Janasena workers
-
జనసేన కార్యకర్త మునీర్ పై దాడి చేసిన టీడీపీ నేతలు
-
పవన్ ఇలా చేశావేంటి?.. పిఠాపురంలో జనసైనికులకు అవమానం
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేటు మూసేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపులో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు.. వారిని భుజంపై మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన కార్యకర్తలు తిట్టుపోసుకుంటున్నారు. ఇదీ చదవండి: జనసేనను చిదిమేసిన చంద్రబాబు -
నారా భువనేశ్వరిపై..జనసేన కార్యకర్తల ఆగ్రహం
-
విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ. 90 లక్షలకు సరిపడా రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్ నేవల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నలుగురి అరెస్ట్: విశాఖ నోట్ల మార్పిడి కేసులో నలుగుర్ని అరెస్టు చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రూ. 90 లక్షల 500 రూపాయల నోట్లకు కోటి రూపాయల రూ. 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మాజీ నేవల్ ఆఫీసర్లు నగదును తీసుకుని సీతంధర వద్ద వెళ్లారని,, ఆర్ఐ స్వర్ణలత సమక్షంలోనే డబ్బుల పంపకాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో సూరీని హోం గార్డుల చేత కొట్టించి.. 12 లక్షల రూపాయలను బాధితుల వద్ద నుంచి తీసుకొని వదిలేశారని పేర్కొన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట! -
ఆ జిల్లాలో పవన్‌కు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీగా జనసేన కార్యకర్తలు
గాజువాక: విశాఖజిల్లా గాజువాకలో ఆదివారం 500 మంది జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ నుంచి జగ్గు జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 72వ వార్డు యువ నాయకుడు కొసిరెడ్డి గణేష్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన దంతవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన నుంచి 500 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అవి పేదలకు అందుతున్న విధానం చూసి వారు వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. 72వ వార్డు ప్రజల కోరిక మేరకు వార్డులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, 72వ వార్డు ఇన్చార్జి సిరట్ల శ్రీనివాస్ (వాసు), నాయకురాలు రోజారాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
జనసేన కార్యకర్తలకు మరోసారి గట్టి షాక్..
సాక్షి, అనకాపల్లి: వరుసగా జనసేన శ్రేణులకు చుక్కెదురైంది. మొన్న ఇప్పటం, నిన్న పెడన, తాజాగా గోలుగొండలో జనసేన కార్యకర్తలకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నేతలకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. జనసేన కార్యకర్తలపై మహిళలు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తెల్లముఖం వేశారు. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గోలుగొండలో జగనన్న కాలనీల్లోకి జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో, జనసేన శ్రేణులు బిక్కమొహంతో వెనుదిరిగారు. కాగా, జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలు.. అక్కడ అవినీతి జరిగిందంటూ ఓవరాక్షన్ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు డబ్బులు సరిపోలేదని.. ప్రభుత్వాన్ని డబ్బులు అడగాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు.. మీరు(జనసేన శ్రేణులు) ఇక్కడికి వచ్చి ఎలాంటి రాజకీయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న.. ఎలాంటి అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు ఇచ్చారు. దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. మీరు వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు అడగాలని మాకు చెప్పే పనిలేదు. మాకు ఏం కావాలో జగనన్నకు తెలుసు. జగనన్న మాకు అన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము ఒక్క రూపాయి కూడా అడగము. కావాలంటే మీరే మాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో బిక్కమొహం వచ్చిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెనుదిగారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలపై ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణను ఓర్పలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు. -
జనసేన నాయకులను అడ్డుకున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
-
శ్రుతిమించిన జనసేన నేత అరాచకాలు.. కోర్టు అరెస్టు వారెంట్ జారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.42 లక్షలు అప్పు తీసుకున్నాడు. రుణం తీర్చమని అడిగితే బెదిరింపులకు దిగాడు. పెద్ద మనుషుల ముందు పెడితే ఒప్పుకున్నట్లే తల ఊపి, మళ్లీ తన బుద్ధి చూపించాడు. ఈ దౌర్జన్య వైఖరిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ జనసేన నాయకుడు. పేరు బస్వ గోవింద రెడ్డి. అలియాస్ గుర్రాలరెడ్డి. రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామ వాసి. ఈయనను శుక్రవారం జేఆర్‌పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసే కాదు ఇంతకు ముందు ఇలాంటి ఘన కార్యాలు ఎన్నో చేశాడు. అప్పు తీసుకుని దాడులు.. విశాఖపట్నంలోని చిన్ని వెంకటరావు అనే వ్యక్తి వద్ద బస్వ గోవిందరెడ్డి రూ. 42 లక్షలు రొయ్యిల చెరువుల వ్యాపారం కోసం అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. వడ్డీలు కట్టమని అడిగినా స్పందించ లేదు సరికదా డబ్బులు అడిగినందుకు ఆయన ఇంటికెళ్లి దౌర్జన్యం చేశారు. దీనిపై జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో వెంకటరావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద ఒప్పందం చేసుకున్నాడు. రూ.42 లక్షలకు గాను ప్రామిసరీ నోటులు, చెక్కులు రాసి కొద్ది రోజుల్లో ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే పెద్ద మనుషులు సమక్షంలో ఒప్పుకున్న తేదీలు పూర్తి కావచ్చినా డబ్బులు ఇవ్వలేదు. వడ్డీ కాకపోయినా అసలైనా ఇవ్వాలని గోవింద రెడ్డిని పలుమారు వెంకటరావు, వారి కుటుంబ సభ్యులు అడిగితే భౌతికంగా వారిపై దాడి చేశాడు. దీంతో వెంకటరావు కుటుంబ సభ్యులు గోవిందరెడ్డి రాసిచ్చిన రూ.16.50 లక్షలు విలువ గల ప్రామిసరీ నోట్లు కోర్టులో వేశారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం జేఆర్‌పురం ఎస్ఐ రాజేష్ కొచ్చెర్ల పంచాయతీలోని అతని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం విశాఖపట్నం కోర్టుకు తరలించారు. గతంలోనే రౌడీషీట్.. కొచ్చెర్ల గ్రామంలో బస్వ గోవిందరెడ్డి వ్యవహారం మొదటి నుంచీ వివాదాస్పదమే. గుర్రాల రెడ్డి అని పిలిచుకునే గోవింద రెడ్డి వద్ద రెండు గుర్రాలు ఉండేవి. మత్స్యకార గ్రామాల్లో గుర్రాలపై హల్చల్ చేస్తుండేవాడు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో అడ్డు తగులుతూనే వస్తున్నాడు. ప్రస్తుతం అరెస్టు వారెంట్ జారీ చేసిన కేసులో వెంకటరావు కుటుంబ సభ్యులపై భౌతిక దాడులే కాకుండా తుపాకులతో బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అప్పలస్వామి అనే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం భవన నిర్మాణాలు అడ్డుకుని బెదిరింపులకు దిగాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సత్యవతి గోవిందరెడ్డిపై కేసు పెట్టారు. అంతకుముందు మరికొన్ని దాడులు, దౌర్జన్య కేసులు నమోదయ్యాయి. దీంతో జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో 20 సెప్టెంబర్ 2021లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. ప్రేమ జంట కుటుంబ సభ్యులపై దాడి కొచ్చెర్ల గ్రామంలోని వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు మేజర్లు ముంత దుర్గాప్రసాద్, బస్వ ఉర్వశిరెడ్డి ప్రేమించుకుని హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో గత నెల 27న పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బస్వ గోవిందరెడ్డి అదే నెల 29న పెళ్లి కుమారుడైన దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి సామాన్లు అన్నీ బయటపడేసి ధ్వంసం చేశాడు. అడ్డువచ్చిన ప్రసాద్ తల్లిదండ్రులు రాములమ్మ, అప్పలరాముడులపై భౌతికంగా దాడి చేశాడు. దీనిపై గత నెల 30వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయానికి నలుగురు వెళ్లి ఫిర్యాదు చేసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై కూడా బస్వ గోవిందరెడ్డిపై జే.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.. మాటమార్చే తత్వానికి ఐకాన్ పవన్ కళ్యాణ్
-
అందరూ కలిసి వచ్చినా మేం రెడీ.. పవన్‌కు పేర్నినాని సవాల్
సాక్షి, అమరావతి: జనసేన రౌడీలు ఎయిర్‌పోర్టులో బీభత్సం సృష్టించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తల దాడిపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాటలు, నీటి మీద రాతలు ఒకటేనని అన్నారు. మాటమార్చే తత్వానికి పవన్‌ను ఐకాన్‌గా చూపించవచ్చని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించిందని, ఆ విషయం కూడా పవన్‌కు తెలీదా అని నిలదీశారు. కర్రలతో రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. ‘జనసేన అల్లరి మూకలు మంత్రులపై దాడి చేశాయి. మహిళ మంత్రిని పట్టుకొని అసభ్యంగా తిట్టారు. దళిత మంత్రిపై చెప్పులేస్తారా?. పచ్చి బూతులు తిడతారా.. పవన్ ర్యాలీ కారణంగా రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడుతున్నారని చెబితే తప్పా?. అడ్డదిడ్డంగా వాగుతూ.. విధానపరమైన విమర్శ మాత్రమే చేస్తున్నా అంటారా. పూటకో మాట, నెలకోమాట తత్వం మీది. ఒళ్లు మరిచి మాట్లాడటం విధానపరమైన విమర్శలా. నోరుందని ఏదైనా మాట్లాతే సహించేది లేదు. మంత్రులపై దాడి చేస్తే పోలీసులు చర్యలు తీసుకోరా.. జనసేన రైడీలు ఏం చేసిన చూస్తూ ఊరుకోవాలా. ఉద్దేశపూర్వకంగానే విశాఖలో రచ్చ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, పవన్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి వచ్చినా.. మేం రెడీ. మీరందరూ కలిసి పోటీ చేసినా విజయం మాదే. ’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చదవండి: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్ కామెంట్స్ -
ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు : మంత్రి జోగి రమేష్
-
మేము కన్నెర్ర చేస్తే జనసైనికులు రోడ్లపై తిరగలేరు : మంత్రి రోజా
-
జన సైకోలు.. ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్‌పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు. -మంత్రి ఆర్కే రోజా జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు. -వైవీ సుబ్బారెడ్డి ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య. -స్పీకర్ తమ్మినేని సీతారాం. చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్‌పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -మంత్రి గుడివాడ అమర్నాథ్ వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్చల్ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. -హోంమంత్రి తానేటి వనిత జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్ కళ్యాణ్ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. -మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన జనసైనికులా? సైకో లా?? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖ లో వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. — VenuGopalaKrishna Chelluboina (@chelluboinavenu) October 15, 2022 ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్ కల్యాణ్ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. -మంత్రి నారాయణ స్వామి ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ @PawanKalyan కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి#JanaSenaGoons pic.twitter.com/qp0pVCpJFQ — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) October 15, 2022 మొన్న కోనసీమ జిల్లాలో మంత్రి ఇంటిపై దాడికి తెగబడ్డారు. నేడు విశాఖలో అల్లర్లు సృష్టిస్తున్నారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అయినా బాధ్యతాయుతమైన అధికార పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటులేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.2/2 — Malladi Vishnu (@malladiysrcp) October 15, 2022 I strongly condemn the attack by @JanaSenaParty goons on @yvsubbareddymp garu, @JogiRameshYSRCP garu & @RojaSelvamaniRK garu in Vizag. This incident clearly Shows the true character of Janasena party today. Such misdemeanour acts are against to democratic values in the country. pic.twitter.com/okztqTdx23 — Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 15, 2022 -
జనసేన రాజకీయ పార్టీనా .. రౌడీ మూకనా : స్పీకర్ తమ్మినేని సీతారాం
-
మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి : హోంమంత్రి తానేటి వనిత
-
జనసైనికులు కాదు...జన సైకోలు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద తనపై దాడి జరిగిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్తుండగా వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ కార్లపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన కార్యకర్త దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి స్పందిస్తూ.. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేడని ధ్వజమెత్తారు. సంబంధిత వార్త: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. పవన్ సమాధానం చెప్పాలి వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులు మంత్రులు రోజా, జోగి రమేష్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 గర్జనను పక్కదారి పట్టించేందుకే గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులు చేసిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. వందమంది రౌడీలతో దాడులు చేశారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా? దాడి ఘటనపై పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు. పవన్ పిచ్చి వేషాలు వేస్తే చీరెస్తాం’ -ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ -
మంత్రుల కార్లపై కర్రలు , రాళ్లతో దాడిచేసిన జనసేన కార్యకర్తలు
-
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం
-
Guntur: టీడీపీ, జనసేనకు ఊహించని షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ, జనసేన పార్టీలకు ఊహించిన షాక్ తగిలింది. రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గుంటూరు జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు మాదా రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సుభాని, మాజీ ఎంపీపీ కొండా శివనాగిరెడ్డి, పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.షాలిని ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గోపాలపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోనెల చంటి బుధవారం ధ్వంసం చేశాడు. మండపంపై నుంచి విగ్రహాన్ని పెకిలించి రోడ్డుమీద ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిని పంచాయతీ వార్డుసభ్యుడు కోనపురెడ్డి శ్రీనివాసరావు, గ్రామస్తులు అడ్డుకున్నా రు. చంటికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. సర్పంచ్ బోను రామినాయుడితో పాటు గ్రామపెద్దలతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి లాక్కెళుతున్న చంటి, నిందితుడు చంటి తొలగించిన విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించారు. పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఘటన వెనుక చాలా అనుమానా లున్నాయని చెప్పారు. ఎవరైనా చేయించి ఉండవచ్చన్నారు. నింది తులను కఠినంగా శిక్షించాలని, ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుం డా చూడాలని పోలీసులను కోరారు. డీఎస్పీ సుభాష్, సీఐ విజయానంద్, పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డు సభ్యుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 153ఎ, 427, 109 సెక్షన్లతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్‌కాల్ లిస్టుపై ఆరా తీస్తున్నారు. -
వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి
-
వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తలు గురువారం దాడి చేశారు. ఈ ఘటనతో ప్రమేయమున్న పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (బస్తీమే సవాల్ : రామ్‌గోపాల్ వర్మ) రామ్‌గోపాల్ వర్మ ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ సినిమాతో మరో సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై పవన్ అభిమానుల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. మరోవైపు ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ చిత్రానికి కౌంటర్‌గా రామ్‌గోపాల్ వర్మపై హీరో పవన్ కల్యాణ్ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.(భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
జనసేన కార్యకర్తల ఓవరాక్షన్.. విస్తుపోతున్న జనం!
సాక్షి, కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారా? కాకినాడలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందు స్వయంగా జరిగిన ఈ సంఘటన చూస్తుంటే అవునని ఎవరైనా అంటారు. మొన్న ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై ఆవేశంతో దాడికి దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ-జనసేన కార్యకర్తలు బాహబాహికి దిగారు. రెండు వర్గాల వారికీ దెబ్బలు తగిలాయి. ఇప్పటి వరకూ బానే ఉంది. అంతా సద్దుమణిగింది. అయితే అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. మా పార్టీ కార్యకర్తలను ప్రాణాలు పోయేలా కొట్టారంటూ పవన్ కళ్యాణ్‌కు కాకినాడ కార్యకర్తలు, నేతలు కంప్లయింట్ చేశారు. దీంతో పరామర్శ అంటూ ఓ ప్రోగ్రామ్ పెట్టుకుని జనసేన బాసు రెండు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్ణం వచ్చి.. అక్కడి నుంచి కాకినాడకు కారులో వచ్చి మరీ దెబ్బలు తగిలిన కార్యకర్తలను ఓదార్చారు. దాడి జరిగింది ఆదివారం.. అయితే.. గాయపడ్డ జనసేన కార్యకర్తకు మాత్రం పవన్ పరామర్శ సమయంలో కూడా కాలి నుంచి తీవ్రంగా రక్తం కారిపోతోంది. ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత కూడా ఆ కార్యకర్త కాలు నుంచి రక్తం కారడం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. రెండ్రోజులు పాటు బ్లీడింగ్ అయితే ఇంకేమైనా ఉందా అంటూ ముక్కున వేలెసుకుంటున్నారు. జనసేన మరో డ్రామా పవన్ టూర్‌కు ముందు జనసేన ఆడిన మరో డ్రామా బయటపడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై దుష్ప్రచారం చేసేలా ఓ వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించి జనసేన బ్యాచ్ అడ్డంగా బుక్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన మహిళా కార్యకర్తలు. ఈ క్రమంలో ఓ మహిళ మరో మహిళను ‘ఊ.... స్టార్ట్ చెయ్యి... మొదలు పెట్టు’ అనగానే ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఏడవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించాలన్న పదాలు ఆ వీడియోలో కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
కాకినాడలో జనసేన కార్యకర్తల వీరంగం
-
కాకినాడలో టెన్షన్.. టెన్షన్
పెన్షనర్స్ పేరడైజ్‌గా పిలిచే ప్రశాంత కాకినాడ నగరంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో స్థానికేతరులు కాకినాడ వచ్చి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై దాడికి ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల దాడి ప్రయత్నాలను ప్రతిఘటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసలు నగరంలో ఏ మూల ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సాక్షి, కాకినాడ: మూడు రాజధానుల ప్రతిపాదనపై శనివారం కాకినాడలో జరిగిన సంఘీభావ ర్యాలీలో పవన్‌కల్యాణ్ వ్యవహారశైలిని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఎత్తిచూపారు. మొదటి నుంచి పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో జనసే కార్యకర్తలు ఆదివారం తొలుత కాకినాడ భానుగుడి జంక్షన్లో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నాయకులు పంతం నానాజీ, కందుల దుర్గే‹Ù, ముత్తా శశిధర్ తదితరులు భానుగుడి సెంటర్లో బైఠాయించారు. భానుగుడి సెంటర్ నుంచి టూటౌన్ ఫ్లై ఓవర్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా తిరిగి భానుగుడి సెంటర్‌కు చేరుకుని ఎమ్మెల్యే నివాసం ముట్టడిస్తామంటూ మూకుమ్మడిగా బయలుదేరారు. పోలీసులు ఆ సమయంలో జనసేన కార్యకర్తలను, నాయకులను అక్కడే కట్టడి చేసి ఉంటే వారు ఎమ్మెల్యే నివాసానికి సమీపం వరకూ వెళ్లే వారు కాదంటున్నారు. జనసేన కార్యకర్తల దాడిలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టేకేటి సారధి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ పిఠాపురం, పెద్దాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని దాడికి రెచ్చగొట్టారు. జనసేన నాయకులు, కార్యకర్తలు భాస్కర్‌నగర్‌లోని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసం సమీపాన ఉన్న వాటర్ ట్యాంక్ సెంటర్‌కు చేరుకున్నారు. వచ్చీ రాగానే కర్రలతో, రాళ్లతో ఎమ్మెల్యే నివాసంపై దాడికి ప్రయత్నించారు. వేర్వేరు వీధుల నుంచి గుంపులుగా చుట్టుముట్టి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ పరిణామాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ వ్యవహారం కాకినాడలో ఏడు గంటల పాటు టెన్షన్ వాతావరణానికి కారణమైంది. జనసేన కార్యకర్తల దాడి నేపథ్యంలో గాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడితో కన్నబాబు చర్చలు జనసైనికుల దుందుడుకు చర్య నేపథ్యంలో వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు టీడీపీ తెరవెనుక మద్దతునిచ్చి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోన్న అంశంపై చర్చించారు. జనసేన ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని నేతలు సూచించారు. జనసేన కార్యకర్తల దాడి దృశ్యాలను మంత్రి కన్నబాబుకు సెల్లో చూపిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి, ఫ్రూటీకుమార్ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసానికి చేరుకుని ఆయనతో ఘటనపై చర్చించారు. పోలీసులు సమయానుకూలంగా స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనకు దిగిన జనసేన నాయకులు, కార్యకర్తలను భానుగుడి సెంటర్లోనే కట్టడి చేసి ఉంటే ఎమ్మెల్యే ఇంటి సమీపం వరకూ జనసేన కార్యకర్తలు వచ్చి ఉండే వారే కాదు, ఇంతటి ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో మాట్లాడుతున్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఇటువంటి ఘటనలను ఖండించాలి సంఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందిస్తూ ప్రశాంతమైన కాకినాడ నగరంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు విధ్వంసం సృష్టించడం బాధ కలిగిస్తోందన్నారు. కాకినాడ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ తాను చూడలేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అన్నారు. అంతమాత్రానికే విమర్శలు చేసిన వారిపై బయట ప్రాంతాల వారిని తీసుకువచ్చి దాడులకు తెగబడటం చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. పవన్‌పై తాను చేసిన విమర్శలకు కులం కలర్ తీసుకు రావడం చూస్తుంటే కాపు సామాజికవర్గంలో పట్టులేని పంతం నానాజీ వంటి వారే ఒక పథకం ప్రకారం ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడిచేస్తూ రాళ్ల వర్షం కురిపిస్తున్న జనసేన కార్యకర్తలు జీజీహెచ్‌లో బీభత్సం ►ఓ మహిళా రిపోర్టర్, ఇద్దరు డ్యూటీ నర్సులపై దాడి కాకినాడ క్రైం: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించడంతో ఆరుగురు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారు చేస్తున్న అరాచకాన్ని సెల్లో చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్‌పై దాడి చేసి గాయపరిచారు. అంతేకాకుండా మరో ఇద్దరు నర్సులు కూడా వీరి దాడిలో గాయపడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిపై దాడికి దిగేందుకు ప్రయత్నించిన జనసేన కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను గాయపర్చారు. గాయపడిన వ్యక్తులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందేందుకు వచ్చారు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు కాకినాడ జీజీహెచ్‌కు నాలుగు కారుల్లో వచ్చి చికిత్స పొందేందుకు అత్యవసర విభాగంలో మంచాలపై పడుకున్న వారిని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్ జుత్తుక జ్యోతిపైన జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన డ్యూటీ నర్సులను కొట్టారు. జనసేన కార్యకర్తలను అరెస్టుచేసి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు ఈ సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల సెల్ఫోన్లు తీసుకెళ్లిపోయారు. అదే సమయంలో జనసేనకు చెందిన ఓ మహిళ నాయకురాలు మహిళా రిపోర్టర్ చేతిని వెనక్కి వంచేసీ, తలను గోడకు ఢీకొట్టింది. దీంతో రిపోర్టర్ జ్యోతి కింద పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను ఎమర్జన్సీ వార్డులో చేర్చారు. జనసేన కార్యకర్తలు, నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిలో టేకేటి సారధి, వాసుపల్లి కృపానందం, పేర్ల విజయ్, అర్జల సింహాచలం, వాసుపల్లి ఏసుపాదం, పాడిశెట్టి గోపీలు ఉన్నారు. వీరందరూ కాకినాడ జీజీహెచ్ ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అవుట్‌పోస్టు పోలీసులు వచ్చి వీరి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేశారు. జనసేన కార్యకర్తలు సుమారు 200 మందికి పైగా పాల్గొని ఎమర్జన్సీ వార్డులో వీరంగం సృష్టించారు. ఎవరు ప్రశ్నించినా వారు కొట్టేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు విలేకరులు ఘటనా స్థలానికి చేరుకొని వారు చేస్తున్న వీరంగాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయగా, విలేకర్లపై దాడికి యత్నించారు. విషయం తెలిసిన వెంటనే వన్‌టౌన్, త్రీటౌన్, టూటౌన్లకు చెందిన పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జనసేన నాయకులను ఆసుపత్రి ఎమర్జన్సీ వార్డు నుంచి బయటకు పంపించి గొడవను సర్దుబాటు చేశారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రౌడీల్లా వ్యవహరించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే కాకుండా డ్యూటీ నర్సులను, మహిళా రిపోర్టర్‌పై దాడికి దిగడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. వీరంగం సృష్టించి పలువురిని గాయపర్చిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయనున్నారు. -
మీ వల్లే నేను ఓడిపోయా: పవన్
సాక్షి, మండపేట: ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో నిన్న (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు. దీంతో పవన్ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజుల్లోగా ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. -
రాడ్లతో జనసేన కార్యకర్తల దాడి
-
గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి
సాక్షి, సఖినేటిపల్లి (రాజోలు): ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావద్దని హెచ్చరిస్తూ గుడిమూలకు చెందిన గ్రామవలంటీర్లపై అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. గుడిమూల గ్రామానికి చెందిన వలంటీర్లు గుబ్బల రాజేష్, బత్తుల సునీల్‌లపై జనసేన పార్టీ కార్యకర్తలు నాయుడు కృష్ణస్వామి, బొలిశెట్టి దుర్గాప్రసాద్, నామన రంగబాబు, నాయుడు ఆదినారాయణ రాడ్లతో దాడి చేశారు. వలంటీరు రాజేష్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు యత్నించారు. గుడిమూల నుంచి స్థానికులు కారును వెంబడించడంతో గొంది గ్రామంలో కారు నుంచి బయటకు తోసేశారు. 6777 నంబరు కలిగిన తెలుపురంగు షిఫ్ట్‌కారులో ఇనుప రాడ్లతో వచ్చి రాజేష్, సునీల్‌పై దాడి చేసి భయకంపితులను చేశారు. దాడిలో గాయపడ్డ గుడిమూల వలంటీర్లు రాజేష్, సునీల్ ఈ మేరకు సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో వలంటీర్లు రాజేష్, సునీల్‌ను ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా వలంటీర్లు గ్రామంలో ప్రభుత్వ పథకాల మంజూరు కోసం సర్వే నిర్వహిస్తుండగా దానిని అడ్డుకుని, తమ ఇళ్ల వద్దకు సర్వే కోసం వస్తే సహించేది లేదని జనసేన కార్యకర్త నాయుడు కృష్ణస్వామి తన అనుచరులతో రాజేష్, సునీల్‌లను బెదిరించాడు. అంతేకాదు కొన్ని రోజులుగా వలంటీర్లు రాజేష్, సునీల్‌లు ప్రభుత్వ పథకాలను ఫేస్బుక్లో పోస్టు చేయడంపైనా జనసేన కార్యకర్తలు ఆగ్రహం పెంచుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు సఖినేటిపల్లి అడిషనల్ ఎస్సై భవానీకి వలంటీర్లు రాజేష్, సునీల్ ఫిర్యాదు చేశారు. వలంటీర్ రాజేష్ కిడ్నాప్‌కు యత్నించింది ఈ కారులోనే వలంటీర్లపై దాడులకు పాల్పడితే సహించం : కో ఆర్డినేటర్ రాజేశ్వరరావు గ్రామ వలంటీర్లపై దాడులకు దిగితే సహించబోమని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు హెచ్చరించారు. గుడిమూల వలంటీర్లపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద రాజేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు జనసేన తెరతీస్తోందన్నారు. ఇనుపరాడ్లతో గుడిమూల గ్రామంలో హల్చల్ చేస్తున్న జనసేన కార్యకర్తలు ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లి డేవిడ్ మాట్లాడుతూ వలంటీర్లపై దాడులు చేసేలా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ బీసీసెల్ కార్యదర్శి పాటి శివకుమార్, నాయకులు రావి ఆంజనేయులు, రుద్రరాజు చినరాజా, సానబోయిన ఏసుబాబు, గుండుమేను శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కోన ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
రౌడీరాజ్యమా.. ప్రజాస్వామ్యమా?
సాక్షి, కంచిలి/కవిటి (శ్రీకాకుళం): ఎన్నికల వేళ ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, ఆయన అనుచరవర్గం వ్యవహరించే తీరును పరిశీలిస్తే .. రౌడీ రాజ్యమా లేక ప్రజాస్వామ్యం ఇక్కడ నడుస్తుందా అనే అనుమానం కలుగుతోంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ వ్యవహర శైలిపై స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రాత్రి కవిటిలో అనుమానస్పదంగా రాత్రి సంచరిస్తున్న టీడీపీ నాయకుల వాహనాలపై వీడియో షూట్ చేసి ఎన్నికల కమిషన్ సివిజల్ యాప్‌లో పంపించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోంపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త మణిసంతోష్‌ను టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, అనుచరులు స్పృహతప్పేలా చితక్కొట్టారని, స్పృహ వచ్చాక బెదిరించి వారికి అనుకూలంగా మొబైల్లో వీడియో షూట్‌చేసి, కవిటి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ పి.పారినాయుడుతో తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించి, తెల్లకాగితం మీద సంతకాలు తీసుకొన్నారని ఆరోపించారు. ఈ సంఘటన వివరాలను బాధితులైన జనసేన పార్టీ కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం కుసుంపురం వద్ద విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అశోక్ తీరుపై ధ్వజం కవిటిలో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా నంబర్‌లేని కారు, మరికొన్ని మోటారు సైకిళ్లు సంచరిస్తుండడాన్ని సోంపేట, కవిటి మండలాలకు చెందిన జనసేన కార్యకర్తలు గమనించినట్టు బాధితుడు మణిసంతోష్, కార్యకర్తలు కె.ప్రశాంత్, మిన్నారావు, బి.కృష్ణారావు తెలిపారు. పట్టణంలో శివాలయం వద్ద గల ఒక ఇంట్లో ఈ తతంగమంతా జరుగుతుండడడంతో బాధ్యతగల ఒక పౌరుడిగా సాక్ష్యాధారాలతో వీడియో తీసి, ఎన్నికల కమీషన్‌కు సివిజిల్ యాప్‌లో పొందుపరిచేందుకు ప్రయత్నించానని సోంపేటకు చెందిన జనసేన కార్యకర్త మణిసంతోష్ చెప్పారు. దీన్ని గమనించిన స్థానికులు తనను ఈడ్చుకొని ఒక ఇంట్లో బంధించి, టీడీపీ అభ్యర్థి అశోక్, అనుచరులు సుమారు 15 మంది కలిసి ఎందుకొచ్చావంటూ చితక్కొట్టడంతో స్పృహ కోల్పోయానన్నారు. స్పృహ వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా తనతో కొన్ని మాటలు చెప్పించే వీడియోను షూట్ చేశారని వాపోయాడు. తర్వాత మిగిలిన జనసేన పార్టీ కార్యకర్తల్ని కవిటి స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. ఎస్ఐ పారినాయుడు తమను ఆ ప్రాంతానికి ఎందుకెళ్లారని ప్రశ్నించారన్నారు. దీనిపై వారు మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు మద్యం, నగదు పంపిణీని అడ్డుకోవడమే ధ్యేయంగా సివిజల్ యాప్‌లో అక్కడ జరుగుతున్న తతంగాన్ని అధికారులకు చేరవేసేందుకు ప్రయత్నించామని, మా ప్రయత్నాన్ని ఆదిలోనే గండికొట్టారని ఎస్ఐతో చెప్పినట్టు మీడియా ముందు వెల్లడించారు. ఇకపై ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని, వీడియోలో బంధించడం తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలి పత్రికల్లో రాయడానికి వీల్లేని పదజాలంతో తమ ను దూషించి, ఎన్నికలైన తరువాత మా ఆరుగురు తలలు నరికి తన ఇంటి గుమ్మానికి వేలాడదీస్తానని తీవ్ర స్వరంతో టీడీపీ అభ్యర్థి అశోక్ హెచ్చరికలు జారీచేశారని, దీంతో తమకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వమే రక్షణ కల్పించాలని బాధితులు మీడియాకు వివరించారు. ఈ విషయమై కవిటి ఎస్ఐ. పారినాయుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ మంగళవారం రాత్రి టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ నుంచి అనుమానాస్పదంగా కొందరు యువకులు తిరుగుతున్నారని ఫిర్యాదు చేయడంతో , సోంపేటకు చెందిన మణిసంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించామన్నారు. తీరా ఆ యువకుడు సోంపేటకు చెందిన వ్యక్తిగా తేలిందని, తర్వాత కొందరు యువకులు వచ్చి తమకు తెలుసునని చెప్పడంతో పూచీకత్తుగా తెల్లకాగితాలు మీద సంతకాలు తీసుకొని విడిచిపెట్టామని ఎస్ఐ.పారినాయుడు తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు
తిరుపతి క్రైం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొంది. ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ము గ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తిరుపతి రూరల్‌లోని కాలూరు క్రాస్ వద్ద జరిగింది. ఎమ్మార్‌పల్లి ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. కేటీ రోడ్డు ద్వారకానగర్‌కు చెందిన సుధీర్‌రాయల్ (26), సింగాలగుంటకు చెందిన కుమారస్వామి కుమారుడు దాము (21), రమేష్, జయప్రకాష్, నాగా ర్జున షిప్ట్ కారులో సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. తిరుపతి రూరల్ పరిధిలోని కాలూరు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొం ది. సుధీర్ రాయల్, దాము అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్, జయప్రకాష్, నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రుయాకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సుధీర్‌రాయల్ తిరుమలలో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. దాము నగరంలో చదువుతున్నాడు. సీఐ విజయకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గురువారం వీరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సం ఘటనా స్థలంలో వీరి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతులు జనసేన పార్టీకి చెందన వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో సుధీర్‌రాయల్ సినీనటుడు, జనసేన నాయకు డు పవన్‌కల్యాణ్ అభిమానుల సంఘం సంయు క్త కార్యదర్శిగా ఉన్నారు. జనసేన పార్టీలో బోత్ ఆస్పత్రి అధినేత పసుపులేటి హరిప్రసాద్ అనుచరుడిగా ఉంటూ కీలకపాత్ర పోషించేవాడు. వీరి మృతి సమాచారం తెలిసిన వెంటనే పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పవన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సురేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కార్యాలయానికి సమాచారం అందించినట్టు నాయకులు పేర్కొన్నారు. వీరి మృతదేహాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీకి చెందినవారు రావడం గమనార్హం. -
జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటూ..
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మహిళలు, యువతులను మాయమాటలతో మోసగిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వీరు ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని వేధింపులకు పాల్పడుతుండేవారు. వీరి వేధింపులను భరించలేక ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఎం.రవిప్రకాష్ దర్యాప్తు చేపట్టి నిందితులైన ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ రవిప్రకాష్, ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావుతో కలిసి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏలూరుకు చెందిన దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్ అలియాస్ బాలు, పిళ్లా సాయి దేవేంద్రనాయుడు, విప్పర్తి ఫ్రాన్సిస్, కొండి రాజేష్, గుజ్జుల రాజీవ్, టి.అశోక్‌కుమార్‌లు గత కొంతకాలం నుంచి కొందరు యువతులను మాయమాటలతో ట్రాప్ చేసి భారీగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. జనసేన పార్టీ కార్యకర్తలుగా తిరుగుతూ యువతులను సినీ హీరోలకు పరిచయం చేయిస్తామని, ఫొటోలు తీయిస్తామంటూ మాయమాటలు చెప్పి స్నేహం చేసి అనంతరం బెదిరింపులకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, డబ్బు గుంజుతున్నారు. ఈనెల 4న ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బంగారు వ్యాపారి కుమార్తెను మోసం చేసి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు తీసుకున్నారని ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఎస్పీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేయాలని ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావును ఆదేశించారు. ఈ యువకులు యూఏఈ ఎక్ఛేంజ్, ముత్తూట్, మణప్పురం, యాక్సిస్ బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి ఆ వచ్చిన సొమ్ముతో గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ క్యాసినోలలో రోలెట్, బ్లాక్‌జాక్, పోకర్, అందర్ బాహర్ వంటి విలాసవంతమైన జూదాలు ఆడుతుంటారు. లగ్జరీ కార్లు, మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసి జల్సాలు చేయటం వీరి అలవాటు. వీరి నుంచి 3424 గ్రాముల బంగారు ఆభరణాలు, చవర్లెట్ కారు, రెండు ఖరీదైన మోటారు సైకిళ్లు, యాపిల్, సామ్సంగ్ కంపెనీ ఫోన్లు, ఏసీ, టీవీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్
గుంటూరు (మంగళగిరి): రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేస్తే తాము రోడ్డున పడతామని.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి తమచేత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనిపై ప్రశ్నించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి రైతులు, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రశ్నించవయ్యా పవన్‌కళ్యాణ్. నీవు ప్రశ్నించే సమయం వచ్చింది. నిన్ను నమ్మి బాబుకు ఓట్లేస్తే మా కుటుంబాలను కూల్చేస్తున్నాడు.. మహాప్రభో ప్రశ్నించు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భూసమీకరణ వల్ల తాము ఉపాధి కోల్పోతామని మంత్రులకు, అధికారులకు చెప్పామనీ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో 9.2ఫారాలు (అభ్యంతర పత్రాలు) అందజేశామనీ, అయినా భూసేకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో గ్రామ యువకులు, రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరి మాట విని తాము టీడీపీకి ఓట్లేశామో వారే ఇప్పుడు తమకు అండగా నిలవాలని వారు గ్రామంలో ఫ్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు. అనంతరం తమకు ప్యాకేజీలు వద్దని, భూములు ఇచ్చేదిలేదని వారు స్పష్టం చేశారు. భూసమీకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ శవాలపై రాజధాని నిర్మించుకోండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత రైతులు గ్రామస్తుల అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.