రేపటి నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు.
హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఆయన వెల్లడించారు.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన దిగడంతో హెచ్ సీయూలో తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగింది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్ ల నిర్వహణకు హెచ్ సీయూ స్టూడెంట్ జేఏసీ గురువారం అంగీకరించింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు క్లాసుల బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.