సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు సోమవారం తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించారు.
190 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడిసిన్ సీట్లు
యూజీ నీట్–21 తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)కు చెందిన 190 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మలి విడత కౌన్సెలింగ్‌లోనూ కొందరు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సొసైటీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ తెలిపారు. (క్లిక్: అంతా మా ఇష్టం.. పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు)
Comments
Please login to add a commentAdd a comment