Part Time
-
ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్’ గోపీనాథన్
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది. ’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం!
ఒక సిద్ధాంతం లేదు.. కానీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానంటాడు.. ఆ సిద్ధాంతం ఏంటో మాత్రం చెప్పడు! ప్రశ్నించి తీరతానంటాడు.. తీరా సమయం వచ్చే సరికి సీన్లో లేకుండా పోతాడు నమ్మినవాళ్లను నట్టేట ముంచి.. పక్కనోడి జెండా మోయాలనడం బాగా అలవర్చుకున్నాడు ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా.. సీఎం అవుతాడని అభిమానుల కలలు కంటుంటే.. వాటిని తుంచేస్తాడు కులం కులం లేదంటూనే.. కుల రాజకీయాలు చేయాలని తీవ్రంగా యత్నించి భంగపడుతుంటాడు సినిమానా? రాజకీయమా? ఎటూ తేల్చుకోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటాడు పవన్ ఇక పార్ట్ టైం పొలిటీషియనా? .. ఆ విషయం తన నోటితోనే చెప్పేశాడా? కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల సమయంలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. తన అసహనాన్ని బర్రెలు కాస్తూ ప్రకటించిందామె. ఆపై సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఈ-సెలబ్రిటీగా మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేసింది. ఆపై కొందరు నిరుద్యోగులు ఆమెకు అండగా కదిలి వచ్చారు. చందాలేసి మరీ బర్రెలక్క కోసం ప్రచారంలోకి దిగారు. దీంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఆమెపై నాటకీయ పరిణామాల నడుమ ఆమె వర్గంపై జరిగిన దాడి.. మీడియా ముఖంగా ఆమె కన్నీటి పర్యంతం.. అటుపై అనూహ్యంగా లభిస్తున్న మద్దతు చర్చనీయాంశంగా మారాయి. యువత పోటీకి దిగితే.. ఇలాంటి పరిణామాలా? అంటూ ఆమె ప్రశ్నించడం తెలంగాణ సమాజంలో చాలామందిని కదిలించింది కూడా. మరి.. తొమ్మిదిన్నరేళ్లుగా ఓ పార్టీని నడుపుతూ.. అంతకు ముందు ఆరేళ్ల కిందటే మరో పార్టీ యువ విభాగానికి పని చేసిన రాజకీయ అనుభవం ఉండి పవన్ చేస్తోందేంటి?.. టీడీపీ తొత్తు పార్టీ ట్యాగ్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలచేత ‘అన్‌ఫిట్’ అనిపించుకున్న పవన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే ధైర్యం చేయలేదు. అందుకు పార్టీ విస్తరణ, ఉనికిపరమైన కారణాలు ఉండొచ్చు. కానీ, అప్పుడెప్పుడో తొందరపడి 32 సీట్లకు పోటీ అని ప్రకటించుకుని.. చివరాఖరికి బీజేపీ మద్దతుతో 8 సీట్లలో(నామమాత్రమేమో!) పోటీకి దింపుతున్నాడు. పోనీ ఆ అభ్యర్థుల గెలుపు కోసం అయినా తీవ్రంగా యత్నిస్తున్నాడా? అంటే.. ఇక్కడా సీరియస్లెస్ రాజకీయాలే!. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పట్టుమని వారం రోజులు కూడా లేదు. ప్రచారంలోకి దిగిందే ఆలస్యంగా.. ఇప్పుడేమో టైం లేదంటూ నేరుగా ప్రకటన చేశాడు. మీరూ మీరే ఇక చూసుకోవాలని.. మద్దతు ఇవ్వాలని జనసేన శ్రేణులకు సలహా ఇచ్చాడు. అంటే.. ఓటమికి పవన్ ప్రిపేర్ అయిపోయినట్లేనా?. ధరణి విఫలం, పేపర్ లీక్స్.. ఇవి తెలంగాణ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలు. ఇవి పైపై విమర్శలే!. లోతుగా వెళ్లి విమర్శించే ధైర్యం చూపించలేదు. పైగా రాజకీయాల్లో తాను విమర్శలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ కబుర్లు చెబుతున్నాడు. తెలంగాణలో ఎక్కువ తిరగలేదంట. కేటీఆర్‌తో, రేవంత్‌తో స్నేహం ఉందంట.. రాజకీయాలు, స్నేహం వేరట. కానీ, మోదీ నాయకత్వంలో పని చేస్తాడట. తెలంగాణలో, దేశంలోనూ బీజేపీనే అధికారంలోకి రావాలంటున్నాడు. బీజేపీతో కలిసి మనస్ఫూర్తిగా పని చేయాలని.. ఆ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని జనసేన కేడర్‌కు పవన్ పిలుపు ఇస్తున్నాడు. నిన్న వరంగల్‌లో.. ఇవాళ కొత్తగూడెంలో.. పవన్ ఈ సూటి వ్యాఖ్యలే చేశాడు. మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, కనీసం గెలిపించాలని అనే మాట కూడా పవన్ నోట రావడం లేదు. గద్దర్ ఆశయం గెలిపించాలంటూ ఓ భారీ డైలాగ్ కొట్టాడు. మరి గద్దర్ కూతురు కాంగ్రెస్ అభ్యర్థి అనే సంగతి పవన్ మరిచిపోయి ఉంటాడేమో. గత రెండు రోజులుగా ప్రచారంలోకి దిగి పవన్ చేస్తున్న ప్రసంగాలు చూస్తే.. రాజకీయాల్లో ఓనమాల దశలో ఉన్న బర్రెలక్కలాంటి వాళ్లు ఇంతకంటే పరిణితి ప్రదర్శిస్తున్నారనే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. చిన్నవయసులోనే పోటీ.. నామినేషన్ దగ్గరి నుంచి ప్రచారంలోనూ ఆమె కనబరుస్తున్న చిత్తశుద్ధికి, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అటు ఏపీలోనేమో తెలుగు దేశం పార్టీకి మద్దతు.. పొత్తుగా జనసేనను తాకట్టు పెట్టాడు. రేపు ఎన్నికల సమయంలో చంద్రబాబు విసిరే ఐదు పది సీట్లను మహాప్రసాదం అనుకోడని గ్యారెంటీ ఏంటి?. అప్పుడు ప్రచారంలోనూ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే చాలని అనకుండా ఉంటాడా?. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కాబట్టి.. జనసైనిక్స్ ఫిక్స్ అయిపోండి. పవన్ సర్.. ఇక పార్ట్‌టైం పొలిటీషియనే!. :::సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
సాఫ్ట్వేర్ నిపుణులకు ‘పార్ట్‌టైమ్’ ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్‌టైమ్‌గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు. వాళ్లెవరో చెప్పాల్సిందే... రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌తో బోధన చేయించాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది. ఆన్లైన్ క్లాసులు... ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్‌టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. -
యుఐడీఏఐ పార్ట్‌టైం చైర్మన్‌గా నీల్కాంత్..
UIDAI part time chairman Neelkanth Mishra యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, యాక్సిస్ క్యాపిటల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్కాంత్ మిశ్రా కీలక పదవికి ఎంపికయ్యారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పార్ట్ టైమ్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఛైర్పర్సన్, సభ్యులు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు పదవీకాలం కొనసాగుతారు, ఏది ముందుగా ఉంటే అది అని మంగళవారం ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా, ఐఐటీ ఢిల్లీలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొమౌసమ్ పార్ట్ టైమ్ సభ్యులుగా మారనున్నారు. భారత ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో సహా అనేక కమిటీలకు సలహాదారుగా కూడా ఉన్నారు. యుఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారంబోర్డులో ఒక చైర్పర్సన్, ఇద్దరు పార్ట్ టైమ్ సభ్యులు, అథారిటీ మెంబర్-సెక్రటరీ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు.సీనియర్ఐఏఎస్ ఆఫీసర్. ఐటి మంత్రిత్వ శాఖలో మాజీ అడిషనల్సెక్రటరీ అమిత్ అగర్వాల్ జూన్‌లో యుఐడిఎఐ సీఈగా ఎంపికైప సంగతి తెలిసిందే. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) ఎవరీ నీల్కాంత్ మిశ్రా ఐఐటి కాన్పూర్ గోల్డ్‌మెడలిస్ట్. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన మిశ్రా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ గానూ,హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లో కూడా పనిచేశారు. గతంలో జ్యూరిచ్-ఆధారిత క్రెడిట్ సూయిస్లో పనిచేసిన మిశ్రాకు ఆర్థిక రంగంలో రెండు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం ఉంది. క్రెడిట్ సూయిస్లో రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత మే 2023లో యాక్సిస్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్‌గా మిశ్రా బాధ్యతలు చేపట్టారు. APAC స్ట్రాటజీ, ఇండియా ఈక్విటీ స్ట్రాటజీకి సహ-హెడ్‌గా, ఇండియా హెడ్ ఆఫ్ రీసెర్చ్‌గా పనిచేశారు. (అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను) -
పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ
మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్‌కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము. మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్‌కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్‌వాలె అనే వెబ్సైట్లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. వారు లింక్‌లో పంపినఒక వెబ్‌సైట్‌ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది) -
12న ఓయూ పార్ట్‌టైం అధ్యాపక రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు సోమవారం తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించారు. 190 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడిసిన్ సీట్లు యూజీ నీట్–21 తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన 190 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మలి విడత కౌన్సెలింగ్‌లోనూ కొందరు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సొసైటీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ తెలిపారు. (క్లిక్: అంతా మా ఇష్టం.. పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు) -
కరోనాతో మృతి.. టీకా వేసుకుంటే బతికేవాడేమో..
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని సుబేదారి యూనివర్సిటీ పీజీ కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ దబ్బెట మహేశ్(39) గురువారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. మహేశ్‌కు నెల క్రితం కరోనా సోకింది. ఆయనను వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. కొద్దిరోజులకు కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ ఊపరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మహేశ్ కేయూలో రాజనీతి శాస్త్రం పీజీతో పాటు పీహెచ్డీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేశారు. కేయూ పార్ట్ టైం లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మహేశ్ మృతితో కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు, సహచర పార్ట్‌టైం లెక్చరర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేయూ ఎస్డీఎల్సీఈ మాజీ డైరెక్టర్ దినేశ్‌కుమార్, కేయూ అబివృద్ధి అధికారి రాంచంద్రం, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రి, వివిధ సంఘాల బాధ్యులు నివాళులర్పించారు సంతాపం కేయూ ఫ్రొఫెసర్లు దినేశ్‌కుమార్, రామచంద్రం, ఓయూ, కేయూ జేఏసీ నాయకులు సాదురాజేశ్, దుర్గం సారయ్య, విజయ్‌ఖన్నా, స్టాలిన్, విజయ్, పృద్వీ, మోహన్‌రాజ్, సోమలింగం, నర్సింహారావు, శ్రీధర్, నివాస్, దేవోజీ నివాళులు అర్పించారు. కేయూ మొదటి గేట్ వద్ద మహేశ్ చిత్రపటానికి ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కొంగర జగన్ మహేశ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్ చిత్రపటానికి నివాళులర్పించారు. స్వగ్రామంలో విషాదం కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బెట సీతయ్య, కాంతమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేశ్, చిన్న కుమారుడు శ్రీను. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి చెందాడు. ప్రస్తుతం కరోనా కాటుకు మహేశ్ బలవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలిచివేశాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఓయూ, కేయూ జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల బాధ్యులు కోరుతున్నారు. టీకా వేసుకుంటే బతికేవాడేమో.. మహేశ్ ఉన్నత విద్యావంతుడై ఉండి టీకా ఎందుకు వేసుకోలేదు అనే ప్రశ్న అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కరోనాను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గమని ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చైతన్య పరుస్తున్నారు. టీకా వేసుకొని ఉంటే బతికేవాడేమో అని అంతిమయాత్రలో పాల్గొన్న వారు చర్చించుకున్నారు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వల.. లాంగ్ డ్రైవ్ పేరుతో కిడ్నాప్ -
కాలేజీల్లో 1000 పార్ట్‌టైం పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1000 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ పోస్టులను గతంలో లాగా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పార్ట్‌టైమ్ లెక్చరర్ల పేరుతో నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాటిని ప్రభుత్వానికి పంపనుంది. -
ఉద్యోగాల్లో దక్కని సమభాగం
ఆకాశంలో సగం వాళ్లు. అయినా, అవకాశాల్లో సమభాగం దొరకడమే లేదు. చట్టసభల్లో మహిళా బిల్లుకు ఇప్పటికీ మోక్షం దక్కడం లేదు. ఇన్ని ప్రతికూలతల నడుమ వారిది ఎడతెగని ఎదురీత. నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలంటే అష్టకష్టాలు అనివార్యం. అడుగుపెట్టాక అందులో కొనసాగాలంటే అడుగడుగునా అగ్నిపరీక్షలే! ఐటీ రంగంలో మహిళల నియామకాలు పెరుగుతున్నాయి. ఇదొక ఊరట. కేవలం ఒక్కరంగంలో సానుకూలత ఉన్నంత మాత్రాన సరిపోదు కదా! మిగిలిన రంగాల్లోని ఉద్యోగాల మాటేమిటి ఇబ్బందికరమైన పనివేళలు... పనిప్రదేశాల్లో వేధింపులు... ఎదుగుదలకు అడ్డంకిగా మారే లింగవివక్ష... ఇలాంటి పరిస్థితుల్లో కడవరకు కొనసాగుతున్న వారు కొద్దిమందే.. వేధింపులను తట్టుకోలేక కొందరు... వివక్షపై విరక్తి చెంది ఇంకొందరు... ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇదీ మన పరిస్థితి ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కార్పొరేట్ రంగంలో మహిళల భాగస్వామ్యం భారత్‌లోనే అతి తక్కువ. మన దేశంలో కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళలు 23 శాతం మాత్రమే. కార్పొరేట్ రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడంలో అమెరికా 52 శాతం మహిళా ప్రాతినిధ్యంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (48 శాతం), కెనడా (46 శాతం), ఫిన్లాండ్ (44 శాతం) ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ఈ లెక్కల ప్రకారం మన దేశం అట్టడుగు స్థానంలో ఉండటం శోచనీయం. మనదేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఐటీ రంగంలో మహిళల నియామకాలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పుంజుకుంటున్నాయి. అయితే, ఉద్యోగాల్లో దీర్ఘకాలం కొనసాగేందుకు తగిన అనుకూల పరిస్థితులే వారికి గగనమవుతున్నాయి. అందుకే దాదాపు 40 శాతం మంది మహిళలు ఉద్యోగాలను వదులుకోవడానికే సిద్ధపడుతున్నారు. పిల్లల ఆలనాపాలన చూసుకోవడానికి కొందరు ఉద్యోగాలను వదులుకోవాలని భావిస్తుంటే, పనిప్రదేశాల్లో వేధింపులు, లింగవివక్ష తట్టుకోలేక చాలామంది ఉద్యోగాలకు రామ్ రామ్ చెప్పేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వరంగంలో ఈ పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు గానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే మహిళల్లో దాదాపు 40 శాతం మంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలను మానేయాలనుకుంటున్నట్లు ‘అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ (అసోచామ్) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ‘అసోచామ్’ ఈ సర్వే నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పుణే నగరాలను ఈ సర్వే కోసం ఎంపిక చేసుకుంది. ఈ సర్వే ప్రకారం... మహిళలు ఉద్యోగాలు మానేయాలనుకునేందుకు దారి తీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవీ: * పురుషులతో సమానమైన వేతనాలు పొందలేకపోవడం * అనుకూలంగా లేని పనివేళలు * పనిప్రదేశంలో వేధింపులు, లింగ వివక్ష * పనిచేయడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం * తగిన భద్రత లేకపోవడం * కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు * ఉన్నత చదువులు చదవాలనుకోవడం ఇవి మాత్రమే కాదు. పలు సంస్థల్లో యాజమాన్యాల నిర్వాకాలకు విసిగి వేసారిపోయి కూడా పలువురు మహిళలు ఉద్యోగాలను వదులుకోవాలనుకుంటున్నారు. తాము పనిచేసే సంస్థల్లో మహిళలకు భద్రత కరువవుతోందని, మహిళల భద్రత కోసం చట్ట నిబంధనల ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలేవీ యాజమాన్యాలు కల్పించడం లేదని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా, పరిష్కరించే యంత్రాంగమేదీ ఉండటం లేదని కూడా ఈ సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు వాపోవడం గమనార్హం. ‘‘చాలా సంస్థల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం వాళ్లకు చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటం. ఒకేలాంటి అనుభవం ఉన్నా ఇంకా చాలా సంస్థల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు సమాన పారితోషికం ఇవ్వడం లేదు. మహిళల పట్ల వివక్ష కూడా ఎక్కువ. ఈ వివక్ష వల్ల కూడా మహిళా ఉద్యోగుల సంఖ్యను ప్రభావితం చేస్తోంది. ఇక మహిళలు గర్భం ధరించాల్సి వస్తే వాళ్లకు కనీసం 84 రోజుల పాటు సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. కానీ చాలా సంస్థలు ఈ నిబంధనను పాటించడం లేదు. పైగా నిబంధనను పాటించాల్సి వస్తే తాము వేతనాన్ని ఇస్తున్నా, తగిన పనిని రాబట్టుకోలేకపోతున్నామనే భావన ఉంటుంది. ఇక వస్తుత్పాదన రంగాలు, పరిశ్రమల్లో జాబ్ టైమింగ్స్ కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రధాన భూమిక పోషించే అంశం. అందుకే ఈ రంగాలను వదిలి సాఫ్ట్వేర్ రంగంవైపునకు మహిళలు మొగ్గుచూపుతున్నారు’’ - వి. ప్రశాంతి హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఎనిమిదేళ్లు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేశాను. మా వారిది ఐటి ఫీల్డ్. చెన్నైకి ట్రాన్స్ఫర్ అయితే, నేనూ అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మా వారికి బెంగుళూర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ టైమ్‌లో బాబు పుట్టాడు. పనివేళలు సరిగా లేకపోవడం, ఒత్తిడి.. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవనిపించి ఉద్యోగం మానుకున్నాను. - శకుంతల, బెంగుళూరు నేనొక ఐటీ బేస్డ్ కంపెనీలో ఏడాది పాటు జాబ్ చేశాను. రోజూ తొమ్మిది నుంచి పది గంటల పని. ఇచ్చిన టైమ్‌లో వర్క్ పూర్తి చేయాలి. లేదంటే రిమార్క్. ఎంత చేసినా తరగని పని, దానికి తోడు ఉద్యోగ భద్రత లేకపోవడం, టార్గెట్ రీచ్ కాకపోతే ఏమవుతుందో అనే టెన్షన్... దీంతో తిండి మీద కూడా ధ్యాస ఉండేది కాదు. విసుగనిపించి జాబ్ మానేశాను. - శ్రావణి, హైదరాబాద్ -
పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు
ఏలూరు సిటీ : జిల్లాలో పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని ఏపీ రాజీవ్ విద్యామిషన్ ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సమాఖ్య జిల్లా శాఖ అధ్యక్షుడు వీర్ల శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. వారంతా ఈనెల 31లోగా రాజీవ్ విద్యామిషన్ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో ఈ పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు యథావిధిగా కొనసాగేందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లోని ఒక సభ్యుడు నుంచి పనితీరు సం తృప్తికరంగా ఉందనే సర్టిఫికెట్ తీసుకుని దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి వయోపరిమితి లేదని, కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులకైతే ఓసీలకు 39 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 44 సంవత్సరాలు, వికలాంగులకు 49 సంవత్సరాలు పరిమితి ఉందని తెలిపారు. ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో 179, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 22, వర్క్ ఎడ్యుకేషన్‌లో 202 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. నెలకు రూ.6 వేల గౌరవవేతనం ఇస్తారని తెలిపారు. దరఖాస్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయుల వద్ద లభిస్తాయని పేర్కొన్నారు. -
పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్ధంగానే... చక్రం తిప్పుతున్న ఎంఈవోలు మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు కళలు, చేతివృత్తుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సర్వశిక్షా అభియాన్ ద్వారా పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకం జరుగుతోంది. ఈ నియామకాల్లో నిబంధనలను పక్కనపెట్టి ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆరోగ్య విద్య, కుట్లు, అల్లికలు, నృత్యం, నైతిక విద్య తదితరాలను విద్యార్థులకు నేర్పేందుకు జిల్లావ్యాప్తంగా 230 మంది ఇనస్ట్రక్టర్లను నియమించేందుకు అనుమతులొచ్చాయి. ఆర్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో 99, పీఈటీలు 19 మంది, వర్క్ ఎడ్యుకేషన్ 112 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీరు 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వీరి నియామకం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 230 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరంలో గుర్తించి అక్కడ పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను సర్వశిక్షా అభియాన్ విడుదల చేసింది. ఎంపికైన ఇనస్ట్రక్టర్లకు నెలకు రూ. 6వేల వేతనం చెల్లిస్తారు. నిబంధనలు ఉల్లంఘన... వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలున్న ప్రాంతం నుంచే ఈ ఇనస్ట్రక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ బాధ్యతలను పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ తీసుకుంటుంది. మండల పరిధిలో ఉన్న పాఠశాలల్లో పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక పర్యవేక్షణా బాధ్యతలను ఎంఈవోలకు అప్పగించారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకున్న ఎంఈవోలు స్కూలు కాంప్లెక్స్ చైర్మన్, హెచ్ఎం, పాఠశాల యాజమాన్య కమిటీలను పక్కనపెట్టి తమ చిత్తానుసారం తమను ప్రసన్నం చేసుకున్న వారికి ఈ పోస్టులను కేటాయిస్తున్నారనే రోపణలు వస్తున్నాయి. పూర్తయిన జాబితాలను కలెక్టర్, డీఈవో, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారికి సమర్పించాల్సి ఉంది. వారు ఈ జాబితాలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తారు. అయితే పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల ఎంపికలో ఎంఈవోలకు కేవలం పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించినప్పటికీ వారే అన్నీ తామై వ్యవహరిస్తూ జిల్లాలోని అధిక మండలాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతిభావంతులైన అభ్యర్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.