సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. అధికారమే పరమావధిగా గంటా పనిచేస్తారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు గంటా పార్టీ మారుదామని అనుకుంటే సిట్ దర్యాప్తులో ఆయన పేరు ఉందని చంద్రబాబు బెదిరించారట. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటివారు విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన అపరాధి గంటా శ్రీనివాసరావే అని చెప్పారు.
ప్రజల కోసం పనిచేసే వాళ్లు, మచ్చ లేనోళ్లు ఎవరైనా బీజేపీ లోకి రావచ్చు. గంటా శ్రీనివాసరావు ఇటీవల బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులను కలుస్తున్నారు. అధికారమే పరమావధిగా ఆయన పని చేస్తున్నారు. అధికారం మాత్రమే కావాలా? సిద్ధాంతాలు వద్దా? వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు క్షమించరు. అమిత్ షా, సీఎం జగన్ మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది’అని రఘురాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment