Viral: Pakistani Man Married For 5th Time Alongside His Daughters - Sakshi
Sakshi News home page

వైరల్‌.. అప్పటికే 4 పెళ్లిళ్లు.. 11 మంది సంతానం.. 40 మంది మనవళ్లు.. అయినా మరో పెళ్లి!

Published Sun, Oct 2 2022 12:30 PM | Last Updated on Sun, Oct 2 2022 1:51 PM

Viral: Pakistani Man Married For 5th Time Alongside His Daughters - Sakshi

పాకిస్థాన్‌కు చెందిన షౌకత్‌ అనే వ్యక్తి గతేడాది పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకోవడంలో వింత ఏముంది అనుకుంటారా.. ఆయన వయసు 62 ఏళ్లు. అంతేకాదు ఇది షౌకత్‌కు మొదటి పెళ్లి కాదు.. అయిదోది.. ఇంతకముందే అతనికి నాలుగు పెళ్లిళ్లు అవ్వగా 11 మంది సంతానం. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా ఒకరు అబ్బాయి. ఏకంగా 40 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. మొత్తంగా కుటుంబంలో 62 మంది ఉన్నారు. 

మరి ఇంత మంచి కుటుంబం ఉండగా మళ్లీ పెళ్లి ఎందుకనేగా మీరు ఆలోచిస్తుంది.. అక్కడే వస్తున్నాం.. షౌకత్‌కు 5వ పెళ్లికి ముందే తన ఎనిమిది మంది అమ్మాయిలు, ఏకైక కుమారుడికి పెళ్లిళ్లు అయిపోయాయి.అయితే మిగిలిన ఇద్దరు పెళ్లికాని కుమార్తెలు తండ్రి ఒంటరిగా ఉండకూడదని భావించి మరో పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలని పట్టుబట్టారు.  షౌకత్‌ తన ఇద్దరు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేశాడు. అదే సమయంలోనే తాను కూడా 5వ పెళ్లి చేసుకున్నాడు.

షౌకత్‌కు అయిదో భార్యగా వచ్చిన మహిళ సైతం ఈ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పెద్ద కుటుంబంలో చేరినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. కాగా  2021 మార్చిలో ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో షౌకత్‌ లైఫ్‌ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్లాంలో బహు భార్యాత్వం, బహుళ వివాహాలలకు అనుమతి ఉంది. కానీ అది తప్పనిసరి కాదు.
చదవండి: ఉక్రెయిన్‌ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement