Srivastava
-
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
Pragati Srivastava: పెదకాపు హీరోయిన్ ఎంత ముద్దుగా ఉందో (ఫొటోలు)
-
ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది!
నిజం చెప్పాలంటే, శ్లోక్ శ్రీవాస్తవ ఇంతలా ఎప్పుడూ కృంగిపోలేదు. దిల్లీలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవాస్తవకు ఐఐటీ,దిల్లీలో సీటు రాకపోవడం శరాఘాతంలా పరిణమించింది. తల్లిదండ్రులు ఏమీ అనకపోయినా, ధైర్యం చెప్పినా తనలో అంతులేని బాధ. అలా రెండు నెలలు...దుఃఖమయ సమయం. Forbes India 30 Under 30 in 2022: తనను తాను చీకటిగుహలో నుంచి వెలుగు వాకిట్లోకి తీసుకురావడానికి విజేతల ఆత్మకథలు చదవడం మొదలు పెట్టాడు. వాళ్లెవరూ పుట్టు విజేతలు కాదు. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు. విజేతలకు సంబంధించి రకరకాల పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు... ‘నీ లక్ష్యం మీద నీకు స్పష్టత ఉంటే నీ దగ్గరకు విజయం...నడిచిరావడం కాదు పరుగెత్తుకు వస్తుంది’ అనే వాక్యం తనకు బాగా నచ్చింది. ఆ సమయంలో ఆలోచించాడు ‘అసలు నా లక్ష్యం ఏమిటీ?’ అని. ఆ విషయంపై తాను ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అభిరుచి నుంచి లక్ష్యం పుడుతుంది...అంటారు. తన అభిరుచి విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తనకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ వీడియోలు రూపొందించడం అంటే ఇష్టం. వీటిలో ఏముంది ప్రత్యేకత? ప్రత్యేకత ఆవిష్కరించడమే కదా విజేత పని! ∙∙ చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో శ్లోక్కు అడ్మిషన్ దొరికింది. యూనివర్శిటీలో ఉన్న కాలంలో...ఒకవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు డిజైన్, థియేటర్, కోర్స్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్లను పరిచయం చేయడానికి ‘టెక్ బర్నర్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. గ్యాడ్జెట్ల పరిచయం వ్యాపార ప్రకటనల్లా కాకుండా...ఎంటర్టైనింగ్, స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో పరిచయం చేసేవాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయకుండా పూర్తిస్థాయిలో సమయాన్ని చానల్‌కు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది వారి కుటుంబసభ్యులకు నచ్చలేదు. సర్దిచెప్పాడు. కెమెరా ముందు ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? నాణ్యమైన వీడియోలు ఎలా రూపొందించాలి....మొదలైన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాడు. చానల్ సూపర్‌డూపర్ హిట్ అయింది! ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది. ఈ ఉత్సాహంలో రెండు వెబ్సైట్లు, బర్నర్ మీడియా బ్యానర్‌పై ఆన్లైన్ అప్లికేషన్లు లాంచ్ చేశాడు. ‘టెక్ బర్నర్’ అనేది అతడి పేరుకు ప్రత్యామ్నాయం అయింది. ఈ పేరుతోనే అతడిని పిలుస్తుంటారు. ‘ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు...రిస్క్ చేస్తున్నావు అని ఎంతోమంది హెచ్చరించారు. రిస్క్ అని వెనక్కి తగ్గితే ఏమీ చేయలేము అనే విషయం తెలుసు. దీనికి కారణం నేను చేస్తున్న పనిపై నాకు ఉన్న సంపూర్ణ నమ్మకం. బరిలో మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే నాకు ఒక నమ్మకం... నాకంటూ ఎక్కడో ఒకచోట స్థానం ఉంటుందని. దానికోసం వెదికాను. విజయం సాధించాను’ అంటున్న శ్లోక్ శ్రీవాస్తవ ‘ఫోర్బ్స్’ ఇండియన్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
ఆత్మస్థైర్యం.. అక్షరం నేర్చిన పాదం
అల్లంత దూరన సన్నని తీగపై అటు ఇటూ పట్టు తప్పకుండా నడుస్తున్న పాదాలు.. తీగపై నడక ఆగిపోగానే డబ్బులు ఏరుకుంటున్న ఆటగాళ్లను చూసి ఆమె ఓ కల కన్నది. ‘నాకు రెండు చేతులు లేకపోతేనేం... పాదమే చేయిగా మారదా’ అనుకుంది. పట్టుబట్టింది. సాధన చేసింది. పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో ఉంటున్న కామిని శ్రీవాస్తవ. కాళ్లతో రాయడం మొదలుపెట్టినప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను మెచ్చుకుంది. జీవితాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటో చూపాక ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ అందుకుంది కామిని శ్రీవాస్తవ. నాలుగేళ్ల వయసులో రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న శ్రీవాస్తవకు ముందున్న జీవితం గురించి ఆప్పుడేమీ తెలియదు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. తల్లిదండ్రికి గారాబు తనయ. తండ్రి రైల్వేలో డ్రైవర్. ఓ రోజు మారాం చేస్తే తనతో పాటు డ్యూటీకి తీసుకెళ్లాడు. కానీ, అనుకోకుండా అక్కడ జరిగిన ప్రమాదంలో రెండు చేతులు, ఎడమపాదం ఐదు వేళ్లూ తెగిపోయాయి. అయితేనేం మొక్కవోని ఆమె ధైర్యం ఉన్నతశిఖరాలను చేర్చిన విధానం ఇలా వివరిస్తుంది.. ‘‘ఆ సమయంలో జీవితం ఏంటి అనే పెద్ద విషయాలు ఏమీ తెలియవు. కానీ, అందరిమాదిరిగా నాకు చేతులు లేవు. ఏ పనీ చేయలేకపోతున్నాను. నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు ఇదే బాధ. చేతులు లేకుంటే ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడాల్సిందే. కొన్నాళ్లు డిప్రెషన్ నన్ను కమ్మేసింది. ఎవరితోనూ మాట్లాడకుండా రోజుల తరబడి గడిపాను. ఆలోచనలో పడేసిన సందర్భాలు.. ఓ రోజు మార్కెట్‌కు వెళుతున్నప్పుడు ఒక దగ్గర రెండు పోల్స్‌పైన కట్టిన సన్నని తీగపై ఒక అమ్మాయి అటూ ఇటూ నడవడం చూశా. చుట్టూ జనాలు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ‘కాళ్లు అంత శక్తిమంతమైనవా!’ అనుకున్నాను. అదే విషయం మా నాన్నను అడిగాను. మా నాన్న ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్. అతను కూడా సన్నని తాడు మీద నడిచి చూపించాడు. సంకల్పం ఉంటే ఏమైనా చేయచ్చు అని కళ్లకు కట్టాడు. అప్పటి నుంచి కాళ్లతో పనులు చేయడం నేర్చుకున్నాను. అక్షరాలు రాయడం సాధన చేశాను. ఈ విషయంలో ఒక పోరాటయోధురాలిగా మారిపోయాను. చేతులు మినహా నా శరీరం అంతా బాగుందని నేను అంగీకరించాను. అసలు చేతులు అనేవి పుట్టుకతోనే లేకపోతే... అనే ఆలోచన వచ్చాక ఏ పనైనా అవలీలగా చేయగలను అనిపించింది. పనిలో పదోన్నతులు.. డిగ్రీ చేశాక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టాను. అందులో.. చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ నూట్రిషన్ విభాగంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆ విభాగంలోనే మరికొన్నాళ్లకు ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఉద్యోగంతో పాటు ఎకనామిక్స్, సోషియాలజీలో ఎంఏ చేశాను. ఇందిరా మహిళా సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ స్కీమ్ కింద అధ్యయన బృందంలో సభ్యురాలిగా ఇండోనేషియాకు వెళ్లొచ్చాను. కుటుంబం.. అవార్డులు.. నాకు అడుగడుగునా అండగా నిలిచే భర్త లభించాడు. ఇరవై ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఉమ్మడి కుటుంబంలోనే మా జీవనం ఆనందంగా సాగిపోయింది. అత్తమామలు, ఆడపడచులు.. అందరూ నన్ను బాగాచూసుకున్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నా రచనలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం చేయబడ్డాయి. అనేక వార్తాపత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను. కవితా సంకలనాలు రాశాను. వాటిలో ‘ఖిల్తే ఫూల్ మెహక్తా అంగన్’, ‘డోర్’ కథా సంకలనం, భారతరత్న ఇందిర, అస్మాప్త రహీన్’నవలలు ప్రచురించబడ్డాయి. ఎన్నో సత్కారాలు అందుకున్నాను. నా ఉద్యోగం, అభిరుచి రెండింటికీ సమాన ప్రాముఖ్యతను ఇచ్చాను. దీని ఫలితంగా 1994లో మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మచే జాతీయ అవార్డు, ఆ తర్వాత ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. సాహిత్యరంగంలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. నా పట్టుదల, శ్రమ అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని అనేవారు. నమ్మకమే మనం.. ఈ రోజు నేను ఈ దశకు చేరుకున్నాన ంటే నా చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయసహకారాల వల్లనే అనుకుంటాను. ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాసి, ప్రచురించాను. ప్రతిరోజూ నా రచనను సోషల్ మీడియా మాధ్యమంగా పంచుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడు వికలాంగురాలిని అనుకోలేద’’ని ఒక్కో మెట్టును అధిగమించిన విధానాన్ని కళ్లకు కడతారు శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడూ వికలాంగురాలిని అనుకోలేదు – శ్రీవాస్తవ -
పదేళ్ల తర్వాత అమ్మ ఒడికి
సాక్షి,హైదరాబాద్: మానసిక స్థితి సరిగాలేని ఓ బాలుడు ఏడేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆ బాలుడిని పోలీసులు చేరదీసి చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. పదేళ్లు అక్కడే గడిపిన ఆ బాలుడు తెలంగాణ పోలీసుల సాయంతో అమ్మ ఒడికి చేరాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా కొత్వాలీకి చెందిన శ్రీవాత్సవకు చిన్నతనంలో మానసిక సమస్యలున్నాయి. 2010 అక్టోబర్ 10న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. అదే నెల 21న పశ్చిమబెంగాల్లోని హుగ్లీ పోలీసులు అతన్ని చేరదీశారు. అనంతరం హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. గుర్తించిన ‘దర్పణ్’ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ‘దర్పణ్’ యాప్ ను తెలంగాణ సేఫ్టీ వింగ్ అభివృద్ధి చేశారు. తప్పిపోయిన, ఆశ్రమాల్లో ఉన్న పిల్లల ఫొటోలను దీంతో పోల్చిచూస్తారు. శ్రీవాత్సవ చిన్ననాటి ఫొటోతో హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న బాలుడి ముఖకవళికలు ఒకేలా ఉన్నాయని యాప్ గుర్తించింది. సేఫ్టీ వింగ్ పోలీసులు శ్రీవాత్సవ తల్లిదండ్రులు, హుగ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న శ్రీవాత్సవను అతని తండ్రికి అధికారులు అప్పగించారు. -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
కరోనా కట్టడి చర్యలపై ఐఎంసీటీ సంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ఇక్కడి కట్టడి చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు. గురువారం కరోనా తాజాస్థితి వివరాలు తెలిపారు. ఇందులో భా గంగా హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐఎంసీటీ బృందం ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, మార్కెట్లను సందర్శించింది. టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్లు తగినన్ని ఉన్నాయని ఈ బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డు ద్వారా పేషెంట్ల రాక నుంచి డిశ్చార్జి వరకు పర్యవేక్షిస్తోందని తెలిపింది. స్టేట్ నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించింది. రోజుకు 300 టెస్టులు జరిపే సామర్థ్యం ఈ ఆస్పత్రి లేబొరేటరీకి ఉంది. చికిత్స అందిన తర్వాత పేషెంట్‌ను ఇంటి వద్దకు వాహనంలో పంపిస్తోంది. 14 రోజుల పాటు మొబైల్ ద్వారా వారిని పర్యవేక్షిస్తున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా అన్నిరకాల ప్రామాణిక నిబంధనలు పాటిస్తున్నారు. శాంపిల్ సేకరణ వసతి ఉంది. ఆస్పత్రిలో పీపీఈ కిట్ల డానింగ్, డాఫింగ్ ఏరియాలను వేర్వేరుగా దూరంగా ఉంచాలని బృందం ఆస్పత్రికి సూచించింది. పేషెంట్లకు, సిబ్బం దికి వేర్వేరు కారిడార్లు కేటాయించాలని సూచించింది. హుమాయున్‌నగర్ కంటైన్మెంట్ కేంద్రాన్ని కూడా టీం పరిశీలించింది. క్వారంటైన్ కేంద్రాన్ని, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను కూడా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఔషధాల సరఫరా పర్యవేక్షణ ఉన్నట్లు బృందం గ్రహించింది. షెల్టర్ హోంను కూడా సందర్శించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్ క్యాంటీన్లు, నైట్ షెల్టర్లు, అనాథాశ్రమాల ద్వారా భోజన వసతి ఏర్పాట్లు, లాక్డౌన్ నిబంధనలు అమలు, సామాజిక దూరం పాటించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని భవన నిర్మాణాల వద్ద కార్మికులు మాస్కుల్లేకుండా పనిచేయడం చూసి దానిపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది’అని శ్రీవాస్తవ వివరించారు. కాగా, తెలంగాణలో కేసుల రెట్టింపు రేటు 40 రోజులకు పైగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ సంయుక్త శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. -
పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..
న్యూఢిల్లీ: వారం ప్రారంభంలో అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు శుక్రవారం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి, నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు విధులకు వెళ్లడం ప్రారంభించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా భద్రతాదళాలు అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘాను పెట్టాయి. మసీదుల్లో మౌల్వీలు శాంతి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయితే, చెత్త, వ్యర్థ వస్తువులను ఏరుకునేందుకు శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన తన తండ్రి తలపై గాయాలతో చనిపోయారని సల్మాన్ అన్సారీ అనే వ్యక్తి తెలిపారు. ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలు ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజాల్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అరెస్ట్ చేయడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారానికి 42కి చేరింది. వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఐపీఎస్ శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు అల్లర్ల సమయంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు శుక్రవారం అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా విధులు చేపట్టనున్నారు. అల్లర్లను గుర్తించడంలో, అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుత కమిషనర్ అమూల్య పట్నాయక్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘ప్రజల్లో భద్రతా భావాన్ని, మా కోసం పోలీసులున్నారనే ధైర్యాన్ని పాదుకొల్పడమే ప్రస్తుతం నా ప్రధాన బాధ్యత’ అని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో 331 శాంతి సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ కమిటీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పైనుంచి దూకేశాం ‘బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా ఇంట్లోకి జొరబడింది. నన్ను, నా ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. భయంతో దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశాం’ అని ఒక బాధిత మహిళ తెలిపింది. ఆమె ఒక ఎన్జీవోను నిర్వహిస్తున్నారు. ‘గాంధీ’లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి! అల్లర్ల తర్వాత తండ్రి ఆచూకీ తెలీకపోవడంతో తల్లితో కలసి ఢిల్లీలో ఓ ఆస్పత్రి మార్చురీ బయట వేచి ఉన్న బాలిక విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రాలపై కేసులను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌లపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ‘లాయర్స్ వాయిస్’ సంస్థ తమ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారించింది. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లలో తాము భాగస్వాములమవుతామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. సీబీఎస్సీ పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ప్రతిపక్షాల వల్లే అల్లర్లు: అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారమే ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. భువనేశ్వర్‌లో జరిగిన ర్యాలీలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఏఏ అమలుతో ముస్లింలు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం సాగించాయి. ప్రజలను రెచ్చగొట్టడం గొడవలకు దారితీసింది’ అని అన్నారు. సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు. పైపెచ్చు దీనితో మరికొందరికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం చారిత్రక నిర్ణయం. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, మమతా దీదీ అబద్ధాలు ప్రచారం చేశారు’ అని ఆరోపించారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి: విపక్షాల లేఖ ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతవాతావరణం నెలకొనేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని, విద్వేషాలను ప్రేరేపించేలా ప్రసంగించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసేతర ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను ప్రారంభించాలని, రక్షణ కల్పించడంతోపాటు నిత్యావసర సరుకులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పరిస్థితులపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, లోక్తాంత్రిక్ జనతా దళ్‌కు చెందిన శరద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్, ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి టీఆర్ బాలు, సీపీఐ నేత డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఆ లేఖపై సంతకాలు చేశారు. ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించా: మమతా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(ఈజెడ్‌సీ) సమావేశంలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈజెడ్‌సీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన రాలేదు. అవి సమావేశం ఎజెండాలో లేవు. ఢిల్లీలో ఘర్షణలను మాత్రం నేను ప్రస్తావించా. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం అందించాలని కోరా’ అని తెలిపారు. పేరు అడిగి.. కొట్టి చంపారు! ఉదయం చెత్త ఏరేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో తిరిగివచ్చి, అనంతరం చనిపోయిన ఘటన శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది. అయూబ్ షబ్బీర్ ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లోని నస్బంది కాలనీవాసి. రోజూ చెత్త, ఇతర వ్యర్థ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఆయన శుక్రవారం ఉదయం చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లాడని, సాయంత్రం కొందరు ఆయనను తలపై తీవ్ర గాయాలతో తీసుకువచ్చారని ఆయన కుమారుడు సల్మాన్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడన్నారు. ‘వెళ్లొద్దని చెప్పాను. అయినా వినలేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయి. సంపాదన లేకుండా ఎంతకాలం ఉంటాం? అని చెప్పి ఉదయమే బయటకు వెళ్లాడు’ అని సల్మాన్ వివరించాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొందరు పేరు, మతం అడిగి, ఆ తరువాత దారుణంగా కొట్టారని తన తండ్రి తనకు చెప్పాడని సల్మాన్ వివరించాడు. పోలీసులకు సమాచారమిచ్చానని, అయినా, వారు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సహకరించలేదని చెప్పారు. తాను దివ్యాంగుడినని, తండ్రి తప్ప తనకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ
-
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్: ఆర్.సి.శ్రీవాత్సవ
సాక్షి, హైదరాబాద్: ములుగు, జీడిమెట్లలో రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఉత్తరాఖండ్ ఉద్యాన సంచాలకుడు ఆర్సీ శ్రీవాత్సవ శనివారం సందర్శించారు. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నూతన సాంకేతిక పద్ధతిలో పెంచుతున్న మామిడి తోటలు, నాణ్యమైన కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను ఆయన పరిశీలించారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పాలీహౌజ్‌లో సాగు చేస్తున్న పంటలు, కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను సందర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అనుసరిస్తున్న సాగు విధానాలను శ్రీవాత్సవ అభినందించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధి కోసం ఉద్యాన శాఖ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్ ఎల్.వెంకట్ రాంరెడ్డి వివరించారు. పంట కాలనీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాఖండ్‌లో సాగులో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, నాణ్యమైన మొక్కల సరఫరా, పాలీహౌజ్ విధానంలో పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం తదితరాల అంశాలపై శ్రీవాత్సవ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. -
ప్రొటెక్షన్ ప్లాన్స్‌పైనే దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రధానంగా ప్రొటెక్షన్ ప్లాన్స్‌పై దృష్టి సారిస్తోంది. అలాగే, పూర్తి స్థాయి ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటోంది. టాటా ఏఐఏ చీఫ్ ఆఫ్ ప్రొప్రైటరీ చానల్స్ రిషి శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా సుమారు ఎనిమిది శాతం మందికి మాత్రమే బీమా కవరేజీ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వచ్చే పదేళ్లలో జీవిత బీమా విభాగంలో సేవింగ్స్ కూడా కలిపి ఉన్న పథకాలకన్నా.. ప్రొటెక్షన్ ప్లాన్స్‌కే మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మొత్తం పాలసీ జారీ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంపై తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం టాటా ఏఐఏ సుమారు ఆరు రకాల రైడర్స్‌తో 34 పైచిలుకు పథకాలు అందిస్తోందని తెలిపారు. ప్రీమియర్ ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు.. ఏజెన్సీలు, బ్యాంకులు తదితర మార్గాల్లో తమ పథకాలను విక్రయిస్తున్నప్పటికీ.. సొంతంగా ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. కంపెనీ ద్వారా శిక్షణ పొందిన ఈ ఫుల్‌టైమ్ ప్రీమియర్ ఏజెంట్స్.. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని ఆయన చెప్పారు. మిగతా ఏజెంట్లతో పోలిస్తే ప్రీమియర్ ఏజెంట్లలో అట్రిషన్ (ఉద్యోగుల వలస) చాలా తక్కువగా ఉండటం వల్ల సుదీర్ఘకాలం అటు పాలసీదారుకు ఇటు కంపెనీకీ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు ఈ తరహా ఏజెంట్స్ ఉండగా, మొత్తం ఏజెంట్స్ సంఖ్య 20,000 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 400 దాకా ఉంటుందన్నారు. -
‘యుగ్పురుష్ అటల్’ వస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్రపై ‘యుగ్పురుష్ అటల్’ పేరిట చిత్రం తీస్తున్నారు. సోమవారం నాడు ఆయన 93వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. స్పెక్ట్రమ్ మూవీస్‌కు చెందిన రాజీవ్ ధమీజా, అమిత్ జోషి, రంజీత్ శర్మలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాలా సచ్ చిత్రానికి దర్శకత్వం వహించిన మయాంక్ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. వాజపేయి పెంపుడు కూతురు నమితా, ఆమె భర్త రంజన్ భట్టాచార్య సహా వాజపేయి కుటుంబ సభ్యులందరి అనుమతితోనే ఈ సినిమాను నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్టును చేపట్టడంలో వాజపేయి మేనకోడలు మాలా తివారీ తమకు ఎంతో సహకరించారని దర్శకుడు శ్రీవాత్సవ తెలిపారు. వాజపేయి రాసిన ఓ కవిత ఆధారంగా ఆయన సినిమాకు ఓ పాటను బప్పీలహరి కంపోజ్ చేశారు. 1998 నుంచి 2004 మధ్య ఐదేళ్లపాటు పూర్తికాలంలో అధికారంలో కొనసాగిన కాంగ్రేసేతర వ్యక్తిగా రికార్డు సష్టించిన వాజపేయి తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విషయం తెల్సిందే. ఆయన తాను రాసిన కవిత్వాన్ని అప్పుడప్పుడు చదివి వినిపించిన సందర్భాలున్నాయనే విషయం తెల్సిందే. -
ఏపీకి 217.8, తెలంగాణకు 112.2 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో లభ్యత నీటిని బోర్డు శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతమున్న 330 టీఎంసీలలో... ఏపీకి 217.8 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 112.2 టీఎంసీలు (34 శాతం) కేటాయించింది. సుదీర్ఘంగా భేటీ ఇరు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించింది. నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ, రాష్ట్ర స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, సాగర్ సీఈ సునీల్, బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను బోర్డు ముందుంచాయి. తెలంగాణ 138.5 టీఎంసీలు ఇవ్వాలని కోరగా.. ఏపీ 270 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది. చిన్న నీటి వనరులపై రగడ భేటీ సందర్భంగా చిన్న నీటి వనరుల అంశాన్ని ఏపీ మరోసారి లేవనెత్తింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు చిన్ననీటి వనరుల కోసం 89.11 టీఎంసీల కేటాయింపు ఉందని.. దాన్ని పరిగణనలోకి తీసుకుని 70:30 నిష్పత్తిన నీటిని పంపిణీ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల కింద 13 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి బోర్డు కల్పించుకుని.. ఇరు రాష్ట్రాల అధికారులను సముదాయించింది. ఈ ఏడాది తెలంగాణ చెబుతున్న వినియోగ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ.. 66:34 నిష్పత్తిన నీటిని పంచుతామని స్పష్టం చేసింది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక చిన్ననీటి వనరుల లెక్కల వాస్తవ వినియోగాన్ని తేల్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) సహాయాన్ని తీసుకోవాలని భేటీలో నిర్ణయించారు. పట్టిసీమపై నిపుణుల కమిటీ గోదావరి నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీ చేపట్టిన పట్టిసీమ అంశాన్ని తెలంగాణ మరోమారు ప్రస్తావించింది. గతేడాది పట్టిసీమ కింద 53 టీఎంసీల వినియోగం జరిగిందని, ఈసారి అదే రీతిన వినియోగం జరుగుతోందని బోర్డు దృష్టికి తెచ్చింది. పట్టిసీమతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాపై తేల్చాలని పట్టుబట్టింది. అయితే ఈ అంశంపై తేల్చే అధికారం బోర్డుకు లేదని, కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 మాత్రమే తేల్చగలదని చైర్మన్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. అయితే అప్పటివరకు తాత్కాలికంగా ఈ అంశాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక శ్రీశైలం కింద ఏపీ నీటి వినియోగానికి, చెబుతున్న లెక్కలకు పొంతన లేదని.. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటికి, సాగర్‌కు చేరుతున్న జలాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. సాధారణంగా నీటి నష్టాలు 7 నుంచి 10 శాతం మాత్రమే ఉంటాయని.. కానీ ఇక్కడ 30 నుంచి 40 శాతంగా కనబడుతున్నాయని పేర్కొంది. దీనిపై బోర్డు స్పందిస్తూ.. నీటి నష్టాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, దీనిపై ఇరు రాష్ట్రాలు, బోర్డు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వర్కింగ్ మాన్యువల్‌పై భిన్నాభిప్రాయాలు కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తాము సూచిస్తున్న పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది వర్కింగ్ మాన్యువల్ రూపొందించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టుల నియంత్రణ వద్దని.. పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక టెలిమెట్రీ ఏర్పాటు మొదటి విడత ఇప్పటికే అమల్లో ఉందని.. రెండో విడత పరికరాల ఏర్పాటు త్వరితగతిన ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మాకు పక్షపాతమేం లేదు.. కృష్ణా బోర్డు భేటీ అనంతరం బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి కేటాయింపులపై చర్చలు జరిపామని, 66 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్, 34 శాతం నీటిని తెలంగాణ వినియోగించుకుంటాయని చెప్పారు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలో అవకతవకలు, ట్యాంపరింగ్ జరగలేదని.. అది అవగాహనా రాహిత్యమని పేర్కొన్నారు. తాము పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నామనడం సరికాదని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. -
పోలవరం ఆథారిటీలోకి శ్రీవాత్సవ
► కృష్ణా బోర్డు చైర్మన్‌ను సభ్యకార్యదర్శిగా నియమించిన కేంద్రం ► వివాదాస్పద నిర్ణయంపై మండిపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర జలవనరులశాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె. శ్రీవాత్సవను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం, పట్టిసీమ వాటాలపై న్యాయం కోసం ఓవైపు బోర్డు ముందు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉంచాల్సిన బోర్డు చైర్మన్‌ను, ఏపీ ప్రాజెక్టుకు సభ్య కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ మండిపడుతోంది. వివాదాలు ఉన్నాపట్టించుకోకుండానే... ప్రస్తుతం కృష్ణా జలాలకు సంబంధించి నీటి పంపిణీ, విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమెట్రీ వంటి అంశాలతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల తమకు దక్కే వాటాపై తేల్చాలని తెలంగాణ పట్టుబడుతోంది. పట్టిసీమ, పోలవరం ద్వారా మొత్తంగా 90 టీఎంసీల నీటి వాటాలు దక్కుతాయని, కనిష్టంగా 70 టీఎంసీలైనా రావాలని కోరుతోంది. గతేడాది ఏపీ పట్టిసీమ ద్వారా ఏకంగా 53 టీఎంసీల నీటిని తరలించగా ఇందులో తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కలేదు. ఈ ఏడాది సైతం 80 టీఎంసీలకుపైగా తరలించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మళ్లింపులతో దక్కే వాటాలపై కృష్ణా బోర్డు చైర్మన్ స్థాయిలో శ్రీవాత్సవ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు మళ్లింపు జలాలపై కేంద్రం ప్రత్యేకంగా నియమించిన ఏకే బజాజ్ కమిటీకి బోర్డు చైర్మన్ అందించే నివేదికలకు ప్రాధాన్యం ఉటుంది. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఉన్న వ్యక్తినే సభ్య కార్యదర్శిగా నియమించడం ఏమిటని తెలంగాణ నీటిపారుదల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోలవరం, పట్టిసీమలతో దక్కే వాటాల అంశంలో ఆయన ఎలా పారదర్శకంగా పని చేస్తారని అడుగుతున్నాయి. గతంలోనూ ఇంతే... గతంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్.కె. గుప్తాను కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆ సమయంలో గుప్తా పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న జలవనరులశాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ కేంద్రం ప్రస్తుతం మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం. -
శ్రీవాస్తవ ట్విట్టర్ నోస్ట్రడామస్
రామ్‌నాథ్ పేరును గతేడాదే చెప్పిన శ్రీవాస్తవ న్యూఢిల్లీ: ఊహించని విధంగా రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు, విద్యావంతుడైన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించి అధికార బీజేపీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఏడాది కిందటే ఈ పేరును ఊహించి చెప్పాడో క్విజ్ నిర్వాహకుడు. గత ఏడాది జూన్ 2న కాబోయే రాష్ట్రపతి ఎవరనే దానిపై ట్విట్టర్లో రాహుల్‌శర్మ అనే వ్యక్తి ఆన్లైన్ పోల్ నిర్వహించారు. దీనికి ప్రణబ్, అద్వాణీ సహా పలు పేర్లపై చర్చ జరిగింది. అయితే ఎవరూ ఊహించని, అసలు ప్రచారంలో లేని రామ్‌నాథ్ కోవింద్ పేరు చెప్పి ఆశ్చర్యపరిచారు క్విజ్ నిర్వాహకుడైన నితీష్ శ్రీవాస్తవ. ‘రామ్‌నాథ్ కోవింద్. దళితుడు.. విద్యావంతుడు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఈయన ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు’అని ట్వీట్ చేశారు శ్రీవాస్తవ. తెరపై లేని పేరును శ్రీవాస్తవ ప్రస్తావించడంపై నాడు నెటిజన్లు షాకయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అదే పేరును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన నెటిజన్లు శ్రీవాస్తవను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అతడిని ‘ట్విట్టర్ నోస్ట్రడామస్’గా ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక రామ్‌నాథ్ రాష్ట్రపతి అయితే... అతని అంచనా నూటికి నూరుశాతం నిజమైనట్టే! -
‘కోడ్ ఆఫ్ డిసిప్లేన్ సవరించాల్సిందే...
► నేడు హైదరాబాద్‌లో సీఎల్సీ వద్ద సమావేశం గోదావరిఖని : సింగరేణిలో అమలవుతున్న కోడ్ ఆఫ్ డిసిప్లీన్ లో మార్పులు తప్పనిసరిగా చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. గత నవంబర్ 26న డెప్యూటీ సీఎల్సీ శ్రీ వాస్తవ సమక్షంలో తొలి సమావేశం జరగగా శనివారం హైదరాబాద్‌లో సెంట్రల్ లేబర్ కమిషనర్ అనిల్‌కుమార్‌నాయక్ సమక్షంలో ద్వితీయ సమావేశం జరగనుంది. దేశంలో 1968లో సిమ్లాలో జరిగిన జాతీయ కార్మిక సంఘాల సమావేశంలో కోడ్ ఆఫ్ డిసీప్లీన్ ను రూపొందించారు. దాని ప్రకారం ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనైనా రెండేళ్ల కాలపరిమితికే ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ యూనియన్ అయినా గేట్ మీటింగ్‌లు, కార్మికుల నుంచి సభ్యత్వం సేకరించే వీలు కల్పించారు. ఆయా కంపెనీల్లో జరిగిన ఎన్నికల్లో 15 శాతం ఓట్లు సాధించిన కార్మిక సంఘానికి యాజమాన్యంతో రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. సింగరేణిలో మాత్రం 1998లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన సంఘంతో సంప్రదించకుండా యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లీన్ ను తయారుచేసి అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం గెలుపొందిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలే గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై గేట్‌మీటింగ్‌లు నిర్వహించాలని, గెలిచిన సంఘాలే కార్మికుల వద్ద నుంచి వార్షిక సభ్యత్వాన్ని సేకరించాలని, ఏ ఒప్పందం జరిగినా గుర్తింపు సంఘంతోనే చేయాలని తదితర నిర్ణయాలను కోడ్ ఆఫ్ డిసిప్లీన్లో పొందుపర్చారు. దీనివల్ల ఓడిపోయిన ఇతర కార్మిక సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. ఓడిపోయిన లేక ఇతర డివిజన్లలో ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన చాలా కార్మిక సంఘాలకు గనులపైకి వచ్చిన ప్రతీసారి యాజమాన్యం నుంచి పరాభవమే ఎదురైంది. గేట్లు మూసివేసి వెళ్లగొట్టిన సంఘటనలు, గేట్మీటింగ్లను వీడియోలు, ఫొటోలు తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. కార్మికుల వేతనాలు, ఇతర సౌకర్యాలు, అలవెన్స్ లకు సంబంధించి జేబీసీసీఐ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను కార్మికులకు చెప్పడానికి, ఆ నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయించేలా చర్చించడానికి జాతీయ కార్మిక సంఘాలకు వీలులేకుండా పోయింది. దీంతో కోడ్‌ఆఫ్ డిసిప్లీన్ లో మార్పులు చేయాలని సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు జాతీయ సంఘాలు మొరపెట్టుకున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తి కావడం, ఎన్నికలకు సంబంధించి అధికారిని నియమించకపోవడంతో ఆయాకార్మిక సంఘాలు కోడ్ ఆఫ్ డిసీప్లీన్ లో మార్పులు చేయాలని పట్టుబడుతున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఎన్నికలపై ఎంపీ కవిత కేంద్ర కార్మిక శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎన్నికల గురించి కార్మిక సంఘాలతో సెంట్రల్ లేబర్ కమిషనర్ చర్చించే అవకాశం ఉంది. -
హెచ్ సీయూలో రేపటి నుంచి తరగతులు
-
'అతడి ఆత్మహత్యకు నేను బాధ్యున్ని కాదు'
హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో విచారణ చేపడతామని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వేముల రోహిత్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం తమ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే రోహిత్ కుటుంబానికి రూ. 8 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును కోరామన్నారు. 2008లో విద్యార్థి సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తాను బాధ్యున్ని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ కూడా జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆయన కోరారు. ఆందోళనల కారణంగా స్కాలర్ షిప్ లు, ఫెలో షిప్ లు, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. -
హెచ్ సీయూలో రేపటి నుంచి తరగతులు
హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఆయన వెల్లడించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన దిగడంతో హెచ్ సీయూలో తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగింది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్ ల నిర్వహణకు హెచ్ సీయూ స్టూడెంట్ జేఏసీ గురువారం అంగీకరించింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు క్లాసుల బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
'చిక్కుముడులను పరిష్కరిస్తున్నా'
హైదరాబాద్: రైల్వే, జీహెచ్ ఎంసీ, వాటర్ బోర్డు మధ్య ఉన్న చిక్కుముడులను పరిష్కరిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రైల్వే, వాటర్ బోర్డు అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కరీంనగర్-పెద్దపల్లి రైల్వేలైనుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంఎంటీఎస్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పొడిగించే ఆలోచన ఉందని దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశలపై రైల్వే మంత్రి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఆర్వోబీ, ఆర్ యూబీలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జీహెచ్ ఎంసీ నుంచి అనుమతులు రావాల్సివుందన్నారు. -
త్వరలో రెండు భారీ రైల్వే టెర్మినళ్లు
వట్టినాగులపల్లి, మౌలాలీలో విస్తరణ భూమి కేటాయింపునకు సర్కార్ సంసిద్ధత ప్రతిపాదనల రూపకల్పనలో ద.మ.రైల్వే జనరల్ మేనే జర్ శ్రీవాస్తవ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో రెండు భారీ రైల్వే టెర్మినళ్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. మౌలాలి, వట్టినాగులపల్లిలో సకల సదుపాయాలతో విశాలమైన రైల్వేస్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలి పారు. గురువారం రైల్ నిలయంలో నూతన రైల్వే టైమ్ టేబుల్ ఆవిష్కరణ సందర్భంగావిలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు. సికింద్రాబాద్, నాం పల్లి, కాచిగూడ స్టేషన్లలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని వట్టినాగులపల్లి, మౌలాలీల్లో స్టేషన్ల ఏర్పాటుకు కావలసిన భూమిని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ టర్మినళ్ల పట్ల శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ మేరకు తాము ప్రస్తుతం ప్రతిపాదనలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ముంబయి మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు వట్టినాగులపల్లి, కాజీపేట్ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు మౌలాలీ ప్రధాన స్టేషన్లుగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ స్టేషన్ల నుంచి ప్రయాణికులు నగరంలోకి చేరుకొనేందుకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుపనున్నట్లు జీఎం తెలిపారు. ఏటా పెరుగుతున్న రైళ్లు... సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఏటా రైళ్ల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో వందకు పైగా ప్యాసింజర్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ రైళ్లు ఈ మూడు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవులు వంటి ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ రెట్టింపవుతోంది. మరోవైపు ఏటా 15 నుంచి 25 కొత్త రైళ్లు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి అనుగుణంగా స్టేషన్లను విస్తరించేందుకు అవకాశం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకల్లో గంటల కొద్దీ జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ఉదయం 5-6 గంటల మధ్య సికింద్రాబాద్ స్టేషన్‌కు రావలసినరైళ్లలో 80 శాతం గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా చేరుకోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మౌలాలీని విస్తరించాలని రైల్వేశాఖ ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. దీనివల్ల సికింద్రాబాద్ పైనే కా కుండా కాచిగూడ స్టేషన్ పైనా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రైల్వే బోర్డు పరిశీలనలో ‘కాజీపేట డివిజన్’
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటును ఢిల్లీ రైల్వే బోర్డు సమన్వయంతో ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త రైల్వే డివిజన్లు, కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు బోర్డు కమిటీ పరిశీలనలో ఉన్నాయన్నారు. కాజీపేట జంక్షన్ పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన రైల్వే డ్రైవర్ల కార్యాలయంలోని డ్రైవర్ల కౌన్సెలింగ్ కార్యాలయూన్ని ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ల కార్యాలయం లో తనిఖీ చేశారు. క్రూ కంట్రోల్లో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన విధివిధానాలైపై అధికారులను అభినందించారు. అక్కడి నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ ముందు డ్రైవర్ల విశ్రాంతి కార్యాలయమైన రన్నింగ్ రూంలోకి వెళ్లి డ్రైవర్ల సెంట్రలైజ్డ్ ఏసీ పడక గదులు, రీడింగ్‌రూం, డైనింగ్ హాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు జీఎం స్టేషన్ ప్లాట్‌ఫాంల తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లోని రైల్వే రెస్టారెంట్‌ను పరిశీలించి రోజువారీ అమ్మకాలపై ఆరా తీశారు. డీజిల్ లోకోషెడ్‌కు వెళ్లి అక్కడ మల్టీపుల్ యూనిట్ జంపర్ కేబుల్ సిస్టంను ప్రారంభించారు. డీజిల్ లోకోషెడ్ అభివృ ద్ధి, కార్మికుల సమస్యలను షెడ్ సీనియర్ డీఎంఈ లచ్చిరాం నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ నిర్వహణ, అభివృద్ధి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం తెలుసుకున్నా రు. ఆ తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ ముందు గల రన్నింగ్‌రూం కార్యాలయంలో శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడారు. కాజీపేటకు మంజూరైన ఫిట్‌లైన్ల నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ పరంగా లోపాలున్నాయని.. వాటిని పరిశీలిస్తున్న ట్లు తెలిపారు. రైల్వే బడ్జెట్లో మంజూరైన కాజీపేట నుంచి ముంబయి వరకు వెళ్లే వీక్లి ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ప్రవేశపెట్టేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాజీపేటకు మం జూరైన వ్యాగన్ షెడ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నివేదికను జిల్లా కలెక్టర్ రైల్వే శాఖకు ఇంకా అందజేయలేద ని చెప్పారు. రైల్వే శాఖకుు భూమి ఎప్పుడు అప్పగిస్తే అప్పు డు రైల్వేబోర్డు వ్యాగన్ నిర్మాణపనులను చేపట్టేందుకు సిద్ధం గా ఉందన్నారు. వ్యాగన్‌షెడ్ నిర్మాణంలో రాష్ట్ర ముఖ్యమం త్రి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్-నాగపూర్, హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పెరిగిన ట్రాఫిక్‌కు సరిపడా సిబ్బందిని నియమించేందుకు తగు చర్య లు తీసుకుంటున్నట్లు జీఎం వెల్లడించారు. సమావేశంలో జీఎం వెంట సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్కే.మిశ్రా, చీఫ్ మె కానికల్ ఇంజనీర్ ఖాదర్ హమ్మద్, సికింద్రాబాద్, కాజీపేటలోని రైల్వే విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. -
రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలవకుండా చూడండి: జీఎం
హైదరాబాద్: వానలు కురిసే సమయాల్లో ట్రాక్‌పై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ఆదేశించారు. వానాకాలం ముందస్తు జాగ్రత్తలపై బుధవారం ఆయన రైల్‌నిలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్వే ట్రాక్‌లపైకి, రైళ్లకు కరెంటును సరఫరా చేస్తున్న స్తంభాలపైకి చెట్ల కొమ్మలు చేరకుండా చూడాలన్నారు. వానాకాలంలో రైళ్ల భద్రత, సమయపాలనకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గడచిన రెండు నెలల్లో రైళ్ల రాకపోకల్లో జాప్యం, నమోదైన ప్రాంతాలపై దృష్టి సారించి కారణాలను విశ్లేషించాలని పేర్కొన్నారు. -
డబుల్ డెక్కర్ రైలు...వచ్చేస్తోంది!
ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న రైలు విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయం జిల్లా వాసులకు డబుల్ డెక్కర్ రైలు కల సాకారం కానుంది. ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో త్వరలో డబుల్ డెక్కర్ ప్రయాణం అవకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. సాక్షి, విజయవాడ : రెండంతస్తుల రైలు విజయవాడ రానుంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడ -గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ రైలును విజయవాడ - హైదరాబాద్ మధ్య తిప్పాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అది రూట్ మారింది. విజయవాడ నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించాలని తాజాగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి ఈ పొడిగింపు అమలులోకి వస్తుందన్న విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం రాలేదు. గురువారం జిల్లా పర్యటనకు వస్తున్న రైల్వే జీఎం శ్రీవాస్తవ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రైలు మంగళవారం, శుక్రవారం ఉదయం కాచిగూడలో 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. మళ్లీ 12.45కు గుంటూరులో బయలుదేరి 5.55 గంటలకు కాచిగూడ చేరుతుంది. దీన్ని విజయవాడకు పొడిగిస్తే తిరుగు ప్రయాణ వేళల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పూర్తిగా ఎయిర్‌కండీషన్డ్ రైలులో ప్రయాణించే అనుభూతి త్వరలోనే విజయవాడ వాసులకు సొంతం కానుంది. -
ఫిబ్రవరి 23న టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని/మంచిర్యాలసిటీ/కొత్తగూడెం, న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్)లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరు కు ఎట్టకేలకు తెరపడనుంది. నాయకుల వర్గపోరు కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తగిన న్యాయం చేసేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర కు మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించారు. ఫిబ్రవరి 23వ తేదీన గోదావరిఖని ఏరియాలో జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహించి అందులోనే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా యూనియన్ అంతర్గత ఎన్నికలు జరుపుకోవాలని కమిషనర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవులకు ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్వీకరించి, ఫిబ్రవరి 4వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకా శం కల్పించారు. ప్రచారం కోసం ఆ తర్వాత రోజు 15 రోజుల సమయం ఇచ్చారు. అయితే 15 రోజుల ప్రచారం తర్వాత ఫిబ్రవరి 19నాడే ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు పనిదినం కావడంతో కార్మికులు ఎక్కువ గా హాజరుకాలేకపోతున్నారు. దీంతో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం సింగరేణికి సెలవుదినం కావడంతో అదేరోజు ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఆర్ఎల్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు యూనియన్‌లోని ఇరువర్గాల నాయకులు సమ్మతించినట్లు సమాచారం. కాగా, టీబీజీకేఎస్‌కు సభ్యత్వం చెల్లిస్తున్న మొత్తం 40,576 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, కమిషనర్‌తో జరిగిన చర్చల్లో ఆర్జీ-3 డివిజన్ నుంచి పెర్కారి నాగేశ్వర్రావు, నాగెల్లి సాంబ య్య, పర్రె రాజనరేందర్, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, గిటుకు శ్రీనివాస్, గాజుల తిరుపతి పాల్గొన్నారు. ఇక్కడే ప్రారంభమైన వర్గపోరు.. సింగరేణిలో 2012 జూన్ 28వ తేదీన జరిగిన ఐదో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గుర్తింపు సంఘంగా గెలుపొందిన కొంతకాలానికే యూనియన్‌లో నాయకత్వ పోరు ప్రారంభమైంది. ఈ తరుణంలో యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణం తో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మిర్యాల రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2013 మే 19వ తేదీన గోదావరిఖని లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి, విషయాన్ని కెంగెర్ల వర్గీయులు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అదే నెల 26వ తేదీన శ్రీరాంపూర్‌లో మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లయ్యను తొలగించి కొత్తగూడెంకు చెందిన కనకరాజును ఎన్నుకున్నట్లు ప్రకటిం చారు. అప్పటి నుంచి గుర్తింపు యూనియన్‌లో రెండు కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. దీంతో సమస్యలపై చర్చించేందుకు ఎవరిని పిలవాలనే మీమాంసలో సింగరేణి యాజమాన్యం పడిపోయింది. అయితే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అనంతరం వరంగ ల్ లోని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (వరంగల్) వద్దకు చేరింది. ఈ క్రమంలో ఆగస్టు 27వ తేదీ న యూనియన్ బైలాస్ ప్రకారం నవంబర్ 30 వ తేదీన ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ తమకు ఎన్నిక లు నిర్వహించిన అనుభవం లేదని జేసీఎల్ పేర్కొనడంతో డిసెంబర్ 31వ తేదీలోగా తిరిగి ఎన్ని కలు జరపాలని, ఆ బాధ్యతలు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ చూడాలని డిసెంబర్ 3న హైకోర్టు నుంచి తీర్పు వెలువడింది. అయి తే కోర్టు నుంచి తీర్పు ఉత్వర్తు కాపీ డిసెంబర్ 20వ తేదీన ఆర్ఎల్సీకి చేరగా నెలారునాటికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంద ని, అది సరిపోదని తిరిగి ఆర్ఎల్సీ కోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం జనవరి 31వ తేదీలోగా యూనియన్‌లో ఏర్పడిన నాయకత్వ పోరుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇందులో భాగంగా ఈనెల 21, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యం లో ఫిబ్రవరి 23వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో అంతర్గత నాయకత్వ ఎన్నికలు జరిపిందుకు నిర్ణయాలు తీసుకు న్నారు. ఈ పరిణామం సింగరేణి చరిత్రలోనే మొదటిది కాగా వివిధ కార్మిక సంఘాలు ఆసక్తి గా గమనిస్తున్నాయి. ఇక రేపటి నుంచి మిర్యాల, కెంగెర్ల వర్గీయులు ఎన్నికల్లో గెలుపు కోసం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అయితే మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మం చిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకోవడానికి మరింత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. గెలుపుకోసం కెంగెర్ల, మిర్యాల వర్గీయుల ఆరాటం.. టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఫోన్లు చేస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో గత ఏడాది కాలంగా రాజుకున్న వర్గపోరు ఈ ఎన్నికలతో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని కార్మికులు సంతోషపడుతున్నారు.