faculty
-
త్వరలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు. గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
‘ఇంటర్’ క్లాసులు చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్ : విద్యాసంవత్సరం మొదలైనా.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో బోధన సాగడం లేదు. అన్నిచోట్ల అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏటా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేవారు. ఫలితంగా బోధన అనుకున్న మేర జరిగేది.ఈ సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అసలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరగా సిలబస్ పూర్తి చేయాలి. అప్పుడే వారు జేఈఈ, రాష్ట్ర ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వెసులుబాటు ఉంటుంది. త్వరలో 1372 మంది కొత్త లెక్చరర్లు వస్తారని...పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించారు. త్వరలో ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ఇంటర్వ్యూ లేకపోవడంతో మెరిట్ ప్రకారమే నియామకాలుంటాయి. దీంతో గెస్ట్ లెక్చరర్ల అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గెస్ట్ లెక్చరర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.అయితే వీరి అవసరాన్ని తెలియజేస్తూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టి, ఆర్డర్లు ఇచ్చే వరకూ ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.కొత్తగా వచ్చినవారు కాలేజీల్లో బోధన చేపట్టే వరకూ కొంత సమయం పడుతుందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. అప్పటి వరకూ కాలం వృథా అవుతుందని, ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు. బోధన సాగేదెలా..?నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటారా? లేదా? స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందని అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో 418 ప్రభుత్వ జూనియర్ కాలేజీఉన్నాయి. గత ఏడాది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేశారు. వీరితో కలుపుకుంటే 3900 మంది శాశ్వత అధ్యాపకులున్నారు. మరో 72 మంది మినిమమ్ టైం స్కేల్‌తో పనిచేసే అధ్యాపకులున్నారు. ఇంకా 413 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. కొంతమంది రిటైర్ అయ్యారు. సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల నియామకం జరిగినా కనీసం 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉంటుంది. ఏటా రాష్ట్రంలో 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటున్నారు. వీరి సర్వీస్‌ను ప్రతీ ఏటా సంవత్సరం పాటు పొడిగిస్తూ వస్తున్నారు. వీరికి నెలకు రూ. 27 వేలు ఇస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల కన్నా ఎక్కువ క్లాసులే చెబుతున్నామనేది వారి వాదన. నిజానికి గడచిన ఐదేళ్లుగా ఒక్క సైన్స్ అధ్యాపకుడిని కూడా నియమించలేదు. మేథ్స్ లెక్చరర్ల కొరత ప్రతీ కాలేజీలోనూ ఉంది. రాష్ట్రంలో 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీస వసతులు కూడా లేవు. గదులు, బల్లాలు సమకూర్చలేదు. ఫ్యాకల్టీ అరకొరగా ఉంది. బదిలీలు చేపట్టకపోవడంతో కొత్తవారు వచ్చే అవకాశమే లేదు. ఇన్ని సమస్యల మధ్య గెస్ట్ లెక్చరర్లను తీసుకోకపోతే విద్యార్థులు నష్టపోతారని పలువురు అంటున్నారు. అవసరం ఉంటే తీసుకుంటాం అవసరం ఉంటే గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటాం. ఎంతమేర అవసరం అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. వీలైనంత త్వరగా ఇంటర్ కాలేజీల్లో పూర్తిస్థాయిలో బోధన చేపట్టేందుకు ప్రయత్నిస్తాం. –శ్రుతిఓజా, ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగెస్ట్ లెక్చరర్లు లేకుంటే కష్టమే ప్రభుత్వ కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుతారు. అవసరమైన బోధకులు ఉంటే తప్ప వారికి నాణ్యమైన విద్య అందించలేం. కొత్త కాలేజీల్లో వసతులు లేవు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉంది. తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి, సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా చూడాలి. –మాచర్ల రామకృష్ణగౌడ్ ప్రభుత్వ ఇంటర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
బాలికలు, మహిళలను వేధించే వారిని వదలం
మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్‌లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్‌లో మానిటరింగ్ సిస్టమ్ లేదన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్ సిస్టం.. కనీసం కంప్లయింట్ బాక్స్ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్‌సీపీసీ డైరెక్టర్ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది. మార్చి 28న విశాఖపట్నం కొమ్మాదిలోని ‘చైతన్య ఇంజనీరింగ్’ కళాశాలలో డిపొ్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్‌లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ను కూడా తెలపాలంటూ సూచించింది. కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. -
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. .. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది. 12 లక్షల మందికి లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది. -
కంప్యూటర్ కోర్సుల బోధనకు.. అధ్యాపకులంతా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సులను ఏ బ్రాంచీ అధ్యాపకులైనా బోధించే వెసులుబాటు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలనూ ఆదేశించింది. కొత్తగా వచ్చిన కోర్సుల బోధన కోసం ఇప్పటికే వాటిని పూర్తిచేసిన వారే ఉండాలన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనివల్ల ఎక్కడా ఫ్యాకల్టీ లభించని పరిస్థితి తలెత్తుతుందని, కంప్యూటర్ కోర్సుల బోధనకు సమస్య తలెత్తుతుందని స్పష్టం చేసింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్ ఆధారిత బ్రాంచీలకు డిమాండ్ పెరుగుతోందని.. వాటిలో ఫ్యాకల్టీకి సంబంధించి కొన్నేళ్లు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌ను కూడా బోధనకు వినియోగించుకోవాలని సూచించింది. వర్సిటీలు వేధిస్తున్నాయన్న ఫిర్యాదులతో.. కొన్నేళ్లుగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గుతూ.. కంప్యూటర్ ఆధారిత టెక్ కోర్సుల్లో చేరేవారు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈసారి 58శాతం విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లోనే చేరారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఈ కోర్సుల బోధనపై పలు షరతులు పెట్టాయి. సదరు సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారినే ఫ్యాకల్టిగా నియమించాలని స్పష్టం చేశాయి. కానీ చాలా కాలేజీలు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు (సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ) బోధిస్తున్న అధ్యాపకులను కొత్త కోర్సులకు ఫ్యాకల్టిగా నియమించాయి. ఈ అధ్యాపకులు కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు చేసినవారేనని పేర్కొంటున్నాయి. కానీ దీనిని తాము అనుమతించబోమని, పీజీ చేసినవారిని నియమించాల్సిందేనని యూనివర్సిటీలు పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలపై వర్సిటీ అధికారుల వేధింపులు పెరిగాయంటూ కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ.. ఇతర కోర్ గ్రూపులు బోధించే వారినీ కొత్త కంప్యూటర్ కోర్సుల బోధనకు అనుమతించాలంటూ వర్సిటీలకు స్పష్టత ఇచ్చింది. ఆ కోర్సులు తప్పనిసరి ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచీలో బోధిస్తున్న అధ్యాపకుడైనా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలనుకుంటే మైనర్ డిగ్రీ కోర్సుగా దానిని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులను మూక్స్, స్వయం వంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాయి. ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల అధ్యాపకులకు సాంకేతికతలు, బోధనపై అవగాహన ఉంటుందని.. అదనంగా సర్టిఫికెట్ కోర్సులు చేయడాన్ని అర్హతగా పరిగణించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ సర్టిఫికెట్ కోర్సులకు 18 నుంచి 20 క్రెడిట్స్ ఉంటాయని, అవి బోధనకు సరిపోతాయని స్పష్టం చేసింది. 20% అనుమతిస్తున్నాం ఇతర బ్రాంచీల వారిని ఇప్పటికే 20శాతం వరకూ కొత్త కోర్సుల ఫ్యాకల్టిగా అనుమతిస్తున్నాం. వంద శాతం అనుమతిస్తే బోధనలో నాణ్యత ఉండదని భావిస్తున్నాం. అయితే సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని అనుమతించాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ అందరినీ అనుమతించాలి కొత్త కంప్యూటర్ కోర్సులు బోధించే నైపుణ్యం అలవరచుకున్న అందరినీ బోధనకు అనుమతించాలి. దీనికి వర్సిటీలు అభ్యంతరం చెప్పడం సరికాదు. వర్సిటీల తీరుతో ఫ్యాకల్టీ లభించక బోధన కుంటుపడుతుంది. సర్టిఫికెట్ కోర్సులు చేసిన కోర్ గ్రూప్ వారికీ కంప్యూటర్ అనుబంధ కోర్సులపై పట్టు ఉంటుంది. – వి.బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
అమెరికాలో మరోసారి కాల్పులు
రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం క్యాంపస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్‌కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing pic.twitter.com/Nte6OxelM6 — Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023 -
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్‌తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోధనాస్పత్రులపై సమీక్ష నిర్వహించారు. 65 మందికి ప్రొఫెసర్లు, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. వీరికి నియామక ఉత్తర్వులను ఈనెల 22న శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామన్నారు. వీరందరి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని ఈ రంగంలో మొదటి స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు టీచింగ్ ఫ్యాకల్టీ ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలన్నారు. కాగా, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్ షిప్ కోసం రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చామని ఆయన తెలిపారు. డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలి.. 24 గంటలూ.. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలని కోరారు. ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయకూడదని, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ లేదా సీ సెక్షన్ డెలివరీ చేయాలని స్పష్టం చేశారు. ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనన్నారు. ఈ సమీక్షలో వైద్యాధికారులు రిజ్వీ, రమేశ్ రెడ్డి, శ్వేతా మహంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
‘ఫార్మా’లిటీస్ కోసం పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో హడావుడి మొదలైంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించనుండటంతో కాలేజీ యాజ మాన్యాలు నానా హైరానా పడుతున్నాయి. పీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నాయని చూపించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. దీనికోసం రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీఐ సిబ్బంది ప్రతి కాలేజీనీ పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వల్ల పెద్దగా తనిఖీలు జరగలేదు. ఈసారి ప్రత్యక్ష తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలకు అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అద్దె లేబొరేటరీలు చాలా ఫార్మసీ కాలేజీల్లో ఇప్పటికీ పీసీఐ నిబంధనల ప్రకారం లేబొరేటరీలు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేబొరేటరీల తనిఖీపై పీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికప్పుడు కెమికల్ లేబొరేటరీలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేబొరేటరీలు ఉన్న కాలేజీలతో మాట్లాడుకొని, తనిఖీ సమయంలో వాటిని తీసుకొచ్చి కాలేజీలో అమర్చుకుని తర్వాత తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలకు ఒక టి కన్నా ఎక్కువ కాలేజీలున్నాయి. వీళ్లు ఏదో ఒక కాలేజీలోనే లేబొరేటరీని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్లు తనిఖీ సమయంలో మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాకల్టీ కోసం పాట్లు చాలా కాలేజీల్లో సబ్జెక్టులో నిష్ణాతులైన అధ్యాపకులను నియమించట్లేదని ఆరోపణలున్నాయి. రికార్డుల్లో పీజీ, పీహెచ్డీ చేసిన అధ్యాపకులు అని పేర్కొంటున్నా విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మాత్రం తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్లు ఉంటున్నారని విమర్శలున్నాయి. కాలేజీలో ఎవరు పనిచేస్తున్నారు, వారి అర్హతలేంటో పీసీఐ తనిఖీ చేయాల్సి ఉంది. దీని కోసం అన్ని రికార్డులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండా లని తెలియజేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న వ్యక్తులను తనిఖీ సమయంలో రావాలని చెప్పినట్టు తెలిసింది. దీని కోసం కొంత ముట్టజెప్పేందుకు ఒప్పందమూ చేసుకున్నాయని సమాచారం. ఫ్యాకల్టీ పాన్ కార్డు ఆధారంగా వాళ్లు ఇంకెక్కడైనా ఉపాధి పొందుతున్నారా అని వివరాలు సేకరిస్తే కాలేజీల అసలు బాగోతం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల అమలేదీ? ఫార్మా కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పీసీఐ నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. వేతన సంఘం జీతాలు కాదు కదా కనీసం రూ. 20 వేలు ఇచ్చే అవకాశం లేదు. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు ఇప్పటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా చూపిస్తారు. చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే అవకతవకలు వెలుగు చూస్తాయి. – అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు -
12న ఓయూ పార్ట్‌టైం అధ్యాపక రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు సోమవారం తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించారు. 190 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడిసిన్ సీట్లు యూజీ నీట్–21 తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన 190 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మలి విడత కౌన్సెలింగ్‌లోనూ కొందరు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సొసైటీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ తెలిపారు. (క్లిక్: అంతా మా ఇష్టం.. పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు) -
ఆనర్స్.. బోధించేవారు లేరు సార్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బీఏ ఆనర్స్ కోర్సు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి తీసుకొచ్చిన ఈ కోర్సు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న కోర్సులకన్నా భిన్నంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నిజాం కాలేజీలో ఎకనామిక్స్, కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను ఆనర్స్‌గా ప్రారంభించింది. సీట్లు కూడా భర్తీ అయ్యాయి. ప్రాజెక్టు వర్క్, ఫీల్డ్ స్టడీ ఎక్కువగా ఉండేలా సిలబస్ రూపొందించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. అయితే, రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రత్యేక బోధన చేపట్టగల అధ్యాపకులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని అధ్యాపకుల కోసం సైతం వేట మొదలు పెట్టారు. ఈ ప్రయత్నంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి పురోగతి కన్పించడం లేదనే విమర్శలొస్తున్నాయి. (బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్.. అధికారుల తీరే కారణమా..?) నిపుణుల కోసం వేట.. ► ఆనర్స్ కోర్సుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల అధికారులు చర్చించారు. నిపుణుల కోసం జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ బోధన విజయవంతంగా సాగుతుండటంతో అక్కడి అధ్యాపకులను రప్పించేందుకు సంప్రదింపులు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి బోధనకు వారు సుముఖంగాలేరని తెలిసింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లాసు చెప్పగలమే తప్ప పూర్తిస్థాయిలో బోధించలేమని వారు చెబుతున్నారు. దీంతో కచ్చితమైన ప్రణాళిక కష్టమని అధికారులు వాపోతున్నారు. ► వీలైతే ఇతర రాష్ట్రాల అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసులైనా ఇప్పించాలనుకుంటున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఏమేర సత్ఫలితాలనిస్తుందనేది చెప్పలేమని అధికారులు అంటున్నారు. కొత్త కోర్సు కావడంతో విద్యార్థుల సందేహాల నివృత్తి వీలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇతర రాష్ట్రాల ఫ్యాకల్టీ ఆన్లైన్ ద్వారా కొద్దిసేపు మాత్రమే బోధించే వీలుందని నిజాం కాలేజీ అధ్యాపకుడు ఒకరు చెప్పారు. ► ప్రముఖులతో విశ్లేషణలు ఆనర్స్ కోర్సుల్లో ప్రధానాంశం. అవసరమైతే ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆ స్థాయి అధికారులతో ఆర్థిక శాస్త్రంలో మార్పులపై చెప్పిస్తామని అధికారులు చెప్పినా.. ఇంతవరకు సరైన ప్రణాళిక లేదు. ఎవరిని, ఎప్పుడు పిలవాలి? అనే దానిపై విద్యార్థులకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదు. -
ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్‌తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్‌కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్‌కు పంపగలంఅని ఇంటర్ బోర్డ్ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి. స్పాట్‌కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ముదురుతున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఇక చర్యలు తప్పవు మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్ కాలేజీలు రిలీవ్ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. –ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆందోళన తప్పదు మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. –మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ అధ్యాపకులే లేరు.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో? –అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
ఆర్ జెడి కార్యాలయంలో జాయిన్ అయిన అధ్యాపకులు
-
మా కాలేజీలో చేరండి..!
బాబూ.. ఏ కాలేజీలో బీటెక్ చేయాలనుకుంటున్నావు. ఎంసెట్‌లో సీటు వచ్చినా, రాకున్నా మా కాలేజీలో చేరితే అన్నీ మేమే చూసుకుంటాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్. వెంటనే రూ.10 వేలు చెల్లించి నీకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ తీసుకో.. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థితో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఫోన్ సంభాషణ ఇది. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–20 పరీక్ష ఇంకా నిర్వహించలేదు. ర్యాంకులు వెలువడలేదు. ఏయే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్ని సీట్లున్నాయో తెలియదు. ఏ కాలేజీలో ఏ కటాఫ్ ర్యాంక్ ఉంటుందో కూడా స్పష్టత లేదు. ఇంత గందరగోళంలో ఉన్నా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ప్రచారకార్యక్రమాలు మొదలుపెట్టాయి. కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీపై అడ్మిషన్ టార్గెట్లు విధిస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తేనే వేతనాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో లెక్చరర్లు క్షేత్రస్థాయిలో అడ్మిషన్ల నిమిత్తం విద్యార్థుల కోసం వేట మొదలుపెట్టారు. అడ్వాన్స్ బుక్ చేస్తే సరి... ఎంసెట్ పరీక్ష జరగనప్పటికీ మాక్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలో వచ్చే మార్కులను అంచనా వేసి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలుంటాయనే దాన్ని సైతం అంచనా వేయొచ్చు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ముందస్తుగానే సీటు రాదని భావించి మేనేజ్మెంట్ కోటావైపు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితిని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు కాలేజీల్లో బోధన సిబ్బంది ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోసం ఎన్ రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలతో కూడిన జాబితాను సంపాదించి వారిని సంప్రదిస్తున్నారు. కొందరైతే నేరుగా ఇంటికి వెళ్లి మరీ విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం రూ.10 వేలు తీసుకుని రిసిప్ట్ ఇస్తున్నారు. ఒకవేళ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కోరిన చోట సీటు వస్తే డబ్బులు తిరిగిచ్చేస్తామని, లేకుంటే తమ కాలేజీలో అడ్మిషన్ పక్కా అని హామీ ఇస్తున్నారు. గవర్నర్ ఆగ్రహం కాలేజీ యాజమాన్యాల అడ్మిషన్ల వ్యవహారంపై ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ అసోసియేషన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కోవిడ్–19 తీవ్రత ఉన్నప్పటికీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి లెక్చరర్లు విధులకు వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేఎన్టీయూహెచ్కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాకల్టీతో అడ్మిషన్ల ప్రక్రియకు ఉసిగొల్పిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జేఎన్టీయూ తక్షణమే స్పందించి అడ్మిషన్లు, ఫ్యాకల్టీ విధులపై పలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తర్వులను వర్సిటీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి చేయొద్దు.. విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా తనకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ, ర్యాంకు ఏదొచ్చినా మా కాలేజీలో చేరాలని ఒత్తిడి చేయొద్దు. ఆతని కుటుంబ పరిస్థితి, ఆర్థిక నేపథ్యం ఆధారంగా కాలేజీని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఫ్యాకల్టీకి అడ్మిషన్ల టార్గెట్ ఇవ్వొద్దు. వాళ్లు కేవలం పాఠ్యాంశ బోధనలోనే అనుభవం ఉంటుంది. అడ్మిషన్లు చేయించడం వాళ్లకేం తెలుసు. ఫ్యాకల్టీపై ఇలాంటి అనవసర విధులు రుద్ది వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. – దాసరి శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్సిస్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
నకిలీలతో జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే యాజమాన్యాలపై చర్యలు చేపడతామని జేఎన్టీయూ పేర్కొంది. తమ కాలేజీల్లో చేరే ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. నకిలీ/ఇన్వ్యాలిడ్ సర్టిఫికెట్లు, నకిలీ పీహెచ్‌డీలు చూపించి ఏయే కోర్సులకు అనుబంధ గుర్తింపు పొందుతారో కాలేజీల్లో ఆయా కోర్సు లను రద్దు చేస్తామని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు చూపించే ఫ్యాకల్టీకి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలను ఏడాది పొడవునా పరిశీలిస్తామని, ఏ దశలోనైనా హాజరు లేకపోయినా వారు, కాలేజీలో లేకపోయినా ఆయా కోర్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అఫీలియేషన్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను జేఎన్టీయూ సోమవారం ప్రకటించింది. దానిపై యాజమాన్యాలు మెయిల్ ద్వారా (feedbackaac@jntuh.ac.in) అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలపాలని స్పష్టం చేసింది. ఏటా పరిగణనలోకి తీసుకునే నిబంధనలతో పాటు ఈసారి కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ వెల్ఫేర్, కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అంశాలను పొందుపరిచింది. మరోవైపు ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే గడిచిన మూడేళ్లలో కాలేజీల్లో ప్రవేశాలు 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గతంలో అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో లేని విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు వివిధ కారణాలతో తమ వద్దే పెట్టుకోవద్దనే నిబంధనను ఈసారి రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌లోని ప్రధాన అంశాలు.. ►కాలేజీల గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ సమావేశాల మినిట్స్‌ను కచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ►ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరును ఏడాది కాలంలో ఎప్పుడైనా పరిశీలిస్తారు. ఫ్యాకల్టీ లేకపోతే ఆ కోర్సుల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారు. ►కాలేజీల్లో తమ ఉద్యోగులు, ఫ్యాకల్టీకి వర్తింపజేస్తున్న సర్వీసు రూల్స్‌ను కూడా యూనివర్సిటీకి అన్లైన్ అందజేయాలి. -
నటనలో శిక్షణ పేరుతో అసభ్యంగా తాకుతూ..
కోల్‌కతా : నటనలో శిక్షణ పేరుతో యువతులను అసభ్యంగా తాకుతూ అభ్యంతరకరంగా వ్యవహరించారనే ఆరోపణలపై కోల్‌కతాలో థియేటర్ ఆర్టిస్ట్, హెరిటేజ్ అకాడమీ ఫ్యాకల్టీ మెంబల్ సుదీప్తో ఛటర్జీపై కళాశాల యాజమాన్యం దర్యాప్తునకు ఉపక్రమించింది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఆయన వైదొలిగారు. నాటక ప్రదర్శనలో సహకరిస్తానంటూ ఛటర్జీ తన ఇంటికి పిలిచి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను అభ్యంతరకరంగా తాకారని బాధిత యువతి ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన లాగే పలువురు యువతులను ఆయన లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. తాను ఛటర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఇనిస్టిట్యూట్ నియమించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణకు సహకరిస్తానని, మహిళా కమిషన్ దృష్టికీ ఈ విషయం తీసుకువెళతానని తెలిపారు. బాధితురాలు తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అనంతరం మరికొందరు సైతం ఛటర్జీ చేష్టలను బహిర్గతం చేశారు. వాయిస్ ఎక్సర్సైజ్ల పేరుతో ఛటర్జీ తనను ఆయన ఇంటికి పిలిపించారని, అక్కడ ఆయన తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని ఆరోపించారు. శారీరకంగా తాకడం ఈ ప్రక్రియలో భాగమని ఆయన మెసేజ్ చేశారని చెప్పారు. ఇక ఛటర్జీ వేధింపులు భరించలేక తాను బెంగాలీ థియేటర్లో పనిచేయడం మానేశానని మరో మహిళ పేర్కొన్నారు. మరోవైపు తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఛటర్జీ తోసిపుచ్చారు. తాను అమాయకుడినని వాస్తవాలను వక్రీకరించేలా ఈ ఆరోపణలున్నాయని చెప్పుకొచ్చారు. శిక్షణలో భాగంగా నాటకంలో ఆమె పాత్రను రక్తికట్టించేలా చేసే క్రమంలో వారు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు. నాటక రంగ శిక్షణలో ప్రముఖుడిగా పేరొందిన ఛటర్జీ ఢిల్లీ జేఎన్‌యూ, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లోనూ ఫ్యాకల్టీ సేవలు అందించడం గమనార్హం. టఫ్ట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనూ ఆయన బోధనలు సాగాయి. -
అధ్యాపకులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల వేతనాలు త్వరలోనే పెరగనున్నాయి. పెంపు కనీసం 20 శాతం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆ కమిటీ మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో సమావేశమై చర్చించింది. కమిటీ ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 5వేల మందికి పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది. అందులో 240 మంది ఎయిడెడ్ డిగ్రీ అధ్యాపకులు, 1,350 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిబ్బంది, 1,000 మంది వరకు యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది ఉన్నట్లు అంచనా వేసింది. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పాత పెన్షన్ వర్తించే దాదాపు 2,500 మంది రిటైర్డ్ అధ్యాపకులకు ఈ పీఆర్సీ ప్రయోజనాలను వర్తింపచేయాల్సి ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని భావిస్తోంది. అయితే అందులో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుండగా, మరో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. 2019 మార్చి 31లోగా కేంద్ర ఏడో పీఆర్సీని వర్తింపజేయకపోతే అందుకోసం ఇవ్వాల్సిన నిధులను తాము ఇవ్వబోమని, ఈలోగా వర్తింపజేస్తేనే తమ వాటా కింద ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో వేతనాల పెంపునకు కసరత్తు ప్రారంభమైంది. ఈనెల 21న అధ్యాపకులు, అధికారులతో మరోసారి సమావేశం కావాలని, తర్వాత ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై నివేదిక ఖరారు చేయాలని నిర్ణయించింది. కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి, వేతనాల పెంపును ప్రకటించనుంది. దీనికి ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
వేధింపుల వల్లే ఆత్మహత్య : మీకు బిడ్డల్లేరా?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో యువ వైద్యుడు శివతేజరెడ్డి ఆత్మహత్య ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.రాజారెడ్డి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీఎస్వీ మంజుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. న్యూరోసర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ విచారణ చేపట్టనుంది. సోమవారం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న రెసిడెంట్లతో కమిటీ సమావేశమై.. రెసిడెంట్ వైద్యుల పట్ల ఫ్యాకల్టీ అనుసరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చించనుంది. ఇదిలా ఉంటే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, న్యూరోసర్జరీ విభాగం ఫ్యాకల్టీ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని శివతేజరెడ్డి తల్లి కవిత ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఆమె నిమ్స్ డైరెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, లేదంటే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. శివతేజ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్లతో కలసి శుక్రవారం ఆమె నిరసన తెలిపారు. చిన్న తప్పు దొర్లితే చాలు.. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో ఉన్నవాళ్లపై పనిభారం పెరుగుతోంది. ఇక ఆపరేషన్ థియేటర్లలో టేబుళ్లు, కుర్చీలు, గ్లౌజులు, మాస్కులే కాదు ఓటీలోకి వెళ్లేందుకు అవసరమైన డ్రెస్‌లు, చెప్పులు కూడా లేవు. పని ఒత్తిడి.. కనీస వసతులు లేకపోవడం.. కుటుంబ సభ్యులకు కనీస సమయం కేటాయించలేకపోతుండటంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చికిత్సల్లో చిన్న తప్పు దొర్లినా సీనియర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ వేధింపులతో మనస్తాపం చెందే శివతేజరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. న్యూరోసర్జరీ విభాగంలోనే కాక.. అన్ని విభాగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని పేర్కొంది. అయితే యువ వైద్యులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ వైద్యులు కృషి చేస్తున్నారని, రోగులు చనిపోయినప్పుడు సీనియర్ ఫ్యాకల్టీలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమయం లో రెసిడెంట్లే కాదు ఆ విభాగం మొత్తం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఫ్యాకల్టీ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనికి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా వద్ద ఆధారాలు ఉన్నాయి శివతేజను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని కమిటీకి అప్పగిస్తాం. మీడియా సహా ఇతరులెవరిపైనా మాకు నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం వాటిని బయట పెట్టడం లేదు. ఒక్క న్యూరాలజీ విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాల్లోనూ వేధింపులు ఎదురవుతున్నాయి. భయంతో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. – డాక్టర్ శివానందరెడ్డి, రెసిడెంట్ల సంఘం అధ్యక్షుడు వేధింపుల వల్లే ఆత్మహత్య..‘మీకు బిడ్డల్లేరా..? వైద్య విద్య కోసం వచ్చిన నా బిడ్డను సూటిపోటి మాటలతో వేధించి చంపేస్తారా? న్యూరాలజీ ఫ్యాకల్టీకిది తగునా.. చదువు కోసం వచ్చిన వారిని ఆదరించాల్సింది పోయి.. తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారా? ఫ్యాకల్టీతో పాటు ఎంఆర్ఐ టెక్నీషియన్లు కూడా నా బిడ్డను హేళన చేశారు. నాలాగా మరొకరికి పుత్రశోకం కలగకూడదనే న్యాయం పోరాటం చేస్తున్నాను. – శివతేజరెడ్డి తల్లి కవిత -
జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్న అతుల్ జోహ్రి అనే అధ్యాపకుడిని పోలీసులు రక్షిస్తున్నారంటూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. జోహ్రి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎనిమిది మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల అనంతరం కూడా పోలీసులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారనీ, కనీసం ఆయనను విచారించలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థినుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని 54 మంది అధ్యాపకులు కూడా పోలీసులను డిమాండ్ చేశారు. -
20 మందికో అధ్యాపకుడు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలన్న నిబంధన ఉండగా, దాన్ని సడలించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2018–19 విద్యా సంవత్సరంలో కాలేజీలకు అనుమతులు ఇచ్చే క్రమంలో ఈ నిబంధనను అమల్లోకి తేనుంది. తద్వారా ఫ్యాకల్టీ లేకున్నా ఉన్నట్లుగా పేపర్‌పై చూపిస్తున్న కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. కాలేజీ యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రెగ్యులర్ అధ్యాపకులు లేకున్నా 20 శాతం వరకు తాత్కాలిక అధ్యాపకులను (అడ్జంక్ట్ ఫ్యాకల్టీ) నియమించుకునేందుకు వీలు కల్పిస్తోంది. అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా రిటైర్ అయిన వారిని, పీహెచ్డీ వంటి అర్హతలు లేని వారిని కూడా నియమించుకునే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి కాలేజీల్లో అక్రమాలకు అడ్డకట్ట వేయడంతోపాటు నాణ్యత ప్రమాణాల కోసం పక్కా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. 30 శాతం లోపు ప్రవేశాలు రద్దు! 2018–19 విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు తాజా నిబంధనలతో కూడిన ఏఐసీటీఈ అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను వారం రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు 30 శాతంలోపు ప్రవేశాలు ఉండే కాలేజీలను కొనసాగించడానికి వీల్లేదని, 30 శాతం ప్రవేశాలు ఉంటే దాని నిర్వహణ కూడా యాజమాన్యాలకు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే 30 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి తరలించి, ఆయా కాలేజీల్లో ప్రవేశాలను రద్దు చేసే నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని కాలేజీ యాజమాన్య వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఆగస్టులో ఢిల్లీలో యాజమాన్యాలతో ఏఐసీటీఈ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలిసింది. కాలేజీలకు మరిన్ని అంశాల్లోనూ మినహాయింపులు ఇవ్వాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో కాలేజీకి 10 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధన ఉండగా, దాన్ని 5 ఎకరాలకు తగ్గిస్తున్నట్లు తెలిసింది. మెట్రో ప్రాంతాల్లో 2.5 ఎకరాలు ఉంటే ఇతర కోర్సులను ప్రవేశ పెట్టేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. సిలబస్ కుదింపు! ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో సిలబస్‌ను కుదించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బీటెక్‌లో ఉన్న 192 క్రెడిట్లను 150 నుంచి 160 వరకు కుదించాలని నిర్ణయించింది. విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన మోడల్ సిలబస్‌లో పరిశ్రమలతో అనుసంధానంగా ప్రాక్టికల్‌గా పని చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఇది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు అవుతుందా, లేదా అన్నది తేలాల్సి ఉంది. 192 నుంచి 150–160 క్రెడిట్లకు తగ్గిస్తూ సిలబస్‌ను కుదించే ప్రక్రియను యూనివర్సిటీలే చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్ కరిక్యులమ్ అమలుకు యూనివర్సిటీలు తగిన చర్యలు చేపట్టాలని ఏఐసీటీఈ పేర్కొంది. వీటి అమలుతో విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్స్ ఎక్కువ ఉండనున్నాయి. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ నిర్ణయానికి వచ్చిందని స్టాన్లీ విద్యా సంస్థల కరస్పాండెంట్ కృష్ణారావు పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు 150–160 క్రెడిట్లలో 20 క్రెడిట్లను తమ సబ్జెక్టుకు సంబంధించిన ఆన్లైన్ కోర్సుల ద్వారా సంపాదించుకోచ్చని వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో ప్రస్తుతం 24 క్రెడిట్లు ఉండగా, వాటిని 17.5 కు తగ్గించాల్సి ఉంటుందని, తర్వాతి మూడేళ్లలోని క్రెడిట్లను తగ్గించేందుకు వర్సిటీలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
వేంపల్లె : వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుడు నాగరాజు మృతికి నిరసనగా తోటి అధ్యాపకులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి ఆర్ జె యూ కె టి యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని రోడ్డుపై బైఠాయించారు. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన బి. నాగరాజు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగంలో కాంట్రాక్ట్ అధ్యాపకునిగా పనిచేసేవాడు. పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ప్రకటించగా దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ప్రకారం తనకు రావాల్సిన ఉద్యోగం వేరే వ్యక్తికి రావడంతో మనస్థాపం చెందాడు. సమాచార హక్కు చట్టం ద్వారా అవకతవకలు జరిగాయని యూనివర్సిటీపై హై కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ యూనివర్సిటీ అధికారులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ఈ ఏడాది జులై 19న ట్రిపుల్ ఐటీ ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప రిమ్స్ లో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ నాగరాజు తన స్వగ్రామంలో తాడేపల్లి గూడెంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నాగరాజు మృతికి ట్రిపుల్ ఐటీ అధికారులు సంతాప సూచకంగా చిత్ర పటానికి నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేస్తుండగా మంగళవారం తోటి అధ్యాపకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. మూడు నెలల కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలతో బయటపడితే అప్పుడైన నాగరాజుకు న్యాయం చేసి ఉంటే అతను బతికి వుండే వాడని, అధికారులు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ప్రైవేట్’ లెక్క ఎంత?
► శిక్షణలేని టీచర్ల సంఖ్య తేల్చేపనిలో విద్యాశాఖ ► ప్రైవేటు సూళ్లలో బోధనకు టెట్ తప్పనిసరి ► జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 20,40,436 మంది విద్యార్థులుండగా 1,27,843 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరోవైపు 11,304 ప్రైవేటుపాఠశాలల్లో 27,23,601 మంది విద్యార్థులుండగా కేవలం 92,675 మంది ఉపాధ్యాయులే పని చేస్తున్నట్లు ప్రైవేటు స్కూళ్లు 2015–16లో లెక్కలు చెప్పాయి. దీనిని బట్టి ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని అనుసరించడంలేదన్నది స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సంఖ్యను దాస్తున్నారన్నది అర్థం అవుతోంది. ఇప్పుడు ఆ లెక్కను తేల్చే పనిలో విద్యాశాఖ పడింది. 2019 మార్చి 31 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ప్రతి టీచర్ ఉపాధ్యాయశిక్షణ తీసుకొని ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లోని 92,675 మంది టీచర్లలో 3,905 మంది అన్ట్రైన్డ్ టీచర్లు శిక్షణ పొందా లని తేల్చింది. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో వాస్తవంగా మరో 30 వేల మందికిపైగా టీచర్లుంటారని విద్యాశాఖ భావిస్తోంది. అధికారికంగా వారి సంఖ్యను చూపిస్తే నిబంధనల ప్రకారం వారికి ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందనే లెక్కలు చెప్పడం లేదేమోనని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాజా లెక్కలు తేల్చేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించినవారే ప్రైవేటు పాఠశాలల్లో బోధించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్న విద్యాశాఖ లెక్కల సేకరణలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ఉపాధ్యాయ శిక్షణ పొందినవారు, పొందనివారు.. టెట్‌లో అర్హతలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు సిద్ధం అవుతోంది. ఈసారి టెట్‌ను పక్కాగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అర్హతలు కలిగినవారి తాజా వివరాలను సేకరించాలని నిర్ణయించింది. జాతీయ ఓపెన్‌స్కూల్ ద్వారా అర్హతలు పొందే వీలు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న అన్ట్రైన్డ్ టీచర్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఓస్) ద్వారా ఉపాధ్యాయ శిక్షణకు తత్సమాన అర్హత పొందేలా కేంద్రం వీలు కల్పించాలని నిర్ణయించింది. ఎన్ఐఓఎస్ ప్రవేశం పొంది, రెండేళ్లలో నిర్వహించే రెండు పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే వారికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు (డీఎడ్) తత్సమాన సర్టిఫికెట్‌ను అందజేయనుంది. దూరదర్శన్‌కు చెందిన రెండు చానెళ్ల ద్వారా ఈ శిక్షణను అందజేయనుంది. ఇందుకు అభ్యర్థులు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఆర్యూ నియామకాలపై తాత్కాలిక స్టే
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలు పాటించకుండా చేపట్టిన నియామకాలను నిలుపుదల చేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు డాక్టర్ జి.మల్లికార్జున, డాక్టర్ మల్లెపోగు రవి, డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడారు. రాయలసీమ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ వై.నరసింహులు..యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు చేయకుండా అధ్యాపకులు నియామకాలు చేపట్టారని ఆరోపిచారు. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు విజ్ఞప్తిని పెడచెవిన పెడుతూ నియంత ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. -
బోధకులు లేక.. బోధనెలా?
► వర్సిటీలో రెగ్యులర్ బోధకుల కొరత ► కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25న ఏర్పాటైంది. ఇక్కడ అన్నింటికంటే ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకుల నియామకం జరగకపోవడం, ప్రస్తుతం యూనివర్సిటీలో 12 మంది మాత్రమే రెగ్యులర్ బోధకులు ఉన్నారు. వీరిలో వర్సిటీ పాలనాపరమైన కీలక బాధ్యతల్లో కొందరు ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ఇన్చార్జి వీసీగా ఉన్నారు. ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ గుంట తులసీరావు రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు ఎగ్జామినేషన్స్ డీ¯న్గా వ్యవహరిస్తున్నారు. ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య ఉండగా.. ఆయన చీఫ్ వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. బయోటెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ పీలా సుజాత ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. సోషల్ వర్కులో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా.. డాక్టర్ గంజి సంజీవయ్య జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇలా కీలకమైన బాధ్యతల్లోనే కొందరు ఉన్నారు. రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ బోధకులు నియామకానికి రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. అయినా నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013 సంవత్సరం జూన్ 22న 34 పోస్టులకు.. 2014 మార్చి 1న 15 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేశారు. వర్సిటీలో ఆరు ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే నేటికీ నియామకాలు జరగలేదు. వర్సిటీ ఏర్పడిన సమయంలో అరుగురు మాత్రమే ఇక్కడ ఉండేందుకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 22 మంది మాతృసంస్థ ఏయూకు వెళ్లి పోయారు. ఆ స్థానంలో సైతం పోస్టులు వర్సిటీలో భర్తీ కాలేదు. 2009లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్వర్కులో ముగ్గురు బోధన సిబ్బందిని మాత్రమే నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో కామన్ పాలసీ వంటి కొత్త రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తోంది. దీంతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే నియామకంలో జాప్యం జరుగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోతే.. బోధన కుంటుపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.. : ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫె సర్ల నియామకంలో ప్రభుత్వం కామన్ పాలసీ విధానం, స్క్రీనింగ్ టెస్ట్ వంటి అంశాలను తెరపైకి తెస్తోం ది. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. వర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు –10 పోస్టులకు సంబంధించి పాలక మండలిలో చర్చించి, ఉన్నత వి ద్యా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళతాం. నియామకాలకు చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ పోస్టుల నియామకంతోనే విద్యబలోపేతం అవుతుంది. -- ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, ఇన్చార్జి వీసీ, డాక్టర్ బీఆర్‌ఏయూ. -
విద్యార్థులకు కంప్యూటర్ బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం 250 మంది ఫ్యాకల్టీల నియామకం ప్రారంభమైన తరగతులు ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ భాస్కర్ దెందులూరు : జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ఇటీవల పునఃప్రారంభమైంది. రెండేళ్ల కిందట అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. పదేళ్ల కిందట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసీ) పథకంలో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.రెండేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయపార్టీల ఆందోళనకుతోడు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మన జిల్లాలో కంప్యూటర్ విద్య తిరిగి పునఃప్రారంభమైంది. జిల్లాలో 48 మండలాల్లో ఉన్న 464 పాఠశాలల్లో 250 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన గత వారంలో ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. దాదాపు రెండు లక్షల మంది 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి తరగతికి ఒక గంట కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, టాలీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ విభాగాల్లో ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు అత్యవసరం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేయాలనే లక్ష ్యంతో పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రారంభించాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అత్యవసరం. సర్వేశ్వరరావు, ఏఎంవో, సర్వశిక్షాభియాన్ కంప్యూటర్ విద్యాబోధన కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిపరిస్థితి. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరం. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బోధన మళ్లీ ప్రారంభించడం అభినందనీయం. టి కిశోర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ, గోపన్నపాలెం కలెక్టర్ కృషితో ప్రారంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించడంతో విద్యాబోధన ప్రారంభించాం. దుక్కిపాటి మధుసూదనరావు, డీఈవో ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం 250 మంది ఫ్యాకల్టీల నియామకం ప్రారంభమైన తరగతులు ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ భాస్కర్ దెందులూరు : జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ఇటీవల పునఃప్రారంభమైంది. రెండేళ్ల కిందట అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. పదేళ్ల కిందట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసీ) పథకంలో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.రెండేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయపార్టీల ఆందోళనకుతోడు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మన జిల్లాలో కంప్యూటర్ విద్య తిరిగి పునఃప్రారంభమైంది. జిల్లాలో 48 మండలాల్లో ఉన్న 464 పాఠశాలల్లో 250 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన గత వారంలో ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. దాదాపు రెండు లక్షల మంది 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి తరగతికి ఒక గంట కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, టాలీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ విభాగాల్లో ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు అత్యవసరం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేయాలనే లక్ష ్యంతో పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రారంభించాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అత్యవసరం. సర్వేశ్వరరావు, ఏఎంవో, సర్వశిక్షాభియాన్ కంప్యూటర్ విద్యాబోధన కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిపరిస్థితి. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరం. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బోధన మళ్లీ ప్రారంభించడం అభినందనీయం. టి కిశోర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ, గోపన్నపాలెం కలెక్టర్ కృషితో ప్రారంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించడంతో విద్యాబోధన ప్రారంభించాం. దుక్కిపాటి మధుసూదనరావు, డీఈవో -
డైట్లో అధ్యాపకుల కుదింపు
డిప్యూటేషన్ ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలకు.. రిటైర్డ్ ఉపాధ్యాయులతో ఖాళీల భర్తీ ప్రమాణాలపై విద్యార్థుల ఆందోళన ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో అధ్యాపకుల సంఖ్యను కుదించారు. డైట్ విద్యార్థులకు బోధ న జరుపుతూనే, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వ డం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలు, ఇత ర అంశాలపై ప్రచారం చేసే డైట్ అధ్యాపకుల సంఖ్య మూడో వంతుకు తగ్గించారు. 25 మంది నుంచి 8 మందికి కుదించా రు. డిప్యూటేషన్‌పై డైట్ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గు రు ఉపాధ్యాయులను వారి వారి పాఠశాలలకు పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ లను రిటైర్డ్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. ఇప్పటికే ఖాళీలతో నెట్టుకొస్తున్న డైట్ బోధన, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాప్రమాణా లు, ఛాత్రోపాధ్యాయుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. 25 నుంచి 8కి.. 200 మంది విద్యార్థులు చదివే జిల్లా డైట్ కళాశాలలో 24 మంది అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్‌తో కలిపి మొత్తం25 మంది ఉండేవారు. వీరిలో 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్ అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు. పలువురు అధ్యాపకులు ఇతర జిల్లాల్లోని డైట్ కళాశాలలకు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ పొందడంలో రోజు రోజుకు అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. మిగిలిన పోస్టుల్లో పీజీ ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించి పనిచేయిస్తున్నారు. తెలుగు, సోషల్, ఫౌండేషన్ కోర్సు( సైకాలజీ, ఫిలాసఫీ), ఆర్డ్ ఎడ్యుకేషన్, పీఈటీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించి రూ. 18 వేల వేతనం, ఆర్ట్ టీచర్, పీఈటీలకు రూ. 7 వేల మేరకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రమాణాలపై ప్రభావం.. అధ్యాపకుల కుదింపుతో ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 100, ద్వితీయ సంవత్సరంలో 100 మొత్తం 200 మంది విద్యార్థులు చదివే కళాశాలలో కేవలం 8 మంది అధ్యాపకులను నియమిస్తే ఎలా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల స్కూల్ అబ్జర్వేషన్, టీచింగ్ ప్రాక్టీస్ పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభు త్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి డైట్ లెక్చరర్స్‌గా నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
గాడి తప్పిన ఇంటర్ విద్య
అధ్యాపకుల కొరత రెన్యూవల్‌కు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా ఇంటర్ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా వారి పోస్టులను రెన్యూవల్ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పోస్టులు 652... పని చేస్తోంది 156 మంది జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్ కలిపి మొత్తం 41 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. -
కళాశాలల్లోబయోమెట్రిక్
♦ పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం ♦ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేవెళ్ల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సిబ్బంది, విద్యార్థుల హాజరులో మరింత పాదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నారుు. ఇవి కాకుండా ఐదు ఎరుుడెడ్, 12 ఆదర్శ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి అధ్యాపకులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతాన్ని నమోదు చేసుకున్నారు. ప్రతి కళాశాలలో 4 సీసీన కెమెరాలు, బయోమెట్రిక్ పరికరం ప్రతి జూనియర్ కళాశాలలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేవెళ్ల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గదిలో, కళాశాల ముఖద్వారం వద్ద (ఎంట్రెన్ ్స), స్టాఫ్ రూం, ఒకేషన్ లో బిల్డింగ్‌లో ఒకటి చొప్పున ఏర్పాటుచేశారు. భద్రత పరంగా కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. సీసీ కెమెరాల పుటేజీలను ప్రిన్సిపాల్ గదిలో నుంచి పర్యవేక్షించవచ్చు. పెరగనున్న హాజరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సమయపాలన పాటించడానికి బయోమెట్రిక్ విధానం ఉపకరించనుంది. ఉదయం 9:45 గంటలకు కళాశాల ప్రారంభం కానుంది. ఆలోపే.. అంటే 9.30 నుంచి 9.40 వరకు మాత్రమే బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు నమోదుచేయాల్సి ఉంటుంది. కళాశాలల వేళలు ముగిసే సమయానికి సాయంత్రం 3.50 నిమిషాలనుంచి 4 గంటలవరకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ యంత్రం ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంటుందని ఇంటర్‌బోర్డు నిబంధనల్లో పొందుపరిచారు. అధ్యాపకులతోపాటుగా ఇతర సిబ్బంది, కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యార్థులు కూడా బయోమెట్రిక్ పరికరంలో హాజరును నమోదుచేసుకోవాలి. విద్యార్థుల హాజరుశాతం మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రం ద్వారా అధ్యాపకులు, విద్యార్థులలో జవాబుదారీతనం, బాధ్యత మరింత పెరుగుతుంది. విద్యార్థులు హాజరుశాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రతిష్ట పెరుగుతుంది. ఇది మంచి ప్రయోగం. సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం. - ఎం.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల -
మంచి కోర్సులున్నాయ్...రండి!
బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల ప్రచారం హిమాయత్ నగర్: నారాయణగూడలోని బాబూ జగ్జీవన్ రామ్ (బీజేఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అక్కడి అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు...అందుబాటులో ఉన్నా... విద్యార్థులు ఈ కళాశాల వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటింటా తిరుగుతూ కళాశాల ప్రాముఖ్యం, ఫలితాల సరళి, సౌకర్యాల వంటివివరాలను ప్రజలకు వివరిస్తూ.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు అధ్యాపకులు యత్నిస్తున్నారు. గతంలో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీ, నాంపల్లిలోని బజార్‌ఘాట్ వద్ద ఈ కళాశాల అద్దె భవనాల్లో నడి చింది. 2015 అక్టోబర్ లో రూ.1.40 కోట్లతో నారాయణగూడ విఠల్‌వాడిలో శాశ్వత భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కళాశాలలో జిమ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్, లైబ్రరీలో ఈ-కార్నర్ వ్యవస్థ ద్వారా సుమారు 5 లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యాపకులు... ‘మా కళాశాలలో మీ పిల్లలను చేర్పించండి. అత్యుత్తమ బోధన అందిస్తాం. కార్పొరేట్ విద్యా సంస్థలలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.’ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న కోర్సులివే... బీఏ (హెచ్ఈపీ, హెచ్‌పీపీ, మాస్ కమ్యూనికేషన్), బీకాం (ఇంగ్లిష్ మీడియంలో జనరల్, కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్) కోర్సులను కళాశాల ఆఫర్ చేస్తోంది. మొత్తం 450 సీట్లు ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఆటోమోటివ్ సర్వీసింగ్, బేసిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెబ్ డిజైనింగ్, అకౌంటింగ్ ప్యాకేజ్ (టాలీ), టాక్సేషన్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, బ్యూటీషియన్, గార్డెనర్, డెయిరీ ఫార్మింగ్‌తో పాటు మల్టీమీడియా, ఫొటోషాప్, నెయిల్ ఆర్ట్ పెయింటింగ్, వాటర్ అన లైసిస్ తదితర సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. పోటీ పరీక్షలైన గ్రూప్స్‌కు కోచింగ్ అందిస్తున్నారు. ప్రత్యేక కోర్సులు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్’ కింద ‘గార్డెనర్, బ్యుటీషియన్, అకౌంట్స్ అండ్ టాలీ, వెబ్ డిజైనింగ్’ లాంటి కోర్సులను నేర్పిస్తున్నాం. వీటిలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ‘ఇంటర్మీడియట్ బోర్డు’ సర్టిఫికెట్లను అందిస్తుంది. - డాక్టర్ కె.పద్మావతి, బీజేఆర్ కళాశాల ప్రిన్సిపల్ పెట్రోల్ తీసిన హోంగార్డుపై చర్యలు బహదూర్‌పురా: బహదూర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న ఖదీర్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ వాహనంలోనుంచి ఖదీర్ పెట్రోల్ తీసిన వీడియో బయటికి రావడంతో చర్యల్లో భాగంగా అటాచ్ చేశామన్నారు. దీనిపై హోంగార్డు ఖదీర్‌ను వివరణ కోరగా వాహనం నుంచి పెట్రోల్ లీకవడంతో రిపేర్ చేసేందుకు పెట్రోల్‌ను బయటికి తీశానని పేర్కొన్నారు. పెట్రోల్ లీకవుతున్న సమస్యను వీడియో తీస్తున్న వ్యక్తికి చెప్పేందుకు భయపడి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లానని పేర్కొన్నారు. -
ఫ్యాకల్టీలు ఫిజికల్‌గా వేధిస్తున్నారు:స్టూడెంట్స్
-
30న తెలంగాణ వర్సిటీల బంద్
ఇంచార్జి వీసీలను తొలగించాలని డిమాండ్ హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్స్ నిధులను పెంచి తక్షణం విడుదల చేయాలని అధ్యాపకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ వర్సిటీల్లో ఇంచార్జి వీసీలతో పాలన కుంటుపడిందని, వారిని తొలగించి కొత్త వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడారు. వర్సిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 10న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం, 17న అన్ని వర్సిటీల్లో మహార్యాలీలు, 23న రోడ్లపై వంటా వార్పు, 30న విశ్వవిద్యాలయాల బంద్ పాటించనున్నట్లు చెప్పారు. -
వెటర్నరీ కళాశాలపై సర్కార్ కన్ను
వెటర్నరీ కాలేజీలో సచివాలయం ఏర్పాటుకు కసరత్తు! గుట్టుగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం కళాశాలను గుంటూరుకు తరలిస్తారని ప్రచారం ఆందోళనలో అధ్యాపకులు, విద్యార్థులు విజయవాడ : ఒకవైపు విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు నెలకొల్పుతామని చెబుతున్న పాలకులు.. మరోవైపు ఉన్న ప్రతిష్టాత్మక కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తు చేయడం విడ్డూరంగా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీని మంగళగిరికి తరలిస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలపై ప్రభుత్వం కన్ను పడినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టుకు, ఐటీ పార్కుకు మధ్యలో అసెంబ్లీని తలపించేలా భవన సముదాయం ఉన్న ఈ కళాశాలను మరో ప్రాంతానికి తరలించి ఇక్కడ సెక్రటేరియేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో కళాశాల వర్గాలు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెటర్నరీ కళాశాల క్యాంపస్‌ను త్వరలో నిర్మించే రాజధానిలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఎం దృష్టిలో పడిందిలా.. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జాతీయ రహదారి పక్కనే సుందరంగా ఉన్న వెటర్నరీ కళాశాల భవన సముదాయం కనిపించింది. ఆయన పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులతో ఈ భవనం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే సచివాలయం ఏర్పాటుకు పరిశీలించాలని సూచించినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో గన్నవరంలో వెటర్నరీ కళాశాలను 1998లో ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఒకప్పటి బేకన్ ఫ్యాక్టరీలో సుమారు 25 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించారు. ఇక్కడ దాదాపు వందకుపైగా గదులు ఉన్నాయి. కళాశాలకు అతి దగ్గరలో మరో 30 ఎకరాల్లో దాదాపు 25 వేల చదరపు అడుగుల్లో మూడు ఆంతస్తుల అప్మెల్ భవనం, ఖాళీ స్థలం వెటర్నరీ కళాశాల ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలంలో విద్యార్థులకు అవసరమైన పౌల్ట్రీఫారం, పశుగ్రాసం పెంపపం వంటివి చేపట్టారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 328 మంది బీవీఎస్ఈ విద్యార్థులు, 28 మంది పీజీ, ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలకు అనుబంధంగా గన్నవరంలో బోధనాస్పత్రి ఉంది. వెటర్నరీ కళాశాల తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం ధరలు పెరిగినందున రాజధాని కోసం భూముల సేకరణ కష్టం కావడంతో ప్రస్తుతం వెటర్నరీ కళాశాలతోపాటు ఖాళీగా ఉన్న 30 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెటర్నరీ కళాశాలను ప్రత్నామ్నాయంగా గుంటూరు జిల్లాకు తర లిస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. -
కాలేజీలన్నీ లోపాల పుట్టలే!
జేఎన్టీయూ అధికారుల తనిఖీల్లో వెల్లడి బోధనా సిబ్బంది తక్కువే.. మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు నేడు ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్: ల్యాబ్ ఉంటే ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ ఉంటే ల్యాబ్ లేదు.. రెండూ ఉన్నావిద్యా ప్రమాణాల్లేవు.. లైబ్రరీల్లో పుస్తకాల్లేవు, సరైన మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు.. ఇదీ రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి. చాలా కళాశాలల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులేమీ లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లూ లేవు.. ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి ఎన్నో కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ నేతృత్వంలో ఏర్పాటైన అఫిలియేషన్ల కమిటీల కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. 17వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో 16వ తేదీ సాయంత్రానికి ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు కళాశాలలను తనిఖీ చేసిన అధికారులు... రాత్రంతా వాటిని క్రోడీకరించే పనిలో పడ్డారు. కళాశాలల వారీ పరిస్థితులతో కూడిన నివేదికను శనివారం ఉదయమే ప్రభుత్వానికి పంపించేందుకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించగా... అందులో వంద కాలేజీల్లో చాలా ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు తెలిసింది. మిగతా కాలేజీల్లోనూ చాలా వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, మౌలిక సౌకర్యాలు లేనట్లుగా అధికారుల తనిఖీలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటన్నింటినీ పరిశీలించి ఏయే కళాశాలలకు అఫిలియేషన్లు ఇస్తుందనే విషయం శనివారం వెల్లడికానుంది. దీంతో ఆదివారం ఉదయం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయానికి కళాశాలల సంఖ్య, సీట్ల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఏయే కాలేజీలకు అఫిలియేషన్లు వస్తాయి..? ఏయే కాలేజీలకు అనుమతులు రావన్న దానిపై యాజమాన్యాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ లోపాలున్న కాలేజీలకు అనుమతులు కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచే జరిగే వె బ్ ఆప్షన్ల ప్రక్రియలో 220 వరకే కాలేజీలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.