Incharge VC
-
తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం
సాక్షి, డిచ్పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి వీసీ వి.అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు. ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్‌కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
హెచ్ సీయూలో రేపటి నుంచి తరగతులు
-
'అతడి ఆత్మహత్యకు నేను బాధ్యున్ని కాదు'
హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో విచారణ చేపడతామని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వేముల రోహిత్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం తమ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే రోహిత్ కుటుంబానికి రూ. 8 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును కోరామన్నారు. 2008లో విద్యార్థి సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తాను బాధ్యున్ని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ కూడా జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆయన కోరారు. ఆందోళనల కారణంగా స్కాలర్ షిప్ లు, ఫెలో షిప్ లు, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. -
హెచ్ సీయూలో రేపటి నుంచి తరగతులు
హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఆయన వెల్లడించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన దిగడంతో హెచ్ సీయూలో తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగింది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్ ల నిర్వహణకు హెచ్ సీయూ స్టూడెంట్ జేఏసీ గురువారం అంగీకరించింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు క్లాసుల బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
30న తెలంగాణ వర్సిటీల బంద్
ఇంచార్జి వీసీలను తొలగించాలని డిమాండ్ హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్స్ నిధులను పెంచి తక్షణం విడుదల చేయాలని అధ్యాపకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ వర్సిటీల్లో ఇంచార్జి వీసీలతో పాలన కుంటుపడిందని, వారిని తొలగించి కొత్త వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడారు. వర్సిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 10న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం, 17న అన్ని వర్సిటీల్లో మహార్యాలీలు, 23న రోడ్లపై వంటా వార్పు, 30న విశ్వవిద్యాలయాల బంద్ పాటించనున్నట్లు చెప్పారు.