ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది.
’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment