నుజ్జునుజ్జు అయిన కారు మృతుడు దాము (ఫైల్)
తిరుపతి క్రైం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొంది. ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ము గ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తిరుపతి రూరల్‌లోని కాలూరు క్రాస్ వద్ద జరిగింది. ఎమ్మార్‌పల్లి ఎస్‌ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. కేటీ రోడ్డు ద్వారకానగర్‌కు చెందిన సుధీర్‌రాయల్ (26), సింగాలగుంటకు చెందిన కుమారస్వామి కుమారుడు దాము (21), రమేష్, జయప్రకాష్, నాగా ర్జున షిప్ట్ కారులో సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. తిరుపతి రూరల్ పరిధిలోని కాలూరు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొం ది. సుధీర్ రాయల్, దాము అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్, జయప్రకాష్, నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రుయాకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సుధీర్‌రాయల్ తిరుమలలో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. దాము నగరంలో చదువుతున్నాడు. సీఐ విజయకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గురువారం వీరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సం ఘటనా స్థలంలో వీరి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతులు జనసేన పార్టీకి చెందన వారు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో సుధీర్‌రాయల్ సినీనటుడు, జనసేన నాయకు డు పవన్‌కల్యాణ్ అభిమానుల సంఘం సంయు క్త కార్యదర్శిగా ఉన్నారు. జనసేన పార్టీలో బోత్ ఆస్పత్రి అధినేత పసుపులేటి హరిప్రసాద్ అనుచరుడిగా ఉంటూ కీలకపాత్ర పోషించేవాడు. వీరి మృతి సమాచారం తెలిసిన వెంటనే పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పవన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సురేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కార్యాలయానికి సమాచారం అందించినట్టు నాయకులు పేర్కొన్నారు. వీరి మృతదేహాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీకి చెందినవారు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment