ఆర్‌యూ నియామకాలపై తాత్కాలిక స్టే
Published Thu, Jun 29 2017 11:24 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలు పాటించకుండా చేపట్టిన నియామకాలను నిలుపుదల చేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు డాక్టర్ జి.మల్లికార్జున, డాక్టర్ మల్లెపోగు రవి, డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడారు. రాయలసీమ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వై.నరసింహులు..యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు చేయకుండా అధ్యాపకులు నియామకాలు చేపట్టారని ఆరోపిచారు. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు విజ్ఞప్తిని పెడచెవిన పెడుతూ నియంత ధోరణితో వ్యవహరించారని విమర్శించారు.
Advertisement
Advertisement