capital expenditure
-
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్‌మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ కంపెనీలు దేశంలో తయారీని ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో స్థానికంగా ఉత్పాదకత పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు హెచ్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల దేశ ఆదాయం ఊపందుకుంటుంది. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. రక్షణశాఖలోనూ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం ఈ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. డిఫెన్స్ విభాగానికి అవసరమయ్యే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఆ రంగం అభివృద్ధికి కేంద్రం మూలధనం సేకరించాలని ప్రతిపాదించింది. అందుకోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)తో కలిసి ఇటీవల రూ.1.44 లక్షల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌సీఈ) కొనుగోలు చేయనున్నారు. ఎఫ్‌ఆర్‌సీఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగి రియల్‌టైమ్ పరిస్థితులను అంచనావేస్తూ శత్రువులపై పోరాడే యుద్ధ ట్యాంక్. ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లుఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇది గగనతలంలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించి ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంటలతో వాటిని నియంత్రిస్తుంది.ఇదీ చదవండి: ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహంఇండియన్ కోస్ట్ గార్డ్ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఆమోదించారు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు చేయనున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్. అధునాతన సాంకేతికత కలిగిన దీన్ని తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించనున్నారు. ఏదైనా విపత్తుల సమయంలోనూ ఇది సహాయపడుతుంది. -
పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయం
దేశంలో ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 54% పెరుగుతుందని అంచనా. 2023-24లో రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్బీఐ ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ నిర్వహణ, స్థిరమైన క్రెడిట్ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి..వంటి చాలా అంశాలు ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయానికి, రోడ్లు, వంతెనలు, విద్యుత్..వంటి ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి వెచ్చిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలుబ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారీగా నిధులు పొంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సదుపాయాల ద్వారా రానున్న 3-5 ఏళ్లల్లో ఆదాయం సమకూరనుంది. మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు దూసుకుపోతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. ఎగుమతులు హెచ్చవుతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి అధికమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రూ.4,419 కోట్ల నిధుల మళ్లింపు.. ఇన్వెస్టర్ల ఆరోపణ
ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్‌లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కోరారు. ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్‌కు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది. అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు. ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్సీఎల్టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్‌ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్‌ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. ‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్‌లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్‌ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్ఐ తెలిపింది. అందుకే సుజుకీకి షేర్ల జారీ.. సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్ఐ సమరి్ధంచుకుంది. ఎస్ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్ఐ వివరించింది. సోమవారం బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది. -
మూలధన వ్యయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు మూల ధన వ్యయంపై కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే 47.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళం రాష్ట్రానికి చెందిన తొలి నాలుగు నెలల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్ పేర్కొంది కేరళం బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 28.19 శాతమే వ్యయం చేసినట్లు కాగ్ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏపీ మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లు అని, ఇది బడ్జెట్లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో 47.79 శాతంగా ఉందని తెలిపింది. ఈ నాలుగు నెలల్లో కేరళం మూల ధన వ్యయం రూ.4,117.87 కోట్లు అని, ఇది బడ్జెట్ కేటాయింపుల్లో 28.19 శాతం అని వెల్లడించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన జూలై నెల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్ ఇంకా విడుదల చేయలేదు. కాగా, ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి మే వరకు) కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు బడ్జెట్లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర వ్యయం చేశాయనే వివరాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్రంతో పాటు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు చేయనంత మూల ధన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి త్రైమాసికంలోనే చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో కేంద్రం కంటే ఎక్కువ వ్యయం కేంద్ర ప్రభుత్వం ఈ ఆ ర్థిక ఏడాది బడ్జెట్లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో 27.8 శాతం వ్యయం చేయగా, ఆంధ్రప్రదేశ్ 40.8 శాతం వ్యయం చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో ఇంత పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం మూల ధన వ్యయం చేయడం స్వాగత సంకేతమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. తొలి త్రైమాసికంలో మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల సరాసరి చూస్తే మూల ధన వ్యయం బడ్జెట్ కేటాయింపుల్లో 12.7 శాతంగా ఉంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు రంగాల్లో ఆస్తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులను చేపట్టిన విషయం తెలిసిందే. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మూలధన వ్యయంలో గత ప్రభుత్వం కన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా పట్టించుకోకుండా కేవలం అప్పులంటూ దు్రష్పచారం చేస్తుండటం గమనార్హం. -
మూలధన వ్యయంలో ఏపీ టాప్
-
మూలధన వ్యయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై కాగ్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాలు బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయలేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్ గణాంకాలు కూడా మూల«దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎక్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరుగా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. -
మూలధన వ్యయం రూ. 37 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద రూ. 37,524.70 కోట్లు వెచ్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్ పరిమాణంలో ఇది దాదాపు 13 శాతం. 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 29,728.44 కోట్ల మూలధన వ్యయ కేటాయింపులతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ. 8 వేల కోట్లు అధికం. అదే సవరించిన బడ్జెట్ 2022–23 అంచనాల (రూ. 26,934.02 కోట్లు) ప్రకారం అయితే సుమారు రూ. 11 వేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మూలధన వ్యయ కేటాయింపులు భారీగా పెంచడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది కేంద్రం తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన వడ్డీలేని రుణాలని పేర్కొంటున్నారు. రాష్ట్రాలకు రూ. 5 లక్షల కోట్ల వరకు వడ్డీలేని రుణాలిస్తామని, కానీ వాటిని మూలధన వ్యయం కిందనే వెచ్చించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో మూలధన వ్యయ కేటాయింపులను పెంచిందని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ పరిమాణం ఈసారి దాదాపు రూ. 34 వేల కోట్లు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు మూలధన వ్యయాన్ని ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు. -
గ్రాసిమ్ విస్తరణకు రూ.3,117 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విస్తరణకు రూ.3,117 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్యం పెంపు, ప్లాంట్ల ఆధునీకరణకు వెచ్చిస్తామని సంస్థ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సోమవారం వెల్లడించారు. పెయింట్స్, బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారాలు మినహా ఇతర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ‘ఇప్పటికే పెయింట్స్ వ్యాపారంలో రూ.10,000 కోట్ల మూలధన వ్యయానికి బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికే రూ.605 కోట్లు ఖర్చు చేశాం. అదనంగా రూ.2,000 కోట్లను బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారానికై వెచ్చిస్తాం. 2021–22లో గ్రాసిమ్ రూ.1,958 కోట్లు మూలధన వ్యయం చేసింది. స్థలం దక్కించుకున్న ఆరు పెయింట్స్ ప్లాంట్లలో నాలుగుచోట్ల నిర్మాణం ప్రారంభం అయింది’ అని వాటాదార్ల సమావేశంలో వివరించారు. -
వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్
ముంబై: మహమ్మారి కోవిడ్–19 మూడవ వేవ్ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో అన్నారు. పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్ డ్రైవ్) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్– నాన్–బ్యాంకింగ్ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి, ప్రైవేట్ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు. 2021–22లో కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్‌ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. -
మూలధన వ్యయం కింద ఏపీకి రూ.1,189 కోట్లు సాయం
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే పథకం కింద 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు 1,189.79 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కోవిడ్ మహమ్మారి వలన రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద సాయం చేయడానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. చదవండి: (ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు: కేంద్రమంత్రి) ఈ విధంగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద కేంద్రం అందించే నిధులు 50 ఏళ్ళపాటు వడ్డీ లేని రుణాలుగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. మూలధన వ్యయం గుణాత్మకమైన ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా ఆర్థిక ప్రగతి ఉన్నతంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. -
పెట్టుబడులు పెంచండి
న్యూఢిల్లీ: ‘టీమ్ ఇండియా’ (భారత జట్టు)లో చేరి, భారత ప్రభుత్వ మూలధన వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచాలని ప్రైవేటు రంగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరాల్లోనూ భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా గుర్తింపు నిలబెట్టుకునేందుకు సాయంగా నిలవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లను చేరుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేటు రంగం నుంచి సైతం ఇతోధిక పెట్టుబడులకు మార్గం చూపుతుందన్నారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులకు ఇది అవకాశాల తరుణం. మీ సామర్థ్యాలను విస్తరించుకోండి. కరోనా మహమ్మారి రావడానికి ముందుతో పోలిస్తే కార్పొరేట్ పన్ను తగ్గించాం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను’’ అంటూ పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం గమనార్హం. ‘‘ముందుకు రండి. వీలైనంత మెరుగ్గా కృషి చేయండి. టీమ్ ఇండియాలో భాగస్వాములై ఈ ఏడాది, వచ్చే ఏడాది, తర్వాతి సంవత్సరాల్లోనూ భారత్ మెరుగైన వృద్ధి నమోదు చేసేందుకు మద్దతుగా నిలవండి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. -
AP: ఆస్తులపై పెరిగిన పెట్టుబడి
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఆస్తుల కల్పన వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా మూలధన వ్యయం పెరుగుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. పలు రాష్ట్రాల బడ్జెట్లను అధ్యయనం చేసిన ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదంటూ కొందరు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. మూలధన వ్యయం అంటే ఆస్తులు సమకూర్చేందుకు చేస్తున్న వ్యయంగా పరిగణిస్తారు. తెలంగాణ కంటే అధికంగా.. టీడీపీ హయాంలో 2018–19లో మూలధన వ్యయం రూ.35,364 కోట్లు ఉండగా 2020–21లో రూ.44,397 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. గత సర్కారు హయాంలో కన్నా గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో మూలధన వ్యయం ఎక్కువగా ఉందని నివేదిక తేటతెల్లం చేసింది. విభజన అనంతరం చంద్రబాబు అధికారం చేపట్టిన 2014–15లో మూలధన వ్యయంతో పోల్చితే 2020–21లో వైఎస్సార్ సీపీ పాలనలో ఏకంగా 139 శాతం మేర పెరిగింది. 2018–19తో పోల్చితే 2019–20లో 5.29 శాతం మేర పెరిగింది. 2020–21లో 19.28 శాతం పెరిగింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ కంటే ఒకింత ఎక్కువగానే ఏపీలో మూలధన వ్యయం ఉంది. 2019–20లో తెలంగాణ మూల ధన వ్యయం రూ.31,228 కోట్లు కాగా 2020–21లో రూ,44,145 కోట్లు వరకు ఉంది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా ఆదాయంతో పాటు రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చే రాబడి తగ్గిపోయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రాకుండా వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది. -
22న రాష్ట్రాలకు రూ.95 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ: మూలధన వ్యయం పెంచాలని పలు రాష్ట్రాలు కోరిన మేరకు ఒక ముందస్తు వాయిదాతో కలుపుకుని మొత్తం రూ.95,082 కోట్లను ఈ నెలలో రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం చేసేందుకు సోమవారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సీఎంలు, మూడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఇందులో మూలధన వ్యయాన్ని పెంచాలని రాష్ట్రాలు కోరాయి. ఈ సమావేశానంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా రాష్ట్రాలకు విడుదల చేసే రూ.47,541 కోట్లకు బదులు నవంబర్ 22న రాష్ట్రాలకు మరో విడత అదనంగా ఇవ్వాలని ఆర్థిక కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. దీంతో ఈనెల 22న మొత్తం రూ.95,082 కోట్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దీంతో రాష్ట్రాల వద్ద ఉండే మూలధనం పెరుగుతున్న కారణంగా, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేయడాన్ని పరిగణించవచ్చని ఆమె వెల్లడించారు. ఇక ప్రస్తుతం వసూలుచేస్తున్న పన్నులో 41 శాతం 14 వాయిదాల్లో రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. అంతేగాక.. ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్ ధరలో రూ.5, డీజిల్ ధరలో లీటరుకు రూ.10 నాన్–షేరబుల్ పోర్షన్ నుంచి తగ్గించామన్నారు. రూ. 20వేల కోట్ల వీజీఎఫ్ కార్పస్‌ను రూపొందించాలి: బుగ్గన ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ.. ఒక కీలక ప్రతిపాదనను ఉంచారు. జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల తరహాలో రూ. 20,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కార్పస్‌ను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతిపాదించారు. ఈ నిధుల ద్వారా సుమారు రూ.5 లక్షల కోట్ల ఏకీకృత పెట్టుబడి సామర్థ్యంతో 10 వ్యూహాత్మక ప్రాజెక్టులను బలోపేతం చేయడం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృష్టించవచ్చని వివరించారు. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా దేశంలోని అన్ని రంగాలలో స్పిన్–ఆఫ్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని.. అంతేగాక, ఇది ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మల్టీ–లేటరల్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల వంటి వినూత్న ప్రాజెక్టు ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలివ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్ సమస్యను ఎత్తిచూపారు. కాకినాడలో రూ.39,200 కోట్లతో ప్రతిపాదించిన హెచ్‌పీసీఎల్–గెయిల్ పెట్రో కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కేసును ఉటంకిస్తూ, గత మూడేళ్లుగా రూ.5,700 కోట్ల వీజీఎఫ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుపోయిందని తెలిపారు. ఈ భారీ పెట్రో ప్రాజెక్టు సాకారమైతే ఆంధ్రప్రదేశ్‌లోకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించవచ్చని తెలిపారు. -
విమానయానం, టెలికం ప్రాజెక్టుల పూర్తి అవశ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికం శాఖ (డీఓటీ)ల్లో మూలధన వ్యయాల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వశాఖలను కోరారు. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ట్వీట్ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మూలధన వ్యయ పురోగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై ఆర్థికమంత్రి సమీక్ష జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మూలధన కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగదల 34.5 శాతంగా ఉంది. విలువలో రూ.5.54 లక్షల కోట్లకు చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ సేవల విస్తరణ వేగవంతం కావాలని కూడా టెలికంశాఖకు ఆర్థికమంత్రి సూచించారు. మానిటైజేషన్ ప్రణాళికపైనా సమీక్ష... సమావేశంలో ఆర్థికమంత్రి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ)కు సంబంధించిన ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలను సమీక్షించినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎంఎన్‌పీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని కేంద్రం పేర్కొంది. -
పెట్టుబడుల లక్ష్యాలపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న పెట్టుబడి వ్యయాల (కేపెక్స్) లక్ష్యాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ శాఖల వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం ఎకానమీకి పునరుజ్జీవం కల్పించాలంటే మరింతగా వ్యయం చేయడం కీలకమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించిన ప్రతిపాదనల అమలు పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ సూచనలు చేశారు. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) బాకీల చెల్లింపు జూలై 31లోగా పూర్తయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), శాఖలకు మంత్రి సూచించారు. ఇక లాభసాటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని మరింతగా దృష్టి పెట్టాలని కూడా సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులకు సంస్కరణల దన్ను: సీఈఏ కేవీ సుబ్రమణియన్ సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం సహా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా తీసుకున్న అనేక సంస్కరణలతో పెట్టుబడులకు మరింత ఊతం లభించగలదని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వర్ధమాన దేశాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 50 శాతం మేర పడిపోయినప్పటికీ.. భారత్‌లోకి మాత్రం రికార్డు స్థాయిలో రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెట్టుబడుల నివేదిక 2021 అంశంపై ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (ఐఎస్ఐడీ) నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా సుబ్రమణియన్ ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన పెద్ద దేశం భారత్ మాత్రమేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా సరఫరాపరమైన సమస్యలను తొలగించేందుకు ఉద్దేశించిన సంస్కరణలతో.. పెట్టుబడుల రాకకు మార్గం సుగమమైందని సుబ్రమణియన్ వివరించారు. కార్మిక చట్టాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, లఘు పరిశ్రమల నిర్వచనం మార్చడం మొదలైనవి కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక ప్రకారం 2020లో భారత్‌లోకి 64 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఎఫ్‌డీఐలు అత్యధికంగా అందుకున్న దేశాల జాబితాలో భారత్ అయిదో స్థానంలో నిల్చింది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) రంగంలోకి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. చదవండి: చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ... -
ఆర్థికలోటు రూ.32,390.68 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల 2019 –20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 –19 బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019 – 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ: డిస్కౌంట్లకు చెక్!
ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్ వ్యయాలు, డిస్కౌంట్ల అంశంపై ఆదాయపన్ను శాఖకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను కోల్పోయింది. వినియోదారులకు అందిస్తున్న డిస్కౌంట్లకు సంబంధించిన వ్యయాలను, డిస్కౌంట్లను పునర్నిర్వచించాలని ఐటీ శాఖ తెలిపింది. దీంతో భారీ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లతో వినియోగదారులకు వల విసురుతున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్ల వైనానికి ఇక తెరపడనుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్)లో దాఖలు చేసిన అప్పీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కోల్పోయింది. వినియోగదారులకు ఇస్తున్న డిస్కౌంట్లను కంపెనీ వ్యయాల్లోకి చేర్చాలని కోరుతూ, తద్వారా కంపెనీ ఆదాయనష్టాలను పూడ్చుకోవాలన్న సంస్థ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ తోసి పుచ్చింది. ఇటువంటి వ్యయాలు వ్యాపారాన్ని బ్రాండ్‌ను నిర్మించటానికి ఉద్దేశించినవని ఆదాయపు పన్ను విభాగం వాదన. అందువల్ల వీటిని మూలధన వ్యయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఫలితంగా ఈకామర్స్సంస్థలపై 30శాతం పన్ను భారం పడనుంది. దీంతో ఇకామర్స్ కంపెనీల డిస్కౌంట్లకు తెరపడనుందని అంచనా. అలాగే భారీ డిస్కౌంట్లను అందిస్తున్న అమెజాన్, స్నాప్‌డీల్ లాంటి ఇతర ఆన్లైన్ రిటైలర్లకు ఇదొక పరీక్షగా మారవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆశ్రయించే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఆదాయపన్నుశాఖ ముందుకు వచ్చిన ఏకైక సంస్థ కాదు. ఈ సమస్య వెలుగులోకి రావడం ఇదే మొదటిసారీకాదు. ఈ విషయాల్లో నిపుణులచే రెండు వైపులా వాదనల తరువాత పరిష్కరించుకోవాల్సిన సమస్యలో ఇదొకటి చెబుతున్నారు. మరోవైపు సంబంధిత కంపెనీలు చట్టపరమైన ఉపశమనంకోసం ప్రయత్నిస్తే ఐటీ శాఖ చర్యలు వీగిపోతాయని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ నిర్ణయం డిసెంబరులో జరిగిందంటూ ఫ్లిప్‌కార్ట్ సీనియర్ అధికారి అభివృద్ధిని ధృవీకరించారని రిపోర్ట్ చేసింది. మరికొద్ది రోజుల్లో ఆదాయం పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) లో సవాల్ చేస్తారని చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. -
ఉప ప్రణాళికలకు గుడ్‌బై!
► వీటి స్థానంలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ► బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సర్కారు నిర్ణయం ►ఎస్సీ, ఎస్టీ కమిటీలకు కొత్త పథకాల రూపకల్పన బాధ్యత సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్ )లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. తాజాగా 2017–18 రాష్ట్ర బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్ అమలు సాధ్యం కాదని భావించిన సర్కారు ఈమేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతుల్లో పద్దులను ప్రవేశపెట్టేది. ప్రస్తుతం ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతులను రద్దు చేస్తూ వాటి స్థానంలో రెవెన్యూ వ్యయం(రెవెన్యూ ఎక్స్పెండీచర్), మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్పెండీచర్) పద్ధతుల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీంతో ప్రణాళిక కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక గందరగోళంలో పడింది. ఈక్రమంలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట సరికొత్త కార్యక్రమాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి వాటిలో కొనసాగించాల్సిన, కొత్తగా చేపట్టాల్సిన వాటిపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు విభాగాలకు ‘ప్రత్యేక అభివృద్ధి నిధి... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానంలో కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సబ్‌ప్లాన్ కు కేటాయించిన నిధులకంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద కేటాయించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన ఏర్పాౖటెన ఎస్టీ కమిటీలు కార్యాచరణకు ఉపక్రమించాయి. సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ వీటిలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపైనా పరిశీలన మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సోమవారం ఈ రెండు కమిటీలు ప్రత్యేంగా సమావేశమయ్యాయి. సామాజిక భద్రత పథకాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రణాళికలు తయారు చేయనున్నాయి. వీటిని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి తుది నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. సబ్‌ప్లాన్ –2013 చట్టానికి సవరణలు... ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ట్టబద్ధమైనవి. ఈమేరకు 2013లో అప్పటి ప్రభుత్వం ఉభయసభల్లో చర్చించి చట్టబద్ధత కల్పించాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయనుంది. ఆ రెండు శాఖలే కీలకం... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉప ప్రణాళికలకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేంద్రంగా ఉన్నప్పటికీ... కార్యక్రమాలకు కే టాయించే నిధులు పలు శాఖల ద్వారా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో లక్ష్యసాధన వెనుకబడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా అమ లు చేయనున్న ప్రత్యేక అభివృద్ధి నిధితో చేపట్టే కార్యక్రమాలకు ఇకపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. -
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%. వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది. రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి... కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు. చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు. సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది -
రికవరీ కనబడుతోంది: నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 3.6 శాతమేనని వివరించింది. స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది.