అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారం కాబో తోంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. అత్యంత ఉన్నతమైన నిర్మాణ విలువలతో మరో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. శ్రీరాముడు వనవాసం చేసింది 14 సంవత్సరాలైతే.. అయో ధ్యలోని రామ్ లల్లా 28 ఏళ్లకుపైగా గుడార వాసం చేశారు. శ్రీరాముడి కోసం నిర్మిస్తున్న ఈ ఆలయం అఖండ భారతదేశంలోని హిందువుల చైతన్యానికి, స్వాభిమానానికి కూడా ప్రతీకగా నిలిచిపోనుంది. ఈ ఆలయ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఖర్చు కానుంది.
దేశంలోని ప్రతి ఒక్క హిందువుకూ ఈ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యే హక్కును దృష్టిలో ఉంచుకుని విరా ళాలు సేకరించే కార్యక్రమం మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ పూర్తి చేయనుంది. విరాళాలు స్వీకరించేందుకు వీహెచ్‌పీ కార్య కర్తలు ఇంటింటికీ వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 15 నుంచి 31 వరకు ఈ విరాళాల స్వీకరణ జరుగుతుంది. హిందు వులందరూ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యేలా కనీస విరాళం 10 రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు ఇచ్చే విరా ళాలను అత్యంత పారదర్శకంగా ట్రస్టుకు జమ చేస్తారు.
రాముడు పుట్టింది అయోధ్యలోనే. రాముడు అవతారం చాలించిన తర్వాత హిందూరాజులు ఈ ప్రదేశాన్ని పాలిం చారు. తదనంతర కాలంలో ముస్లింలు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి దండయాత్రలు చేశారు. అయోధ్యలోని రాముని ఆలయాన్ని ధ్వంసం చేస్తే హిందువుల మనోబలం దెబ్బతీసినట్లేనని భావించిన బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ 1528లో అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే మూడు గుమ్మటాలు నిర్మించాడు. ఇది ఉన్న కొండపేరు రామ్ కోట్. దీనిని బట్టే ఇది శ్రీరాముడి జన్మస్థానం అని స్పష్టమవు తోంది. ఆ తర్వాత మూడు గుమ్మటాల కూల్చివేత, ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ చేసిన, చేస్తున్న అలు పెరుగని పోరాటం అంతా ఒక అద్భుత చరిత్ర.
1990లో మొదటి కరసేవ జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 వేల మంది కరసేవకులు ఆ కార్య క్రమంలో పాల్గొనగా, వీరిలో 2 వేల మంది మహిళలు. చాలా మంది వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అయోధ్య చేరుకున్నారు. ఎల్‌కే అడ్వాణీ, అశోక్ సింఘాల్ వంటి ఎందరో ప్రముఖులు రాముని ఆలయం కోసం దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు.
భారతదేశానికి అతిపెద్ద సమస్య అయోధ్య రామ మందిర నిర్మాణమేనని దశాబ్దాలుగా ఎంతో మంది అభివర్ణిస్తూ వచ్చారు. హిందువులు రాత్రికి రాత్రే గుడి కట్టేస్తారని కూడా కొందరు ప్రచారం చేశారు. అలా చేస్తే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువుపోతుందంటూ ఇంకొందరు చర్చలు లేవనె త్తారు. అయితే రాముని మందిర నిర్మాణం ఎటువంటి వివా దాలకు, భవిష్యత్ లిటిగేషన్లకు తావులేకుండా వైభవోపేతంగా జరుగుతుందని అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా రాతి శిలలు చెక్కు తున్న వారి దగ్గరి నుంచి సాధువులు, సంతుల వరకు అంతా విశ్వసించారు. వారు నమ్మినట్లుగానే ఈ వ్యవహారం 492 ఏళ్ల తర్వాత వివాదాలకు తావివ్వకుండా పరిష్కారం అయ్యింది. ఎటువంటి హింస, రక్తపాతాలు లేకుండానే తుది నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత కూడా దేశంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు.
శాంతియుత వాతావరణంలో ఆలయ నిర్మాణం గురించి దేశం చర్చించుకుంటోంది. ఒకప్పుడు ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన చాలామంది.. నిజమైన పరిష్కారం లభించిన రోజు దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంటుందని, హింసకూ ఆస్కారం ఉంటుందని భావించారు. కానీ, అందుకు భిన్నమైన వాతావరణం ఈ రోజు ఉంది. ఇన్నేళ్ల పాటు ఇంతటి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలోను, ఇప్పుడు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ వీహెచ్‌పీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. బలమైన నాయకత్వంతో పాటు విలువలతో కూడిన ఆలోచనలు, వాటికి తగ్గ ఆచరణ, దేశవ్యాప్తంగా అంద రినీ కదిలించగలిగేంత సమర్థత ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమ వుతాయి. వీహెచ్‌పీ సంస్థ పరంగానూ, కరసేవకుల పరం గానూ మెచ్చుకోదగ్గ రీతిలో వ్యవహరించిందని చెప్పాలి.
అయోధ్యలో నిర్మించేది కేవలం ఆలయం మాత్రమే కాదు. అది రాముడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, న్యాయం చేయడం. దాదాపు మూడు దశాబ్దాలుగా గుడారానికే పరిమి తమైన రాముడికి సముచిత గౌరవం ఇవ్వడం. హిందువుల మనోబలాన్ని దెబ్బతీయాలని ఆనాడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. ఆ భావన తప్పు అని రుజువు చేయడం. నిజాన్ని పూడ్చిపెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందని చాటి చెప్పడం. అఖండ భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం, స్ఫూర్తి నింపడం.
-పురిఘళ్ల రఘురామ్
వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment