విపక్షం భ్రమలు వీడాలి | Purighalla Raghuram criticises congress | Sakshi
Sakshi News home page

విపక్షం భ్రమలు వీడాలి

Published Sun, Oct 8 2017 1:15 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Purighalla Raghuram criticises congress - Sakshi

సందర్భం
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇంకా పరిణతి సాధించలేదేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఆయన మానాన ఆయన్ని వదిలేద్దామని ఊరు కున్నా కూడా ఆయనంతట ఆయనే ఏదో ఒక తలాతోకా లేని వ్యాఖ్య చేసి ఇరుక్కుంటారు. ‘గుజరాత్‌ ప్రభుత్వాన్ని గుజరాతీలే నడపాలి. న్యూఢిల్లీలోని రిమోట్‌ కంట్రోల్‌ కాదు’ అని ఆయన ఆ రాష్ట్ర పర్యటనలో అన్నారు. గుజరాత్‌ ప్రభుత్వంలో ఉన్నది గుజ రాతీలు కాక విదేశీయులా? పోనీ ఆయనేదో మోదీ, అమిత్‌ షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని కాంగేయులు వాదించినా... మోదీ షా ద్వయం కూడా గుజరాతీయులే కదా! ఇక రిమోట్‌ కంట్రోల్‌ పాలన గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటంతో సమానం.

మోదీపై ద్వేషాన్ని రాహుల్‌ అమితంగా ప్రేమిస్తున్నారని నాకనిపిస్తోంది. ఆ అతివల్లనే ఆయన వాస్తవాలు సరిచూసుకోలేక పోతున్నారు. కాకపోతే మరేంటి? ఈ పరిస్థితి రాహుల్‌ ఒక్కరిదే కాదు. ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. గత మూడేళ్లుగా ప్రధాని తన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజ లతో మమేకమయ్యారు. మెరుగైన పాలన, పదునైన వ్యూహాలతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.

దీంతో సహజంగానే ఆయనపైన ఎలాగోలా మచ్చ వేయా లని, ప్రతిదాన్నీ భూతద్దంలో పెట్టి చూపించాలని ఉబలాటపడే ఒక వర్గానికి, అలాంటి భావజాలమే ఉన్న కొన్ని మీడియా సంస్థలు తోడయ్యాయి. దీంతో కనిపించిన ప్రతి అంశాన్నీ వారు వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు తాము ఆశిస్తున్న దాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారనే భ్రమలో పడిపోతున్నారు. ఇందుకు పెద్దనోట్ల రద్దు విఫలమైందంటూ జరుగుతున్న ప్రచారం ఒక ఉదాహరణ. వాస్తవానికి పెద్దనోట్ల రద్దు జరగ్గానే వీళ్లంతా ‘ఇదొక్కటి చాలు, మోదీ నాశనం అయిపో వటానికి’ అనుకున్నారు. కానీ, ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టే సరికి వీళ్లకు మతిపోయి, గట్టిగా గొంతెత్తలేకపోయారు.

ప్రభుత్వాధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచే మోదీ అవినీతి ప్రక్షాళన, నల్లధనం వెలికితీతకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలూ గుర్తించని, పట్టించుకోని చాలా పనులు చేశారు. మోదీ హయాంలో చేనేత వస్త్రాల అమ్మకాలు 86 శాతం మేర పెరిగాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 41.63 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా సాయం అందించేందుకు 314 పథకాల ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లు అందించారు. తద్వారా జాతికి రూ. 57 వేల కోట్లు ఆదా చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో అట్టడుగు వర్గాలకు సాయం అందిం చటమే పెద్ద పనిగా ఉండేది. కానీ, మోదీ మాత్రం అట్టడుగు వర్గాలు కూడా పదిమందికి సాయపడేలా చేస్తున్నారు. వారి పురో భివృద్ధి కోసం ముద్ర యోజన ద్వారా 8.6 కోట్ల మంది వ్యాపారు లకు రూ. 3.72 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎలాంటి తనఖా లేకుండానే కావటం గమనార్హం. ఇందులో 70 శాతం మంది మహిళలు ఉండటం గుర్తించాల్సిన విషయం. అటల్‌ పెన్షన్‌ యోజన కింద అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షే మం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన పథ కాల ద్వారా ప్రతి భారతీయుడికి బీమా ధీమా కల్పిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా 50  వేల కిలోమీటర్ల రోడ్లపై దీపాలు వెలిగిం చారు. లెడ్‌ దీపాల ఉద్యమాన్ని తీసుకొచ్చి పర్యావరణానికి మేలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఎన్నో పథకాలు అమలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగంలో మన దేశం ముందడుగు వేసేది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. ఈ దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలని, ప్రజలందరి సహకారంతో దేశాన్ని అగ్రరాజ్యం చేయాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారు. ఆయన ప్రతి పథకం, ప్రతి ఆలోచనా ప్రజలతో ముడిపడే ఉంటాయి. ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడికి ప్రజలే అండ. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మోదీ ముందుకు సాగిపోతున్నారు.

‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు..’ అని వేమన్న అన్నట్టే.. అవినీతిని అంతం చేయాలని, నల్లధనాన్ని వెలికితీయాలని, మెరు గైన పాలన ఇవ్వాలని, ప్రజలకు మేలు చేయాలని మోదీ  పట్టు బట్టారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ ప్రజా సంక్షేమం, దేశాభి వృద్ధి చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రజలకు, మోదీకి మధ్య నెల కొన్న ఈ బంధం చాలా దృఢమైంది. గెలుపు, ఓటమికి మధ్య ప్రజలే మ్యాచ్‌ రిఫరీలు. అలా మోదీ విజయపరంపర కొనసాగిం చటానికి ప్రజలు పట్టంకడుతూనే ఉన్నారు. గుజరాత్, హిమా చల్‌ప్రదేశ్‌లతో పాటు కర్ణాటకలో కూడా ప్రజలకు, మోదీకి మధ్య ఉన్న బంధమే విజయం సాధించనుంది. దాన్ని దెబ్బ తీయాలని ఎన్ని కువిమర్శలు చేసినా ఎదురు దెబ్బలు తినక తప్పదు. సద్వి మర్శలు చేయాలని, తప్పులు ఎత్తి చూపాలని భావిస్తే మాత్రం ‘అతి’ని పక్కనపెట్టి, వాస్తవాల్లోకి రావాలి.


పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement