రైతు బాంధవుడు మోదీ | modi relative of farmers | Sakshi
Sakshi News home page

రైతు బాంధవుడు మోదీ

Published Wed, May 25 2016 12:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతు బాంధవుడు మోదీ - Sakshi

రైతు బాంధవుడు మోదీ

సందర్భం
 
అన్నం పెట్టే రైతుకు కూడా పట్టెడన్నం దొరికేవిధంగా చేయడానికి చంద్ర మండలంపైకి వెళ్లేంత శ్రమపడాల్సిన పనిలేదు. ప్రభుత్వ విధానాలు, పాలకుల ఆలోచనలు సవ్యంగా ఉంటే చాలు.
 
‘‘మన దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమా? కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేద్దాం. 2022 నాటి కల్లా దీన్ని సాధ్యం చేయగలం’’ రాజ్యసభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇది. ఈ అంశంపై అధ్యయనం చేయించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో అంతర్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించారు. రాబోయే ఆరేళ్లలో రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేసేందుకు ఏమేం చర్యలు తీసు కోవాలో ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.


వ్యవసాయం లాభసాటిగా మారితే, రైతుల చేతుల్లో తగినంత డబ్బు ఉంటే... గ్రామాలు కళకళ లాడటమే కాదు చుట్టుపక్కల ఉండే పట్టణాలు, ఆయా పట్టణాల్లోని చిరు వ్యాపారులు కూడా ఆనందంగా ఉంటారు. విదేశీ పెట్టుబడులను ఆక ర్షించేందుకు, మేకిన్ ఇండియా వంటి పథకాలకు మోదీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో వ్యవసాయా నికి, రైతుల సంక్షేమానికి అంతకు మించి ప్రాధా న్యం ఇస్తున్నారు. పప్పు, బెల్లాల పంపిణీ చేసి, నోరు తీపి చేసి ఆ క్షణానికి రైతుల్ని సంతోష పెట్టడం వంటి పథకాలకు కాకుండా... భారత సమాజంలో కలుపు మొక్కల్లా తయారైన విధా నాలను పీకి పారేసి, దీర్ఘకాలంపాటు రైతులు ధీమాగా బతికే పునాదులు వేస్తున్నారు.


పొరుగు రైతు బస్తా యూరియా వేస్తే... బస్తాన్నర యూరియా వేసే అమాయకత్వం మన రైతులది. పక్క పొలంలో ఎర్ర డబ్బా పురుగు మందు పిచికారీ చేస్తే అదే మంచిదనుకుని ఎర్ర డబ్బా పురుగుమందే చల్లుతుంటారు. అందుకే రైతులకు సరైన వ్యవసాయ విధానాలు తెలిపేం దుకు, సూచనలు, సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కిసాన్ రేడియో, కిసాన్ టీవీ చానల్‌ను ప్రారంభించారు. పొలం తీరుకు తగ్గట్లుగా ఎరు వులు వాడాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక పథకాన్ని చేపట్టింది. భూమి ఆరోగ్య కార్డును అందిస్తోంది. మన దేశంలో ఉన్న ప్రతి పొలాన్నీ పరిశీలించి ఆ పొలంలో ఏ ఎరువు, ఎంత మొత్తంలో వేయాలో అధికారులు చెప్పి, కార్డు ఇస్తారు. దీనివల్ల పొలానికి పటుత్వం పెరగటంతో పాటు ఎరువుల వాడకంలో వృథాను అరికట్టొచ్చు.


 బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సంద ర్భంగా ఆన్‌లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ‘‘ఇనామ్’’ అనే  మరొక ప్రతిష్టాత్మక పథకానికి మోదీ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా దేశంలో ఏ మూల నుంచి అయినా ఏ మూలకైనా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చు. ఇక పంటల బీమా పథకం రైతుల ఇబ్బందులను రూపు మాపే చారిత్రక పథకం. సాగు చేస్తున్న పంటకే కాదు.. నారుమళ్లకు, నూర్పిడి జరిగిన తర్వాత పొలంలో ధాన్యం రాశులకు కూడా బీమా సదుపాయం ప్రవేశపెట్టారు. ప్రతి గ్రామం యూని ట్‌గా 30 శాతం పంట నష్టం జరిగినా ఇప్పుడు బీమా వర్తిస్తుంది. అంతేకాదు పంటల బీమాకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం 1.5 శాతం మాత్రమే. నష్టపోయిన పంటను పరిశీలించాల్సిన పనిలేదు. రైతులు తమ సెల్‌ఫోన్లో ఫొటోలు తీసి పంపినా అధికారులు డబ్బులు చెల్లిస్తారు.


ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ రైతు అనుకూల బడ్జెట్‌గా నీరాజనాలు అందుకుంటోంది. దేశంలో ఇప్పుడు వ్యవసాయం చేయటం అంటే నామోషీ అయిపోయింది. రైతుల పిల్లలు కూడా ఏ ఉద్యోగం దొరక్కపోతేనే వ్యవసాయం చేస్తున్నారు. మరో వైపు పంటలు పండించటానికి విపరీతంగా పెట్టు బడి పెట్టాల్సి వస్తోంది. అటు రైతులు, ఇటు కూలీలు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ పరిస్థితిని మార్చాలంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిం చాలి.

ఊడ్పుల నుంచి నూర్పిళ్ల వరకూ యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. అవి రైతుల చేతికి అందేలా కేంద్రం రాయితీలు ఇస్తోంది. నీటి వృథాను అడ్డుకునేందుకు స్ప్రింక్లర్లు, రెయిన్‌గన్ లను అందిస్తోంది. ప్రధానమంత్రి ‘క్రిషి సించాయి యోజన పథకం’ ద్వారా దేశవ్యాప్తంగా తొలి దశలో 80 ప్రధాన జలాశయాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు ఇస్తోంది.


 పొలంగట్ల తగాదాలు మనకందరికీ తెలిసి నవే. ఆ గట్లపై టేకు చెట్లను పెంచితే ఏళ్ల తరబడి తగాదాలకు, వివాదాలకు పరిష్కారం లభించటమే కాకుండా రైతులకు లాభదాయకం.ఎకరం పొలంలో రెండు సెంట్ల భూమి పెద్ద విషయం కాదు. ఆ రెండు సెంట్లలో చిన్న నీటి కుంటను తవ్వుకుంటే అవసరానికి నీరు ఉపయోగపడు తుంది. అందులోనే చేపలు, రొయ్యల వంటివి కూడా సాగు చేసుకోవచ్చు. ప్రతి రైతు కుటుంబం కోళ్ల పెంపకం, పశువుల పెంపకం ద్వారా ఆదా యాన్ని పెంచుకోవచ్చు.

పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన పథకం ద్వారా సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తోంది. సంప్ర దాయ సాగులో భాగంగా రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సేంద్రియ ఎరువు లను వాడి పంటలు పండించే పద్ధతులను రైతు లకు అలవాటు చేస్తోంది. తద్వారా ఆరోగ్య కరమైన, బలవర్ధకమైన వ్యవసాయ ఉత్పత్తులు సమాజానికి, సాధారణ సాగుతో పోలిస్తే అధిక ధర రైతుకు లభిస్తాయి. అదే విధంగా వాణిజ్య పంటలకు కూడా కేంద్రం అన్నివిధాలా సహక రిస్తోంది.
 టమాటా ధర బాగోకపోతే రోడ్లపై పార బోయాలి. అదే టమాటాను కెచప్‌గా చేస్తే ధర పెరుగుతుంది. మిర్చి మామూలుగా అమ్మితే ధర తక్కువ. కారం తయారు చేస్తే ధర ఎక్కువ. కోకాకోలా పానీ యాల్లో 5-10 శాతం పండ్ల రసాలు కలిపితే పండ్ల తోటల సాగు ఊపందు కుంటుంది. ఇవన్నీ చేయాలంటే చంద్రమండలం పైకి వెళ్లేంత శ్రమ పడాల్సిన పనిలేదు. ప్రభుత్వ విధానాలు, పాలకుల ఆలోచ నలు సవ్యంగా ఉంటే చాలు. ‘‘నేను మన్మోహన్ సింగ్‌లాగా గొప్ప ఆర్థిక వేత్తను కాదు. పెద్ద పెద్ద విషయాల గురించి నాకు లోతుగా తెలియదు. చిన్న చిన్న పనులు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే పనులే చేస్తా’’ అని నరేంద్ర మోదీ తరచుగా అంటుంటారు. అందుకే ఆయన ‘‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’’
 
 పురిఘళ్ల రఘురామ్
 వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త
 ఈమెయిల్ :raghuram.bjp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement