వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి | janasena supporters attack on RGV office in Hyderabad | Sakshi
Sakshi News home page

వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి

Published Thu, Jul 23 2020 6:50 PM | Last Updated on Thu, Jul 23 2020 7:11 PM

janasena supporters attack on RGV office in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తలు గురువారం దాడి చేశారు. ఈ ఘటనతో ప్రమేయమున్న పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (బస్తీమే సవాల్‌ : రామ్‌గోపాల్‌ వర్మ)

రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాతో మరో సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై పవన్‌ అభిమానుల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. మరోవైపు ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ చిత్రానికి కౌంటర్‌గా రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.(భారీ వ్యూస్‌ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement