Rajesh Gopinathan
-
ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్’ గోపీనాథన్
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది. ’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
టీసీఎస్.. భేష్.. క్యూ4 నికర లాభం రూ. 11,392 కోట్లు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ దేశీ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్ ప్రస్తుత సీఈవో రాజేష్ గోపీనాథన్ నుంచి జూన్1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఆర్డర్ బుక్ జోరు గతేడాది ఆర్డర్‌బుక్ 34.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది. బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇతర హైలైట్స్ ► షేరుకి రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది. ► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి. ► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి. ► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం. ► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది. ► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది. మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్‌బుక్ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్ఎస్ఐ 9 శాతంపైగా పుంజుకుంది. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్ -
గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్!
న్యూఢిల్లీ: ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ టీసీఎస్‌ను త్వరలో వీడనున్న ప్రస్తుత ఎండీ, సీఈవో రాజేష్ గోపీనాథన్ తదుపరి కంపెనీకి సలహాదారుగా సేవలందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోపీనాథన్ టీసీఎస్ నుంచి తప్పుకోనున్నారు. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మరికొంతకాలంపాటు గోపీనాథన్ సేవలను వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గోపీనాథన్‌తో చంద్రశేఖరన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశాలపై టాటా సన్స్, టీసీఎస్ స్పందించడానికి నిరాకరించాయి. విభిన్న టెక్నాలజీ విభాగాల(డొమైన్స్)లోకి విస్తరిస్తున్న టీసీఎస్‌కు నమ్మకమైన, అనుభవజ్ఞులైన వ్యక్తుల ఆవశ్యకత ఉన్నట్లు టాటా గ్రూప్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి సెప్టెంబర్ 15 తదుపరి గోపీనాథన్‌ను టీసీఎస్‌కు సలహాదారు(అడ్వయిజరీ) పాత్రలో వినియోగించుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన కాగా.. ఇలాంటి ప్రణాళికలేవీ లేవని గోపీనాథన్ విలేకరుల సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం! గోపీనాథన్, చంద్రశేఖరన్ రెండున్నర దశాబ్దాలపాటు కలసి పనిచేశారు. ఈ కాలంలో టీసీఎస్ వృద్ధికి గోపీనాథన్ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన హయాంలో కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 82,600 కోట్లు) ఆదాయాన్ని జత చేసుకుంది. కంపెనీ మార్కెట్ విలువకు సైతం 70 బిలియన్ డాలర్లు జమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ నికర లాభం రూ. 10,846 కోట్ల మైలురాయికి చేరిన సంగతి తెలిసిందే! -
భారీ మార్పులేమీ ఉండవు..
న్యూఢిల్లీ: చీఫ్ మారినప్పుడల్లా తమ సంస్థలో విప్లవాత్మకమైన వ్యూహాత్మక మార్పులేమీ ఉండబోవని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త సీఈవోగా నియమితులైన కె. కృతివాసన్ స్పష్టం చేశారు. తమ సంస్థలో అటువంటి సంస్కృతి లేదని ఆయన తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించడానికి మరింతగా కట్టుబడి పని చేస్తామని కృతివాసన్ వివరించారు. టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ గురువారం అకస్మాత్తుగా రాజీనామా ప్రకటించడం, ఆయన స్థానంలో కృతివాసన్ నియమితులవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కృతివాసన్ ఈ విషయాలు తెలిపారు. ‘మా కస్టమర్ల కోసం, వారితో కలిసి పనిచేయాలన్నది మా సంస్థ ప్రధాన సూత్ర. ఇకపైనా అదే ధోరణి కొనసాగుతుంది. నా హయాంలో గొప్ప వ్యూహాత్మక మార్పులేమైనా ఉంటాయని నేను అనుకోవడం లేదు. మీరు (మీడి యా) కూడా అనుకోవద్దు. మా దృష్టంతా కస్టమర్లకు సర్వీసులపైనే ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులు, కస్టమర్లను బట్టి తదనుగుణమైన మార్పులు మాత్రమే ఉంటాయి‘ అని ఆయన చెప్పారు. 22 ఏళ్ల ప్రయాణం అద్భుతం.. టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోపీనాథన్ చెప్పారు. ‘నా కుటుంబం, గ్రూప్ చైర్మన్.. మెంటార్ ఎన్ చంద్రశేఖరన్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. సంస్థలో గడిపిన ప్రతి రోజును ఆస్వాదించాను. కానీ ఇవాళ వివిధ రకాల భావోద్వేగాలు కలుగుతున్నా యి. ఒకవైపు బాధగా ఉంది అదే సమయంలో మ రోవైపు తేలికగానూ ఉంది‘ అని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పారు. ఎప్పు డు తప్పుకుంటారా అని అంతా ఎదురుచూసే వర కూ ఆగడం కన్నా పరిస్థితి బాగున్నప్పుడు నిష్క్ర మించడమే మంచిదని గోపీనాథన్ తెలిపారు. అయి తే, రాజీనామా తర్వాత ప్రణాళికలను గురించి మా త్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కృతివాసన్‌కు బాధ్యతల బదలాయింపు సజావుగా సాగే లా చూడటమే తన తక్షణ కర్తవ్యం అని గోపీనాథన్ వివరించారు. -
టీసీఎస్‌కు షాక్! సీఈవో గోపీనాథన్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టీసీఎస్ ఎండీ, సీఈవో రాజేశ్ గోపీనాథన్ అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో నూతన సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కె.కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలు సాఫీగా బదిలీ అయ్యేందుకు నూతన సారథికి సహకారం అందిస్తారని టీసీఎస్ ప్రకటించింది. కృతివాసన్‌కు టీసీఎస్‌తో 34 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. 1989 నుంచి ఆయన టీసీఎస్‌తోనే కలసి పనిచేస్తున్నారు. తన కెరీర్లో కృతివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తదితర బాధ్యతల్లో పనిచేసినట్టు టీసీఎస్ తెలిపింది. టీసీఎస్ ఎండీ, సీఈవోగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూపు చైర్మన్‌గా పదోన్నతి పొందడంతో.. సీఎఫ్‌వోగా ఉన్న రాజేశ్ గోపీనాథన్ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లుగా సంస్థకు ఎండీ, సీఈవోగా సేవలు అందించారు. టీసీఎస్‌లో 22 ఏళ్లుగా గోపీనాథన్ పనిచేస్తున్నారు. (గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!) ‘‘టీసీఎస్‌లో నా 22 ఏళ్ల ఉద్యోగ మజిలీని ఎంతో ఆస్వాదించాను. చంద్రతో సన్నిహితంగా కలసి పనిచేయడం పట్ల ఆనందంగా ఉంది. నా ఈ మొత్తం ప్రయాణానికి ఆయన మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఈ దిగ్గజ సంస్థకు గడిచిన ఆరేళ్లుగా నాయకత్వం వహించడం పట్ల సంతృప్తికరంగా ఉంది. ఈ కాలంలో అదనంగా 10 బిలియన్ డాలర్ల ఆదాయం, 70 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తోడయింది’’అని గోపీనాథన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఆసక్తులకు సమయం కేటాయించేందుకు ఇదే సరైన సమయమని భావించి తప్పుకుంటున్నట్టు చెప్పారు. -
TCS CEO: రాజేష్ గోపీనాథన్ సంపాదన ఎంతో తెలుసా?
వ్యాపార ప్రపంచంలో ఎదగటానికి కృషి, సంకల్పం, అకుంఠిత దీక్ష వంటివి తప్పనిసరిగా అవసరం. ఇలాంటి కఠినమైన నియమాలతో గొప్పస్థాయికి చేరుకున్న ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లలో రాజేష్ గోపీనాథన్ ఒకరు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న రాజేష్ గోపీనాథన్, సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఎన్ఐటి నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందడానికి అహ్మదాబాద్‌లోని IIM లో చేరాడు. TCS మేనేజింగ్ పార్టనర్ అండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన తర్వాత కంపెనీ వార్షిక ఆదాయాన్ని భారీగా పెంచాడు. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో 26.6 శాతం వృద్ధిని చూపించాడు. రాజేష్ గోపీనాథన్ జీతం 1.5 కోట్లు అని, 2.25 కోట్ల రూపాయలు ప్రయోజనాలు, ఇతర అలవెన్సులు మొత్తం భారీ సంపాదన ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) రాజేష్ గోపీనాథన్ 2022లో బోర్డ్ ఆఫ్ కామర్స్‌కు, UK ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, CII నేషనల్ కౌన్సిల్ వంటి వాటికి మాత్రమే కాకుండా ఇండియా US CEO ఫోరమ్ అండ్ 2001 ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌లో భాగంగా ఉన్నారు. కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించిన్నప్పుడు అతనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2013లో అతను CFOగా నియమితుడయ్యాడు. -
దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాప్ ర్యాంకు దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి ఆర్థిక ఫలితాలలో యస్ అనిపించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో తొలిసారి ఆదాయం రూ. 50,000 కోట్ల మైలురాయిని దాటింది. వెరసి క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15.8 శాతం జంప్‌చేసి రూ. 50,591 కోట్లకు చేరింది. ఇక నికర లాభం 7.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,926 కోట్లను తాకింది. అయితే మార్జిన్లు 1.8 శాతం నీరసించి 25.3 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. లేదంటే ఒక త్రైమాసికంలో నికర లాభం రూ. 10,000 కోట్ల మార్క్‌ను అందుకునేదని తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. 25 బిలియన్ డాలర్లు మార్చితో ముగిసిన గతేడాదిలో టీసీఎస్ తొలిసారి 25.7 బిలియన్ డాలర్ల(రూ. 1,91,754 కోట్లు) టర్నోవర్ సాధించింది. ఇది 16.8 శాతం అధికంకాగా.. నికర లాభం 14.8 శాతం ఎగసి రూ. 38,327 కోట్లకు చేరింది. ఆర్డర్‌బుక్ విలువ కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. 46 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,000కు అధిగమించినట్లు తెలియజేసింది. అయితే ఉద్యోగ వలస(అట్రిషన్ రేటు) అత్యధికంగా 17.4 శాతానికి చేరినట్లు తెలియజేసింది. సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలోనే అత్యధికంగా 25.3 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నికరలాభ మార్జిన్లు 19.6 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. నాలుగో బైబ్యాక్ సవాళ్లను అధిగమిస్తూ మరోసారి పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ నిర్వహణ లాభాలు ఆర్జించినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ శేక్సారియా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. క్యూ4లో రిటైల్, సీపీజీ విభాగం 22.1 శాతం, తయారీ 19 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 18.7 శాతం, టెక్నాలజీ సర్వీసులు 18 శాతం, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 12.9 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు వివరించారు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా 18.7 శాతం, ఇంగ్లండ్ 13 శాతం, కాంటినెంటల్ యూరోప్ 10 శాతం, లాటిన్ అమెరికా 20.6 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 7.3 శాతం, భారత్ 7 శాతం, ఆసియా పసిఫిక్ 5.5 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► క్యూ4లో జత కలసిన 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 10 కొత్త క్లయింట్లు. ► 5 కోట్ల డాలర్లకుపైగా విలువైన 19 కస్టమర్లు కంపెనీ చెంతకు. ► 2 కోట్ల డాలర్ల క్లయింట్లు 40, కోటి డాలర్ల కస్టమర్లు 52 చేరిక. ► క్యూ4లో నికరంగా 35,209 మందికి ఉపాధి. ► ఏడాదిలో నికరంగా 1,03,546 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో రికార్డ్. ► మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కాగా.. 35.6 శాతం మంది మహిళలే. ► కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 39,181 కోట్లుకాగా.. రూ. 31,424 కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల ద్వారా వాటాదారులకు చెల్లించింది. ► ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తామన్న సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం. గతేడాది సైతం ఇదే స్థాయిలో లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ లక్ష మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు తెలియజేశారు. రికార్డ్ ఆర్డర్లు క్యూ4లో అత్యధికంగా 3.533 బిలియన్ డాలర్ల ఇంక్రిమెంటల్ రెవెన్యూ అదనంగా జత కలసింది. 11.3 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్టానికి ఆర్డర్‌బుక్ చేరింది. పూర్తి ఏడాదికి 34.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కలిగి ఉన్నాం. కస్టమర్ల వృద్ధికి, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సహకరించడం ద్వారా 15 శాతం వృద్ధితో గతేడాదిని పటిష్టంగా ముగించాం. కంపెనీ చరిత్రలోనే రికార్డు ఆర్డర్ బుక్‌ను సాధించడంతో భవిష్యత్‌లోనూ పురోగతి బాటలో కొనసాగనున్నాం. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 3,699 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,712–3,656 మధ్య ఊగిసలాడింది. చదవండి: వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..! -
మరో ఘనత సాధించిన టీసీఎస్
దేశంలోని ఐటీ దిగ్గజలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. జూన్ 30 నాటికి టీసీఎస్ మొత్తం శ్రామిక శక్తి 5,09,058కు పెరిగింది. 2021-22 మొదటి మూడు నెలల్లో 20,409 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్న తర్వాత టీసీఎస్ ఐదు లక్షల శ్రామిక శక్తి మైలురాయిని చేరుకుంది. టీసీఎస్ సీఈఓ మాట్లాడుతూ.. " ఇంకా కొత్త నియామకాల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీసీఎస్ శ్రామిక శక్తిలో 36.2 శాతం ఉన్న మహిళలు ఉన్నారు" అని అన్నారు. మొదటి త్రైమాసికంలో కనీసం 4,78,000 మంది ఉద్యోగులకు ఎజిల్ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడింది. అలాగే, 4,07,000 మందికి పైగా కార్మికులకు బహుళ కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 12 నెలల్లో తన ఐటీ సర్వీసెస్ అట్రిషన్ రేటు 8.6 శాతం వద్ద ఉందని, ఇది పారిశ్రామికాంగ అత్యల్పం అని టీసీఎస్ తెలిపింది. 2022 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసిక లాభం 29 శాతం పెరగినట్లు కంపెనీ ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో డిజిటల్ సేవలకు వ్యాపారాల నుంచి అధిక డిమాండ్ రావడం వల్ల లాభాలు వచ్చాయి అని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.7,008 కోట్ల నుంచి రూ.9,008 కోట్లకు పెరిగింది. -
అదరగొట్టిన టీసీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ గతేడాది చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 9,246 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 8,049 కోట్లు నమోదైంది. మొత్తం ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 39,946 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో టీసీఎస్ నికర లాభం రూ. 32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది. ఇది న్యాయపరమైన క్లెయిముల ప్రొవిజన్లు మినహాయించి ప్రకటించిన నికర లాభంకాగా.. నికరంగా చూస్తే రూ. 32,430 కోట్లు ఆర్జించింది. ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన న్యాయవివాదానికి కంపెనీ రూ. 1,218 కోట్లు(16.5 కోట్ల డాలర్లు) కేటాయించింది. ఇక మొత్తం ఆదాయం 4.6 శాతం పుంజుకుని రూ. 1,64,717 కోట్లయ్యింది. అంతక్రితం ఏడాది రూ. 1,56,949 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఆర్డర్‌బుక్ జోరు క్యూ4లో ఆర్డర్‌బుక్ 9.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలోనే అత్యధికంకాగా.. 2021 మార్చికల్లా మొత్తం ఆర్డర్ బుక్ విలువ 17.1 శాతం వృద్ధితో 31.6 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేసింది. క్యూ4లో కొత్తగా 19,388 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 4,88,649కు చేరింది. ఐటీ సర్వీసులలో వలసల రేటు 7.2 శాతంగా నమోదైనట్లు టీసీఎస్ తెలియజేసింది. కోవిడ్–19.. గత మూడు త్రైమాసికాలుగా కోవిడ్–19 నేపథ్యంలోనూ పటిష్ట ఫలితాలను సాధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ముగించినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. మెగా డీల్స్, పరిశ్రమను మించిన వృద్ధి, సిబ్బంది, కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు తదితరాలకు క్యూ4లో సాధించిన మార్జిన్లు విలువను చేకూర్చినట్లు వ్యాఖ్యానించారు. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 3,250 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,338 వద్ద గరిష్టాన్ని, రూ. 3,213 వద్ద కనిష్టాన్ని తాకింది. కొత్త ఏడాదిలోనూ.. గత దశాబ్దంలో కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు, పరిశోధన, నవీకరణ వంటి అంశాలు భవిష్యత్‌లోనూ సాంకేతిక సేవలలో భారీ అవకాశాలకు దారి చూపనున్నాయి. వృద్ధి, ట్రాన్స్ఫార్మేషన్లలో మరింత వాటాను సాధించనున్నాం. కొత్త ఏడాది(2021–22)లో క్లయింట్ల పురోగతి ప్రణాళికలకు సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతల ద్వారా మద్దతివ్వడంలో దృష్టిపెట్టనున్నాం. – టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ -
టీసీఎస్.. భేష్!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కేక పెట్టించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు కరోనా కల్లోలం ప్రభావం కొనసాగుతున్నా, టీసీఎస్ క్యూ3 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి పోయాయి. గత తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని కంపెనీ పేర్కొంది. ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. రూ.8,701 కోట్ల నికర లాభం.... టీసీఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆదాయం రూ.39,854 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.42,015 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా 5 శాతం వృద్ధిని సాధించింది. ఇక డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం సీక్వెన్షియల్‌గా 5 శాతం వృద్ధితో 57,020 డాలర్లకు పెరిగింది. రూ. 6 మధ్యంతర డివిడెండ్...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.11,184 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో 26.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ3లో 26.6 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ, గత ఐదేళ్లలోనే అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్‌ను ఈ క్యూ3లోనే సాధించింది. నికర మార్జిన్ 20.7 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి. అన్ని విభాగాలూ జోరుగానే.... అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి....7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, రెండు నెలల పిదప వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై సమీక్ష జరుపుతారు. ఆల్‌టైమ్ హైకి టీసీఎస్... మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఇటీవలి కాలంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్ హైను తాకిన ఈ షేర్ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్ 32 శాతం లాభపడింది. ఆశావహంగా కొత్త ఏడాదిలోకి సీజనల్ సమస్యలున్నా ఈ క్యూ3లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించాం. కీలకమైన ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, గతంలో కుదుర్చుకున్న భారీ డీల్స్ సాకారం కావడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఏడాదిలోకి ఆశావహంగా అడుగిడుతున్నాం. గతంలో కంటే మార్కెట్ స్థితి మరింతగా పటిష్టమయింది. డీల్స్, ఆర్డర్లు మరింతగా పెరగడంతో మా విశ్వాసం మరింతగా పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్, ఐఓటీ, క్వాలిటీ ఇంజినీరింగ్అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాట్ఫార్మ్ సర్వీసెస్ల కారణంగా మంచి వృద్ధిని సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, సీఈఓ, టీసీఎస్ -
టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. సుమారు రూ. 16,000 కోట్లతో 5.33 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 3,000 వెచ్చించనుంది. బుధవారం బీఎస్ఈలో షేరు ముగింపు ధర రూ. 2,737తో పోలిస్తే ఇది 9% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్ ఈ విషయం వెల్లడించింది. 2017, 2018లో కూడా టీసీఎస్ భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసింది. 2018లో దాదాపు రూ. 16,000 కోట్లతో షేరు ఒక్కింటికి రూ. 2,100 రేటు చొప్పున 7.61 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం రూ. 58,500 కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ సంస్థ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక, మరో ఐటీ సంస్థ విప్రో కూడా అక్టోబర్ 13న షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, క్యూ2లో టీసీఎస్ నికర లాభం రూ. 7,475 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,042 కోట్లతో పోలిస్తే సుమారు 7% క్షీణించింది. తాజా క్యూ2లో అమెరికన్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌తో లీగల్ వివాదానికి సంబంధించి రూ. 1,218 కోట్లు కేటాయించాల్సి రావడంతో ఫలితాలపై ప్రభావం పడిందని టీసీఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 38,977 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ. 40,135 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 4.7%, లాభం 6.7% పెరిగింది. షేరు ఒక్కింటికి రూ.12 చొప్పున టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 15 కాగా నవంబర్ 3న చెల్లింపు జరుగుతుంది. ‘పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్ అవకాశాలపై మరింత ధీమాగా ఉన్నాం‘ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. జీతాల పెంపు.. ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ పెంచామని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో విభాగాల వారీగా చూస్తే బీఎఫ్ఎస్ఐ (6.2 శాతం), రిటైల్ (8.8 శాతం), లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ (6.9 శాతం), టెక్నాలజీ–సర్వీసెస్ (3.1 శాతం) తయారీ (1.4 శాతం) విభాగాలు వృద్ధి నమోదు చేశాయి. కమ్యూనికేషన్స్ మీడియా విభాగం 2.4 శాతం క్షీణించింది. ► సీక్వెన్షియల్‌గా ఉత్తర అమెరికా మార్కెట్ 3.6 శాతం, బ్రిటన్ 3.8 శాతం, యూరప్ 6.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. తాజాగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థల్లో టీపీజీ టెలికం, టయోటా మోటార్స్ నార్త్ అమెరికా మొదలైనవి ఉన్నాయి. ► చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ 2021 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1 నుంచి ఆయన స్థానంలో సమీర్ సక్సారియా బాధ్యతలు చేపడతారు. 1999లో టీసీఎస్‌లో చేరిన సక్సారియా ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం వైస్–ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ► బీఎస్ఈలో టీసీఎస్ షేరు బుధవారం 0.78 శాతం పెరిగి రూ. 2,737 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
‘వీసా ఆంక్షలతో అమెరికాకే తీవ్ర నష్టం’
ముంబై: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథ్ తప్పుపట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో యూఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని గోపినాథ్ హెచ్చరించారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. దేశీయ ఇంజనీర్లు అమెరికా క్లయింట్లకు మెరుగైన సేవలందించారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో నైపుణ్యం ఉన్న టీసీఎస్ ఉద్యోగులు అమెరికాకు సేవలందించారని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతో శ్రమించిన దేశీయ ఐటీ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. కాగా త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ఇదొక జిమ్మిక్కు నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. అయితే, అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటుందని తాము ఊహించలేదని రాజేశ్ గోపినాథ్ తెలిపారు. (చదవండి: నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్) -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
టీసీఎస్ లాభం 8,118 కోట్లు
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ3లో 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించినట్లు టీసీఎస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.8,105 కోట్ల నికర లాభం వచ్చిందని, 0.2 శాతం వృద్ధి సాధించామని టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ రాజేశ్ గోపీనాధన్ తెలిపారు. సీక్వెన్షియల్‌గా 0.9 శాతం వృద్ధి సాధించామని వివరించారు. ఆదాయం రూ.37,338 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.39,854 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడవ మధ్యంతర డివిడెండ్ అని వివరించారు. ఈ డివిడెండ్‌కు రికార్డ్ డేట్ ఈనెల 25 అని, ఈ నెల 31న డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఒడిదుడుకుల వాతావరణంలోనూ మార్జిన్లు పెంచుకోగలిగామని, ఇది తమ వ్యాపార విధాన సత్తాను వెల్లడిస్తోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) వి.రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉండే క్యూ3లో ఆర్డర్ల అమలుపై ప్రధానంగా దృష్టి నిలిపామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఎన్.గణపతి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు...... - ఎబిట్ సీక్వెన్షియల్‌గా 7% పెరిగి రూ.9,974 కోట్లకు చేరింది. - సీక్వెన్షియల్‌గా చూస్తే, మార్జిన్లు 1 శాతం పెరిగి 25 శాతానికి చేరాయి. కరెన్సీ ప్రయోజనాలు, ఆర్డర్ల అమలు కలసివచ్చాయి. - షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) క్యూ3లో 0.1 శాతం వృద్ధితో రూ.21.63కు పెరిగింది. - కార్యకలాపాల నికర నగదు రూ.9,451 కోట్లుగా ఉంది. నికర లాభంలో ఇది 116 శాతానికి సమానం. - వ్యాపార విభాగాల వారీగా చూస్తే... లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగం ఆదాయం 17శాతం పెరిగింది. కమ్యూనికేషన్స్, మీడియా విభాగం 10 శాతం, తయారీ రంగ విభాగం 9 శాతం చొప్పున వృద్ధి చెందాయి. - మార్కెట్ల పరంగా చూస్తే, యూరప్ మార్కెట్లు 16 శాతం, ఉత్తర అమెరికా 4 శాతం, ఏషియా పసిఫిక్ 6 శాతం, భారత మార్కెట్ కూడా 6 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. . - ఈ క్యూ3లో స్థూలంగా టీసీఎస్ 22,390 ఉద్యోగాలను కల్పించింది. ఇక గత ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,46,675గా ఉంది. ఉద్యోగుల వలస (ఆట్రీషన్ రేటు) 12.2 శాతంగా ఉంది. - ఈ క్యూ3లో భారీ సంస్థల నుంచి ఆర్డర్లను సాధించింది. వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన ఐఏజీ టెక్, బేయర్, తదితర సంస్థల నుంచి భారీ ఆర్డర్లను చేజిక్కించుకుంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ.2,218 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్ 19 శాతం లాభపడింది. ఆర్డర్లు జోరుగా ఉన్నాయి... ఈ క్యూ3లో ఆర్డర్ల బుక్ జోరుగా ఉంది. గత కొన్ని క్వార్టర్ల కంటే కంపెనీకి లభించిన ఆర్డర్లు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ క్యూ3లో 600 కోట్ల డాలర్ల ఆర్డర్లను సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి మొత్తం ఆర్డర్లు 22 శాతం వృద్ధితో 1,800 కోట్ల డాలర్లకు పెరిగాయి. – రాజేశ్ గోపీనాధన్, సీఈఓ, ఎమ్డీ, టీసీఎస్ -
టీసీఎస్ బోణీ భేష్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ మెరుగైన ఫలితాలతో బోణీ చేసింది. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం, మార్జిన్ల విషయంలో అంచనాలు మిస్ అయ్యాయి. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.8,131 కోట్లకు పెరిగిందని టీసీఎస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.7,340 కోట్ల నికర లాభం సాధించామని కంపెనీ సీఈఓ ఎమ్డీ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన నికర లాభం (రూ. 8,126 కోట్ల)తో పోల్చితే 0.06 శాతం వృద్ధి నమోదైంది. ఇక గత క్యూ1లో రూ.34,261 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 11% వృద్ధితో రూ.38,172 కోట్లకు పెరిగిందని గోపీనాథన్ పేర్కొన్నారు. 3 నెలల కాలాన్ని పరగణనలోకి తీసుకుంటే, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం. అయితే గత నాలుగు క్వార్టర్లలో ఈ కంపెనీ 16–20% ఆదాయ వృద్ధి సాధిస్తోంది. దీంతో పోల్చితే ఈ క్యూ1లో ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని గోపీనాథన్ తెలిపారు. నిలకడైన ఆరంభం.... కొత్త ఆర్థిక సంవత్సరం నిలకడైన ఆరంభంతో మొదలైందని రాజేశ్ గోపీనాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు వృద్ధి, డిజిటల్ మార్పుల కోసం గణనీయంగానే పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. ఫలితంగా ఈ క్యూ1లో మంచి ఆర్డర్లు, డీల్స్ సాధించామని తెలిపారు. ఈ క్యూ1లో డీల్స్ 25 శాతం వృద్ధితో 570 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో 32 శాతం వాటా ఉన్న డిజిటల్ ఆదాయం ఈ క్యూ1లో 42 శాతం ఎగసిందని గోపీనాథన్ పేర్కొన్నారు. 13% వృద్ధితో రూ.21.67కు ఈపీఎస్... మార్జిన్లు మంచి వృద్దినే సాధించాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాల జోరుతో నగదు నిల్వలు పెరిగాయని, ఈపీఎస్ 13% వృద్ధితో రూ.21.67కు చేరిందని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు... ► ఆదాయం రూపాయల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 11 శాతం, సీక్వెన్షియల్‌గా 0.4 శాతం వృద్ధి చెందింది. ► ఆదాయం డాలర్ల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 9 శాతం వృద్ధి చెందింది. ► గత క్యూ1లో 25 శాతంగా, మార్చి క్వార్టర్లో 25.1 శాతంగా ఉన్న నిర్వహణ మార్జిన్ ఈ క్యూ1లో 24.2 శాతానికి తగ్గింది. నికర మార్జిన్ 21.3 శాతంగా నమోదైంది. వేతన పెంపు, రూపాయి బలపడటం ప్రభావం చూపాయి. ► ఇతర ఆదాయం సీక్వెన్షియల్‌గా 40 శాతం పెరగడంతో లాభదాయకత మెరుగుపడింది. ► స్థూల లాభం(వడ్డీ, ట్యాక్స్‌లను కలుపుకొని) 3 శాతం క్షీణించి రూ.9,220 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి, డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతో టీసీఎస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.2,131 వద్ద ముగిసింది. నగదు తిరిగిచ్చే విధానం కొనసాగుతుంది... డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) తప్పించుకోవడానికి పలు కంపెనీలు ముఖ్యంగా ఐటీ కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేస్తున్నాయి. దీని నుంచి ఆదాయం పొందడానికి కొత్తగా 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో....వాటాదారులకు నగదు నిల్వలను తిరిగిచ్చే విధానాన్ని కొనసాగిస్తామని గోపీనాథన్ తెలిపారు. అయితే ఎలా తిరిగివ్వాలి, తదితర విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్‌ను 35 శాతానికి పెంచే ప్రతిపాదన నేపథ్యంలో, కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా తమ వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. టీసీఎస్‌లో టాటా గ్రూప్‌కు 75 శాతానికి పైగా వాటా ఉంది. టాటా గ్రూప్ మొత్తం నికర లాభంలో టీసీఎస్ వాటాయే 85 శాతం వరకూ ఉంటుంది. ఐదేళ్ల గరిష్టానికి కొత్త కొలువులు.. ఈ క్యూ1లో నికరంగా 12,356 ఉద్యోగాలిచ్చామని, గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని టీసీఎస్ తెలిపింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.36 లక్షలకు పెరిగింది. 30 వేల మంది తాజా గ్రాడ్యుయేట్లకు జాయినింగ్ లెటర్లు ఇచ్చామని, వీరిలో 40% మంది ఈ క్యూ1లో ఉద్యోగాల్లో చేరారని, మిగిలిన వాళ్లు ఈ క్యూ2లో చేరనున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) 11.5%గా ఉంది. క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్. చిత్రంలో సీఎఫ్ఓ రామకృష్ణన్ -
వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో కరోడ్‌పతిల సంఖ్య ఇపుడు హాట్ టాపిగా నిలిచింది. అయితే టీసీఎస్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలను టాటా గ్రూపులో మరో సంస్థ టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. టీసీఎస్ వృద్ధికి, అద్భుతమైన ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్ మేనేజ్మెంట్కు దక్కు తుందన్నారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం అందివ్వాలని సంస్థ భావించిందని చెప్పారు. ఉద్యోగులను నిలుపుకోవడంపై ప్రధానంగా తాము ఎక్కువ దృష్టి పెట్టామని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. అలాగే నూతన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి-ఆధారిత కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్ ఇండియా చొరవను పునరుద్ఘాటించే అవకాశం ఉందన్నారు. కరెన్సీలో దీర్ఘ కాల స్థిరత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్‌లోనే కరీర్ ప్రారంభించినవారు కావడం విశేషం. ఈ వివరాలను ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌లో కోటిపైగా వార్షిక వేతనం అందుకున్నవారి సంఖ్య 91. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవో రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టిసిఎస్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు; బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ .14.1 కోట్లు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె. కృతివాసన్ సంవత్సరానికి రూ .4.3 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటికిపైగా జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్ (72)గా ఉండగా, అతి తక్కువ వయస్కులు 40 ఏళ్ల వయసు ఉద్యోగి. కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్‌మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసిస్ మాదిరిగా టిసిఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు లభించవు. -
టీసీఎస్ సీఈఓకు రూ. 16 కోట్ల వేతనం
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ వేతనం 28 శాతం పెరిగింది. ఏడాది జీతం రూ.16 కోట్లు దాటింది. రాజేష్ గోపీనాథన్‌కు గతేడాదిలో ఈ మొత్తాన్ని వేతనంగా చెల్లించినట్లు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చెల్లింపుల వివరాల్లోకి వెళితే.. జీతం రూ.1.15 కోట్లు, అదనపు ప్రయోజనం రూ.1.26 కోట్లు, కమీషన్ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60 లక్షలు కలిపి మొత్తంగా 16.02 కోట్ల రూపాయిలు చెల్లించింది. 2017–18లో ఈయనకు చెల్లించిన మొత్తం రూ.12.49 కోట్లతో పోల్చితే గతేడాది వేతనం 28 శాతం పెరిగింది. ఇక సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం వేతనం రూ.11.61 కోట్లు (24.9 శాతం పెంపు), సీఎఫ్ఓ రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్లుగా వెల్లడించింది. ఉద్యోగుల జీతాల్లో 2 నుంచి 5 శాతం పెంపు ఉన్నట్లు ప్రకటించింది. -
ఐటీ బోణీ బాగుంది!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19 జనవరి–మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు అయిందని టీసీఎస్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.6,904 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపీనాధన్ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.32,075 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతం వృద్ధితో రూ.38,010 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదాయం పరంగా నాలుగేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి అని పేర్కొన్నారు. ‘‘డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 2,000 కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. వార్షికంగా 13 శాతం, సీక్వెన్షియల్‌గా 2 శాతం వృద్ధి సాధించాం. రానున్న క్వార్టర్లలో ఇదే జోరు కొనసాగుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కో షేర్‌కు రూ.18 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నాం. దీన్ని వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన నాలుగు రోజులకు చెల్లిస్తాం’’ అని వివరించారు. రూపాయి బలపడినప్పటికీ, కంపెనీ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు అధిగమించగలిగామన్నారు. ఎబిట్ మార్జిన్ 25.1 శాతం.. ఎబిట్ మార్జిన్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరిందని రాజేశ్ తెలియజేశారు. ఎబిట్ మార్జిన్ రూ.9,537 కోట్లుగా నమోదైందని తెలిపారు. నికర లాభం, ఆదాయం పరంగా మార్కెట్ విశ్లేషకుల అంచనాలను టీసీఎస్ ఫలితాలు అధిగమించాయి. అయితే ఎబిట్, మార్జిన్ల పరంగా అంచనాలను ఈ ఫలితాలు అందుకోలేకపోయాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి...! బ్యాంకింగ్, ఆర్థిక సేలు, బీమా విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.13,650 కోట్లకు పెరిగిందని రాజేశ్ చెప్పారు. కంపెనీ డిజిటల్ విభాగం ఆదాయం 46 శాతం ఎగసిందని. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం ఆదాయం వాటా 31 శాతంగా ఉందని పేర్కొన్నారు. రిటైల్, సీపీజీ, తయారీ రంగ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. గత మూడు క్వార్టర్ల పరంగా చూస్తే, ఆర్డర్ బుక్ అధికంగా ఉందని రాజేశ్ తెలిపారు. వివిధ క్లయింట్లతో డీల్స్ కుదుర్చుకునే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపారు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభమే ఉండగలదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.31,472 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.1,46,463 కోట్లకు పెరిగాయని రాజేశ్ గోపీనాధన్ వెల్లడించారు. నిర్వహణ మార్జిన్ 25.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. నికరంగా 29,287 ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24,285కు చేరిందని వివరించారు. దీంట్లో మహిళా ఉద్యోగుల శాతం 36 శాతంగా ఉందని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ఇన్ఫీ లాభం రూ.4,078 కోట్లు ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు షేరుకు రూ.10.5 తుది డివిడెండ్... 2019–20 ఆదాయ వృద్ధి అంచనా 7.5–9.5 శాతం బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,690 కోట్లతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 19.1 శాతం వృద్ధి చెంది రూ.18,083 కోట్ల నుంచి రూ.21,539 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,910 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ జోరు...: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ4లో లాభం 12.88% వృద్ధి చెందింది. ఆదాయం 0.6% పెరిగింది. పూర్తి ఏడాదికి చూస్తే..: 2018–19 పూర్తి ఏడాదిలో ఇన్ఫోసిస్ రూ.15,410 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017–18లో నికర లాభం రూ.16,029 కోట్లతో పోలిస్తే 3.9% తగ్గింది. మొత్తం ఆదాయం 17.2% వృద్ధితో రూ.70,522 కోట్ల నుంచి రూ.82,675 కోట్లకు పెరిగింది. గైడెన్స్ ఇలా...: ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 7.5–9.5 శాతం మేర వృద్ధి చెందొచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్) వేసింది. కాగా, విశ్లేషకులు అంచనా వేసిన 8–10 శాతం కంటే కంపెనీ పేర్కొన్న గైడెన్స్ తక్కువగా ఉండటం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► 2018–19 చివరి క్వార్టర్(జనవరి–మార్చి)లో కంపెనీ డిజిటల్ ఆదాయాలు 41.1 శాతం వృద్ధితో 1,035 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. కంపెనీ మొత్తం ఆదాయాల్లో ఈ విభాగం వాటా 33.8 శాతం కావడం గమనార్హం. ► మార్చి చివరినాటికి కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,279కి చేరింది. డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 1,251. క్యూ4లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నిరంజన్ రాయ్‌ను ఈ ఏడాది మార్చి 1 నుంచి నియమించినట్లు కంపెనీ ప్రకటించింది. ► జనవరి–మార్చి క్వార్టర్లో ఇన్ఫీలో నికరంగా 2,622 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మార్చి చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2.28 లక్షలకు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) 20.4 శాతంగా నమోదైంది. ► క్యూ4లో ఇన్ఫీ ఒక్కో షేరుకు రూ.10.5 చొప్పన తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం ఇచ్చిన రూ.7 మధ్యంతర డివిడెండ్‌తో కలిపితే 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం డివిడెండ్ రూ.17.5కు చేరుతుంది. గురువారం ఇన్ఫీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ‘పటిష్టమైన ఫలితాలతో గతేడాది మంచి పురోగతిని సాధించాం. ఆదాయ వృద్ధి, డిజిటల్ వ్యాపారాలతో సహ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదైంది. భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడం, క్లయింట్లతో మంచి సంబంధాలు కూడా దీనికి దోహదం చేసింది. ప్రణాళికాబద్దంగా మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ -
టీసీఎస్ రికార్డు లాభాలు..
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) బంపర్ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8 శాతం వృద్ధితో రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు ఎగిసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైందని కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్లతో పోలిస్తే లాభం 2.6 శాతం పెరిగింది. ఆదాయం 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.8 శాతం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయాల వృద్ధికి ఉత్తర అమెరికా మార్కెట్ ఊతంగా నిలవగా, అటు కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం పనితీరు కూడా దోహదపడింది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది. డిజిటల్ 52 శాతం వృద్ధి.. డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ మొత్తం ఆదాయాల్లో డిజిటల్ వ్యాపార విభాగం వాటా అత్యధికంగా 30.1 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం 8.6 శాతం, ఎనర్జీ యుటిలిటీస్ 18 శాతం వృద్ధి సాధించాయి. అటు ప్రాంతాల వారీగా చూస్తే బ్రిటన్‌లో ఆదాయాలు 25.1%, మిగతా యూరప్ దేశాల్లో ఆదాయాలు 17.6% మేర పెరిగాయి. ఆసియా పసిఫిక్ వ్యాపార విభాగం 12.6%, ఉత్తర అమెరికా 8.2%, భారత్ 9.7%, లాటిన్ అమెరికా వ్యాపార విభాగం 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు.. టీసీఎస్ క్యూ3లో 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో బీఎఫ్ఎస్ విభాగం వాటా 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, రిటైల్ విభాగం వాటా 800 మిలియన్ డాలర్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైచిలుకు కాంట్రాక్టు ఒకటి దక్కించుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు కొన్ని ప్రధాన మార్కెట్లలో నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగినప్పటికీ నిర్వహణ మార్జిన్లను కాపాడుకోగలిగామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.రామకృష్ణన్ తెలిపారు. ఆదాయాలను పెంచుకునే దిశగా కార్యకలాపాలను విస్తరించడం, భవిష్యత్ వృద్ధి సాధనాలపై పెట్టుబడిపైనే టీసీఎస్ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. కొత్త ఆర్డర్ల డిమాండ్‌కి తగ్గట్లుగా మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి రావడంతో.. మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని రామకృష్ణన్ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ క్యూ3లో 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 25.6%కి చేరింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, సబ్–కాంట్రాక్టుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. ఆశావహంగా కొత్త ఏడాది.. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కీలకమైన విభాగాలన్నీ మెరుగైన పనితీరు కనపర్చడంతో 2018లో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి.. 14 త్రైమాసికాల గరిష్టం‘ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. పటిష్టమైన ఆర్డర్ బుక్, క్లయింట్స్, డిజిటల్ సేవల వృద్ధి, భారీ కొత్త ఆర్డర్లు వంటివి టీసీఎస్ సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారాయన. దీంతో కొత్త ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని రాజేష్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. ‘డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు సాధించాం. మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోబోతున్నాం. వీటి ఊతంతో కొత్త సంవత్సరం ఆశావహంగా ఉండబోతోంది‘ అని ఆయన తెలిపారు. తమ క్లయింట్లు.. ఐటీ వ్యయాల్లో కోత విధించే సూచనలేమీ కనిపించలేదని, అయితే మార్చి క్వార్టర్ మధ్యలో మాత్రమే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు సాధించేంతగా టీసీఎస్ పటిష్టమైన స్థితిలో ఉందని గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, యూరప్ దేశాలు, బ్రిటన్‌లో ఆర్థిక సేవల విభాగం కొంత మందగించవచ్చని, రిటైల్ విభాగం ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యూ3 ముగిసేనాటికి కంపెనీ చేతిలో రూ. 43,000 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉన్నాయని గోపీనాథన్ చెప్పారు. తమ వ్యూహాలకు అనువైన సంస్థల కొనుగోలు అవకాశాల అన్వేషణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 6వేల పైచిలుకు నియామకాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నికరంగా 6,827 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వార్షికంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 27,049 మేర పెరిగినట్లయింది. గడిచిన పన్నెండు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఐటీ పరిశ్రమతో పోలిస్తే అత్యల్పంగా 11.2 శాతంగా ఉంది. 2,92,000 మందికి డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణనిచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. టీసీఎస్ షేరు గురువారం బీఎస్ఈలో 0.02 శాతం పెరిగి రూ. 1,888.15 వద్ద క్లోజయ్యింది. -
భారీగా పెరిగిన టీసీఎస్ సీఈవో వేతనం
ముంబై : దేశంలో అతిపెద్ద టెక్ దిగ్గజంగా పేరున్న టీసీఎస్‌ను నడిపిస్తున్న సీఈవో రాజేష్ గోపినాథన్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతానాన్ని గతేడాది కంటే ఈ ఏడాది రెండింతలు చేసింది ఆ కంపెనీ. 2018 ఆర్థిక సంవత్సరంలో గోపినాథన్ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఆర్జించారని, ఇది 2017 ఆర్థిక సంవత్సరానికి రెండింతలు ఎక్కువని కంపెనీ తన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. టాప్ జాబ్‌కు ఆయన్ను ఎంపిక చేసిన అనంతరమే ఈ పెంపును కంపెనీ భారీగా చేపట్టింది. అంతకముందు గోపినాథన్ టీసీఎస్‌లో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. గోపినాథన్ అందుకునే రెమ్యునరేషన్లో రూ.1.02 కోట్ల బేస్ శాలరీ, రూ.10 కోట్ల కమిషన్, రూ. 86.8 లక్షల ఇతర అలవెన్స్‌లు, ఇతరాత్రవి ఉన్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో ఆయన కేవలం రూ.6.2 కోట్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం గోపినాథన్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్, సాధారణ టీసీఎస్ ఉద్యోగి అందుకునే రెమ్యునరేషన్ ఆర్జించే స్థాయి కంటే 212 సార్లు ఎక్కువ. ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలను కూడా కంపెనీ బయటికి విడుదల చేసింది. వారిలో టాప్‌లో రెండో స్థానంలో ఉన్న సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం రూ.9 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పొందుతున్నట్టు తెలిసింది. ఈయన కూడా ముందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.6.15 కోట్లను మాత్రమే పరిహారాలుగా పొందేవారు. 2017 ఫిబ్రవరిలోనే వీరిద్దరూ తమ బాధ్యతలను స్వీకరించారు. గోపినాథన్ 2001 నుంచి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో కంపెనీ సీఎఫ్ఓగా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్‌లో కూడా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. మార్చి క్వార్టర్ ఫలితాల సందర్భంగా క్వార్టర్లీ ఇచ్చే వేరియబుల్ పేను 120 శాతం ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చిన మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రయోజనాలను ఉద్యోగులకు చేరవేస్తామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపులు 2 శాతం నుంచి 6 శాతం వరకు ఉంటాయని కంపెనీ చెప్పింది. -
అంచనాలకు తగ్గట్టు టీసీఎస్ ఫలితాలు
ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకు తగ్గ ఫలితాలను వెల్లడించింది. 2017 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో క్వార్టర్- క్వార్టర్‌కు నికర లాభాలు 1.3 శాతం పెరిగి రూ.6,531 కోట్లగా రికార్డైనట్టు టీసీఎస్ పేర్కొంది. 2017 సెప్టెంబర్ క్వార్టర్లో ఈ లాభాలు రూ.6,443 కోట్లగా ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ రూ.6532.70 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. వీరి అంచనాలకు తగ్గట్లే టీసీఎస్ తన లాభాలను ప్రకటించింది. త్రైమాసిక సమీక్ష సందర్భంగా కంపెనీ మొత్తం ఆదాయం క్వార్టర్‌కు 1.32 శాతం పెరిగి రూ.31,774 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. ఫలితాల వెల్లడి క్రమంలో ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిండెట్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ మూడో మధ్యంతర డివిండెట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కు 2018 జనవరి 31 వరకు చెల్లించనున్నట్టు టీసీఎస్ తెలిపింది. ఫైనాన్స్, కాస్ట్లకు ముందు కంపెనీ లాభాలు 2 శాతం పెరిగి రూ.8651 కోట్లగా ఉన్నట్టు టీసీఎస్ పేర్కొంది. 50 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో ముగ్గురు క్లయింట్లను, 20 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో ఏడుగురిని, 10 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో తొమ్మిది మందిని, 5 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో 15 మంది క్లయింట్లను చేర్చుకున్నట్టు టీసీఎస్ పేర్కొంది. ఈ క్వార్టర్లో తాము తొలిసారి 50 మిలియన్ ప్లస్ డాలర్ల డీల్‌పై సంతకం చేసినట్టు టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ తెలిపారు. డిజిటల్ టెక్నాలజీస్‌లో తాము ఎంతో కీలకమైన మైలురాయిని అధిగమించినట్టు పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ బేసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ3లో 39,0880కి పెరిగింది. స్థూలంగా కంపెనీలోకి తీసుకున్న ఉద్యోగులు 12,534 మంది ఉండగా... నికరంగా 1,667 మంది ఉన్నారు.ఫలితాల ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేర్లు 0.67 శాతం నష్టంలో రూ.2,788.40 వద్ద స్థిరపడ్డాయి. -
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు
ముంబై: టాటా మిస్త్రీ బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో కీలక నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు. టీసీఎస్ విజన్ రోడ్ మ్యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని టీసీఎస్ కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్ చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు. టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ తదితర ప్రముఖులు చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు.