
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా రెండో టీజర్‌ని విడుదల చేశాడు ఆర్జీవీ. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను తనదైన స్టైల్లో చూపించాడు.
(చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా)
సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలను ఈ టీజర్‌లో చూపించాడు.
‘నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది’ అని జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్‌లో కనిపించింది. అలాగే చివర్లో పవన్ కల్యాణ్ పాత్రను చూపించి, చంద్రబాబు పాత్రధారితో ఓ వ్యక్తి ‘ఎప్పుడో అప్పుడు మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా’ అని అడగ్గా.. ‘వాడికంత సీన్ లేదు. తనను తానే పొడుచుకుంటాడు’ అని చంద్రబాబు పాత్రధారి అనడం టీజర్‌లో గమనించవచ్చు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment