arena
-
వెడ్డింగ్ ఫంక్షన్ కాస్త రెజ్లింగ్ అడ్డాగా మారింది..!
ఇస్లామాబాద్:పాకిస్థాన్‌లో ఓ వెడ్డింగ్ ఫంక్షన్ రెజ్లింగ్ అడ్డాగా మారింది. వేడుకకు వచ్చిన అతిథులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కుర్చీలు, ప్లేట్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. తినుబండారాలు చెల్లాచెదురుగా విసిరారు. ఈ వీడియో ట్విట్టర్(ఎక్) లో ఓ యూజర్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. వేడుకకు వచ్చిన అతిథులందరూ భోజనంలో పాల్గొన్నారు. మగవారికి ఓ వైపు మరొవైపు ఆడవారికి ఏర్పాట్లు చేశారు. బంధువులందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ డైనింగ్ టేబుళ్లపై ఉన్న ఆహారాన్ని ఆరగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరోవ్యక్తి టోపీని తిప్పాడు. అంతే.. గొడవ ప్రారంభమైంది. బంధువులు రెండు వర్గాలుగా వీడి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వేడుకలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. Kalesh during marriage ceremony in pakistan over mamu didn’t got Mutton pieces in biriyani pic.twitter.com/mYrIMbIVVx — Ghar Ke Kalesh (@gharkekalesh) August 29, 2023 ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 3,33000 వ్యూస్ వచ్చాయి. ఫంక్షన్లో చికెన్ ముక్క సరిపోట్లేదా..? అని ఓ యూజర్ ఫన్నీగా ప్రశ్నించారు. పాపం ఆ పెళ్లి చేసుకున్న వరుడు-వధువు పరిస్థితి ఏంటో..? అంటూ మరొకరు స్పందించారు. వేలు ఖర్చు చేసి ఫంక్షన్ చేస్తే నాశనం చేశారు కదరా..? అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ -
మారుతీ ఎరీనా.. 70 లక్షల కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్–ప్రెస్సో, వేగన్–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు. 2022లో భారత్‌లో అమ్ముడైన టాప్–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్íÙప్ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు. -
Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి. -
‘సాక్షి’ఎరీనావన్‌కు విశేష స్పందన
– ప్రశాంతంగా ముగిసిన మొదటి రౌండు పరీక్షలు – చెస్, పెయింటింగ్, సింగింగ్‌తో సహా ఆరు విభాగాల్లో పోటీలు – అద్భుతాలు ఆవిష్కరించిన చిన్నారులు – రెండు, మూడు రోజుల్లో ఫలితాలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెస్, హ్యాండ్ రైటింగ్, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్, సింగింగ్, ఇన్స్ట్రూమెంట్స్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. మొదటి రౌండు పోటీలకు రిడ్జ్, సెయింట్ జోసెఫ్, భాష్యం తదితర పాఠశాలల నుంచి 126 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 90 మంది హాజరయ్యారు. వీటి ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు తెలియజేస్తామని సాక్షి యూనిట్ మేనేజర్ కిరణ్ తెలిపారు. మెదడుకు పదను పెట్టించిన చెస్... చెస్ పిల్లల మెదడుకు పదును పెట్టించింది. మొత్తం 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 28 మంది చెస్ ఆడారు. వీరికోసం 14 టేబుళ్లలో మొదటి రౌండు చెస్‌ను నిర్వహించారు. అందమైన చేతిరాత మా సొంతం... ఉత్తమ మార్కులు రావాలంటే కష్టపడి చదవడంతోపాటు మంచిచేతిరాత ఉండాలి. అప్పుడే మార్కులు సొంతమవుతాయి. హ్యాండ్రైటింగ్ విభాగంలో 29 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 17 మంది హాజరై అందమైన చేతిరాతను ప్రదర్శించారు. పెయింటింగ్, పోస్టర్ మేకింగ్... బొమ్మను గిస్తే నీలా ఉంటుంది..అంటూ ఓ కవి అన్న మాటలను సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్‌లో విద్యార్థులు నిజం చేశారు. అందమైన బొమ్మలను గీసి పెయింటింగ్ వేసి తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు. పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ విభాగాల్లో 49 మందికి 29 మంది హాజరై తమలోని చిత్రకళను ప్రదర్శించారు. నేను పాడితే లోకం ఆడదా.... సింగింగ్, ఇన్సూ్ర్టమెంట్స్ విభాగాల్లో 27 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 16 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. నేను పాడితే లోకం ఆడదా అన్న రీతిలో 12 మంది చిన్నారులు పాటలు పాడగా, నలుగురు గీటారు, వయోలిన్, హార్మోని వాయించారు.