Tata Motors chairman
-
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది. ► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది. -
టాటా మోటార్స్‌కు కొత్త చైర్మన్
న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్‌గా ఎంపికైన ఎన్ చంద్రశేఖరన్, గ్రూప్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నటరాజన్ చంద్రశేకరన్ను అడిషినల్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా ఎంపికచేసినట్టు కంపెనీ ప్రకటించింది. వెంటనే ఆయన కంపెనీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించిన వారంలోనే టాటా మోటార్స్ కూడా చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా ఎంపికచేసేసింది. రెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్‌గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టాటా-మిస్త్రీ బోర్డు వార్ అనంతరం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కంపెనీలు కూడా మిస్త్రీపై వేటువేశాయి. 150 ఏళ్ల టాటా గ్రూప్‌కు మొదటి నాన్-పార్సీ చైర్మన్ చంద్రశేఖరనే. ఫిబ్రవరి 21న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా మోటార్స్ చైర్మన్‌గా ఎంపికైన ఈయన రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టు నానో కారుపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. భావోద్వేగ కారణాలతో నష్టాల్లో ఉన్న నానో ప్రాజెక్టును టాటా మోటార్స్ మూసివేయడం లేదని మిస్త్రీ ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
అందరికన్నా ముందుండాలి
♦ చురుగ్గా అవకాశాలు అందిపుచ్చుకోవాలి ♦ గ్రూప్ సంస్థల ఉద్యోగులకు ♦ టాటా’ చైర్మన్ సైరస్ మిస్త్రీ లేఖ న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మార్కెట్ లీడరుగా స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రూప్ కంపెనీలు సంస్థాగతంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత చురుగ్గా వ్యవహరించాలని చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించారు. అమెరికాలో రికవరీ, ఆసియా.. ఆఫ్రికా ఖండాల్లో వృద్ధి మెరుగుపడుతుండటం, చైనా ఎకానమీలో మార్పులు చోటు చేసుకుంటుండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల్లోని దాదాపు ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యాపార అవకాశాలను నిరంతరం దక్కించుకోవాలంటే టాటా కంపెనీలన్నీ కొంగొత్త టెక్నాలజీలను (ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో) అందిపుచ్చుకోవాలని, వివిధ విభాగాల మధ్య వ్యత్యాసాలు తగ్గించి మరింత సమష్టిగా కృషి చేయాలని మిస్త్రీ సూచించారు. చైనా ఎకానమీలో చోటు చేసుకుంటున్న మార్పులు పలు దేశాలపై ప్రభావాలు చూపుతున్నాయని, ఈ క్రమంలో తెరపైకి వచ్చే కొత్త వ్యాపారావకాశాలను గుర్తించి, దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సర కాలం గ్రూప్ కంపెనీల శక్తిసామర్థ్యాలను పరీక్షించేదిగాను, అదే సమయంలో కొత్త వ్యాపార మార్గాలను చూపించేదిగా ఉండబోతోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వ స్థాయిని నిలబెట్టుకోవాలంటే గ్రూప్ కంపెనీలు వ్యూహాత్మకంగానూ, సంస్థాగతంగానూ చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వివిధ దేశాల్లో కార్యకలాపాలు ఉన్న గ్రూప్ కంపెనీలు.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఇతోధికంగా తోడ్పాటు అందించాలని సూచించారు.