న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్‌ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్‌ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది.
‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్‌లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్‌ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది.
అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్‌ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్‌ఐ తెలిపింది.
అందుకే సుజుకీకి షేర్ల జారీ..
సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్‌ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్‌ఐ సమరి్ధంచుకుంది. ఎస్‌ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్‌ఐ వివరించింది. సోమవారం బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment