హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్‌లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్–ప్రెస్సో, వేగన్–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు.
2022లో భారత్‌లో అమ్ముడైన టాప్–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్íÙప్ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment