
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేటు మూసేశారు.
టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపులో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు.. వారిని భుజంపై మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన కార్యకర్తలు తిట్టుపోసుకుంటున్నారు.
ఇదీ చదవండి: జనసేనను చిదిమేసిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment