సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి యనమల కృష్ణుడు | Senior Tdp Leader Yanamala Krishnudu Joined Ysrcp | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి యనమల కృష్ణుడు

Published Sat, Apr 27 2024 5:03 PM | Last Updated on Sat, Apr 27 2024 5:03 PM

Senior Tdp Leader Yanamala Krishnudu Joined Ysrcp

సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌ పాల్గొన్నారు.

ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరా..
సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.

‘‘42 సంవత్సరాలగా ప్రజల‌ మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement