Perni Nani Strong Comments On Pawan Kalyan Over Vizag Airport Attack Issue, Details Inside - Sakshi
Sakshi News home page

అందరూ కలిసి వచ్చినా మేం రెడీ.. పవన్‌కు పేర్నినాని సవాల్‌

Published Mon, Oct 17 2022 6:57 PM | Last Updated on Mon, Oct 17 2022 7:52 PM

Perni Nani Strong Comments On pawan Kalyan Over Vizag Issue - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన రౌడీలు ఎయిర్‌పోర్టులో బీభత్సం సృష్టించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తల దాడిపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ మాటలు, నీటి మీద రాతలు ఒకటేనని అన్నారు. మాటమార్చే తత్వానికి పవన్‌ను ఐకాన్‌గా చూపించవచ్చని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించిందని, ఆ విషయం కూడా పవన్‌కు తెలీదా అని నిలదీశారు. కర్రలతో రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. 

‘జనసేన అల్లరి మూకలు మంత్రులపై దాడి చేశాయి. మహిళ మంత్రిని పట్టుకొని అసభ్యంగా తిట్టారు. దళిత మంత్రిపై చెప్పులేస్తారా?. పచ్చి బూతులు తిడతారా..  పవన్‌ ర్యాలీ కారణంగా రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడుతున్నారని చెబితే తప్పా?. అడ్డదిడ్డంగా వాగుతూ.. విధానపరమైన విమర్శ మాత్రమే చేస్తున్నా అంటారా. పూటకో మాట, నెలకోమాట తత్వం మీది. ఒళ్లు మరిచి మాట్లాడటం విధానపరమైన విమర్శలా. నోరుందని ఏదైనా మాట్లాతే సహించేది లేదు.

మంత్రులపై దాడి చేస్తే పోలీసులు చర్యలు తీసుకోరా.. జనసేన రైడీలు ఏం చేసిన చూస్తూ ఊరుకోవాలా. ఉద్దేశపూర్వకంగానే విశాఖలో రచ్చ చేశారు.  ఉత్తరాంధ్ర ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, పవన్‌, బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అందరూ కలిసి వచ్చినా.. మేం రెడీ. మీరందరూ కలిసి పోటీ చేసినా విజయం మాదే. ’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 
చదవండి: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement