ఇంచార్జి వీసీలను తొలగించాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్స్ నిధులను పెంచి తక్షణం విడుదల చేయాలని అధ్యాపకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ వర్సిటీల్లో ఇంచార్జి వీసీలతో పాలన కుంటుపడిందని, వారిని తొలగించి కొత్త వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.
గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడారు. వర్సిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 10న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం, 17న అన్ని వర్సిటీల్లో మహార్యాలీలు, 23న రోడ్లపై వంటా వార్పు, 30న విశ్వవిద్యాలయాల బంద్ పాటించనున్నట్లు చెప్పారు.
30న తెలంగాణ వర్సిటీల బంద్
Published Fri, Dec 5 2014 1:26 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement