వ్యాపార ప్రపంచంలో ఎదగటానికి కృషి, సంకల్పం, అకుంఠిత దీక్ష వంటివి తప్పనిసరిగా అవసరం. ఇలాంటి కఠినమైన నియమాలతో గొప్పస్థాయికి చేరుకున్న ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లలో రాజేష్ గోపీనాథన్ ఒకరు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న రాజేష్ గోపీనాథన్, సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఎన్ఐటి నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందడానికి అహ్మదాబాద్‌లోని IIM లో చేరాడు.
TCS మేనేజింగ్ పార్టనర్ అండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన తర్వాత కంపెనీ వార్షిక ఆదాయాన్ని భారీగా పెంచాడు. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో 26.6 శాతం వృద్ధిని చూపించాడు. రాజేష్ గోపీనాథన్ జీతం 1.5 కోట్లు అని, 2.25 కోట్ల రూపాయలు ప్రయోజనాలు, ఇతర అలవెన్సులు మొత్తం భారీ సంపాదన ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
(ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!)
రాజేష్ గోపీనాథన్ 2022లో బోర్డ్ ఆఫ్ కామర్స్‌కు, UK ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్, CII నేషనల్ కౌన్సిల్ వంటి వాటికి మాత్రమే కాకుండా ఇండియా US CEO ఫోరమ్ అండ్ 2001 ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌లో భాగంగా ఉన్నారు. కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించిన్నప్పుడు అతనికి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2013లో అతను CFOగా నియమితుడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment