Yanamala Krishnudu
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు. -
మా అన్నకు పదవులే ముఖ్యం
-
యనమల రాజీనామా.. టీడీపీకి చావుదెబ్బ
-
Yanamala Family: కుమార్తె కోసం యనమల రామకృష్ణుడి కుట్ర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు ఒక్కటవుతార’నే సామెత టీడీపీలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడి విషయంలో నిజమైనట్టే కనిపిస్తోంది. నమ్ముకున్న నాయకులను చంద్రబాబు నట్టేట ముంచేసిన సందర్భాలు కోకొల్లలు. అనుకున్న పని అయిపోయిందంటే చాలు.. ఇక వారిని దూరం పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారనే విమర్శ ఉంది. చంద్రబాబుతో సావాసమో ఏమో కానీ తునికి చెందిన ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు మాత్రం ప్రస్తుతం అధినేత పంథానే అనుసరిస్తున్నారు. టీడీపీలో నంబర్–2గా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన చంద్రబాబు మాదిరిగానే.. వరుసకు సోదరుడయ్యే కృష్ణుడిని టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ‘దివ్య’ంగా పొగ పెట్టేస్తున్నారు. నేరుగా పొమ్మనకుండానే ఈ కుటిల రాజకీయం నడిపించేస్తున్నారు. పార్టీకి దూరం చేస్తున్నారిలా.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దాదాపు మూడు దశాబ్దాల పాటు తునిలో యనమల సోదరుల అరాచక పాలన సాగించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా తునిలో ఆ పార్టీ వరుసగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటూ వచ్చింది. చివరకు టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి టీడీపీ తరఫున రామకృష్ణుడు బరిలోకి దింపారు. ఆమెకు అడ్డంకిగా ఉన్నారనే అక్కసుతో సోదరుడైన కృçష్ణుడిని పారీ్టకి దాదాపు దూరం చేసే ఎత్తులు వేస్తున్నారు. ► నియోజకవర్గంలో ఇంత కాలం కృష్ణుడి వెన్నంటి నడిచిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరినీ ఆయనకు దూరం చేస్తూ, ఏకాకిని చేశారు. ► రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రామకృష్ణుడిదే పెత్తనమైనా.. తుని టీడీపీలో మాత్రం కృష్ణుడి హవాయే నడిచేది. కుమార్తె దివ్యకు టిక్కెట్టు ఇప్పించుకున్న రామకృష్ణుడు.. టీడీపీ తెరపై కృష్ణుడు కనిపించకూడదనే నిశ్చయానికి వచ్చారు. దివ్యను తుని టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణం నుంచే కృష్ణుడిని పారీ్టకి దూరం చేసే ప్రయత్నాలను తెర వెనుక ముమ్మరంగా సాగిస్తున్నారు. ► కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావును దూరం పెట్టాలని కృష్ణుడికి చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కృష్ణుడు ప్రచారంలో తన వెంట ఉండటానికి వీలు లేదని దివ్య కరాఖండీగా చెప్పారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కృష్ణుడు ఉంటే ప్రచారానికి వెళ్లబోనని ఆమె ఇటీవల తండ్రి రామకృష్ణుడికి తెగేసి చెప్పారనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఆయన తన వెంట ప్రచారంలో తిరిగితే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే లెక్కలతోనే దివ్య ఆ విధంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కృష్ణుడు పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కృష్ణుడి ఏలుబడిలో అరాచకాలు, దోపిడీలు, కేసులు పార్టీపై ప్రభావితం చూపుతాయనే ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉండాలని రామకృష్ణుడు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ► అనేక అవినీతి ఆరోపణలతో వైఎస్సార్ సీపీ బయటకు గెంటేసిన వెంకటేషకు టీడీపీలో పెత్తనం అప్పగించడం ద్వారా కృష్ణుడిని దూరం పెట్టడానికి రామకృష్ణుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కృష్ణుడి వల్లనే పార్టీ నష్టపోయిందనే సాకుతో ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించిందని అంటున్నారు. ► 30 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించినందుకు తగిన శాస్తే జరిగిందని సహచరుల వద్ద కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటికి యత్నాలు తాము ఏం చేసినా అన్న రామకృష్ణుడి కోసమేనని ఆయనకు తెలియనిది కాదని, అయినప్పటికీ తనపట్ల కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారని కృష్ణుడు మండిపడుతున్నారు. సీటు కాదన్నా పార్టీ కోసం ఓపికగా భరించామని, ఇప్పుడు ప్రచారంలో కూడా వద్దని చెబుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన వర్గం ప్రశి్నస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇంతలా అవమానించిన రామకృష్ణుడి వెంట తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ.. వేరుకుంపటి పెట్టేందుకు కృష్ణుడి వర్గం సన్నద్ధమవుతోంది. వాస్తవానికి దివ్యను పార్టీ అభ్యరి్థగా ఎంపిక చేయడాన్ని మొదట్లోనే కృష్ణుడి వర్గం వ్యతిరేకించింది. ఇప్పుడు పారీ్టకి దూరం చేయాలనే రామకృష్ణుడు ఎత్తులను ఎదుర్కొనే దిశగా భవిష్యత్ నిర్ణయం కోసం మంతనాలు జరుపుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తునిలో సోమవారం అనుచరులతో భేటీ కావాలని కృష్ణుడు భావించారు. ఈ మేరకు అందరికీ పిలుపులు కూడా వెళ్లాయి. కారణాంతరాలతో చివరి నిమిషంలో సమావేశాన్ని మరో రెండు రోజులు వాయిదా వేశారు. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
టీడీపీ నేత యనమల కృష్ణుడుపై జనసేన ఫైర్
నక్కపల్లి/పాయకరావుపేట : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకేనని నియోజకవర్గ పరిశీలకుడు యనమల కృష్ణుడు చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కృష్ణుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే అధికారం పరిశీలకులకులేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపు నేత గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనితకు టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలు మద్దతిచ్చే ప్రసక్తిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి.. కాపులను, జనసేనతోపాటు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాలు తెలియక యనమల కృష్ణుడు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో అనితకు ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీయేనని, తమ మద్దతువల్లే ఆమె గెలిచారని బుజ్జి చెప్పారు. పదవి చేపట్టిన వెంటనే ఆమె తనపై రేప్ కేసు పెట్టించిందని, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, కాపుల వ్యతిరేకి అయిన ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకే కేటాయించాలని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కోరుతున్నారని ఆయన తెలిపారు. పాయకరావుపేట టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నిర్ణయిస్తారన్నారు. -
సత్యప్రభకు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కలసి ఉన్నట్టే కనిపించిన తమ్ముళ్లు ఒక్కసారిగా కత్తులు దూస్తున్నారు.. పార్టీపై పెత్తనం కోసం మూడు గ్రూపులు.. ఆరు ముఠాలు అన్నట్టు కాలు దువ్వుతున్నారు.. సరి చేయాల్సిన జిల్లా నేతలు సైతం అసమ్మతి కుంపట్లను మరింతగా రాజేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరిపాకాన పడింది. నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా హఠాన్మరణం తరువాత ఆయన భార్య సత్యప్రభను ఆ స్థానంలో నియమించారు. ఆ బాధ్యతలు తీసుకున్న సత్యప్రభ నియోజకవర్గ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో నేతలంతా కలసి ఉన్నట్టే పైకి కనిపించారు. రెండు నెలలు గడిచేసరికి గతంలో రాజాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలు.. ఇప్పుడు సత్యప్రభ లక్ష్యంగా అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. పార్టీలో ఆమెను ఏకాకిని చేయడం ద్వారా పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. బొత్తిగా కొత్త అయిన సత్యప్రభ ఈ రాజకీయాలకు బెదిరిపోయి తనంత తానే తప్పుకుంటారనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా అసమ్మతి రాజేస్తున్నారని పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయాలు ఇలానే కొనసాగితే ఇన్చార్జి పదవి నుంచి వైదొలగడమే పరిష్కారమనే భావన ఆమెకు కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాజా మరణానికి ముందు నుంచే.. వరుపుల రాజా హఠాన్మరణానికి ఏడాది ముందు నుంచే పైలా బోస్ వర్గం ఆయనపై అసమ్మతి వెళ్లగక్కుతూ వచ్చింది. ఇన్చార్జిగా రాజాను తొలగించాలంటూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బోస్ వర్గం హోర్డింగ్‌లు పెట్టింది. దీనిపై ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే నాడు భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాజాను తొలగించాలని ధర్నా చేయడం, పార్టీలో కొందరు పెద్దలు తెర వెనుక ఉండి అసంతృప్తిని ఎగదోయడంతో రాజా మానసిక వేదనకు గురై హఠాన్మరణం చెందారనే చర్చ అప్పట్లో పార్టీ వర్గాల్లో జరిగింది. రాజా మరణానంతరం ఆయన భార్య సత్యప్రభకు ఇన్చార్జి పదవి ఇవ్వడాన్ని అసమ్మతి వర్గం ఏ కోశానా ఆమోదించడం లేదు. సరికదా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆమె వల్ల కాదంటూ.. ► రాజకీయాలకు కొత్త.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సత్యప్రభతో పార్టీని నడిపించడం సాధ్యం కాదనే వాదనను ఆమె వ్యతిరేక వర్గాలు తెర మీదకు బలంగా తీసుకువస్తున్నాయి. ఇదే వాదనను వారు పార్టీ ముఖ్య నేతలకు వినిపించారని సమాచారం. ఆమెను తప్పించి అన్ని విధాలా సమర్థులైన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని వ్యతిరేక వర్గం గట్టి పట్టుదలతో ఉంది. దీని వెనుక పార్టీ ముఖ్యులున్నారనే ప్రచారం ఉంది. ► ఇటీవల ఏలేశ్వరంలో రాజా వర్గానికి చెందిన పలివెల శ్రీనుపై బోస్ వర్గీయులు చేయి చేసుకున్న వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. రౌతులపూడి మండలం జెడ్పీటీసీకి పోటీ చేసి, ఓటమి పాలైన గంటా గోపి.. అదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, రాజా వర్గీయుడైన సోమరౌతు చంద్రమౌళిని బహిరంగంగానే చెప్పుతో కొట్టారు. చంద్రమౌళిని జ్యోతుల నవీన్, సత్యప్రభ పరామర్శించారు. ► గోపీని సస్పెండ్ చేయాలని మౌళి సహా రాజా వర్గీయులు పలువురు పట్టుబట్టినా యనమల వర్గం అడ్డుపడిందని అంటున్నారు. ► తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సత్యప్రభపై చంద్రమౌళి వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ► శంఖవరం మండలంలో కొంతమంది నాయకులు యనమల కృష్ణుడికి మద్దతుగా ఉంటూ వ్యతిరేక ప్రచారం చేస్తూండటం సత్యప్రభకు తలనొప్పిగా మారింది. ► యనమల వర్గంగా ముద్రపడిన టీడీపీ శంఖవరం మండల అధ్యక్షుడు బద్ది రామారావు తమ వారిని దూరం పెడుతున్నారని సత్యప్రభ వర్గం కారాలూ మిరియాలూ నూరుతోంది. ఆమెకు వ్యతిరేకంగా ముదునూరి మురళీకృష్ణంరాజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక రామారావు పాత్ర ఉందని అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఇదంతా యనమలకు తెలిసే జరుగుతోందని అంటున్నారు. ► ఏలేశ్వరంలో పార్టీ ఉనికి కోల్పోవడానికి పైల బోస్ తీరే కారణమంటూ సత్యప్రభ ఆ వర్గాన్ని దూరం పెట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు తారస్థాయికి చేరాయి. ► సొంత నియోజకవర్గాల్లో చేతులెత్తేసిన యనమల రామకృష్ణుడు (తుని), ఎస్వీఎస్ఎన్ వర్మ (పిఠాపురం) ప్రత్తిపాడులో వేలు పెట్టి టీడీపీలో వర్గ విభేదాలకు కారకులవుతున్నారని సత్యప్రభ వర్గీయులు మండిపడుతున్నారు. ► సత్యప్రభ ప్రాతినిధ్యం విషయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ సానుకూలంగా ఉండటం యనమల, వర్మ వర్గీయులకు రుచించడం లేదు. నెహ్రూ, యనమల మధ్య పార్టీ ఆవిర్భావం నుంచీ విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ► పిఠాపురం సీటును ఈసారి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గానికి ఇవ్వాలనే వాదనను జ్యోతుల నవీన్ తెర మీదకు తీసుకువచ్చారు. అప్పటి నుంచీ మాజీ ఎమ్మెల్యే వర్మతో విభేదాలు పొడచూపాయి. ఇందుకు ప్రతిగా కాకినాడ పార్లమెంట్ స్థానంపై నవీన్ పెట్టుకున్న ఆశలపై యనమల సాయంతో నీళ్లు చల్లేందుకు వర్మ ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచీ వర్మను జ్యోతుల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్ని విభేదాల మధ్య చివరి వరకూ సత్యప్రభ ఇన్చార్జిగా కొనసాగుతారా లేక మధ్యలోనే కాడి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే. సై అంటున్న మరో వర్గం ఇదిలా ఉండగా ఇటీవలే సైకిల్ ఎక్కిన ముదునూరి మురళీకృష్ణంరాజు మరో వర్గంగా అసమ్మతి కార్యకలాపాలకు సై అంటున్నారు. శంఖవరం మండలం అన్నవరం సహా ప్రతిపాడు తదితర ప్రాంతాల్లో వ్యక్తిగతంగా మురళీకృష్ణంరాజు ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడాన్ని రాజా వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తల్లో అయోమయం సృష్టించేందుకు కావాలనే ఇలా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఈ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. విభేదాల నేపథ్యంలో సత్యప్రభ ఇటీవల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిశారు. -
మహానాడు సాక్షిగా టీడీపీలో పొలిటికల్ వార్.. ఆయన ప్లాన్ ఏంటి?
తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడితో పాటు ఆయన తమ్ముడు కృష్ణుడు కూడా బాగా పాపులర్. తునిలో అన్న ఓటమి తర్వాత తమ్ముడు కూడా రెండు సార్లు ఓడిపోయాడు. తమ్ముడితో లాభం లేదని భావించిన యనమల తన కూతురిని తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అన్న చేసిన ద్రోహంతో రగిలిపోతున్న కృష్ణుడు ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ యనమల కృష్ణుడి ప్లాన్ ఏంటి?.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుండి ఆరు సార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత స్థానానికి చేరుకున్నారు. 2009లో ఓటమి తర్వాత యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. యనమల రామకృష్ణుడు అధికార పదవుల్లో ఉన్నంతకాలం.. తుని నియోజకవర్గంలో ఆయన తమ్ముడు కృష్ణుడి హవా కొనసాగింది. అన్న స్థానంలో తుని నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కృష్ణుడిని రెండు సార్లు అక్కడి ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. మూడో సారి పోటీ చేద్దామని అనుకుంటుంటే.. అన్న యనమల తన కుమార్తె దివ్యను తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించి.. తమ్ముడికి షాక్ ఇచ్చారు. అన్న నిర్ణయంతో తమ్ముడు కుంగిపోయారు. ఇన్ఛార్జ్ పదవి పోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతే అని ఆందోళన చెందుతున్నారు. అన్న నియోజకవర్గంలో లేకపోయినా.. పార్టీని నిలబెట్టుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి తీసేస్తారా అని కృష్ణుడు రగిలిపోతున్నారు. అన్నపై ప్రతీకారం తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే తమ్ముడిని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు యనమల రామకృష్ణుడు. అయితే పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోన రగలిపోతున్న కృష్ణుడు అవకాశం రాగానే తన కోపాన్ని చూపించారు. ఇటీవల కాకినాడలో జరిగిన టీడీపీ మిని మహనాడుకు డుమ్మా కొట్టారు. మినీ మహానాడుకు హాజరు కాకపోవడంపై కొందరు నేతలు ప్రశ్నించగా.. తన అన్న కుమార్తె దివ్య ఇన్ఛార్జ్ హోదాలో హాజరైనపుడు.. తనతో పనేముందని వారిని ప్రశ్నించారట కృష్ణుడు. చాలా కాలంగా అన్న స్థానంలో పార్టీలో పలుకుబడి పెంచుకున్న యనమల కృష్ణుడు.. ఇక పార్టీతో పని లేకుండా సొంతంగా ఇమేజ్ పెంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అన్నచాటు తమ్ముడిగా ఉండకుండా.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటేనే గుర్తింపు ఉంటుందని తన సన్నిహితులు వద్ద చెబుతున్నారట కృష్ణుడు. అందుకే నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌తో ఎదగాలనుకుంటున్నానని చెప్పారటా. మొత్తం మీద తునిలో అన్న తీసుకున్న నిర్ణయం తమ్ముడుకి జ్ఞానోదయం కలిగించిందని తుని తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉంటే కూతురిని తునిలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ టీడీపీ ఆఫీస్ పెట్టేందుకు యనమలకు భవనం దొరకడం లేదని టాక్. భవనం అద్దెకు ఇస్తే రెంట్ ఇస్తారా లేదో అన్న అనుమానంతో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదని సమాచారం. యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె దివ్య తునిలో ఉండేది తక్కువ. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా ఉంటారు. అందుకే కృష్ణుడు మద్దుతు లేని రామకృష్ణుడి కోసం పార్టీ ఆఫీస్‌కు భవనం అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదంటున్నారు. మరి అన్నదమ్ముల సవాళ్ళు చివరికి పార్టీని ఏ తీరానికి చేరుస్తాయో అని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్! -
కృష్ణుడికి శఠగోపం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పదవి యనమల రామకృష్ణుడి కుటుంబంలో చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడిని కాదని తన కుమార్తె దివ్యకు ఇన్చార్జి పదవి ఇప్పించుకున్నారు. రెండుసార్లు అక్కడ పోటీ చేసి..ఇన్నాళ్లూ తునిలో పార్టీని నడిపిన తనకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. చంద్రబాబు, తన అన్న యనమల రామకృష్ణుడు తనను మోసం చేశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇటీవల తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన అన్న రామకృష్ణుడి రాజకీయ ఎదుగుదలకు 40 ఏళ్లుగా సహకరించానని, ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అవకాశవాదంతో తనను పక్కనపెట్టి ఆయన కుమార్తెను ఇన్చార్జిగా నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. బాబుని కలవడానికి ఇష్టపడని కృష్ణుడు..! బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి యనమల బ్రదర్స్‌ని చంద్రబాబు పిలిపించుకున్నారు. అయితే కృష్ణుడు రావడానికి ఇష్టపడకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పంపి ఆయన్ను ఇంటికి రప్పించారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానని, పార్టీకి సహకరించాలని బతిమలాడారు. అనంతరం యనమల కుటుంబంలో వివాదం సద్దుమణిగినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ కృష్ణుడు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను నిర్వహించానని కృష్ణుడు గుర్తుచేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణుడు పోటీ చేశారు. ఈ సారి కూడా తనకే పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆయన ఆశిస్తున్న తరుణంలో బాబు ఆయనకు ఝలక్ ఇచ్చారు. దీంతో బాబు తీరును కృష్ణుడు బాహాటంగానే తప్పుబడుతున్నారు. ఇలా అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ చావుదెబ్బ తింటుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. -
యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు. అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. నీ సంగతి బాబుకు చెబుతా ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్‌గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు. దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఫోన్ సంభాషణ: యనమలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోదరుడు కృష్ణుడు
-
టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తుని సీటు విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ ముదిరింది. తుని నుంచి తన కూమార్తెను బరిలోకి దింపనున్నట్లు యనమల రామకృష్ణుడు సంకేతాలిచ్చారు. దీనిపై ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఈ విషయంపై తొండంగి పార్టీ నేతతో యనమల సోదరుడు కృష్ణుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. గ్రామానికి 40 మంది చొప్పున వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి అంటూ ఆయన పిలుపునివ్వడం ఫోన్ సంభాషణలో స్పష్టంగా ఉంది. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పండి అంటూ అల్టిమేటం ఇచ్చారు యనమల కృష్ణుడు. దీంతో తుని టీడీపీలో రచ్చ మొదలైంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే
సాక్షి, కాకినాడ: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్రమాలను ప్రశ్నించిన గొంతుకలను కక్షలు, కార్పణ్యాలతో నొక్కేశారు. ఇలా ఆ పార్టీ నేతల అధికార దాహానికి బలైపోయిన కుటుంబాలు కోకొల్లలు. టీడీపీ ఏలుబడిలో వైకల్యాల జ్ఞాపకాలు, నెత్తుటి మరకలు చాలా కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాడు అరాచక పాలన సాగించిన నేతలు అధికారం ఇక కల అని తేలిపోవడంతో నేడు ఉనికి కోసం పాటుపడుతున్నారు. ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులుముతున్నారు. తమ దాష్టీకాలు ఎక్కడ బయటపడతాయోనని ఈ రకమైన వ్యూహం అనుసరిస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న తుని నడిబొడ్డున ఆ పార్టీ నాయకుడు పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగితే వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీపై బురదజల్లుడుకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి తుని ప్రజల తిరస్కారానికి గురైన యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఈ హత్యపై రాజకీయ దుమారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజా ఇందుకు బాధ్యులంటూ దారుణ విమర్శలకు తెగబడ్డారు. ఇదెక్కడి చోద్యం శేషగిరిరావుపై హత్యాయత్నం కేసుపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాజకీయ కోణంలో కాకుండా వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసింది. వారం తిరక్కుండానే ఈ కేసులో ప్రధాన నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించింది. ఈ సంఘటనకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. శేషగిరిరావు వేధింపులు, బెదిరింపులే కారణమని నిర్ధారించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పెద్దగదిలిలోని తన గురువు అభిరామ్ ఆదేశాలతో శిష్యుడు చంద్రశేఖర్ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బహిర్గతమైంది. వాస్తవం ఇలా ఉంటే తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆపాదించి ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజాపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. తీరా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగుచూడటంతో టీడీపీ నేతల ఆరోపణలు ఏపాటివో తేలిపోయింది. 2019లో తునిలో కాతా సత్యనారాయణ హత్యోదంతానికి ఇలానే అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాయే కారణమంటూ ఫిర్యాదు చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకున్న టీడీపీ నేతలు భంగపడ్డారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చడంతో ఆ పార్టీ నేతలు చివరకు అభాసుపాలయ్యారు. ఇప్పటికీ మరువలేని ఘాతుకాలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తునిలో సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్లు సాగించిన దాడులకు లెక్కే లేదు. కొన్ని హత్యోదంతాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆస్తి తగాదాలు, సరిహద్దు వివాదాలు, కోర్టు లిటిగేషన్లు, ప్రేమ వ్యవహారాలు, భూకబ్జాలు.. ఇలా వివాదం ఏదైనా నాటి పాలకులే తీర్పులిచ్చేవారు. మాట వినకుంటే దౌర్జన్యమేనని తుని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: (Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు) రాజకీయ కక్షతోనే తాతయ్యను చంపేశారు గతం నుంచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం మాది. ఏ సమస్య వచ్చినా మా ఇంటి వద్దకు వచ్చేవారు. ఒక భూ వివాదంలో అప్పట్లో తాతయ్య మేడపురెడ్డి చంద్రయ్యనాయుడు గ్రామ పెద్దగా తగవు పరిష్కరించాలని చూసినా రాజకీయాల కారణంగా సాధ్యం కాలేదు. కోర్టులో ఆ భూ సమస్యపై నేరం రుజువైన వర్గంతో కలిసి అప్పట్లో అధికారంలో ఉన్న నేతలు తాతయ్య రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకపోయారు. 1996లో తుని కోర్టు సమీపాన మా తాతయ్యను దారుణంగా హత్య చేశారు. మా నాన్న శివగిరి, అమ్మ వెంకట రమణమ్మ సర్పంచ్‌గా పని చేశారు. అమ్మ వెంకట రమణమ్మ ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యురాలు. టీడీపీలో నాటి నేతల దౌర్జన్యాలు చూస్తూ ఉండలేక మా కుటుంబం ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది. – మేడపురెడ్డి భానుచంద్ర, ఎన్ఎన్ పట్నం, రౌతులపూడి నాన్నను చంపేసి, నన్ను అవిటివాడిని చేశారు మా నాన్న అన్నంరెడ్డి తాతయ్యనాయుడు టీడీపీ నాయకుడు. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేశారు. 1998లో తుని నుంచి కేఓ మల్లవరం బస్సులో వస్తుండగా టీడీపీ నాయకులు కిరాతకంగా కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో 10 మందికి జీవితఖైదు పడింది. ఆ తరువాత 2004లో కక్ష కట్టి టీడీపీ నేతలు నాపై దాడి చేసి కాలు నరికేశారు. నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష పడినప్పటికీ అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష వాయిదా పడింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వికలాంగ పింఛను ఇస్తే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో కక్ష కట్టి దాన్ని కూడా రద్దు చేశారు. కోర్టుకు వెళితే జన్మభూమి కమిటీ ముందు హాజరవ్వాలన్నారు. హాజరైతే చీడికమ్మతల్లి డిబ్బీని చోరీ చేసినట్టు తప్పుడు కేసుతో వేధించారు. ఇలా మా కుటుంబ సేవలను ఉపయోగించుకుని కూడా నన్ను అవిటివాడిని చేశారు. – అన్నంరెడ్డి శ్రీనివాసరావు, కేఓ మల్లవరం, తుని మండలం ►16 ఏళ్ల క్రితం తెలుగు తమ్ముళ్లు శృంగవృక్షంలో సొంత సామాజిక వర్గానికి చెందిన దూలం రత్నంపై పెట్రోలు పోసి నిప్పటించారు. రత్నంతో పాటు పక్కనే నిద్రలో ఉన్న బాలిక సజీవ దహనమైన సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ►కాంగ్రెస్ మద్దతుదారుడు గోపాలపట్నం మాజీ సర్పంచ్ అచ్చా గోవిందరావు కుమారుడు వెంకట కృష్ణ హత్యోదంతం వెనుక అక్కడి టీడీపీ నేత హస్తం ఉందన్న విషయం పెనుదుమారమే లేపింది. అధికారంలో ఉండటంతో వారి ఆగడాలకు భయపడి బాధిత కుటుంబం మిన్నకుండిపోయింది. ►గోర్సపాలెంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారంలో అంతమయ్యాడు. కాకినాడలో హత్య చేయించి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ వ్యవహారంలో బాధిత వర్గాన్ని టీడీపీ నేతలు బెదిరించారనే అభియోగాలున్నాయి. చివరకు యనమల స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ నేతలే బలవంతంగా రాజీ చేశారు. ►తుని ఆచారి స్టూడియో అధినేత ఆస్తుల వ్యవహారంలో టీడీపీ నేతలు తలదూర్చి అంతమొందించారు. చివరకు కొత్తపల్లిలో ఉన్న భూములను దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకుని గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ►పాలమాన్పేటలో మత్స్యకారుల ఇళ్లపై సామూహిక దాడి అప్పట్లో యనమల సోదరుల ప్రేరేపణతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. తమకు ఎదురు తిరుగుతున్నాడని మత్స్యకార నాయకుడు అప్పలరాజును అక్రమంగా కేసుల్లో ఇరికించారు. టీడీపీ దాడుల్లో ఒక వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందితే ఇతనిపై కేసు బనాయించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి అప్పలరాజు కుమార్తె మోసా అనిత విషయాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. -
టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ సభలో టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగనన్న ఇళ్ల పట్టాల లబ్ధిదారుల లిస్ట్ రద్దుచేస్తామని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి మూడేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కృష్ణుడు సోదరుడి వరుస అవుతారు. ‘ఈ లిస్టులు ఉంటాయి అనుకుంటున్నారు వీళ్లు.. గవర్నమెంట్ రాగానే అయి తీసి పడేసి మన లిస్టులు ఇస్తాం. మన లిస్ట్ పెట్టి రెండేసి సెంట్లు చేసి ఫస్ట్ లిస్ట్ పెడతాం. అబ్బాయి మీ లిస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో మా లిస్ట్ పంచి పెట్టండి అని చంద్రబాబు నాయుడుని తిట్టారు కూడా ఒక్కోరు. ఇంతకముందు మనది కూడా తప్పుంది. ఎందుకంటే ధర్మంగా చెయ్యాలి అని చేశాం. ధర్మం ఇక పనిచేయదు. చదవండి👉 తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రెండు సెంట్లే కాదు.. రెండేసి పేర్లు పెడతామో, మూడేసి పేర్లు పెడతామో మీకే తెలీదు. రాబోయే రోజుల్లో మాత్రం చాలా గొప్పగా చేసాడ్రా కృష్ణాగారు అనే టైపు తీసుకొచ్చాను చూడండి అని చెప్పుకోవాలి. తునిలో నేను గెలిచాను.. మోజారీటీ కోసం పోరాడుతున్నాను. అక్కడ చంద్రబాబు అధికార పార్టీకి సీట్లు రాకుండా పోరాడుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు..కృష్ణుడు వచ్చేశారని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి’ అంటూ యనమల కృష్ణుడు కార్యకర్తలతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి👉 టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ -
‘త్వరలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’
సాక్షి, తాడేపల్లి: రాయలసీమలో హైకోర్టు వద్దని అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ క్రాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. హై బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది అక్కడి ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని ఆయన ఎద్దేవా చేశారు. -
ఆర్థికలోటు రూ.32,390.68 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల 2019 –20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 –19 బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019 – 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు. -
సరి'హద్దు' మీరిన దాదాగిరీ
మూడున్నర దశాబ్దాలకు పైగా తునిలో తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం ఆర్థిక మంత్రి యనమల సోదరుడు కృష్ణుడిపై ఆరోపణలు విశాఖ జిల్లా పాల్మన్‌పేటలో దాడి ఆయన ప్రోద్బలంతోనే అంటున్న బాధితులు కాకినాడ : మూడు దశాబ్దాలకు పైగా తుని ప్రాంతంలో చక్రం తిప్పుతున్న తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు సరి‘హద్దు’ మీరాయి. మంగళవారం విశాఖ జిల్లా పాల్మన్‌పేటపై విరుచుకుపడి, విధ్వంసం సృష్టించడానికి సూత్రధారి తుని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి వరుసకుసోదరుడైన యనమల కృష్ణుడేనన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. పాల్మన్‌పేట దాడిలో బాధితులైన మత్స్యకారులు గురువారం తుని వద్ద హైవేపై బైఠారుుంచి ఆందోళన చేసిన సందర్భంగా ఇదే ఆరోపణ చేశారు. ‘కృష్ణుడు డౌన్‌డౌన్’ అని నినదించడం, కృష్ణుని ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఎలుగెత్తడం గమనార్హం. ఇదే విషయాన్ని పాల్మన్‌పేట బాధితులు పాయకరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణుడు రాష్ట్ర వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. తుని ఏఎంసీ చైర్మన్ అయిన కృష్ణుడే నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తూంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. 2009లో ఓటమి తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న రామకృష్ణుడు అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. గత ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ తరఫున తలపడ్డ కృష్ణుడు.. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యూరు. అయినా.. సోదరుడు మంత్రి కావడంతో ఆయన పెత్తనానికి అడ్డు లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంతవరకూ తుని నియోజకవర్గానికే పరిమితమైన తెలుగు తమ్ముళ్ల దాష్టీకం, దౌర్జన్యాలు ఇప్పుడు సరిహద్దు దాటాయనడానికి పాల్మన్‌పేట ఘటనే ఉదాహరణ. ముఖ్యనేత ఉన్నారన్న భరోసాతోనే.. యువకుల క్రికెట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తునికి చెందిన తెలుగు తమ్ముళ్లు మారణాయుధాలతో పాల్మన్పేటవాసులపై దాడికి తెగబడ్డారు. తునిలోని వేమవరం, గొల్లముసలయ్యపేట, యాదాలవారివీధి, కుమ్మరిపేట మంత్రి రామకృష్ణుడికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామాలు. విశాఖకు చెందిన రాజయ్యపేట గ్రామస్తులకు మద్దతుగా పై నాలుగు గ్రామాల నుంచి ఐదారు వందల మంది తెలుగు తమ్ముళ్లు బరిసెలు, బల్లేలతో పాల్మన్‌పేటపై దాడులకు తెగబడ్డారు. కృష్ణుడి ప్రోద్బలం, ముఖ్యనేత చూసుకుంటారన్న భరోసాతోనే తెలుగు తమ్ముళ్లు ఇంతకు బరి తెగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2014లో హేచరీస్‌లో విధ్వంసం నియోజకవర్గంలో సముద్రతీరంలో ఉన్న హేచరీలపై చెన్నై నుంచి అధికారులు దాడులకు రాకుండా చూసుకుంటామని, అందుకు రూ.20 లక్షలు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు 2014లో డిమాండ్ చేశారు. ప్రియాంక హేచరీస్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఎవరికీ సొమ్ము ఇవ్వనవసరం లేదని నిరాకరించడంతో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు 2014 డిసెంబరులో ఆ హేచరీపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి కృష్ణుడే కారణమని, ఆయన నుంచి ప్రాణహాని ఉందని హేచరీస్ యజమాని అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకున్న టీడీపీ ముఖ్యులు రాజీ చేశారు. అప్పుడు హేచరీస్ యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వడమే దాడులకు కారణం కాగా.. ఇప్పుడు పాల్మన్‌పేటపై దాడికి కూడా వారు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణమైంది. ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే చట్టాన్ని తెలుగు తమ్ముళ్లు పెరట్లో రాటకు కట్టేసిన పశువును చేశారనే విషయం స్పష్టమవుతోంది. అక్రమ ఇసుకదందా తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ దందాతో లక్షలు కొల్లగొట్టారు. 2015 మార్చి నుంచి తుని, కోటనందూరు మండలాల్లో బొద్దవరం, డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. కొండల మధ్య వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసి వ్యాపారం నిర్వహిస్తుండగా, స్థానికుల సహకారంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రెడ్‌హేండెడ్‌గా పట్టిచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లకు భయపడ్డ అధికారులు కేసును నీరుగార్చారు. వైఎస్సార్సీపీ వారిపై కక్షతో కేసులు కాగా వైఎస్సార్ సీపీలో చురుకుగా ఉన్నవారిపైనా తెలుగు తమ్ముళ్లు కక్ష కడుతున్నారు. తుని కాపు ఐక్యగర్జన ఘటనలతో సంబంధం లేనివారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. బిళ్లనందూరుకు చెందిన లగుడు శ్రీనును అలాగే తుని కేసులో ఇరికించారని బంధువులు ఆవేదన చెందుతున్నారు. తమ మాట వినని, వైఎసార్సీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ, సొసైటీ అధ్యక్షుడు గొర్లె రామచంద్రరావు, భీమవరపుకోట సర్పంచ్ జిగటాల వీరబాబు.. ఇలా 70 మందికి పైబడి నేతలు, కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు తెలుగు తమ్ముళ్ల వేధింపులకు సాక్ష్యం. చివరకు ఒంటిమామిడిలో పోలీసు క్వార్టర్ల కోసం కేటాయించిన లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కూడా తెలుగు తమ్ముళ్లు కబళించారంటున్నారు. బడా కంపెనీల పారిశ్రామిక అవసరాల కోసం రైతుల అభీష్టానికి భిన్నంగా బలవంతపు భూ సేకరణలో కూడా తెలుగు తమ్ముళ్లదే హవా. అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అసైన్డ్ ల్యాండ్స్, డి ఫాం పట్టాల అమ్మకాలు...ఇలా తుని నియోజకవర్గంలో వారి అక్రమాలు, ఆగడాల జాబితా కొండవీటి చేంతాడంత ఉంటుంది. ఈ దందాకు అడ్డుకట్ట పడేదెప్పుడా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూంటే.. ఇప్పుడది సరిహద్దులు కూడా దాటడంతో గగ్గోలు పెట్టడం పాల్మన్పేటవాసుల వంతైంది. ప్రాతినిధ్యం ఎవరిదైనా పెత్తనం ‘తమ్ముళ్ల’దే.. ఇప్పుడంటే తుని తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం సరిహద్దు దాటడం సంచలనమైంది. కానీ.. నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఆగడాలు నిత్యకృత్యం. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ తుని, పరిసర ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ల దాదాగిరీ బరితెగించడం ప్రజలకు తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా ఇదే ప్రధాన కారణం. అయినా పార్టీ అధికారంలో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు ఆ సంస్కృతిని విడనాడకపోగా మరింత పేట్రేగిపోతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేయే అయినా.. తెలుగుతమ్ముళ్ల ఇష్టారాజ్యమే నియోజకవర్గంలో సాగుతోంది. అందుకు ఉదాహరణలకూ కొదవ లేదు. -
వారు ఉరిశిక్షకూ అర్హులే: సీఎం
♦ కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ నిందితులపై చంద్రబాబు ♦ ఆ వ్యవహారాన్ని నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది ♦ ఆధారాల కోసం పత్రికలు, చానళ్లకు నోటీసులు ♦ తహసీల్దార్ వనజాక్షి పరిధి దాటారు...ఆమెపై కూడా చర్య తీసుకోవాలి.. సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కేసులో నిందితులు ఉరి శిక్షకు కూడా అర్హులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాల్ మనీపై శాసన మండలిలో చర్చ సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యవహారంపై ప్రజా ప్రతినిధులుగాని లేదా బాధితులు ఎవ్వరైనా తప్పుడు ఆరోపణలు చేయకుండా వారి వద్దనున్న ఆధారాలు తనకు ఇస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని పసిగట్టడంలో నిఘా వ్యవస్థ సైతం విఫలమైందన్నారు. ఈ కేసుకు సంబంధించి మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తోచిన విధంగా రాస్తూ ప్రజలను గందరగోళం చేస్తోందన్నారు. సాక్ష్యాధారాలుంటే నిర్భయ కేసు న మోదు చేస్తున్నామని...కొన్ని ఛానెళ్లు మహిళలకు ముసుగులు వేసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ మాట్లాడిస్తున్నాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకోలేమని, స్పష్టమైన ఆధారాలు కావాలన్నారు. అందుకే వార్తలు ప్రచురించి, ప్రసారం చేసిన పత్రికలు, టీవీ ఛానెళ్లకు నోటీసులు ఇచ్చి వాటి ఆధారాలు సేకరించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఇసుక మాఫియాకు సంబంధించి మహిళా తహసీల్దార్‌పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై ఏమి చర్యలు తీసుకున్నారని సీపీఐ సభ్యుడు పి.జె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించగా తహసీల్దార్ తన పరిధి దాటి వెళ్లినందునే అక్కడ సమస్య ఉత్పన్నమైందన్నారు. ఆమె మండల పరిధి కాదు...ఏకంగా ఇతర జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో ఆమె తల దూర్చారు... వాస్తవానికైతే ఆమెపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 227 కేసులు కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, సొంత సమాచారంతో ఇప్పటి వరకు 227 కేసులు నమోదు చేసి 188 మందిని అరెస్టు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. కాల్‌మనీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ను కరువులేని రాష్ట్రంగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తోందని ‘నీరు - ప్రగతి’పై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ నూతన రాజధాని ప్రాంతం నుంచే పని చేస్తాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు బి.చెంగల్ రాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయమై సచివాలయంలోని అన్ని శాఖలకు, శాఖాధి పతులకు ఈ నెల 1వ తేదీన ప్రధాన పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడులపై పరువు నష్టం దావా దాఖలైంది. ప్రియాంక హేచరీస్ యజమాని చంద్రమౌళి వీరిపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. అనధికార హేచరీల నుంచి చంద్రమౌళి దబ్బులు వసూలు చేశారంటూ తనను విమర్శించడంతో ఆయన యనమల సోదరులిద్దరికీ లీగల్ నోటీసులు పంపారు. అనుమతులు ఇప్పిస్తానంటూ చంద్రమౌళి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని యనమల సోదరులు గతంలో ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలు నిరాధారమని, తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 5 కోట్లు చెల్లించాలని కోరుతూ చంద్రమౌళి పరువునష్టం దావా దాఖలు చేశారు. -
మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యం
కాకినాడ: తొండంగి మండలం దానవాయిపేటలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు అనుచరులు దౌర్జన్యం చేశారు. ప్రియాంక హేచరీస్‌పై వారు దాడి చేశారు. 25 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారు. హేచరీస్ యాజమాన్యం తొండంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హేచరీస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.