‘సాక్షి’ఎరీనావన్‌కు విశేష స్పందన
‘సాక్షి’ఎరీనావన్‌కు విశేష స్పందన
Published Sun, Feb 19 2017 9:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
– ప్రశాంతంగా ముగిసిన మొదటి రౌండు పరీక్షలు
– చెస్, పెయింటింగ్, సింగింగ్‌తో సహా ఆరు విభాగాల్లో పోటీలు
– అద్భుతాలు ఆవిష్కరించిన చిన్నారులు
– రెండు, మూడు రోజుల్లో ఫలితాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెస్, హ్యాండ్ రైటింగ్, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్, సింగింగ్, ఇన్‌స్ట్రూమెంట్స్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. మొదటి రౌండు పోటీలకు రిడ్జ్, సెయింట్ జోసెఫ్, భాష్యం తదితర పాఠశాలల నుంచి 126 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 90 మంది హాజరయ్యారు. వీటి ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు తెలియజేస్తామని సాక్షి యూనిట్ మేనేజర్ కిరణ్ తెలిపారు.
మెదడుకు పదను పెట్టించిన చెస్...
చెస్ పిల్లల మెదడుకు పదును పెట్టించింది. మొత్తం 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 28 మంది చెస్ ఆడారు. వీరికోసం 14 టేబుళ్లలో మొదటి రౌండు చెస్‌ను నిర్వహించారు.
అందమైన చేతిరాత మా సొంతం...
ఉత్తమ మార్కులు రావాలంటే కష్టపడి చదవడంతోపాటు మంచిచేతిరాత ఉండాలి. అప్పుడే మార్కులు సొంతమవుతాయి. హ్యాండ్‌రైటింగ్ విభాగంలో 29 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 17 మంది హాజరై అందమైన చేతిరాతను ప్రదర్శించారు.
పెయింటింగ్, పోస్టర్ మేకింగ్...
బొమ్మను గిస్తే నీలా ఉంటుంది..అంటూ ఓ కవి అన్న మాటలను సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్‌లో విద్యార్థులు నిజం చేశారు. అందమైన బొమ్మలను గీసి పెయింటింగ్ వేసి తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు. పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ విభాగాల్లో 49 మందికి 29 మంది హాజరై తమలోని చిత్రకళను ప్రదర్శించారు.
నేను పాడితే లోకం ఆడదా....
సింగింగ్, ఇన్సూ్ర్టమెంట్స్ విభాగాల్లో 27 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 16 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. నేను పాడితే లోకం ఆడదా అన్న రీతిలో 12 మంది చిన్నారులు పాటలు పాడగా, నలుగురు గీటారు, వయోలిన్, హార్మోని వాయించారు.
Advertisement