న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్‌బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment