
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ, జనసేన పార్టీలకు ఊహించిన షాక్ తగిలింది. రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గుంటూరు జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు మాదా రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సుభాని, మాజీ ఎంపీపీ కొండా శివనాగిరెడ్డి, పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.షాలిని ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్