International economic power
-
గ్లోబల్ ఎకానమీపై వడ్డీరేట్ల పెరుగుదల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఎకానమీ వృద్ధిపై వచ్చే యేడాది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లకు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2022–23కు సంబంధించిన వార్షిక నివేదికలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి కీలక వ్యాసం రాశారు. వడ్డీరేట్ల పెరుగుదల బ్యాంకింగ్ రంగంపై కనపడని ప్రభావం చూపవచ్చని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆయన సందేశంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీని కట్టడికి వడ్డీరేట్ల పెంపుదలకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం మనం చూశాం. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే అంశం బ్యాంకింగ్ రంగంపై కొంత ఒత్తిడిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ► ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, మహమ్మారి సవాళ్లు, సైనిక సంఘర్షణలు, పెరుగుతున్న అసమానతలు, సప్లై చైన్ సవాళ్లు వంటి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థలు అలాగే సమాజాలలో నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ► మరోవైపు డిజిటల్ ట్రాన్సిషన్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ ప్రధాన స్రవంతి అవుతున్నాయి. సంస్థ విషయానికి వస్తే, టాటా గ్రూప్ పటిష్ట వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది. టాటా మోటార్స్ అనేక సవాళ్లను అధిగమించి పటిష్ట స్థానానికి వెళ్లడం ప్రారంభించింది. ► రాబోయే సంవత్సరం సంస్థకు చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులో మనం గరి్వంచే పనితీరుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇందుకు సంబంధించి సాంకేతిక పురోగతి చోటుచేసుకోనుంది. -
భారత్ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్ మార్కెట్ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్ మార్కెట్లలో నియంత్రణాపరమైన మార్పులు భారత్ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్ఏ అసిసెంట్ వైస్‌ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ దీపక్ జట్వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సవాళ్లు ఉన్నప్పటికీ, ఐటీ రంగం అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’గానే ఉంచడం జరుగుతోంది. పలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం. ► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇ న్సూరెన్స్) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే. ► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది. ► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్ విభాగంలో ఈ సమస్య ఉంది. -
స్టార్టప్‌లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు. అన్ని విభాగాల్లోనూ క్షీణత.. ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది. ఒక్కో డీల్ 4-5 డాలర్లు.. సెప్టెంబర్ క్వార్టర్లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. -
పెట్టుబడులకు భారత్ బెస్ట్..!
బ్రెజిలియా: పెట్టుబడులు పెట్టేందుకు భారత్.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. ‘2024 నాటికి భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లకి‡్ష్యంచుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి. అందుకని భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి. అపరిమిత అవకాశాలు అందిపుచ్చుకోండి’ అని కార్పొరేట్లను ఆయన ఆహ్వానించారు. బ్రిక్స్ కూటమి బిజినెస్ ఫోరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అయిదు సభ్య దేశాల బ్రిక్స్ కూటమి మాత్రం ఆర్థిక వృద్ధికి సారథ్యం వహిస్తోందని ఆయన చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్ దేశాలదే. అంత ర్జాతీయంగా మందగమనం ఉన్నా బ్రిక్స్ దేశాలు వృద్ధి నమోదు చేయడంతో పాటు కోట్ల మందిని పేదరికం నుంచి బైటికి తెచ్చాయి. కొంగొత్త సాంకేతిక ఆవిష్కరణలు చేశాయి’ అని మోదీ చెప్పారు. బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశాయి. భవిష్యత్ ప్రణాళిక అవసరం... బ్రిక్స్ కూటమి ఏర్పాటై పదేళ్లయిన నేపథ్యంలో భవిష్యత్తు కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మోదీ సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలన్నారు. సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. ‘ఒక దేశానికి టెక్నా లజీ ఉండొచ్చు. మరో దేశం ముడివనరులు సరఫరా చేస్తుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనా లు, డిజిటల్ టెక్నాలజీ, ఎరువులు, వ్యవసాయోత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్.. పరస్పరం సహకరించుకునేందుకు ఇలాంటి అనువైన రంగాలెన్నో ఉన్నాయి. వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఇలాంటివి కనీసం 5 రంగాలైనా గు ర్తించి, జాయింట్ వెంచర్స్‌కి అవకాశాలను అధ్యయనం చేయాలి’ అని చెప్పారు. -
ఆర్థిక బలిమి.. అట్నుంచి ఇటు
- పశ్చిమం నుంచి తూర్పునకు ఆర్థిక శక్తి - టాప్-100 ఆర్థిక నగరాల్లో 49 చైనాలోనే - అమెరికాలో మాత్రం కేవలం 12 - బ్రూకింగ్స్ మెట్రో మానిటర్ సూచీ వెల్లడి న్యూయార్క్: ‘‘అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఇన్నాళ్ళూ నిలిచిన పశ్చిమదేశాలిపుడు వెనకబడుతున్నాయి. ఆర్థిక బలిమి పశ్చి మం నుంచి తూర్పు, దక్షిణానికి తరలుతోంది’’ ఇదీ... ప్రసిద్ధ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ చెబుతున్న మాట. ఈ సంస్థ వెలువరించిన ఆసియా-పసిఫిక్ మెట్రో మానిటర్ సూచీ ప్రకారం... అమెరికా పశ్చిమతీరంలోని వాంకూవర్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు ఆక్లాండ్‌లోని లిమా, ఇండోనేషియా రాజధాని జకార్తా, చైనా శక్తి కేంద్రాలు షాంగై, హాంకాంగ్, జపాన్ రాజధాని టోక్యో వంటి 100 నగరాల జీడీపీ... 22 ట్రిలియన్ డాలర్లు. మొత్తం ప్రపంచ జీడీపీలో ఇది ఏకంగా 20 శాతం!!. ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ టాప్-100 శక్తిమంతమైన ఆర్థిక నగరాల్లో దాదాపు సగం... అంటే 49 వరకూ కేవలం చైనాలోనే ఉన్నాయి. వీటిలో 19 నగరాలు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లలో ఉండగా, అమెరికాలో 12 ఉన్నాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాల్లో తలా 7 నగరాలుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 6 నగరాలున్నాయి. ‘‘ఆసియా-పసిఫిక్ మెట్రో మానిటర్ చెబుతున్నదేమిటంటే ఆసియా దేశాలు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దిశగా కదులుతున్నాయి. దీంతో ఆర్థిక శక్తి తూర్పు, దక్షిణ దేశాలకు తరలుతోంది. ఫలితంగా ఇక్కడి మెట్రో నగరాలు ఆసియా- పసిఫిక్ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగా, వాణిజ్య, పెట్టుబడుల కేంద్రాలుగా మారుతున్నాయి’’ అని నివేదిక వెల్లడించింది. అంతేకాదు. ఈ 100 నగరాలకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ప్రపంచ జీడీపీలో 20 శాతం వీటిదే కాగా... 2014లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో 29 శాతం వీటిదే. ఇక ఈ 100 నగరాలూ గనక ఒకే దేశంలో ఉంటే అది 22 ట్రిలియన్ డాలర్లతో ఈ భూమ్మీద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇక జీడీపీ తలసరి వృద్ధిలో మాత్రం చైనా నగరాలదే ముందంజ. అలాగని ఒక్క ఆసియా మాత్రమే కాదు. పోర్ట్లాండ్, శాన్‌జోస్, సీటెల్ వంటి నగరాలు సైతం 2014 జీడీపీ వృద్ధిలో వాటి జాతీయ సగటును దాటేశాయి.