సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల 2019 –20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 –19 బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019 – 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment