న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది.
► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.
► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది.
► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది.
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
Published Thu, Jun 29 2023 5:05 AM | Last Updated on Thu, Jun 29 2023 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment