revenue expenditure
-
సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది. -
ఆర్థికలోటు రూ.32,390.68 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల 2019 –20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 –19 బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019 – 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు. -
ఆదాయ లోటా.. మళ్లీ మిగులా?
⇒ రెవెన్యూ ఆదాయాన్ని తేల్చేది ఆర్థిక సంవత్సరపు చివరి 4 నెలలే ⇒ నవంబర్ నాటికి రాష్ట్రంలో రూ.7,147 కోట్ల లోటున్నట్లు తేల్చిన కాగ్ ⇒ రూ.45,190 కోట్లుగా రెవెన్యూ ఆదాయం ⇒ రూ.52,337 కోట్లుగా నమోదైన రెవెన్యూ వ్యయం సాక్షి, హైదరాబాద్: తొలి రెండేళ్లు రెవెన్యూ మిగులును నిలబెట్టుకున్న తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మిగుల్లోనే ఉంటుందా లేదా లోటు దిశగా పయనిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో తెలంగాణ దాదాపు రూ.7 వేల కోట్ల రెవెన్యూ లోటును చవిచూసింది. రెవెన్యూ ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 2016 నవంబర్ వరకు దేశంలోని అన్ని రాష్ట్ర ఆదాయ వ్యయాల వివరాలను ఇటీవల రాష్ట్ర అకౌంటెంట్ జనరల్, భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తమ వెబ్సైట్లలో పొందుపరిచాయి. ఈ గణాంకాల ప్రకారం నవంబర్ నాటికి తెలంగాణ రెవెన్యూ ఆదాయం రూ. 45,190.73 కోట్లు, రెవెన్యూ వ్యయం 52,337.93 కోట్లు. ఈ లెక్కన రెవెన్యూ లోటు రూ. 7,147.20 కోట్లు, ద్రవ్య లోటు రూ. 22,541 కోట్లుగా ఉంది. బడ్జెట్లో వేసుకున్న అంచనాలు సైతం నెరవేరలేదని ఈ గణాంకాలు వేలెత్తి చూపించాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది 2013–14లో రూ. 369 కోట్ల మిగులు, 2015–16లో రూ. 241 కోట్ల మిగులు ఉన్నట్లుగా అకౌంటెంట్ జనరల్ ఆడిట్ లెక్కల్లో తేలింది. నవంబర్ నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ ఘనతను నిలబెట్టు కుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ ఆదాయ వ్యయాలు డోలాయ మానంగా ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆరంభంలో ఆదాయం తక్కువగా ఉంటుందని, ఖర్చులు మాత్రం వెచ్చించని తప్పని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి 4 నెలల్లో ఖర్చులకు కళ్లెం పడుతుందని, ఆదా యం పెరిగిపోతుందని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది సైతం రెవెన్యూ మిగులు ఉంటుందనే ధీమాను వెలిబుచ్చుతున్నారు. అంచనాల్లో ఆదాయం సగమే... గత ఏడాది అసెంబ్లీలో రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం భారీగానే అంచనాలు వేసుకుంది. రూ. 1,00,924 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుందని ఆశించింది. కానీ తొలి 8 నెలల్లో ఆశించినంత రాబడి రాలేదు. వార్షిక లక్ష్యంతో పోలిస్తే నవంబర్ నాటికి సగం కంటే తక్కువగా 44.78 శాతం ఆదాయమే సమకూరింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు ఈ పద్దులో వస్తాయి. వాటి కింద నెలకు సగటున రూ. 5,648 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రెవెన్యూ ఆదాయం రూ. 72 వేల కోట్ల నుంచి రూ. 75 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే దాదాపు 25 శాతం ఆదాయం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ తర్వాత ప్రభుత్వం ఖర్చులకు కళ్లెం వేసినప్పటికీ పాత నోట్ల రద్దు పరిణామాలు ఆదాయ మార్గాలన్నింటిపై ప్రభావం చూపాయి. దీనికి ప్రత్యామ్నాయం గా కేంద్రం రాష్ట్రాలకిచ్చే పన్నుల వాటా నిధులు ఎక్కువగానే విడుదల చేసింది. దీంతో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా సర్దుబాటు జరిగింది. లేకుంటే ఆర్థిక పరిస్థితి మరింత గడ్డుగా ఉండేది. భూముల అమ్మకాల ద్వారా దాదాపు 11 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం వేసుకున్న అంచనాలు కార్యాచరణలో ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. రెవెన్యూ రాబడి వృద్ధి 10 శాతమే... రెవెన్యూ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం పెరిగింది. 2015–16లో నవంబర్ నాటికి రూ. 41,049 కోట్ల ఆదాయం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 45,190 కోట్లు అర్జించింది. అంటే రూ. 4,141 కోట్ల మేర కు రాబడి పెరిగింది. రెవెన్యూ ఆదాయ వృద్ధి 10.08 శాతం నమోదైంది. బడ్జెట్లో వేసుకున్న అంచనా ప్రకారం 38.47 శాతం ఆదాయం పెరగాలి. కానీ అందులో మూ డో వంతు ఆదాయ వృద్ధి నమోదవడం ఆర్థిక శాఖను కొంత నిరాశకు గురి చేసింది. ఇదే వ్యవధిలో ఖర్చుకు మాత్రం సర్కారు వెనుకాడలేదు. జీతభత్యాలు, వడ్డీలు, నిర్వహణ ఖర్చుల వంటి ప్రణాళికేతర వ్యయం కింద నవంబర్ నాటికే రూ. 39 వేల కోట్లు వెచ్చించింది. అభివృద్ధి పనులు, ప్రగతి కార్యక్రమాలకు వెచ్చించే నిధులను నిర్దేశించే ప్రణాళిక వ్యయం కింద రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసింది. -
ఉప ప్రణాళికలకు గుడ్‌బై!
► వీటి స్థానంలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ► బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సర్కారు నిర్ణయం ►ఎస్సీ, ఎస్టీ కమిటీలకు కొత్త పథకాల రూపకల్పన బాధ్యత సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్ )లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. తాజాగా 2017–18 రాష్ట్ర బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్ అమలు సాధ్యం కాదని భావించిన సర్కారు ఈమేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతుల్లో పద్దులను ప్రవేశపెట్టేది. ప్రస్తుతం ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతులను రద్దు చేస్తూ వాటి స్థానంలో రెవెన్యూ వ్యయం(రెవెన్యూ ఎక్స్పెండీచర్), మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్పెండీచర్) పద్ధతుల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీంతో ప్రణాళిక కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక గందరగోళంలో పడింది. ఈక్రమంలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట సరికొత్త కార్యక్రమాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి వాటిలో కొనసాగించాల్సిన, కొత్తగా చేపట్టాల్సిన వాటిపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు విభాగాలకు ‘ప్రత్యేక అభివృద్ధి నిధి... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానంలో కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సబ్‌ప్లాన్ కు కేటాయించిన నిధులకంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద కేటాయించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన ఏర్పాౖటెన ఎస్టీ కమిటీలు కార్యాచరణకు ఉపక్రమించాయి. సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ వీటిలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపైనా పరిశీలన మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సోమవారం ఈ రెండు కమిటీలు ప్రత్యేంగా సమావేశమయ్యాయి. సామాజిక భద్రత పథకాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రణాళికలు తయారు చేయనున్నాయి. వీటిని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి తుది నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. సబ్‌ప్లాన్ –2013 చట్టానికి సవరణలు... ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ట్టబద్ధమైనవి. ఈమేరకు 2013లో అప్పటి ప్రభుత్వం ఉభయసభల్లో చర్చించి చట్టబద్ధత కల్పించాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయనుంది. ఆ రెండు శాఖలే కీలకం... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉప ప్రణాళికలకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేంద్రంగా ఉన్నప్పటికీ... కార్యక్రమాలకు కే టాయించే నిధులు పలు శాఖల ద్వారా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో లక్ష్యసాధన వెనుకబడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా అమ లు చేయనున్న ప్రత్యేక అభివృద్ధి నిధితో చేపట్టే కార్యక్రమాలకు ఇకపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. -
అప్పుల తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం పెరుగుతోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి వెచ్చించడంతో అప్పుల భారం ఏటికేటికీ పెరిగిపోతోంది. ఏడాది కాలంలోనే తలసరి అప్పు అదనంగా 7,272 రూపాయలు పెరిగింది. 14వ ఆర్థిక సంఘం విధించిన అప్పుల నిబంధనలను అధిగమించి మరీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24.33 శాతానికి మించకూడదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీన్ని అధిగమించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అప్పులు 1,46,852.53 కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయి. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25.05 శాతం. అప్పుల భారం పెరగడంతో.. తలసరి అప్పు కూడా పెరిగిపోతోంది. రాష్ట్ర జనాభా 4.95 కోట్ల మంది వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తలసరి అప్పు 29,667 రూపాయలకు పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తలసరి అప్పు 22,395 రూపాయలుగా ఉంది. అంటే తలసరి అప్పు ఏడాది కాలంలోనే 7,272 రూపాయలు పెరిగినట్లైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పులు రూ.1,29,264 కోట్లుగా ఉన్నాయి. అంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 17,588 కోట్లు అప్పు చేస్తున్నారు. విశేషమేమంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ సమర్పణ సమయంలో చెప్పిన దాదాపు రూ. 12 వేల కోట్ల కన్నా అదనంగా రూ. 8 వేల కోట్లు అప్పు చేసింది. అంటే మొత్తం రూ. 20 వేల కోట్ల అప్పులు చేసింది. ఇందులో ఆస్తుల కల్పనకు రూ.7 వేల కోట్లు వ్యయం చేసింది. అప్పు చేసిన డబ్బును ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి ఖర్చు చేయడంతో ఆస్తులు తరిగిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి.