ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా నుంచి ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను తనదైన స్టైల్లో చూపించారు.
సోనియా గాంధీ పాత్రధారి ఫోన్ కాల్‌తో వ్యూహం ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్‌ను ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు చంద్రబాబు పాత్ర పోషించిన వ్యక్తి తెరపైకి వస్తాడు. ఇప్పుడు మన వ్యూహం మొదలవుతుంది అని కన్నింగ్ డైలాగ్ చెప్పడం. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటూ బాబు పాత్రధారి చెప్పే డైలాగ్‌తో పాటు పలు ఆసక్తికరమైన వాస్తవ సన్నివేశాలను వర్మ తెరికెక్కించినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ గారి బాడీ లాంగ్వేజ్ అజ్మల్ అద్బుతంగా అనుసరించారని చెప్పవచ్చు. అలాగే వైఎస్ భారతిగా మానస కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. బాలాజీ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ నవంబర్ 10న సినిమా విడుదలకానుంది. రెండోవ భాగం శపథం 2024 జనవరి 25న విడుదల అవుతుందని వర్మ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment