వెడ్డింగ్ ఫంక్షన్ కాస్త రెజ్లింగ్ అడ్డాగా మారింది..! | Pakistani Wedding Function Turns Into Wrestling Arena; Video Viral - Sakshi
Sakshi News home page

వెడ్డింగ్ ఫంక్షన్ కాస్త రెజ్లింగ్ అడ్డాగా మారింది..!

Published Fri, Sep 1 2023 12:09 PM | Last Updated on Fri, Sep 1 2023 12:55 PM

Pak Wedding Turns Wrestling Arena - Sakshi

ఇస్లామాబాద్‌:పాకిస్థాన్‌లో ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌ రెజ్లింగ్ అడ్డాగా మారింది. వేడుకకు వచ్చిన అతిథులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కుర్చీలు, ప్లేట్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. తినుబండారాలు చెల్లాచెదురుగా విసిరారు. ఈ వీడియో ట్విట్టర్‌(ఎక్) లో ఓ యూజర్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. 

వేడుకకు వచ్చిన అతిథులందరూ భోజనంలో పాల్గొన్నారు. మగవారికి ఓ వైపు మరొవైపు ఆడవారికి ఏర్పాట్లు చేశారు. బంధువులందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ డైనింగ్ టేబుళ్లపై ఉన్న ఆహారాన్ని ఆరగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరోవ్యక్తి టోపీని తిప్పాడు. అంతే.. గొడవ ప్రారంభమైంది. బంధువులు రెండు వర్గాలుగా వీడి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వేడుకలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.  

ఈ వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 3,33000  వ్యూస్ వచ్చాయి. ఫంక్షన్‌లో చికెన్ ముక్క సరిపోట్లేదా..? అని ఓ యూజర్ ఫన్నీగా ప్రశ్నించారు. పాపం ఆ పెళ్లి చేసుకున్న వరుడు-వధువు పరిస్థితి ఏంటో..? అంటూ మరొకరు స్పందించారు. వేలు ఖర్చు చేసి ఫంక్షన్ చేస్తే నాశనం చేశారు కదరా..? అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టారు.  

ఇదీ చదవండి: ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement