుడిగా, బాల స్వయం సేవక్ సంఘ్‌గా ఆర్ఎస్ఎస్లో ఓనమాలు నేర్చుకున్న కోవింద్ ఇప్పుడు దేశ ప్రధమ పౌరుడు. నిష్కళంకుడిగా, దళితుల ఔన్నత్యం కోసం పనిచేసిన కోవింద్... న్యాయవాదిగా, రాజ్యసభ సభ్యుడిగా, గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణలో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవక్ సంఘ్‌గా జీవితం ఆరంభించి, బీజేపీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా... ప్రధానిగా ఒకదాని తర్వాత మరో పదవిలోకి ఇమిడిపోయారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా మోదీ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి... నేడు దేశ అత్యున్నత పదవిని అధిరోహించారు. టీ అమ్మడం దగ్గర్నుంచి, స్వయం సేవక్ కార్యకర్తగా, బీజేపీ నేతగా దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో పార్టీకి సేవలందించారు. పదేళ్ల యూపీఏ ఏలుబడిలో జరిగిన అవినీతిని పాతరేసేందుకు, ప్రధాని అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసి నెంబర్ 1 పీఠాన్ని మోదీ దక్కించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం అవుతూ.. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో కలిసి 17 రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకి అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలుగానీ, అసెంబ్లీ స్థానాలను గానీ సంపాదించడంలో అటు మోదీ, అమిత్ షా కృషి మరువలేనిది. ఇక ఎమర్జెన్సీ రోజుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ... జనసంఘ్ పార్టీలో కీలక సభ్యునిగా కొనసాగుతూ... ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మరో బీజేపీ కీలక నేత వెంకయ్యనాయుడు చరిత్ర సృష్టించారు. అంత్య, ఆది ప్రాసలతో విపక్ష పార్టీలను చీల్చిచెండాడి.. ఒకే దేశం... ఒకటే సిద్ధాంతమంటూ వెంకయ్య దేశమంతా బీజేపీ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన పార్టీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై గెలుపొందారు. ఇక మరో కీలక నేత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా లోక్‌సభకు 8 సార్లు ఎన్నికై ఆమె సంచలనం సృష్టించారు. సుమిత్రాతోపాటు లోక్‌సభకు 8 సార్లు ఎంపికైన ఎంపీలు ముగ్గురిలో ఆమె ఒకరు. మహిళా ఎంపీగా మహాజన్ ఒక్కరే ఇన్నిసార్లు విజయాలు సాధించడం విశేషం. వివాదాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతూ... ముందుకు సాగే మహా జన్... రెండేళ్లపాటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగానూ పనిచేశారు. ఎలాంటి రాజ కీయ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించని ఈ నలుగురు నేతలూ, స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగి వచ్చి ఇప్పుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడే విశిష్ట వ్యక్తులయ్యారు. కోవింద్, వెంకయ్య, మోదీ, సుమిత్రా మహాజన్ నలుగురిపైనా ఒక్కటంటే ఒక్క మచ్చ లేదు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ చిన్న అవినీతి, ఆశ్రితపక్షపాతమన్నది లేకుండా వారు రాజకీయ ప్రస్థానం సాగించారు. దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ ఇలా నాలుగు రాజ్యాంగ పదవులను అలంకరిస్తున్న నలుగురు వ్యక్తులు బీజేపీలో కీలక సేవలందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ఓనమాలు దిద్దిన అనుభవం ఆ నలుగురిది. నలుగురు నేతలు విచారధార... సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ స్థాయికి చేరుకున్నవారే. సిద్ధాంత రాజకీయాలకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్న క్రమశిక్షణతో పార్టీలో పనిచేశారు. నేడు ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశ స్వరూపాన్ని మార్చడానికి పిలుపిస్తున్న నరేంద్ర మోదీ కీలక పయనంగా ఈ పొందికను విశ్లేషించవచ్చు. వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ పురిఘళ్ల రఘురాం ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
నిబద్ధతకు నిక్కమైన నిర్వచనం
సందర్భం నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. ఇది తెలుగు జాతి గర్వించదగిన రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ పేరు ప్రముఖంగా విన్పించని రోజుల్లోనే ఆయన ఆ పార్టీకి ముఖ్యనేత. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ పేరు సుపరిచితం. తెల్లటి చొక్కా, తెల్లటి పంచెతో దర్శనమిచ్చే 6 అడుగుల మాటల బుల్లెట్ వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ నేతలు... అటల్జీ, అద్వానీజీ, ప్రమోద్ మహాజన్, సుష్మాస్వరాజ్, నరేంద్రమోదీ, అరుణ్ జైట్లీ ఇలా సీనియర్లందరూ వెంకయ్యాజీ అని పిలిచే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జిగా, బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా ఇలా అనేక బాధ్యతల్లో వెంకయ్య ఒదిగిపోయారు. ఎన్డీఏ ప్రభుత్వాల్లో తనదైన శైలితో ఒక ప్రత్యేక ముద్రతో కార్యకర్తలను, ప్రజలను, ఆకట్టుకోవడంలో వెంకయ్యది ప్రత్యేక స్టైల్. మాటల తూటాలతో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక, బిహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరామ్, జమ్మూ కశ్మీర్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక పార్టీ బహిరంగ సభల్లో పార్టీ వాణి–బాణిని బలంగా విన్పించారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రత్యర్థి పార్టీలకు వేడి పుట్టించే ప్రసంగాలకు వెంకయ్య పెట్టింది పేరు. వెంకయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిం చారు. 4 సార్లు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యసభ ఎంపీనే. 2013 రాష్ట్ర విభజన సందర్భంగా పార్టీ ఎజెండా ప్రకారం రెండు రాష్ట్రాల నినాదాన్ని పార్లమెంట్లో బలంగా విన్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఒకే ఒక్కడుగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... పదేళ్లు కావాలని బల్ల గుద్ది మరీ చెప్పారు. పోలవరం ముంపు మండలాలు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, విశ్వవిద్యాలయాలు, పోర్టులు, రోడ్లు, కేంద్ర సంస్థలు, ఇలా అనేక విషయాల్లో నాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి... బిల్లులో పెట్టించేలా చేశారు. విభజన సమయంలో వెంకయ్య పోషించిన పాత్ర అనన్య సామాన్యం. ఓవైపు సొంత పార్టీ నేతలు, మోదీ, జైట్లీ, సుష్మా, అద్వానీలకు విభజన బిల్లులో లోపాలను వివరిస్తూ... మరోవైపు అధికార పక్షంతో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, కావాల్సిన సంస్థలు, రావాల్సిన నిధులు, పోలవరం ముంపు మండలాల విషయాలపై చర్చించారు. 3 నెలల సమయాన్ని విభజన చర్చల కోసం వెచ్చించడం చాలా మందికి తెలియని విషయం. ఆనాటి సీఎం చివరి వరకు పదవి కోసం ఆఖరి బంతి ఉందంటూ ప్రజలను మభ్యపెట్టడాన్ని మనంచూశాం. ఇక తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఆరుగురు ప్లకార్డులతో ఆందోళన వెలిబుచ్చారు తప్ప రాష్ట్రానికి ఏం కావాలో చెప్పనే చెప్పలేదు. 1985 నుంచి 1998 వరకు ఏ విధమైన పదవి లేకున్నా... ఒకే పార్టీలో ఉండి తన నిబద్ధతను చాటుకున్నారు వెంకయ్య. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు, ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కేవలం సిద్ధాంత రాజకీయాలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు చేసేవారు. అలుపు లేకుండా ఈనాటికి ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాల కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి కొండంత అండగా ఉంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడంలో, భారీగా నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వెంకయ్య చొరవను, ప్రమేయాన్ని ఎవరూ కాదనలేరు. పార్టీ ఏ పని చెప్పినా ఆ పని చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మంత్రిగా ఉన్నా, ఆ శాఖకు వన్నె తెచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా... అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రశంసను నేటి ప్రధాని మోదీ అభినందనలను వెంకయ్య పొందారు. పని రాక్షసుడిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వం లోనూ పేరు తెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో పార్టీ దూతగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య యువజన నేతగా, చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరి... దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సంఘ్ శిక్షణలో ఒక సమర్థమైన క్రమశిక్షణ గల నాయకునిగా రాటుదేలారు. నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెంకయ్య... ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమవుతోంది. మోదీ సర్కారులో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ... ప్రభుత్వానికి తల్లోనాలుకలా వ్యవహరించిన వెంకయ్యను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్య... తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి దిశానిర్దేశం చేశారు. కాకలు తీరిని రాజకీయ నేతల వేదికగా ఉండే రాజ్యసభలో మోదీ స్టైల్లో నడిపించాలంటే అందుకు వెంకయ్యే తగినవాడన్న అభిప్రాయం మోదీలో ఉంది. దక్షిణాదిన కాషా యం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఉత్తరాది పార్టీలో దక్షిణాది పోకడలను నింపాడు. - పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
అత్యున్నతపీఠంపై అసామాన్యుడు
సందర్భం దళితుల్లో పుట్టి స్వయం కృషితో ఎదిగి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపికైన రామ్‌నాథ్ కోవింద్ వంటి విశిష్ట వ్యక్తి విషయంలోనూ రాజకీయం నడపడం, పోటీ పెట్టడం కాంగ్రెస్ పార్టీకే చెల్లు. ఈ దఫా రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా ఆ ప్రయత్నం వమ్మయింది. ప్రతిపక్షాలు సరైన వ్యక్తిని సూచిస్తే మద్దతివ్వడానికి కూడా సిద్ధమేనంటూ బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు తిరస్కరించాయి. రాజకీయంగా అవినీతి ఆరోపణలలో చిక్కుకుపోయిన ప్రతిభా పాటిల్‌నే ఆనాడు రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంచుకుని గెలిపించి అప్రతిష్టను మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రామ్‌నాథ్ కోవింద్ వంటి దళిత రాజకీయవేత్తపై బురద జల్లడానికి కూడా సాహసించడం విచారకరం. సమాజంలో అట్టడుగువర్గాల్లో జన్మించిన రామ్‌నాథ్ కోవింద్‌ది విశిష్టమైన వ్యక్తిత్వం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలంలో పుట్టి పెరిగిన కోవింద్ ప్రజాజీవితంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలిసారిగా 1990లో లోక్‌సభ ఎన్నికల్లో ఘటంపుర్ నుంచి బరిలోకి దిగారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీ కోటాలో తనకు కేటాయించిన నిధుల ద్వారా వచ్చిన సొమ్మును ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అనేక పాఠశాలల నిర్మాణానికి, వాటి అభివృద్ధికి ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చేపట్టాల్సిన పథకాలను నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి విన్నవించి వాటి పరిష్కారాల కోసం కృషి చేశారు. సివిల్ సర్వెంట్‌గా దేశానికి సేవలందించాలని కలగన్న కోవింద్ మూడో ప్రయత్నంలోనే విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు. తనకు ఇష్టమైన, తన ప్రవృత్తికి దVýæ్గరైన న్యాయవాదిగా కొనసాగారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వద్ద కొంత కాలం ప్రైవేటు సెక్రటరీగా పనిచేసి ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన విషయాల్లోనూ అనుభవం గడించారు. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులను ప్రజలకు, తన గ్రామానికి ఇచ్చేసి యూపీ ప్రజల్లో గుర్తింపు పొందారు. నిబద్ధతతో నిరాడంబర జీవితాన్ని గడిపే వ్యక్తిగా సుపరిచితులు. అయితే రాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప ఆశయంతో ముందడుగేయాలని భావించినప్పటికీ.. అది కుదర్లేదు. దేశానికి ప్రథమ పౌరుడి ఎన్నిక ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా జరగాలని ప్రధాని మోదీ భావించారు. అందులో భాగంగానే ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతోనూ, కమ్యూనిస్టులతోనూ ఎన్డీఏ కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీ సభ్యులైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య దేశంలోని కీలక పార్టీలన్నిటితో చర్చించి, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కావాలని, అదే ప్రధాని ఉద్దేశమని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను అభ్యర్థిగా సూచించినప్పుడు నాటి ప్రధాని వాజ్‌పేయి వ్యవహరించిన అదే పంథాను మోదీ కొనసాగించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు నిరాకరించింది. రాజకీయ విభేదం ఉంది కాబట్టే... రాష్ట్రపతి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. బీజేపీకి, మోదీకి క్రెడిట్ ఇవ్వకూడదన్న దురుద్దేశంతోనే... కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి గండికొట్టింది. అయితే ఎన్డీఏలో భాగస్వాములు కాని అనేక పార్టీలు స్వచ్ఛందంగా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా ఒడిశాలోని బీజేడీ, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ, బిహార్‌లోని నితీష్ కుమార్, జేడీ యూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఎన్డీఏ అభ్యర్థికి సహకరిస్తామని విస్పష్టంగా చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 17 పార్టీలు రావ్‌ునాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెబుతోంది. ఎన్డీఏ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాంగ్రెస్ దుష్ట రాజకీయమే. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ప్రతిపక్షాలను సైతం ఒక్కతాటిపై నిలబెట్టలేకపోయింది. బీజేపీపై దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ కన్న కలలు మరోసారి విఫలమయ్యాయి. వైఎస్ జగన్ పరిపక్వత అభినందనీయం ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికి మద్దతిస్తామంటూ వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించాలి. రాజకీయంగా ఎంతో పరి పక్వత ప్రదర్శించి రాష్ట్రపతి ఎన్నికలో మోదీ సూచించిన అభ్యర్థికి మద్దతిస్తానని చెప్పడం... సహజంగా, అధికార టీడీపీ వర్గాలను కలవరపెడుతోంది. టీడీపీ ఎంతగా విమర్శించినప్పటికీ వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు అభినందనీయమని చెప్పాలి. అభ్యర్థిని ప్రకటించకముందే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తానని మోదీతో చెప్పడం టీడీపీకి మింగుడుపడలేదు. జగన్ నిర్ణయంతో టీడీపీ అసహనంతో కంగారుపడి బెంబేలెత్తిపోతోంది. జగన్ నిర్ణయంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందన్నది వాస్తవం. అందుకే టీడీపీ దీనిపై చిలువలు పలువలు అల్లి విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురతను ప్రదర్శించడం శుభపరిణామం. ఒక్కటి మాత్రం నిజం... దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి పూర్తి మద్దతు సంపాదించిన రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ కుటిల రాజకీయాలు మరోసారి రుజువయ్యాయ్. తాను చెడిందే కాకుండా... దేశంలోని ఇతర పార్టీలను సైతం చెడగొట్టే దుష్ట సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత స్థానంలో కుర్చోవడం ద్వారా ప్రపంచానికి మన దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనం చాటినట్టవుతుంది. - పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
అడిగేముందు తెలియాలి!
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ప్రశ్నించడం మంచిదే. కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కేటాయించిన పలు ప్రాజెక్టులను ఆయన విస్మరించకూడదు. అప్పుడప్పుడు వచ్చి తాటాకు చప్పుళ్లు చేయటం అంత మంచిదీ కాదు. అమలైనా, అమలు కాకపోయినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలకు తాయి లాలిచ్చి ఎన్నికల్లో నెగ్గుకురా వటం అనేది స్వతంత్ర భార తంలో ఏడో దశాబ్దంలో కూడా మారకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్కు అయిన ఈ సంస్కృతిని వీలైనంత వరకూ మార్చాలని, అభివృద్ధిని ఎన్నికల ఎజెండాగా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు, కొంతమంది నాయకులకు ఇదేమీ రుచించకపోవచ్చు. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించటం పాలకుల ధర్మం. అయితే, ప్రజలకు, రాష్ట్రానికి ఏది మేలు చేస్తుందో అది చేయటం పాలకుల కర్తవ్యం. రాష్ట్ర విభజనకు ముందు ఒకమాట, తర్వాత ఒక మాట మాట్లాడిన రాజకీయ నాయకులు ఉన్నారు. చెడు జరిగితే ఎదుటివాళ్లపై రుద్ది, మంచి జరిగితే తామే చేశామని కీర్తి కండూతి ప్రదర్శించిన పార్టీలు ఉన్నాయి. అయితే అప్పుడూ, ఇప్పుడూ ఒకే మాట, ఒకే వైఖరికి కట్టుబడిన పార్టీ బీజేపీ మాత్రమే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్టీలన్నీ ఏకమై రోడ్లెక్కినా విభజన అనివార్యమని చెప్పింది బీజేపీయే. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టిన, హామీలు సాధించిన పార్టీ బీజేపీయే. ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది కూడా బీజేపీయే. మరీ ముఖ్యంగా వెంకయ్య నాయుడే. ఆనాడు ఆయనే కనుక పట్టుబట్టకపోతే నేడు రాష్ట్ర రాజకీయాలు వేరేగా ఉండేవి. అందుకు ఆయన్ను అభినందించాల్సిందిపోయి తప్పుబట్టడం అవివేకం. రాష్ట్ర విభజనకు ముందు పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. అప్పటి దేశ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర భవిష్యత్తుపై భయాందోళనలవల్ల ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఆ తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. తాయిలాలు ఇచ్చే సంస్కృతి స్థానంలో నిజ మైన అభివృద్ధి ఎజెండాను ఎత్తుకుంది. ప్రతి రాష్ట్రానికీ సమన్యాయం చేస్తూ సమాఖ్య స్ఫూర్తికి జీవం పోసింది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి విభజన సందర్భంగా ఏర్పడ్డ భయాందోళనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం కేంద్రం కాదా? రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచింది, అవసరమైన సాయం చేసిందీ కేంద్రం కాదా? దేశ ఆర్థిక రంగాన్ని ఎలా ఒడ్డున పడేసిందో.. విభజన కష్టాల నుంచి రాష్ట్రం బయటపడేందుకు అంతే సాయం చేసింది. రాష్ట్ర ప్రభు త్వంకానీ, సీఎం కానీ అడగకుండానే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. ఇదంతా చేసింది రాజకీయం కోసం కాదు. ఓట్ల కోసం అంతకన్నా కాదు. నవ్యాంధ్రకు చేయూతనిచ్చేందుకే. కానీ, ఎంత చేసినా కృత జ్ఞత ప్రదర్శించని పార్టీలు, మేలును మరచి వెన్ను పోటు పొడిచే నాయకులు మనకు కొత్తేం కాదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని తీవ్రంగా తీసుకొంది. బీజేపీ అధిష్టానం సైతం హోదాపై దృష్టి సారించింది. అత్యున్నత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఏపీని ఆదుకునేం దుకు, ప్రజలకు మేలు చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కృతనిశ్చయంతో ఉన్నారు. హోదా సహా హామీల అమలుపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలు వడనుంది. ప్రత్యేక హోదా కోసం అంటూ పవన్ కల్యాణ్ తిరుపతిలో గొంతెత్తారు. ఆయన ప్రశ్నించటంలో తప్పులేదు. చిరంజీవితో పవన్ కల్యాణ్‌ని మనం పోల్చలేం. ఇద్దరికీ చాలా తేడా ఉంది. పవన్‌లో ఆవేశం పాళ్లు ఎక్కువ. ఏదైనా సూటిగా మాట్లాడటం ఆయ నలో ప్రత్యేకత. అంతేకాకుండా చిరంజీవికన్నా ఎక్కువ నిజాయితీపరుడిగా యువతలో పవన్‌కు పేరుంది. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే విష యాన్ని పవన్ ఇంకా గ్రహించినట్లు లేరు. అన్న ప్రజా రాజ్యం పార్టీ తర్వాత ఈ విషయాలు ఈపాటికే తెలిసి ఉండాలి. ప్రత్యేక హోదా గురించి ఆయన అడగటం మంచిదే. అది కూడా ఆయన బాధ్యతే. అయితే, పవన్ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రైల్వే, రోడ్లు, మెట్రోలు, స్మార్ట్ సిటీలు, బీహెచ్ఈఎల్, బెల్, డీఆర్డీఓ, ఎన్ఎండీసీ, ఎన్డీఎంసీ, పెట్రో కారిడార్, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర అభి వృద్ధి కోసమే కదా! పవన్ ఒక వ్యక్తిగా కాకుండా తన పార్టీ జనసేనను విస్తరించాలనుకుంటే, సీరియస్‌గా పోరాడాలనుకుంటే మాత్రం రాజకీయాలను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తన పార్టీకి ఒక కమిటీ నిర్మాణం చేసి, విధివిధానాలు, ఎజెండాను నిర్ధారించుకుని ప్రజల ముందుకు వస్తే బాగుంటుంది. అంతేకానీ అప్పుడప్పుడు వచ్చి తాటాకు చప్పుళ్లు చేయటం అంత మంచిది కాదు. - పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త ఏపీ బీజేపీ సమన్వయకర్త ఈమెయిల్ : raghuram.delhi@gmail.com -
రైతు బాంధవుడు మోదీ
సందర్భం అన్నం పెట్టే రైతుకు కూడా పట్టెడన్నం దొరికేవిధంగా చేయడానికి చంద్ర మండలంపైకి వెళ్లేంత శ్రమపడాల్సిన పనిలేదు. ప్రభుత్వ విధానాలు, పాలకుల ఆలోచనలు సవ్యంగా ఉంటే చాలు. ‘‘మన దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమా? కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేద్దాం. 2022 నాటి కల్లా దీన్ని సాధ్యం చేయగలం’’ రాజ్యసభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇది. ఈ అంశంపై అధ్యయనం చేయించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో అంతర్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించారు. రాబోయే ఆరేళ్లలో రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేసేందుకు ఏమేం చర్యలు తీసు కోవాలో ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. వ్యవసాయం లాభసాటిగా మారితే, రైతుల చేతుల్లో తగినంత డబ్బు ఉంటే... గ్రామాలు కళకళ లాడటమే కాదు చుట్టుపక్కల ఉండే పట్టణాలు, ఆయా పట్టణాల్లోని చిరు వ్యాపారులు కూడా ఆనందంగా ఉంటారు. విదేశీ పెట్టుబడులను ఆక ర్షించేందుకు, మేకిన్ ఇండియా వంటి పథకాలకు మోదీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో వ్యవసాయా నికి, రైతుల సంక్షేమానికి అంతకు మించి ప్రాధా న్యం ఇస్తున్నారు. పప్పు, బెల్లాల పంపిణీ చేసి, నోరు తీపి చేసి ఆ క్షణానికి రైతుల్ని సంతోష పెట్టడం వంటి పథకాలకు కాకుండా... భారత సమాజంలో కలుపు మొక్కల్లా తయారైన విధా నాలను పీకి పారేసి, దీర్ఘకాలంపాటు రైతులు ధీమాగా బతికే పునాదులు వేస్తున్నారు. పొరుగు రైతు బస్తా యూరియా వేస్తే... బస్తాన్నర యూరియా వేసే అమాయకత్వం మన రైతులది. పక్క పొలంలో ఎర్ర డబ్బా పురుగు మందు పిచికారీ చేస్తే అదే మంచిదనుకుని ఎర్ర డబ్బా పురుగుమందే చల్లుతుంటారు. అందుకే రైతులకు సరైన వ్యవసాయ విధానాలు తెలిపేం దుకు, సూచనలు, సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కిసాన్ రేడియో, కిసాన్ టీవీ చానల్‌ను ప్రారంభించారు. పొలం తీరుకు తగ్గట్లుగా ఎరు వులు వాడాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక పథకాన్ని చేపట్టింది. భూమి ఆరోగ్య కార్డును అందిస్తోంది. మన దేశంలో ఉన్న ప్రతి పొలాన్నీ పరిశీలించి ఆ పొలంలో ఏ ఎరువు, ఎంత మొత్తంలో వేయాలో అధికారులు చెప్పి, కార్డు ఇస్తారు. దీనివల్ల పొలానికి పటుత్వం పెరగటంతో పాటు ఎరువుల వాడకంలో వృథాను అరికట్టొచ్చు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సంద ర్భంగా ఆన్లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ‘‘ఇనామ్’’ అనే మరొక ప్రతిష్టాత్మక పథకానికి మోదీ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా దేశంలో ఏ మూల నుంచి అయినా ఏ మూలకైనా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చు. ఇక పంటల బీమా పథకం రైతుల ఇబ్బందులను రూపు మాపే చారిత్రక పథకం. సాగు చేస్తున్న పంటకే కాదు.. నారుమళ్లకు, నూర్పిడి జరిగిన తర్వాత పొలంలో ధాన్యం రాశులకు కూడా బీమా సదుపాయం ప్రవేశపెట్టారు. ప్రతి గ్రామం యూని ట్‌గా 30 శాతం పంట నష్టం జరిగినా ఇప్పుడు బీమా వర్తిస్తుంది. అంతేకాదు పంటల బీమాకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం 1.5 శాతం మాత్రమే. నష్టపోయిన పంటను పరిశీలించాల్సిన పనిలేదు. రైతులు తమ సెల్ఫోన్లో ఫొటోలు తీసి పంపినా అధికారులు డబ్బులు చెల్లిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ రైతు అనుకూల బడ్జెట్‌గా నీరాజనాలు అందుకుంటోంది. దేశంలో ఇప్పుడు వ్యవసాయం చేయటం అంటే నామోషీ అయిపోయింది. రైతుల పిల్లలు కూడా ఏ ఉద్యోగం దొరక్కపోతేనే వ్యవసాయం చేస్తున్నారు. మరో వైపు పంటలు పండించటానికి విపరీతంగా పెట్టు బడి పెట్టాల్సి వస్తోంది. అటు రైతులు, ఇటు కూలీలు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ పరిస్థితిని మార్చాలంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిం చాలి. ఊడ్పుల నుంచి నూర్పిళ్ల వరకూ యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. అవి రైతుల చేతికి అందేలా కేంద్రం రాయితీలు ఇస్తోంది. నీటి వృథాను అడ్డుకునేందుకు స్ప్రింక్లర్లు, రెయిన్‌గన్ లను అందిస్తోంది. ప్రధానమంత్రి ‘క్రిషి సించాయి యోజన పథకం’ ద్వారా దేశవ్యాప్తంగా తొలి దశలో 80 ప్రధాన జలాశయాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు ఇస్తోంది. పొలంగట్ల తగాదాలు మనకందరికీ తెలిసి నవే. ఆ గట్లపై టేకు చెట్లను పెంచితే ఏళ్ల తరబడి తగాదాలకు, వివాదాలకు పరిష్కారం లభించటమే కాకుండా రైతులకు లాభదాయకం.ఎకరం పొలంలో రెండు సెంట్ల భూమి పెద్ద విషయం కాదు. ఆ రెండు సెంట్లలో చిన్న నీటి కుంటను తవ్వుకుంటే అవసరానికి నీరు ఉపయోగపడు తుంది. అందులోనే చేపలు, రొయ్యల వంటివి కూడా సాగు చేసుకోవచ్చు. ప్రతి రైతు కుటుంబం కోళ్ల పెంపకం, పశువుల పెంపకం ద్వారా ఆదా యాన్ని పెంచుకోవచ్చు. పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన పథకం ద్వారా సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తోంది. సంప్ర దాయ సాగులో భాగంగా రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సేంద్రియ ఎరువు లను వాడి పంటలు పండించే పద్ధతులను రైతు లకు అలవాటు చేస్తోంది. తద్వారా ఆరోగ్య కరమైన, బలవర్ధకమైన వ్యవసాయ ఉత్పత్తులు సమాజానికి, సాధారణ సాగుతో పోలిస్తే అధిక ధర రైతుకు లభిస్తాయి. అదే విధంగా వాణిజ్య పంటలకు కూడా కేంద్రం అన్నివిధాలా సహక రిస్తోంది. టమాటా ధర బాగోకపోతే రోడ్లపై పార బోయాలి. అదే టమాటాను కెచప్‌గా చేస్తే ధర పెరుగుతుంది. మిర్చి మామూలుగా అమ్మితే ధర తక్కువ. కారం తయారు చేస్తే ధర ఎక్కువ. కోకాకోలా పానీ యాల్లో 5-10 శాతం పండ్ల రసాలు కలిపితే పండ్ల తోటల సాగు ఊపందు కుంటుంది. ఇవన్నీ చేయాలంటే చంద్రమండలం పైకి వెళ్లేంత శ్రమ పడాల్సిన పనిలేదు. ప్రభుత్వ విధానాలు, పాలకుల ఆలోచ నలు సవ్యంగా ఉంటే చాలు. ‘‘నేను మన్మోహన్ సింగ్లాగా గొప్ప ఆర్థిక వేత్తను కాదు. పెద్ద పెద్ద విషయాల గురించి నాకు లోతుగా తెలియదు. చిన్న చిన్న పనులు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే పనులే చేస్తా’’ అని నరేంద్ర మోదీ తరచుగా అంటుంటారు. అందుకే ఆయన ‘‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’’ పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త ఈమెయిల్ :raghuram.bjp@gmail.com