interest rates increases
-
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
సుకన్య సమృద్ధి పథకంలో మరింత రాబడి
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు. -
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది. ► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది. -
2022లో డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు ► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్‌లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► లిక్విడ్ ఫండ్స్‌లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి. ► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ► డెట్ ఫండ్స్‌కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్‌లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు. -
పసిడితో ఇప్పుడు ఇబ్బందే
అమెరికా వడ్డీరేట్ల పెంపు ఎఫెక్ట్ ముంబై/న్యూయార్క్: పసిడికి ఇప్పుడు గడ్డు స్థితేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తక్షణం అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెంపు ఒక కారణంకాగా, వచ్చే మూడు సంవత్సరాలు కూడా మూడు దఫాల చొప్పున రేటు పెంపు అవకాశం ఉందన్న ప్రకటన దీర్ఘకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. వచ్చే కొద్ది నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఫిబ్రవరి స్థాయికి అంటే దాదాపు 1,050 డాలర్ల స్థాయికి పతనం కావచ్చని కొందరి అంచనా. వడ్డీరేట్ల పెంపు, డాలర్ మరింత బలపడుతుందన్న భయాలతో పెట్టుబడులు క్రమంగా పసిడిని వీడవచ్చని పలువురు భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల అనంతరం పసిడి ధర ఇప్పటికి దాదాపు 11 శాతం పడిపోయింది. జూలైలో పసిడి 1,375 డాలర్ల స్థాయిని చూసింది. శుక్రవారం 1,136 డాలర్ల వద్ద ముగిసింది. వార్షికంగా చూస్తే... ఇంకా దాదాపు పసిడి ధర దాదాపు 74 డాలర్లు లాభంలో ఉంది. ఈ నెలలో ఈ లాభం కూడా కరిగిపోయి వార్షిక నష్టంలో పసిడి ధర ముగిస్తే... వరుసగా నాలుగేళ్లగా ఇటువంటి పరిస్థితి రికార్డవుతుంది. అలా జరిగితే, 1988–1992 తరువాత ఇలాంటి రికార్డు నమోదు ఇదే తొలిసారి అవుతుంది. వారం వారీగా చూస్తే...: ఇక పసిడి ధర వారం వారీగా అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే– దాదాపు 24 డాలర్లు తగ్గి 1,137 డాలర్ల వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్‌ను చూస్తే– 99.9, 99.5 ప్యూరిటీ ధర రూ.685 (2.43 శాతం) తగ్గి రూ. 27,500, రూ.27,350 వద్ద ముగిశాయి. వెండి కేజీ (.999 ఫైన్) ధర భారీగా రూ. 1,710 (4 శాతం) తగ్గి రూ.39,855 వద్ద ముగిసింది.