joined ysrcp
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకీ పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి? పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజలు కోసం కాదు.. వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి?. పవన్ వెంట కాపులెవరూ ఉండరు’’ అంటూ వంగవీటి నరేంద్ర తేల్చిచెప్పారు. -
కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శాంతినగర్ మన్నా కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అల్లవరం వాసులు అన్నారు. చదవండి: జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
సాక్షి, అమరావతి: నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. శుక్రవారం.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ -
Guntur: టీడీపీ, జనసేనకు ఊహించని షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ, జనసేన పార్టీలకు ఊహించిన షాక్ తగిలింది. రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గుంటూరు జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు మాదా రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సుభాని, మాజీ ఎంపీపీ కొండా శివనాగిరెడ్డి, పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.షాలిని ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ -
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, గుంటూరు: టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో దుగ్గిరాల 1,3 సెగ్మెంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: ‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’ కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
హిందూపురం రూరల్ : మండలంలోని కిరికెర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అధికార పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు, నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కిరికెర గ్రామస్తులు నారాయణప్ప, ప్రభాకర్, చిన్నప్పయ్య, కొండప్ప, బాబన్న, కిష్టప్ప, చిన్న యల్లప్ప, హనుమయ్య, నారాయణస్వామి, గోవి, బాలు, చిన్న నారాయణప్ప, మరో 8 మంది వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజా పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్నారని వారికి మద్దతుగా నిలిచి పార్టీ అభివద్ధికి కషి చేయాలని నవీన్‌నిశ్చల్ పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ బసిరెడ్డి, కిరికెర మాజీ సర్పంచ్ సత్యనారాయణ, చాంద్‌బాషా, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, కొటిపి మూర్తి తదితరులు పాల్గొన్నారు.