ముంబై: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథ్ తప్పుపట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో యూఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని గోపినాథ్ హెచ్చరించారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. దేశీయ ఇంజనీర్లు అమెరికా క్లయింట్లకు మెరుగైన సేవలందించారని గుర్తు చేశారు.
గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో నైపుణ్యం ఉన్న టీసీఎస్ ఉద్యోగులు అమెరికాకు సేవలందించారని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతో శ్రమించిన దేశీయ ఐటీ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. కాగా త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ఇదొక జిమ్మిక్కు నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. అయితే, అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటుందని తాము ఊహించలేదని రాజేశ్ గోపినాథ్ తెలిపారు. (చదవండి: నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్)
Comments
Please login to add a commentAdd a comment