Najibullah Zadran retired hurt as Ihsanullah's fierce delivery leaves him bleeding - Sakshi
Sakshi News home page

AFG vs PAK: పాకిస్తాన్‌ బౌలర్‌ రాకాసి బౌన్సర్‌.. దెబ్బకు రక్తం వచ్చేసింది! వీడియో వైరల్‌

Published Tue, Mar 28 2023 11:22 AM | Last Updated on Tue, Mar 28 2023 1:21 PM

Najibullah Zadran retired hurt as Ihsanullahs fierce bouncer - Sakshi

షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ నజీబుల్లా జద్రాన్‌ పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్‌ ఇహ్సానుల్లా వేసిన ఓ బౌన్సర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని జద్రాన్‌ దవడ కింది బాగానికి బలంగా తాకింది. బంతి గట్టిగా తాకడంతో రక్తం కూడా కారింది.

దీంతో మైదానంలో నజీబుల్లా తీవ్రమైన నొప్పితో మైదానంలో విలావిల్లాడు. వెంటనే ఫిజియో వెంటనే వచ్చి చికిత్స అందించినప్పటికీ అతడికి నొప్పి తగ్గలేదు. దీంతో అతడు మైదానం విడిచిపెట్టాడు. కాగా జద్రాన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక గాయపడిన జద్రాన్‌ స్థానంలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అజ్మతుల్లా 20 బంతుల్లో 2 పోర్లు, ఒక​ సిక్సర్‌ సాయంతో 21 పరుగులు చేశాడు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్‌ సొంతం చేసుకుంది. కాగా ఆఫ్గాన్‌కు పాక్‌పై ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం.

చదవండి: AFG vs PAK: రషీద్‌ ఖాన్‌ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement