![Neelkanth Mishra appointed part time chairman of UIDAI - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/22/Neelkanth%20Mishra_%20UIDAI.jpg.webp?itok=v4twKYmc)
UIDAI part time chairman Neelkanth Mishra యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, యాక్సిస్ క్యాపిటల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్‌కాంత్ మిశ్రా కీలక పదవికి ఎంపికయ్యారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పార్ట్ టైమ్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఛైర్‌పర్సన్, సభ్యులు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు పదవీకాలం కొనసాగుతారు, ఏది ముందుగా ఉంటే అది అని మంగళవారం ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అలాగే కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా, ఐఐటీ ఢిల్లీలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొమౌసమ్ పార్ట్ టైమ్ సభ్యులుగా మారనున్నారు. భారత ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో సహా అనేక కమిటీలకు సలహాదారుగా కూడా ఉన్నారు.
యుఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారంబోర్డులో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు పార్ట్ టైమ్ సభ్యులు, అథారిటీ మెంబర్-సెక్రటరీ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు.సీనియర్‌ఐఏఎస్ ఆఫీసర్. ఐటి మంత్రిత్వ శాఖలో మాజీ అడిషనల్‌సెక్రటరీ అమిత్ అగర్వాల్ జూన్‌లో యుఐడిఎఐ సీఈగా ఎంపికైప సంగతి తెలిసిందే. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్‌ఐసీ భారీ వాటా కొనుగోలు)
ఎవరీ నీల్‌కాంత్
మిశ్రా ఐఐటి కాన్పూర్ గోల్డ్‌మెడలిస్ట్. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన మిశ్రా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ గానూ,హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లో కూడా పనిచేశారు. గతంలో జ్యూరిచ్-ఆధారిత క్రెడిట్ సూయిస్‌లో పనిచేసిన మిశ్రాకు ఆర్థిక రంగంలో రెండు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం ఉంది. క్రెడిట్ సూయిస్‌లో రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత మే 2023లో యాక్సిస్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్‌గా మిశ్రా బాధ్యతలు చేపట్టారు. APAC స్ట్రాటజీ, ఇండియా ఈక్విటీ స్ట్రాటజీకి సహ-హెడ్‌గా, ఇండియా హెడ్ ఆఫ్ రీసెర్చ్‌గా పనిచేశారు. (అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను)
Comments
Please login to add a commentAdd a comment