న్యూఢిల్లీ: చీఫ్ మారినప్పుడల్లా తమ సంస్థలో విప్లవాత్మకమైన వ్యూహాత్మక మార్పులేమీ ఉండబోవని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త సీఈవోగా నియమితులైన కె. కృతివాసన్ స్పష్టం చేశారు. తమ సంస్థలో అటువంటి సంస్కృతి లేదని ఆయన తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించడానికి మరింతగా కట్టుబడి పని చేస్తామని కృతివాసన్ వివరించారు. టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ గురువారం అకస్మాత్తుగా రాజీనామా ప్రకటించడం, ఆయన స్థానంలో కృతివాసన్ నియమితులవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కృతివాసన్ ఈ విషయాలు తెలిపారు. ‘మా కస్టమర్ల కోసం, వారితో కలిసి పనిచేయాలన్నది మా సంస్థ ప్రధాన సూత్ర. ఇకపైనా అదే ధోరణి కొనసాగుతుంది. నా హయాంలో గొప్ప వ్యూహాత్మక మార్పులేమైనా ఉంటాయని నేను అనుకోవడం లేదు. మీరు (మీడి యా) కూడా అనుకోవద్దు. మా దృష్టంతా కస్టమర్లకు సర్వీసులపైనే ఉంటుంది. మార్కెట్‌లో పరిస్థితులు, కస్టమర్లను బట్టి తదనుగుణమైన మార్పులు మాత్రమే ఉంటాయి‘ అని ఆయన చెప్పారు.
22 ఏళ్ల ప్రయాణం అద్భుతం..
టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోపీనాథన్ చెప్పారు. ‘నా కుటుంబం, గ్రూప్ చైర్మన్.. మెంటార్ ఎన్ చంద్రశేఖరన్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. సంస్థలో గడిపిన ప్రతి రోజును ఆస్వాదించాను. కానీ ఇవాళ వివిధ రకాల భావోద్వేగాలు కలుగుతున్నా యి. ఒకవైపు బాధగా ఉంది అదే సమయంలో మ రోవైపు తేలికగానూ ఉంది‘ అని ఆయన తెలిపారు.
కంపెనీ ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పారు. ఎప్పు డు తప్పుకుంటారా అని అంతా ఎదురుచూసే వర కూ ఆగడం కన్నా పరిస్థితి బాగున్నప్పుడు నిష్క్ర మించడమే మంచిదని గోపీనాథన్ తెలిపారు. అయి తే, రాజీనామా తర్వాత ప్రణాళికలను గురించి మా త్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కృతివాసన్‌కు బాధ్యతల బదలాయింపు సజావుగా సాగే లా చూడటమే తన తక్షణ కర్తవ్యం అని గోపీనాథన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment