Maruti Suzuki India (MSI)
-
RC Bhargava: భవిష్యత్ భారత్‌దే
న్యూఢిల్లీ: భవిష్యత్ వృద్ధికి సంబంధించి మిగతా దేశాలన్నింటితో పోలిస్తే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. భారత్ ముందుకు సాగాలంటే కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు, విధానాలను వదిలించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు.. వృద్ధి సాధన గురించి ఇథమిత్థంగా అంచనా వేయలేని నిర్దిష్ట స్థాయికి చేరాయని భార్గవ చెప్పారు. అక్కడి ప్రజలు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నప్పటికీ పని చేయాలన్న స్ఫూర్తి తగ్గిందని ఆయన తెలిపారు. మరోవైపు, మన వారు తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును కూడా గణనీయంగా మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. ఇదే కసి భారత్‌ను ముందుకు తీసుకెడుతోందని ఆయన వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ మనం కాలం చెల్లిన విధానాలన్నింటినీ వదిలించుకోవాల్సి ఉందన్నారు. ఇక, తమ సంస్థ ముందు నుంచి పొదుపుగా వ్యవహరిస్తూ వస్తోందని, అందుకే వ్యాపార విస్తరణ కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అంతర్గత నిధులనే వినియోగించుకుంటున్నామని భార్గవ చెప్పారు. చిన్న పట్టణాల్లో నెక్సా సరీ్వస్ మారుతీ సుజుకీ చిన్న పట్టణాల్లో సరీ్వస్ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంపాక్ట్ నెక్సా సరీ్వస్ వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్సహా హర్యానా, పశి్చమ బెంగాల్, గుజరాత్, తమిళనాడులో మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2025 మార్చి నాటి కి దేశవ్యాప్తంగా ఇటువంటి 100 వర్క్‌షాప్స్‌ను నెలకొల్పాలన్నది లక్ష్యమని మారుతీ సుజుకీ ఇండి యా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా జరుగుతున్న మొత్తం కార్ల విక్రయాల్లో నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల వాటా 30 శాతం ఉందని చెప్పారు. -
మారుతీ లాభం స్పీడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3) లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ. 3,207 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,406 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 33,513 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 29,251 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో 8 శాతం అధికంగా 5,01,207 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీ అమ్మకాలు 4,29,422 యూనిట్లుకాగా.. 71,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఇవి ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గత క్యూ3లో దేశీయంగా 4,03,929, విదేశాలలో 61,982 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) మారుతీ సుజుకీ 7 శాతం వృద్ధితో మొత్తం 15,51,292 వాహనాలను విక్రయించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆదాయం, నికర లాభాల్లోనూ రికార్డులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 1,03,387 కోట్లను తాకగా.. నికర లాభం 9,536 కోట్లు ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 2.3 శాతం బలపడి రూ. 10,183 వద్ద ముగిసింది. -
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
మారుతీ చేతికి గుజరాత్ ప్లాంట్
న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్ బ్యాలట్ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్‌కు తెరతీసింది. ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్‌ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్‌ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్‌ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్‌ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. ‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్‌లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్‌ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్ఐ తెలిపింది. అందుకే సుజుకీకి షేర్ల జారీ.. సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్ఐ సమరి్ధంచుకుంది. ఎస్ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్ఐ వివరించింది. సోమవారం బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది. -
2030–31 నాటికి 70 లక్షల కార్లు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన పరిశ్రమ 2030–31 నాటికి భారత్‌లో 60–70 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకే యూచీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే దాదాపు రెండింతల కార్యకలాపాలు పెరుగుతాయ ని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలకడగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చే మార్గాలను కనుగొనాలని ఏసీఎంఏ సదస్సులో పిలుపునిచ్చారు. ‘విడిభాగాల తయారీ పరిశ్రమ దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం, వ్యాపార విస్తరణ, వృద్ధికి ఇప్పటికే ఉన్న మానవశక్తి నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి కొత్త సాంకేతికతలు, ఇంధనాలను స్వీకరించడానికి దారితీస్తున్నాయి. తద్వారా ముఖ్యంగా భారతీయ ఆటో విడిభాగాల తయారీదార్లకు పెద్ద అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ’మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రతిరూపాలలో మీరు ఒకరు. ఇప్పుడు తయారీ నైపుణ్యాన్ని సంపాదించిన తర్వా త మనం ’డిజైన్ ఇన్ ఇండియా’ వైపు మళ్లాలి. భారత్‌లో భారీ టాలెంట్ పూల్ ఉంది. కానీ వారిని పరిశ్రమకు సిద్ధం చేయడానికి ముడిపడి ఉన్న అన్ని సంస్థలతో అనుసంధానం అవసరం. ప్రభుత్వం నుండి కూడా క్రియాశీల మద్దతు కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. -
మారుతీ ఎరీనా.. 70 లక్షల కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్–ప్రెస్సో, వేగన్–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు. 2022లో భారత్‌లో అమ్ముడైన టాప్–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్íÙప్ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
ఎస్‌యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్‌తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
మారుతీ లాభం స్కిడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం ఏకంగా 66 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 487 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,420 కోట్లు. సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరల పెరుగుదల తదితర అంశాలు రెండో త్రైమాసికంలో కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపాయి. తాజా క్యూ2లో ఆదాయం రూ. 18,756 కోట్ల నుంచి రూ. 20,551 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 3 శాతం క్షీణించి 3,93,130 యూనిట్ల నుంచి 3,79,541 యూనిట్లకు తగ్గాయి. దేశీ విక్రయాలు 3,70,619 యూనిట్ల నుంచి 3,20,133 యూనిట్లకు క్షీణించాయి. అయితే, ఎగుమతులు 22,511 వాహనాల నుంచి ఏకంగా 59,408 వాహనాలకు చేరాయి. త్రైమాసికాలవారీగా ఇది అత్యధికం. లక్ష పైగా వాహనాల ఉత్పత్తికి బ్రేక్ .. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు సంబంధించి.. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా దాదాపు 1.16 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి 2 లక్షల పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. డెలివరీలను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పేర్కొంది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో చూస్తే.. ఈ త్రైమాసికంలో ఉక్కు, అల్యూమినియం, ఇతరత్రా విలువైన లోహాల ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాన్ని వీలైనంత అధికంగా భరించేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేసింది. కార్ల ధరలు పెంచినా.. వినియోగదారులకు స్వల్ప భారాన్నే బదలాయించింది. నికర లాభం క్షీణించడానికి ఇది కూడా కారణం‘ అని మారుతీ సుజుకీ తెలిపింది. సవాళ్లమయంగా రెండో త్రైమాసికం.. క్యూ2 అత్యంత సవాళ్లమయంగా సాగిందని ఆన్లైన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఏడాది ప్రారంభంలో కంపెనీ ఊహించని అనూహ్యమైన పరిణామాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘రెండో త్రైమాసికంలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా లేదు. కానీ సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత .. కమోడిటీల ధరలు అసాధారణంగా పెరిగిపోవడం వంటి అంశాలు మా ముందస్తు అంచనాలను తల్లకిందులు చేశాయి‘ అని భార్గవ తెలిపారు. రెండంకెల వృద్ధి ఉండదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా వ్యవధిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడం ప్రస్తుతం చాలా కష్టమని భార్గవ చెప్పారు. కమోడిటీల ధరలు, ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరాలను అంచనా వేయడం అంత సులభంగా లేదన్నారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొందని, ఎవరూ దీర్ఘకాలిక సరఫరాల గురించి ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారని భార్గవ తెలిపారు. నాలుగేళ్ల తర్వాతే ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతగా లేదని, 2025 తర్వాతే దేశీయంగా వీటిని తాము ప్రవేశపెట్టే అవకాశం ఉందని భార్గవ చెప్పారు. తాము ఈ విభాగంలోకి ప్రవేశిస్తే నెలకు కనీసం 10,000 యూనిట్లయినా విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం బ్యాటరీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటివి ఇతర సంస్థల చేతుల్లో ఉన్నందున.. ధరను నిర్ణయించడం తమ చేతుల్లో లేదన్నారు. ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడంపై మాతృ సంస్థ సుజుకీదే తుది నిర్ణయమని చెప్పారు. 2020లో ఎలక్ట్రిక్ వేగన్ఆర్ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ ప్రతికూలతల కారణంగా దాన్ని పక్కన పెట్టింది. -
వెంటిలేటర్ల తయారీలోకి మారుతీ!
న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా... కరోనావైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్‌ల తయారీ చేపట్టనుంది. భారత ప్రభుత్వం కోరిక మేరకు వెంటిలేటర్స్, మాస్క్‌లు, పీపీఈలను తయారు చేసేందుకు అగ్వా హెల్త్‌కేర్ కంపెనీతో కలిసి పనిచేస్తామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని లకి‡్ష్యస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. మారుతీ తయారు చేసే వెంటిలేటర్స్‌కు తగిన టెక్నాలజీని అగ్వాహెల్త్ కేర్ అందించనుంది. ఈ వెంటిలేటర్స్ తయారీకి కావాల్సిన నగదు, ప్రభుత్వపరమైన అనుమతులన్నింటిని మారుతీ సుజుకీ భరించి అగ్వా హెల్త్‌కేర్‌కు ఉచితంగా అందించనుంది. మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి హరియాణ, కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనుంది కూడా. ఇంకా భారత్ సీట్స్ లిమిటెడ్‌తో కలిసి వైరస్ నుంచి రక్షణ కల్పించే క్లాత్‌ను తయారు చేయనుంది. -
వాహనాల తయారీకి వైరస్ బ్రేక్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) గురుగ్రామ్, మానెసర్‌లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్తక్లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్‌డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్‌పూర్ ప్లాంట్‌లో ఇప్పటికే ఆపివేశామని, చకన్ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సైతం తమ ప్లాంట్‌లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్‌లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫండ్... మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్‌లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్‌కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు. -
కారు.. బేజారు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా పదో నెలలోనూ కార్ల విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) జూన్ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3% తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్ 36.2% క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్–సిక్స్ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే కోలుకోవచ్చని చెప్పారు. -
మారుతి వాహనాల ధరల పెంపు..ఎందుకంటే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎస్ఎంఐ) తనవాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1, సోమవారం నుంచి తప్పనిసరి నిబంధన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిండించింది. అన్నిమోడళ్ల వాహనాలపై రూ. 689 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు పెంపు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. హై సెక్యూరిటీ ప్లేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రభుత్వం మాండేటరీ చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపుఅమల్లోకి తీసుకొచ్చినట్టు మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరంటూ గతంలో ప్రభుత్వం ఆదేశించినా కూడా..వాహనదారుల నుంచి ఆసక్తి కరువవ్వడంతో దీనిపై రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై షోరూమ్ నుంచి బయటకొచ్చే ప్రతి వాహనానికి షోరూముల్లోనే తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వాహనాలకు సంబంధించిన టెక్నికల్ వివరాలతోపాటు వాహన యజమానుల వివరాలు పొందుపరిచేలా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటచేసుకోవాలని ఇదివరకే షోరూమ్ నిర్వాహకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలోనూ పాటించాలని నిబంధనలు విధించారు. -
మారుతి విటారా బ్రెజ్జా: కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) బుధవారం కాంపాక్ట్ ఎఎస్‌యూవీ విటారా బ్రెజ్జాను సరికొత్తగా పరిచయం చేసింది. పాదచారుల భద్రతతో సహా, ఆధునిక భద్రతా నిబంధనలతో కొత్త అల్లాయ్ వీల్స్, నిగనిగలాడే నలుపు రంగు ఫినీషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా విడుదల చేసింది. ఈ మేకోవర్ స్పోర్టీ బ్రెజ్జా వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ+ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. రూ. 8.54 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య వీటి ధరలను నిర్ణయించింది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను మెరుగు పర్చడంతోపాటు అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్‌ను పొందుపరిచింది. రిఫ్రెష్ విటారా బ్రెజ్జాలో ISOFIX చైల్డ్ లాకింగ్ సిస్టం , హై స్పీడ్ వార్నింగ్ ఎలర్ట్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్స్‌తో కూడిన కొత్త భద్రతా ఫీచర్స్‌ను జోడించినట్టు కంపెనీ తెలిపింది.భారత ఎస్యూవీ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా ఉన్న బ్రెజ్జాను ఆటోగేర్ షిఫ్ట్, టూ పెడల్ టెక్నాలజీ మేళవింపుతో యువ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు ఆర్ఎస్ కల్సీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఏజీస్ వేరియంట్ విక్రయాలు మూడింతలు పెరిగినట్టు పేర్కొన్నారు. కాగా 2016లో ప్రారంభించిన విటారా బ్రెజ్జా మొత్తం 2.75 లక్షల యూనిట్లు విక్రయించింది. 2017-18లో 1,48,462 యూనిట్లను విక్రయించింది. దీని సగటు నెలవారీ అమ్మకాలు 12,300 యూనిట్లుగా ఉన్నాయి. టాప్ వేరియంట్ సేల్స్ మొత్తం అమ్మకాలలో 56 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. -
ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్‌లు చేరాయి. టాటా తగ్గింపు లక్షన్నర వరకూ టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది. వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యమహా ఇండియా... కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్‌జడ్16, వైజడ్ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్టీఆర్ బైక్‌లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి.