new CEO
-
భారతీయ అమెరికన్‌కు యూఎస్ బ్యాన్‌కార్ప్ పగ్గాలు
హ్యూస్టన్: ఫైనాన్షియల్ సర్విసుల్లో ఉన్న యూఎస్‌కు చెందిన యూఎస్ బ్యాన్‌కార్ప్ తదుపరి సీఈవోగా గుంజన్ కేడియా నియమితులయ్యారు. తద్వారా కంపెనీకి నాయకత్వం వహించనున్న మొదటి భారతీయ అమెరికన్‌గా నిలిచారు. యూఎస్‌లోని అతిపెద్ద ఆర్థిక సంస్థలలో యూఎస్ బ్యాన్‌కార్ప్ ఒకటి. ఏప్రిల్ 15న జరిగే వార్షిక వాటాదారుల సమావేశం తర్వాత ఆమె కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే డైరెక్టర్ల బోర్డులో కూడా చేరనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పదవి స్వీకరించనున్న ఆండీ సెసిరీ స్థానాన్ని 54 ఏళ్ల కేడియా భర్తీ చేస్తారు. ఢిల్లీకి చెందిన గుంజన్ 2016 నుండి యూఎస్ బ్యాన్కార్ప్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. స్టేట్ స్ట్రీట్ ఫైనాన్షియల్, బీఎన్వై మెలన్, మెకిన్సీ అండ్ కంపెనీ, పీడబ్ల్యూసీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహించారు. న్యూ యార్క్‌కు చెందిన మ్యాగజీన్ అమెరికన్ బ్యాంకర్ ప్రకటించిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జా బితాలో ఏడుసార్లు చోటు సంపాదించారు. -
డీబీఎస్ బ్యాంక్ సీఈవోగా రజత్ వర్మ
సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూప్ (DBS) తమ డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రజత్ వర్మను నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం మేరకు మార్చి 1 నుండి డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా రజత్ వర్మ బాధ్యతలు స్వీకరిస్తారని డీబీఎస్ ప్రకటించింది.ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (IBG) హెడ్‌గా ఉన్న వర్మ, ఫిబ్రవరి 28న సురోజిత్ షోమ్ రిటైర్మెంట్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కొత్త పాత్రలో వర్మ డీబీఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం అవుతారు.రజత్ వర్మ గురించి.. అనుభవజ్ఞుడైన బ్యాంకర్ అయిన వర్మ లావాదేవీల బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, స్థిరమైన ఫైనాన్స్, మైక్రో అండ్ ఎస్ఎంఈ (SME) బ్యాంకింగ్, అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్‌తో సహా వినియోగదారు, కార్పొరేట్ బ్యాంకింగ్‌లో 27 సంవత్సరాల ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.2023 జూన్‌లో ఐబీజీ హెడ్‌గా డీబీఎస్‌లో చేరినప్పటి నుండి ఆయన అన్ని క్లయింట్ విభాగాలలో వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం, కొత్త కస్టమర్ల సముపార్జనను వేగవంతం చేయడం, విస్తృతమైన వృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైంది.రజత్ వర్మ నాయకత్వంలో డీబీఎస్ 2024లో గ్లోబల్ ఫైనాన్స్ నుంచి సస్టైనబుల్ ఫైనాన్స్ ఇండియా బెస్ట్ బ్యాంక్‌గా ఎంపికైంది. డీబీఎస్‌లో చేరడానికి ముందు ఆయన హెచ్ఎస్బీసీ (HSBC) ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్, కమర్షియల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్‌గా ఉన్నారు.“బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన రజత్ 18 నెలల క్రితం మాతో చేరినప్పటి నుండి మా ఇండియా ఐబీజీ వ్యాపారాన్ని పటిష్టం చేశారు. మా బలమైన ప్లాట్‌ఫామ్‌తో రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధిలో పాల్గొనడాన్ని డీబీఎస్ కొనసాగిస్తుంది. రజత్ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను’’ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు.డీబీఎస్ గురించి..డీబీఎస్ అనేది 19 దేశాల్లొ ఉనికిని కలిగి ఉన్న ఆసియాలో ప్రముఖ ఆర్థిక సేవల సమూహం. సింగపూర్‌లో లిస్ట్ అయిన ఈ గ్రూప్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. 2024లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌పై దాని దృష్టికి అనుగుణంగా, గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా డీబీఎస్ సస్టైనబుల్ ఫైనాన్స్‌లో భారతదేశానికి ఉత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. అంతే కాకుండా 2020 నుండి 2022 వరకు వరుసగా మూడు సంవత్సరాలు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుల ఫోర్బ్స్ జాబితాలో భారత్‌లోని మొదటి 3 స్థానాల్లో డీబీఎస్ బ్యాంక్ నిలిచింది.డీబీఎస్ బ్యాంక్ భారతదేశంలో 30 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. 1994లో ముంబైలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద విదేశీ బ్యాంకులలో మొదటిది. దేశంలోని పెద్ద, మధ్యస్థ, చిన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు విస్తృత సేవలు అందిస్తోంది. 2020 నవంబర్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనమైంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఇప్పుడు భారత్‌లోని 19 రాష్ట్రాల్లో సుమారు 500 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. -
టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్వివా’కి కొత్త సీఈవో
టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అయిన డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కామ్‌వివాకి కొత్త సీఈవో నియమితులయ్యారు. రాజేష్ చంద్రమణిని సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.2024 మేలో పదవీ విరమణ చేసిన మనోరంజన్ 'మావో' మహాపాత్ర నుంచి రాజేష్ చంద్రమణి పగ్గాలు చేపట్టారు. కాగా కామ్వివా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మహాపాత్ర కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రాజేష్ చంద్రమణి గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఆయన అక్కడ కమ్యూనికేషన్స్, మీడియా & ఎంటర్టైన్మెంట్ విభాగంలో యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, జపాన్, భారత్‌లో వ్యూహాత్మక మార్కెట్లకు బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. -
పెప్సికో ఇండియా సీఈఓగా జాగృత్ కొటేచా
ప్రముఖ ఆహార, పానీయాల తయారీ సంస్థ పెప్సికో ఇండియా సీఈఓగా 'జాగృత్ కొటేచా' (Jagrut Kotecha) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'అహ్మద్ ఎల్ షేక్'కు కంపెనీ మిడిల్ ఈస్ట్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొటేచాను సీఈఓగా ఎంపిక చేశారు. కొటేచా ముంబై యూనివర్సిటీ నుంచి బీఈ, నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత క్యాడ్బరీ ఇండియా సేల్స్‌లో చేరి 1994 వరకు కొనసాగారు. ఆ తరువాత పెప్సికో ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టి 1997లో ప్రాంతీయ సేల్స్ మేనేజర్‌గా, 1999లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, బృనియా, మంగోలియా దేశాల్లో కూడా పనిచేశారు. జాగృత్ కొటేచా పెప్సికో ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా పెప్సికో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఏషియా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజీన్ విల్లెమ్సెన్ మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీకు కీలకమైన మార్కెట్ అని, ఇది కొటేచా నేతృత్వంలో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! గత కొంత కాలంగా పెప్సికో కుటుంబంలోనే ఉన్న కొటేచా భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్సికో ఇండియా గత సెప్టెంబర్‌లో రూ. 778 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని నల్బారిలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోకా’ శ్రీనివాస్ ఎన్నిక
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టరుగా శ్లోకా అడ్వరై్టజింగ్ ఎండీ, సీఈవో కె. శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. డైరెక్టర్ల బోర్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండోసారి ఎవరైనా ఎన్నికవడం ఇదే ప్రథమం. అడ్వరై్టజింగ్, మార్కెటింగ్‌లో శ్రీనివాస్‌కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. డైరెక్టర్ల బోర్డుకు మరోసారి ఎన్నికవడంపై శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ వ్యాపార విధానాలు అమలయ్యేలా చూసేందుకు బోర్డు సభ్యులతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా గ్రూప్ ఎం మీడియా సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. అలాగే, హవాస్ మీడియాకు చెందిన రాణా బారువా ఏకగ్రీవంగా వైస్–ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. -
ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?
OpenAI CEO: 'చాట్‌జీపీటీ'(ChatGPT) సృష్టి కర్త 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓగా ఓపెన్ఏఐ తొలగించిన వెంటనే.. ఈ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మీరా మురాటి' (Mira Murati) స్వీకరించింది. ఓపెన్ఏఐ కొత్త సీఈఓ మీరా ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అల్బేనియాలో జన్మించిన మీరా మురాటి ఉన్నత చదువులు కోసం 16 ఏళ్ల వయసులోనే కెనడాకు వెళ్ళింది. డార్ట్మౌత్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే హైబ్రిడ్ రేస్ కారును నిర్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన ఈమె టెస్లాలో స్టూడెంట్ ఇంటర్న్‌గా పనిచేసి మోడల్ ఎక్స్ వాహనం తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తరువాత 2018లో ఓపెన్ఏఐలో చేరి సూపర్కంప్యూటింగ్పై పని చేయడం ప్రారంభించింది. అంతకంటే ముందు లీప్ మోషన్లో రెండేళ్లు పనిచేసింది. 2022లో ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందింది. టెక్నాలజీ మీద మంచి పట్టు, వ్యాపారంలో మెళకువలు కలిగిన 'మీరా మురాటి' కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసించి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ వెల్లడిస్తుంది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే! శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణం బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే విషయంలో అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేకపోవడం వల్ల సీఈఓగా తొలగించింది. -
యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని నియమితులయ్యారు. వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ వెంకటేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐలో డిçప్యూటీ ఎండీగా వ్యవహరించడంతో పాటు ఆర్బీఐ, ఆర్థిక శాఖలు ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ సభ్యుడిగా సేవలు అందించారు. దేశీ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఇటు పరిశ్రమ, అటు నియంత్రణ సంస్థతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్‌గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్‌ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్‌గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్‌గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్‌గ్రాడ్‌కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్‌కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్‌కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్‌బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్‌లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్‌లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్‌దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్‌పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్‌నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
వీఎల్సీసీ సీఈవోగా వికాస్ గుప్తా
న్యూఢిల్లీ: వెంటనే అమల్లోకి వచ్చే విధంగా వికాస్ గుప్తాను కొత్త సీఈవోగా నియమించినట్లు బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్ వీఎల్సీసీ పేర్కొంది. జయంత్ ఖోస్లా స్థానే వికాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2022 డిసెంబర్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడంతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కార్లయిల్ నిర్వహణలోకి వీఎల్సీసీ చేరింది. కాగా.. గుప్తా ఇంతక్రితం నైకాకు చెందిన ఈబీటూబీ బిజినెస్(సూపర్‌స్టోర్)కు సీఈవోగా వ్యవహరించారు. గ్లోబల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లోనూ పనిచేశారు. 2019–21 మధ్య చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. తొలుత ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)లో కెరీర్‌ను ప్రారంభించిన గుప్తా వివిధ హోదాలలో 21 ఏళ్లపాటు సేవలందించారు. 1989లో ఏర్పాటైన వీఎల్సీసీ గ్రూప్ ప్రస్తుతం స్కిన్‌కేర్, బ్యూటీ, వెల్నెస్ విభాగాలలో మల్టీఔట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది. -
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
హీరో మోటోకార్ప్ కొత్త సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సీఈవోను ప్రటించింది. ప్రస్తుతం సీఎఫ్‌వోగా ఉన్న నిరంజన్ గుప్తాకు ప్రమోషన్ ఇచ్చి మరీ సీఈవోగా నియమించింది. గుప్తా నియామకం 2023 మే 1వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. అయితే కొత్త సీఎఫ్‌వో ఎవరుఅనేది ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, హార్లే డేవిడ్సన్, జీరో మోటార్‌సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంలో నిరంజన్ కీలక పాత్ర పోషించారు. గుప్తా ఏథర్ ఎనర్జీ, హెచ్‌ఎంసిఎల్ కొలంబియా, హెచ్ఎంసి ఎంఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు. నిరంజన్ హీరో మోటోకార్ప్‌లో చేరడానికి ముందు మూడేళ్లు వేదాంతలో, 20 సంవత్సరాలు యూనిలీవర్లో పనిచేశారు. గుప్తా సీఈవోగా ఎదగడంపై హీరో మోటోకార్ప్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోల్ టైమ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంతోషంప్రకటించారు. కాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పవన్ ముంజాల్ కొనసాగనున్నారు. -
ఆహా సీఈవోగా రవికాంత్ సబ్నవీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సీఈవోగా రవికాంత్ సబ్నవీస్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న అజిత్ ఠాకూర్ .. బోర్డ్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. సబ్నవీస్ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఆయన అపార అనుభవం ఆహా వృద్ధికి తోడ్పడగలదని సంస్థ ప్రమోటర్ రాము రావు జూపల్లి తెలిపారు. కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తేవడంలో అజిత్ కీలక పాత్ర పోషించారని, ఇకపైనా ఆహా స్టూడియో మొదలైన అంశాల్లో ఆయన మార్గదర్శకత్వం వహిస్తారని ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ పేర్కొన్నారు. విశిష్టమైన ప్రోగ్రామ్‌లతో వీక్షకులకు ఆహాను మరింత చేరువ చేసేందుకు ఆహా బృందం కృషి చేస్తుందని సబ్నవీస్ చెప్పారు. స్టార్ టీవీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, హెయిన్జ్ ఇండియా వంటి పలు రంగాల సంస్థల్లో వివిధ హోదాల్లో సబ్నవీస్కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. -
స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్
న్యూయార్క్: అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: 31 వేల మంది పైలట్లు కావాలి.. భవిష్యత్‌లో ఫుల్ డిమాండ్ మార్చి 23న జరిగే స్టార్‌బక్స్ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశానికి ఆయన సారథ్యం వహిస్తారు. కంపెనీ అధిక వృద్ధి బాటలో నడిపించేందుకు భాగస్వాములందరితో కలిసి పని చేయనున్నట్లు నరసింహన్ తెలిపారు. గత సీఈవో హొవార్డ్ షుల్జ్ స్థానంలో నరసింహన్ నియామకాన్ని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! పుణె విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన నరసింహన్ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. బహుళజాతి దిగ్గజాలు మెకిన్సే అండ్ కంపెనీ, పెప్సీకో, రెకిట్ బెన్కిసర్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. నరసింహన్‌కు 30 ఏళ్ల పాటు కన్జూమర్ గూడ్స్ వ్యాపార విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ -
భారీ మార్పులేమీ ఉండవు..
న్యూఢిల్లీ: చీఫ్ మారినప్పుడల్లా తమ సంస్థలో విప్లవాత్మకమైన వ్యూహాత్మక మార్పులేమీ ఉండబోవని ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త సీఈవోగా నియమితులైన కె. కృతివాసన్ స్పష్టం చేశారు. తమ సంస్థలో అటువంటి సంస్కృతి లేదని ఆయన తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించడానికి మరింతగా కట్టుబడి పని చేస్తామని కృతివాసన్ వివరించారు. టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ గురువారం అకస్మాత్తుగా రాజీనామా ప్రకటించడం, ఆయన స్థానంలో కృతివాసన్ నియమితులవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కృతివాసన్ ఈ విషయాలు తెలిపారు. ‘మా కస్టమర్ల కోసం, వారితో కలిసి పనిచేయాలన్నది మా సంస్థ ప్రధాన సూత్ర. ఇకపైనా అదే ధోరణి కొనసాగుతుంది. నా హయాంలో గొప్ప వ్యూహాత్మక మార్పులేమైనా ఉంటాయని నేను అనుకోవడం లేదు. మీరు (మీడి యా) కూడా అనుకోవద్దు. మా దృష్టంతా కస్టమర్లకు సర్వీసులపైనే ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులు, కస్టమర్లను బట్టి తదనుగుణమైన మార్పులు మాత్రమే ఉంటాయి‘ అని ఆయన చెప్పారు. 22 ఏళ్ల ప్రయాణం అద్భుతం.. టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోపీనాథన్ చెప్పారు. ‘నా కుటుంబం, గ్రూప్ చైర్మన్.. మెంటార్ ఎన్ చంద్రశేఖరన్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. సంస్థలో గడిపిన ప్రతి రోజును ఆస్వాదించాను. కానీ ఇవాళ వివిధ రకాల భావోద్వేగాలు కలుగుతున్నా యి. ఒకవైపు బాధగా ఉంది అదే సమయంలో మ రోవైపు తేలికగానూ ఉంది‘ అని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పారు. ఎప్పు డు తప్పుకుంటారా అని అంతా ఎదురుచూసే వర కూ ఆగడం కన్నా పరిస్థితి బాగున్నప్పుడు నిష్క్ర మించడమే మంచిదని గోపీనాథన్ తెలిపారు. అయి తే, రాజీనామా తర్వాత ప్రణాళికలను గురించి మా త్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కృతివాసన్‌కు బాధ్యతల బదలాయింపు సజావుగా సాగే లా చూడటమే తన తక్షణ కర్తవ్యం అని గోపీనాథన్ వివరించారు. -
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
టీసీఎస్‌కు షాక్! సీఈవో గోపీనాథన్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టీసీఎస్ ఎండీ, సీఈవో రాజేశ్ గోపీనాథన్ అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో నూతన సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కె.కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలు సాఫీగా బదిలీ అయ్యేందుకు నూతన సారథికి సహకారం అందిస్తారని టీసీఎస్ ప్రకటించింది. కృతివాసన్‌కు టీసీఎస్‌తో 34 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. 1989 నుంచి ఆయన టీసీఎస్‌తోనే కలసి పనిచేస్తున్నారు. తన కెరీర్లో కృతివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తదితర బాధ్యతల్లో పనిచేసినట్టు టీసీఎస్ తెలిపింది. టీసీఎస్ ఎండీ, సీఈవోగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూపు చైర్మన్‌గా పదోన్నతి పొందడంతో.. సీఎఫ్‌వోగా ఉన్న రాజేశ్ గోపీనాథన్ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఆరేళ్లుగా సంస్థకు ఎండీ, సీఈవోగా సేవలు అందించారు. టీసీఎస్‌లో 22 ఏళ్లుగా గోపీనాథన్ పనిచేస్తున్నారు. (గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!) ‘‘టీసీఎస్‌లో నా 22 ఏళ్ల ఉద్యోగ మజిలీని ఎంతో ఆస్వాదించాను. చంద్రతో సన్నిహితంగా కలసి పనిచేయడం పట్ల ఆనందంగా ఉంది. నా ఈ మొత్తం ప్రయాణానికి ఆయన మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఈ దిగ్గజ సంస్థకు గడిచిన ఆరేళ్లుగా నాయకత్వం వహించడం పట్ల సంతృప్తికరంగా ఉంది. ఈ కాలంలో అదనంగా 10 బిలియన్ డాలర్ల ఆదాయం, 70 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తోడయింది’’అని గోపీనాథన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఆసక్తులకు సమయం కేటాయించేందుకు ఇదే సరైన సమయమని భావించి తప్పుకుంటున్నట్టు చెప్పారు. -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవో జీతమెంతో తెలుసా?
భారత సంతతికి చెందిన నీల్ మోహన్ ఇప్పుడు యూట్యూబ్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే సుసాన్ వోజ్కికీ స్థానంలో నియమితులైన నీల్మోహన్ భారీ ప్యాకేజీ అందుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ-అమెరికన్ మోహన్.. సుసాన్ వోజ్కికీ నేతృత్వంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా యూట్యూబ్ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. సీఈఓగా అర్హుల జాబితాలో చాలామంది ఉన్నా నీల్ మోహన్నే యూట్యూబ్ ఎంపిక చేయడం విశేషం. యూట్యూబ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుండటంతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా మోహన్ పని చేశారు. గూగుల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌లో చిన్న ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. గూగుల్‌లో డిస్ప్లే, వీడియో ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించిన ఆయన యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, యాడ్సెన్స్, యాడ్‌మాబ్, డబుల్ క్లిక్ యాడ్ టెక్ వంటి ఉత్పత్తి సేవల బాధ్యతలు నిర్వహించారు. యూట్యూబ్‌కు రాజీనామా చేసిన వోజ్కికీకి యాజమాన్యం భారీ జీతం ఇచ్చేది. మీడియా నివేదికల ప్రకారం నెలకు సుమారు 3,74,829 యూఎస్ డాలర్ల జీతం తీసుకునేవారు ఆమె. అంటే మన కరెన్సీలో రూ. 3.1 కోట్లు. దీని బట్టే..కొత్త సీఈవో నీల్ మోహన్ జీతం అంతకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో నీల్ మోహన్ ట్విటర్‌కు మారకుండా ఉండేందుకు గూగుల్ నుంచి 100 మిలియన్ డాలర్లు బోనస్‌గా అందుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!) -
Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా
సాక్షి, ముంబై: గ్లోబల్ టెక్ కంపెనీలకు సారధులుగా భారతీయ సంతతికి చెందిన నిపుణులు సత్తా చాటుతున్నారు. తాజాగా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ సీఈవోగా ఇండో అమెరికన్ నీల్మోహన్ నియమితులయ్యారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్కికీ తప్పుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతీయ-అమెరికన్ నీల్మోహన్ 2015 నుండి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీచేసిన మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్ కంపెనీల్లో కూడా పనిచేశారు. మరోవైపు దాదాపు పాతికేళ్లపాటు గూగుల్‌కు పనిచేసిన తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నానని సుసాన్ చెప్పారు. తన వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లో 2007లో డబుల్‌క్లిక్ కొనుగోలుతో గూగుల్‌కు వచ్చినప్పటినుంచీ దాదాపు 15 సంవత్సరాలు మోహన్‌తో కలిసి పనిచేశాననీ ఆమె చెప్పారు. అయితే గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కు సలహాదారుగా మార నున్నారని సమాచారం. Thank you, @SusanWojcicki. It's been amazing to work with you over the years. You've built YouTube into an extraordinary home for creators and viewers. I'm excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead... https://t.co/Rg5jXv1NGb — Neal Mohan (@nealmohan) February 16, 2023 సుసాన్ వోజ్కికీ కాగా ఇప్పటికే గ్లోబల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పెప్సికో ఇంద్రా నూయి, తమ ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నీల్ మోహన్ చేరడం విశేషం. -
కొత్త సీఈవో అంటూ మస్క్ ట్వీట్: ‘ఇక ఇదే ఆఖరు’ చెత్త ఫోటోలపై యూజర్లు ఫైర్
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్‌ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్టయిలిష్‌గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్‌లో క్రేజీ లుక్స్‌తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్‌టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్‌పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్మస్క్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. pic.twitter.com/iZUukCVrl5 — Elon Musk (@elonmusk) February 14, 2023 -
కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్‌ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ నియమితులయ్యారు. గ్రోత్‌కు సంబంధించి మంజి పొజిషన్లో ఉన్న కాగ్నిజెంట్ సీవోగాఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్‌లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షికవేతనం ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. 2020లో అంబానీ జీతం కంటే నాలుగు రెట్ల అధికం రవి కుమార్ జీతం 2020లో ముఖేశ్ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్‌ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్ బేసిక్ సాలరీగా ఒక మిలియిన్‌డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను పొందనున్నారు. .కాగా గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్‌యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ . -
స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్
న్యూఢిల్లీ: ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం స్టార్‌బక్స్ సీఈఓగా ఉన్న హోవర్డ్ షుల్ట్జ్ స్థానంలో లక్ష్మణ్ నరసింహన్‌నుఎంపిక చేసింది. అయితే రానున్న అక్టోబర్‌లో కంపెనీ చేరనున్న నరసింహన్ ఏప్రిల్1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ ‘‘రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు. ముఖ్యంగా బారిస్టాలకు మెరుగైన వేతనాలు, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగు పర్చడం, స్టోర్లను తీర్చిదిద్దడంలాంటివి ఉన్నాయి. మేనేజ్మెంట్ టీమ్‌తో చర్చలు, బరిస్టాగా సమగ్ర పరిశీలన ఉద్యోగులను కలవడంతోపాటు, తయారీప్లాంట్లు, కాఫీ ఫామ్‌లను సందర్శిస్తారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటి వరకూ తాత్కాలిక సీఈఓగా ఉండాలని హోవర్డ్‌ను కోరినట్టు తెలిపింది. ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవినుంచి వైదొలగుతున్నట్టు స్టార్‌బక్స్ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4శాతం పడిపోయాయి. నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరిన నరసింహన్ కోవిడ్‌కాలంలో కూడా కంపెనీని విజయపథంలో నడిపి మార్కెట్ వర్గాల ప్రశంసలందుకున్నారు. 1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి దానిలో అధికారం చేపట్టిన తొలి ప్రవాస భారతీయుడు కూడా. అలాగే గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసొంహన్ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరియైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది. -
ఎన్ఎస్ఈ చీఫ్‌గా చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్ చౌహాన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం పాటు బీఎస్ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసిన నేపథ్యంలో, ఈ పదవికి చౌహాన్ ఎంపిక కావడం తెలిసిందే. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. 2000 సంవత్సరంలో ఎన్ఎస్ఈని వీడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు కంపెనీల్లో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. తిరిగి 2009లో బీఎస్ఈ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపట్టి, 2012లో సీఈవో అయ్యారు. మరోవైపు బీఎస్ఈ కొత్త చీఫ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ బీఎస్ఈ రోజువారీ వ్యవహారాలు చూస్తుందని పేర్కొంది. కీలక బాధ్యతలు.. ఎన్ఎస్ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ ముందు పరిష్కరించాల్సిన పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో తరచూ సాంకేతిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆశిష్ కుమార్ చౌహాన్ దీనికి పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే, కోలొకేషన్ స్కామ్‌లో ఎన్ఎస్ఈ తనపై పడ్డ మరకను కడిగేసుకోవాల్సి ఉంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్ఎస్ఈని విజయవంతంగా ఐపీవోకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అలాగే, పాలనా లోపాలకు చెక్ పెట్టాల్సి ఉంది. బీఎస్ఈ బాస్‌గా ఆశిష్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎక్సేంజ్‌గా తీర్చిదిద్దారు. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫామ్ బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్‌ను ఏర్పాటు చేశారు. -
అమెజాన్ కొత్త సీఈఓ జీతం ఎంతో తెలుసా
అమెజాన్ నూతన సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన అందుకోబోతున్న స్టాక్గ్రాంట్లు, వేతన వివరాలను అమెజాన్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ సీఈవోగా జెఫ్ బెజోస్ సెంటిమెంట్ ప్రకారం జూలై 5 న పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో బెజోస్ స్థానంలో జస్సీ బాధ్యతలను స్వీకరించారు. ఆండీ జస్సీకు 61 వేల షేర్లను మంజూరు చేస్తుందని అమెజాన్ ప్రకటించింది. దీని విలువ 214 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లు) పదేళ్ల కాలానికి ఈ షేర్లను అతనికి కేటాయించనుంది. 300 మిలియన్ల డాలర్లు విలువైన షేర్లు ఇప్పటికే జాస్పీ సొంతం. అమెజాన్ షేర్ అధారంగా ఈ విలువ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్‌గా ఆయన అందుకుంటున్న అవార్డుల కంటే ఇది చాలా పెద్దది. అలాగే ఆండీ జస్సీ బేసిక్ వేతనం 1,75,000 డాలర్లుగా ( సుమారు కోటి, 30 లక్షల రూపాయలు) ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్లు షేర్లు అతని ఖాతాలోఉన్నాయి. 2020 నాటికి ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్లు డాలర్లు. అయితే ఇతర టెక్నాలజీ పరిశ్రమలో ప్రత్యర్థి సీఈఓలతో పోలిస్తే జస్సీ స్టాక్ గ్రాంట్ తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ పరిశ్రమలో ప్రత్యర్థి సీఈఓలతో పోలిస్తే జస్సా స్టాక్ గ్రాంట్ తక్కువ అట. కొత్త సీఈఓల నియామకం సందర్భాల్లో పెద్ద టెక్ కంపెనీలలో ఈ రకమైన స్టాక్ గ్రాంట్లు సాధారణం. ఆపిల్ టిమ్ కుక్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ,మైక్రోసాఫ్ట్ సీఈఓ గా సత్య నాదెళ్ల అత్యున్నత పదవులను చేపట్టినపుడు ఇలాంటి స్టాక్ అవార్డులను పొందారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితుడైన సత్య నాదెళ్ళ 2020 జూన్ 30 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 215 మిలియన్ డాలర్ల షేర్లను కలిగి ఉన్నారు. ఆయన మూల వేతనం 2.5 మిలియన్ డాలర్లు. కాగా 1994లో స్థాపించినప్పటి నుంచీ అప్రతిహతంగా వృద్ధి చెందిన టెక్ దిగ్గజం అమెజాన్ వాల్యూ పరంగా 1.8 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అయితే గత సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ, అమెజాన్ స్టాక్ ఫ్లాట్‌గా ఉంది. -
Paroma Chatterjee: బిజినెస్ లీడర్ లాభాల చెయ్యి
ఆర్ధిక లావాదేవీలను, వ్యవహారాలను టెక్నాలజీతో నడిపించే రంగాన్ని ‘ఫైనాన్స్ టెక్నాలజీ’ (ఫిన్‌టెక్) అంటారు. టెక్నాలజీ ఒక్కటే తెలిస్తే కాదు, ఫైనాన్స్ కూడా తెలిసుండాలి. కొంచెం కష్టమైన, ప్రావీణ్యం అవసరమైన పరిజ్ఞానాలివి. అయితే పరోమా చటర్జీకి ఇవి తప్ప వేరే ఏవీ ఆసక్తికరమైనవి కావని అనిపిస్తుంది. గత పదిహేనేళ్లుగా లెండింగ్ కార్ట్, ఫ్లిప్‌కార్ట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పెద్ద సంస్థల ‘ఫిన్‌టెక్’ విభాగాలలో అసమాన వృత్తి నైపుణ్యం కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడిక ‘రివల్యూట్’ అనే 400 కోట్ల పౌండ్ల బ్రిటన్ కంపెనీ.. భారత్‌లో అదే పేరుతో తను ప్రారంభించబోతున్న కంపెనీకి వెళుతున్నారు! పరోమాను భారత్‌లోని తమ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్లు ‘రివల్యూట్’ సంస్థ గురువారం ప్రకటించింది. మహిళలకు డబ్బు వ్యవహారాలు తెలియవని, టెక్నాలజీ పరిజ్ఞానం అంతంత మాత్రమేనని కింది స్థాయిలో ఎవరెంత అనుకున్నా, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఆ రెండు విభాగాలను నడిపిస్తున్నది దాదాపుగా మహిళలే. రివల్యూట్ను ఇప్పుడు పరోమా చటర్జీ నడిపించబోతున్నారు. ఆ కంపెనీ మనీ ట్రాన్స్ఫర్, ఎక్ఛేంజి, స్టాక్ ట్రేడింగ్, లోన్లు, వెల్త్ ట్రేడింగ్ సేవలను అందిస్తుంటుంది. అందుకు అవసరమైన టెక్నాలజీని వృద్ధి చేస్తుంటుంది. వచ్చే పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీని భారత్‌లో విస్తృత పరిచేందుకు రివల్యూట్ ఏరికోరి పరోమాను ఎంపిక చేసుకుంది. అంటే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి వాటిని పరోమా పక్కకు తోసేయాలి. ఛాలెంజింగ్ జాబ్! పరోమా లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివొచ్చారు. ఆ తర్వాత ఆమె తక్కువస్థాయి ఉద్యోగాలేమీ చేయలేదు. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లో కూడా చేశారు. రివల్యూట్ ఆఫర్ రావడానికి ముందు వరకు ఆమె లెండింగ్ కార్ట్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్. దేశంలోని వ్యాపారవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చే విభాగానికి అధికారి ఆమె. తర్వాత వయా.కామ్ అనే ‘బిజినెస్ టు బిజినెస్ టు కన్యూమర్’ (బి2బి2సి) ఇంటర్నెట్ ట్రావెల్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా పదిదేశాలలోని లక్షకు పైగా గల ఏజెంట్ల వ్యవస్థను నిర్వహించారు. ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాల విభాగానికి ఇన్చార్జిగా చేశారు. ∙∙ పరోమా చటర్జీ ఇప్పుడు సీఈవోగా వెళ్తున్న రివల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థ. సిలికాన్ వ్యాలీలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవీసి, డీఎస్టీ గ్లోబర్, రిబిట్ క్యాపిటల్, లేక్స్టార్, జీపీ బుల్హౌండ్ల పెట్టుబడులు రివల్యూట్లో ఉన్నాయి. వాళ్లకు అసలుతో పాటు లాభాలూ అందించడం ఇప్పుడు రివల్యూట్ ఇండియా సీఈవో గా పరోమా బాధ్యత కూడా! ఇండియాలో తన విస్తరణకు సుమారు 200 కోట్ల రూపాయలను రివల్యూట్ వెచ్చించబోతోంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రారంభించబోతున్న కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా బెంగళూరును ఎంపిక చేసుకోవచ్చని ఆ రంగంలో ఉన్న ఇక్కడివారి అంచనా. పరోమా ఇంతవరకు పని చేసిన కంపెనీలనీ ప్రధానంగా బెంగళూరులోనివే. ఆమె చదువు కూడా ఒక నగరానికే పరిమితం అవలేదు. స్కూలు విద్య బెంగళూరులో; ఇంటర్, డిగ్రీ కోల్‌కతాలో, పీజీ ఐ.ఐ.ఎం. లక్నోలో. -
ఎంఅండ్ఎం సీఈఓగా అనీష్ షా
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సీఈవోను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూప్ సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న అనీష్ షాను ఎండీ, సీఈవోగా నియమించింది. తద్వారా ఎంఅండ్ఎం గ్రూప్ చరిత్రలో తొలిసారి వృత్తిగత నిపుణుడిని సీఈవోగా ఎన్నుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ గోయెంకా స్థానంలో అనీష్ ఎంఅండ్ఎం పగ్గాలు చేపట్టనున్నారు. 2021 ఏప్రిల్ 2న గోయెంకా పదవీ విరమణ చేయనున్నట్లు ఇప్పటికే ఎంఅండ్ఎం వెల్లడించింది. ఆనంద్ మహీంద్రా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు గతేడాది నవంబర్లోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రూప్ పగ్గాలను అనీష్ షా అందుకుంటున్నట్లు తెలియజేసింది. సరైన వ్యక్తి..: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా గత ఏడున్నర దశాబ్దాలుగా విజయాల బాటలో సాగుతున్నట్లు కొత్త సీఈవో ఎంపిక సందర్భంగా ఎంఅండ్ఎం గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. మహీంద్రా గ్రూప్‌నకు అనీష్ తగిన నాయకుడంటూ కితాబునిచ్చారు. ఎండీ, సీఈవోగా అనీష్.. గ్లోబల్ బిజినెస్ సహా గ్రూప్‌లోని అన్ని విభాగాలనూ పర్యవేక్షిస్తారని చెప్పారు. 2015లోనే..: అనీష్ షా 2015లో మహీంద్రా గ్రూప్‌లో చేరారు. గ్రూప్ ప్రెసిడెంట్‌గా వ్యూహాల అభివృద్ధి, డిజిటైజేషన్, డేటా సైన్స్‌ల సామర్థ్య పెంపు, వివిధ కంపెనీల మధ్య సహకారం తదితర పలు బాధ్యతలు నిర్వహించారు. ఎంఅండ్ఎంలో చేరకముందు జీఈ క్యాపిటల్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవోగా ట్రాన్స్ఫార్మేషన్ బిజెనెస్‌ల బాధ్యతలను చేపట్టారు. దీనిలో భాగంగా ఎస్బీఐ కార్డ్ భాగస్వామ్య బిజినెస్‌ను టర్న్అరౌండ్ బాట పట్టించారు. జీఈలో 14 ఏళ్లపాటు యూఎస్, గ్లోబల్ యూనిట్లలో పలు విధులు నిర్వహించారు. కన్సాలిడేషన్‌కు ఓకే..: అనుబంధ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ కన్సాలిడేషన్ ప్రతిపాదనకు బోర్డు అనుమతించినట్లు ఎంఅండ్ఎం వెల్లడించింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) బిజినెస్‌కు తగిన నిధులు, వ్యూహాలకు మార్గం ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఈవీ కార్యకలాపాలను లాస్ట్ మైల్ మొబిలిటీ(ఎల్ఎంఎం), ఎలక్ట్రిక్ వెహికల్ టెక్ సెంటర్ పేరుతో రెండు ప్రత్యేక విభాగాలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. -
పురి.. వారసుడొచ్చాడు!
ముంబై: ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్దీశన్ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అక్టోబర్ 27 నుంచీ మూడేళ్లపాటు జగ్దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు. 25 యేళ్ల అనుబంధం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. బ్యాంక్‌లో అత్యుత్తమ రీతిలో ‘స్ట్రేటజిక్ చేంజ్ ఏజెంట్’గా పనిచేస్తున్న ఘనత ఆయనకు ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్దీశన్ ఒకరు. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– సోమవారం సాయంత్రం మొత్తం మూడు పేర్లను ఆమోదం నిమిత్తం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపింది. ఇందులో జగ్దీశన్ పేరు బ్యాంక్ బోర్డ్ మొదటి ప్రాధాన్యతలో ఉంది. హోల్‌సేల్ లెండింగ్ చీఫ్ కజాద్ బారూచా, సిటీ కమర్షియల్ బ్యాంక్ సీఈఓ సునీల్ గార్గ్‌లు బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపిన జాబితాలో మరో రెండు పేర్లు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్దీశన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్ ఏజెంట్’గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. బ్యాంక్ లాభాల బాట... ఆదిత్యపురి సుదీర్ఘ బాధ్యతల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్నో విజయాలు సాధించింది. ఇన్వెస్టర్లకు విశ్వసనీయ బ్యాంక్‌గా మార్కెట్క్యాప్ రూ.5.71 లక్షల కోట్లకుపైగా చేరింది. మొండిబకాయిల భారం భారీగా పెరిగిపోకుండా పటిష్ట నియంత్రణలు ఇక్కడ చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల పురి పదవీ కాలంలోని తొలి పదేళ్లలో బ్యాంక్ 30 శాతంపైగా లాభాల వృద్ధిని నమోదుచేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో ఈ శాతం 20కి తగ్గింది. ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 15.45 లక్షల కోట్లు. ఇందులో రూ.10 లక్షల కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. బ్యాం క్కు ప్రస్తుతం ఉన్న నాన్–బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో లిస్ట్‌కానుంది. పురి బాధ్య తలు అక్టోబర్ 26తో ముగుస్తాయనీ, తరువాతి రోజు నుంచీ జగ్దీశన్ ఆ చైర్‌లోకి వస్తారనీ స్టాక్ ఎక్సే్చంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. సవాళ్లున్నాయ్... బ్యాంక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక సవాళ్లు జగ్దీశన్కు ఎదురుకానున్నాయి. అనిశ్చితి ఆర్థిక వాతావరణంలో బ్యాంక్ నిర్వహణ ఇందులో మొదటిది. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో గత లాభాల బాటలో కొనసాగడానికి బ్యాంక్ కొత్త వ్యాపార వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ వాహన ఫైనాన్స్ బిజినెస్‌లో అసమంజస రుణ విధానాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపులు, బదిలీలు జరిగాయి. ఈ తరహా ఆందోళనలను జగ్దీశన్ పూర్తిస్థాయిలో నివారించాల్సి ఉంటుంది. దూసుకుపోయిన షేర్... కొత్త సీఈఓ నియామకం పట్ల ఇన్వెస్టర్లలో హర్షం వ్యక్తమైంది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సే్చంజ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 3.94 శాతం (రూ.39.45) ఎగసి రూ.1,041కి చేరింది. హర్షణీయం... ఈ నియామకం నాకు సం తోషాన్ని ఇచ్చింది. చేంజ్ ఏజెంట్‌గా నియమితులైననాటి నుంచీ ఆయనతో నేను ఎంతో సన్నిహితంగా పనిచేశాను. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని శక్తిసామర్థ్యాలు, నైపుణ్యత శశిధర్ జగదీశన్‌కు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ వ్యక్తి చేతుల్లో ఉందని భావిస్తున్నాను. మరిన్ని విజయాలు సాధిస్తారని విశ్వసిస్తున్నాను. – ఆదిత్యపురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొత్త సీఈఓ : షేరు దూకుడు
సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు కొత్త సీఈఓగా శశిధర్ జగదీషన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బ్యాంకు ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. త్వరలో ప్రస్తుత సీఈఓ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈఓ ఎంపిక అనివార్యమైంది. ఈ నియామకాన్ని హెచ్డీఎఫ్సీ చైర్పర్సన్ శ్యామలా గోపీనాథ్ ధృవీకరించారు. 1996 సంవత్సరంలో ఫైనాన్స్ ఫంక్షన్ లో మేనేజర్‌గా బ్యాంకులో చేరిన శశిధర్ జగదీషన్ ప్రస్తుతం హెచ్ఆర్ అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్ గా ఉన్నారు. ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్ లో హెచ్డీఎఫ్సీ షేరు భారీ లాభాలతో దూసుకుపోతోంది. కాగా 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంకును స్థాపించిన నాటి నుంచి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్న ఆదిత్యపురి పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ 20తో ముగియనుంది. మరోవైపు ఈ జూలై 21-24 తేదీల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను ఆదిత్య విక్రయించారు. శశిధర్ జగ్‌దీషన్ తోపాటు కైజద్ బరుచా, సునీల్ గార్గ్ ఈ పదవి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
విప్రో కొత్త సారథిగా థియెరీ డెలాపోర్ట్
న్యూఢిల్లీ: కొంత కాలంగా వృద్ధి పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఐటీ రంగ దిగ్గజం విప్రో కొత్త సారథిని ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమినీలో సుదీర్ఘకాలం పనిచేసిన థియెరీ డెలాపోర్ట్.. నూతన సీఈవో, ఎండీగా జూన్ 6 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని విప్రో నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అబిదాలి జెడ్ నీముచ్వాలా జూన్ 1న తప్పుకోనున్నారు. అప్పటి నుంచి డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టే వరకు రోజువారీ కార్యకలాపాలను చైర్మన్ రిషద్ప్రేమ్జీ చూస్తారని విప్రో తెలిపింది. పోటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ కూడా అంతకుపూర్వం క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం. పోటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పోల్చుకుంటే విప్రో వృద్ధి పరంగా వెనకబడిన తరుణంలో ఈ నూతన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విప్రో సీఈవోగా క్యాప్‌జెమిని సీవోవో
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్‌ను ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన డెలాపోర్ట్‌ను సీఈవో, ఎండీగా నియమిస్తున్నట్లు విప్రో తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ విప్రో సీఈవోగా కొనసాగుతున్న అబిదాలీ నీముచ్‌వాల ఈ నెల31కల్లా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో జూన్ 1 నుంచీ డెలాపోర్ట్ విప్రో కొత్త సీఈవోగా పదవిని చేపట్టనున్నారు. నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీముచ్‌వాల వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. డెలాపోర్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడైన డెలాపోర్ట్ వివిధ హోదాలలో పాతికేళ్లకుపైనే కంపెనీలో పనిచేశారు. ఈ బాటలో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యూహాత్మక బిజినెస్ యూనిట్‌కు సీఈవోగా సైతం విధులు నిర్వహించారు. గ్లోబల్ సర్వీస్ విభాగాలకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశీయంగా క్యాప్‌జెమిని కార్యకలాపాలను పర్యవేక్షించారు. -
వేదాంత డైరెక్టర్‌గా అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: మైనింగ్ మ్యాగ్నెట్ అనిల్ అగర్వాల్.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. అనిల్ అగర్వాల్(66)ను నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నవీన్ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్. వెంకటకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. -
‘అరవింద్’ సమేత..
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారు. 200 బిలియన్ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ... 1990లో ఐబీఎంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్వేర్) స్థాయికి చేరారు. ‘సీఈవోగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత సీఈవో వర్జీనియా రొమెటీ, బోర్డ్ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఐటీ పరిశ్రమ శరవేగంగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం సిబ్బంది, క్లయింట్లతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. వ్యాపారాలను మరింతగా మెరుగుపర్చుకునేలా క్లయింట్లకు తోడ్పడటానికి ఇదో అద్భుతమైన అవకాశం‘ అని కృష్ణ పేర్కొన్నారు. ఆయనతో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జేమ్స్ వైట్‌హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కొత్త శకానికి.. సరైన సారథి ‘ఐబీఎం తదుపరి శకానికి కృష్ణ సరైన సారథి. క్లౌడ్, కాగ్నిటివ్ శకంలో కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సరైన వ్యక్తి. ఐబీఎం చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలు అయిన ‘రెడ్ హ్యాట్’ డీల్‌కు ఆయనే సూత్రధారి. అరవింద్ కృష్ణ అద్భుతమైన టెక్నాలజిస్టు. ఐబీఎంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ వంటి కీలక టెక్నాలజీలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడు‘ అని వర్జీనియా రొమెటీ (62) వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా ఐబీఎంలో వివిధ హోదాల్లో పనిచేసిన రొమెటీ ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది ఆఖర్లో రిటైరవుతారు. సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు సరైన వ్యక్తి కోసం సాగిన అన్వేషణలో.. అరవింద్ కృష్ణ ఎంపికయ్యారని ఐబీఎం లీడ్ డైరెక్టర్ మైఖేల్ ఎస్క్యూ పేర్కొన్నారు. సమోసా పార్టీ..! అరవింద్ కృష్ణ నియామకంపై దేశీ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. భారతీయుల సామర్థ్యాలకు తాజా నియామకం నిదర్శనమని మహీంద్రా ట్వీట్ చేశారు. అదే సమయంలో ఇకపై వైట్‌హౌస్ ఎప్పుడైనా టెక్ దిగ్గజాల సదస్సుల్లాంటివి ఏర్పాటు చేస్తే.. హాంబర్గర్ల స్థానంలో కచ్చితంగా భారతీయులకిష్టమైన సమోసాలుండేలా చూసుకోవాల్సి వస్తుందంటూ సరదాగా పేర్కొన్నారు. సాంబర్ వడ, మసాలా చాయ్ లాంటివి కూడా పెట్టాలంటూ నెటిజన్లు లిస్టులో మరిన్ని చేర్చారు. ప్రస్థానం ఇలా... పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో పీహెచ్డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ–రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు. సిలికాన్ వ్యాలీలో భారతీయ జెండా.. అరవింద్ కృష్ణ నియామకంతో టెక్నాలజీ రంగంలో భారతీయుల సత్తా మరోసారి చాటినట్టయింది. అమెరికా సిలికాన్ వ్యాలీలోని నాలుగు అతిపెద్ద బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు భారతీయులే సీఈఓలు. ప్రధానంగా గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. ఇతర ఎంఎన్సీల విషయానికొస్తే... మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగాతో పాటు పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి కూడా అత్యంత సుపరిచితులే. వారినొకసారి చూస్తే... సుందర్ పిచాయ్: తమిళనాడుకు చెందిన పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు. 47 ఏళ్ల పిచాయ్‌కు తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలు కూడా అప్పగించి కంపెనీ ప్రమోటర్లు వైదొలగడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. సత్య నాదెళ్ల: 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం. హైదరాబాద్‌లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. 2014లో స్టీవ్‌బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. శంతను నారాయణ్: యాపిల్‌లో కెరీర్‌ను ప్రారంభిం చిన నారాయణ్ 1998లో అడోబ్ సిస్టమ్స్‌లో వైస్–ప్రెసిడెంట్‌గా జాయిన్ అయ్యారు. 2007లో ఏకంగా ఆ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశారు. జార్జ్ కురియన్: కేరళలోని కొట్టాయంకు చెందిన కురియన్... అమెరికా దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్టోరేజ్ అండ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ ‘నెట్‌యాప్’కు 2015లో ప్రెసిడెంట్, సీఈఓగా నియమితులయ్యారు. -
కెనరాబ్యాంక్, బీఓబీ, బీఓఐలకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. బీఓబీ: సంజయ్ చంద్ర ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్ చంద్ర బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎస్ జయకుమార్ స్థానంలో సంజయ్ చంద్ర నియామకం జరిగింది. బీఓఐ: బ్యాంక్ ఎండీ సీఈఓగా అతనూ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు. కెనరా బ్యాంక్: లింగమ్ వెంకట్ ప్రభాకర్ ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రభాకర్ పీఎన్బీలో ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్ కానున్న ఆర్ఏ శంకర్ నారాయణన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
ఇండిగో కొత్త సారథి రణజయ్ దత్తా
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న రణజయ్ దత్తాను నూతన సీఈవోగా ఐదేళ్ల కాలానికి నియమించినట్టు ఇండిగో ప్రకటించింది. ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది. ఇక, సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమించినట్టు తెలిపింది. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. రణజయ్ దత్తా ప్రస్తుతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఆయన 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్లానింగ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మెయింటెనెన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) వంటి కీలక పదవులను నిర్వహించారు. ఎయిర్ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్ కెనడా, యూఎస్ ఎయిర్వేస్ సంస్థలకు అడ్వైజర్‌గానూ వ్యవహరించారు. ‘‘ఇండిగో ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థగా అపూర్వ విజయం సాధించింది. ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధికంగా వృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇండిగో ఒకటి. భవిష్యత్తులో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని దత్తా పేర్కొన్నారు. ఇండిగోకు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మాతృ సంస్థ. డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ సంస్థ నికర లాభం 75 శాతం క్షీణించి రూ.190 కోట్లకు పరిమితమయింది. ఇండిగోకు ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య ఘోష్ ఇటీవలే హోటల్ అగ్రిగేటర్ ఓయోలో చేరిన సంగతి తెలిసిందే. -
‘యస్’ బాస్.. రవ్నీత్ సింగ్ గిల్!
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్నీత్ సింగ్ గిల్ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1వ తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యస్ బ్యాంక్ తెలిపింది. 29న బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం జరుగుతుందని పేర్కొంది. 28 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం... 2012, ఆగస్టు నుంచి రవ్నీత్ సింగ్ గిల్ డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. యస్ బ్యాంక్ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌ను సీఈఓ, ఎమ్డీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆర్బీఐ ఆదేశించింది. కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించకపోయినప్పటికీ, కపూర్ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్ సీఈఓ విషయమై అనిశ్చితి తొలగిపోవడంతో యస్ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో 8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 19% ఎగసి రూ.235ను తాకింది. షేర్ జోరు కారణంగా యస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్... యస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,002 కోట్లకు తగ్గిందని యస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం 7 శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధి చెంది రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత క్యూ3లో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు. తగ్గిన రుణ నాణ్యత.. యస్ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ3లో 1.72%గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93% నుంచి 1.18%కి చేరాయి. తప్పని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సెగ ! ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్ కంపెనీలకు(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌గా అంచనా) రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని రాణా కపూర్ పేర్కొన్నారు. -
కొత్త సీఎండీ, యస్ బ్యాంకు షేరు దూకుడు
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అటు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు..ఇటు కొత్త సీఎండీ ప్రకటన...దీంతో యస్‌బ్యాంకు కౌంటర్లో ఉత్సాం నెలకొంది. తమ బ్యాంకు కొత్త ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్‌ను ఎంపిక చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. దీనికి ఆర్బీఐ ఆమోదం లభించిందనీ, మార్చి1 నుంచి గిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గిల్ ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యస్ బ్యాంకు రూ. 1001 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 2667 కోట్లుకాగా. రూ. 2297 కోట్లమేర స్లిప్పేజెస్ నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.6 నుంచి 2.1 శాతానికి, నికర ఎన్పీఏలు 0.86 శాతం నుంచి 1.18 శాతానికి పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ ఎక్స్పోజర్ విలువ రూ. 2530 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు దూసుకుపోయింది. యస్ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 235 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14.32 శాతం లాభంతో రూ. 225 వద్ద నిలిచింది. కాగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ససేమిరా అంగీకరించికపోవడంతో ఫిబ్రవరికల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవలసి ఉన్న సంగతి తెలిసిందే -
యాక్సిస్ బ్యాంక్‌కు కొత్త సీఈవో..
ముంబై : యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో కొత్త సీఈవో, ఎండీ దొరికేశారు. యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవో, ఎండీగా అమితాబ్ చౌదరిని మూడేళ్ల పాటు నియమిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసిన ఫైలింగ్ ఈ విషయాన్ని బ్యాంక్ వెల్లడించింది. ‘నేడు జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్‌లో 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అంటే మూడేళ్ల పాటు అమితాబ్ చౌదరిని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమించాలని నిర్ణయించాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఆమోదం తెలిపింది’ అని బ్యాంక్ తెలిపింది. ఈ నియామకం, రెమ్యునరేషన్ నియమ, నిబంధనల ప్రకారం ఉంటుందని పేర్కొంది. అమితాబ్ చౌదరి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో పనిచేస్తున్నారు. 2010లో ఆయన హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరారు. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరువలో దేశంలో అత్యంత విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉంది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌కు సీఈవో, ఎండీగా ఉన్న శిఖా శర్మ పదవి కాలం ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. ఈ పోస్టు కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను బ్యాంక్, ఆర్బీఐ వద్దకు పంపింది. వారిలో అమితాబ్ చౌదరిని ఈ పదవి వరించింది. చౌదరి బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరకముందు ఇన్ఫోసిస్ బీపీవో పనిచేశారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆసియాకు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్, హోల్‌సేల్ బ్యాంకింగ్‌కు, గ్లోబల్ మార్కెట్లకు రీజనల్ ఫైనాన్స్ హెడ్‌గా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పదవులు చేపట్టారు. -
శిఖాశర్మ స్థానంలో ప్రభుత్వ బ్యాంకర్
న్యూఢిల్లీ : పీఎస్ జయకుమార్.. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయనే ఇక యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ స్థానంలో, జయశంకర్ ఆ పదవిని అలంకరించబోతున్నారని తెలుస్తోంది. కొత్త సీఈవోను వెతుకులాడేందుకు బ్యాంక్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఇగోన్ జెహెండర్ను నియమించింది. జెహెండర్ ఆధ్వర్యంలోని సెర్చ్ ప్యానల్, జయకుమార్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జయకుమార్ అంతకముందు సిటీబ్యాంకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఓబీ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం బీఓబీలో ముగియబోతోంది. కాగ, శిఖా శర్మ ఈ ఏడాది చివరికి శాశ్వతంగా తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. 2018 సెప్టెంబర్ వరకు యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవోపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జయకుమార్తో పాటు ఈ పదవికి బ్యాంక్ డిప్యూటీ ఎండీ వీ శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్‌లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను, బోర్డు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనుంది. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి సీఈవో ఎవరో తేల్చేశాక, షేర్‌హోల్డర్స్, ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఆమోదం పొందుతుంది. కాగ, గతేడాది జూలైలోనే యాక్సిస్ బ్యాంక్, శిఖా శర్మను మరోసారి సీఈవో, ఎండీగా నియమించింది. 2018 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఆమెనే కొనసాగనున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఆర్బీఐ అభ్యంతరం తెలిపింది. బ్యాంక్ ప్రదర్శన, ఆస్తుల నాణ్యత బట్టి, మరోసారి యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. అయితే శిఖా శర్మనే తన నాలుగో టర్మ్ పదవి కాలాన్ని 2021 మే వరకు కాకుండా.. ఈ ఏడాది చివరికి ముగించేయాలని కోరినట్టు బ్యాంక్ బోర్డు, ఆర్బీఐకి లేఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరితోనే శిఖాశర్మ తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. -
కొత్త సీఈఓ కోసం ఆ బ్యాంకు వెతుకులాట
ముంబై : ప్రైవేట్ రంగంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు తన కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది. కేవలం ఎనిమిది నెలల్లో శిఖా శర్మ తన పదవి నుంచి దిగిపోతుండగా.. కొత్త సీఈఓను నియామకంపై బ్యాంకు దృష్టిసారించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ పోస్టు కోసం ఆరుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని బోర్డు-సబ్‌కమిటీ ఫైనలైజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈఓ కోసం పోటీ పడే వారిలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇండియా సంజయ్ ఛట్టర్జీ, కేకేఆర్ కంట్రీ హెడ్ సంజయ్ నాయర్, మాజీ డ్యుయిస్ బ్యాంకు ఆసియా-పసిఫిక్ చీఫ్ గునీత్ చదా, సిటీ గ్రూప్ ఇండియా సీఈవో ప్రమీత్ జావేరీలు ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఛట్టర్జీ పేరు అంతకముందు ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా కేవీ కామత్ పదవి విరమణ చేసినప్పుడు కూడా వినిపించింది. కానీ తర్వాత చందా కొచర్‌ను నియమించారు. మిగతా ఇద్దరు బ్యాంకులోని అంతర్గత అభ్యర్థులే ఉన్నారు. వారిలో ఒకరు రిటైల్ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ కాగ, మరొకరు బ్లాక్‌రాక్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ కంపెనీ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్యాంకు ఇండిపెండెంట్ డైరెక్టర్ రోహిత్ భగత్ ఉన్నారు. అయితే ఇంతకముందే తాను కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఆసక్తితో ఉన్నానంటూ యాక్సిస్ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వీ శ్రీనివాసన్ చెప్పారు. ఒకవేళ ఆయనను కూడా సీఈఓ పోస్టుకు పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంకు నిబంధనలకు తగిన వారినే బ్యాంకు సీఈఓగా నియమించాలని బోర్డును ఆర్బీఐ ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు వీడియోకాన్ గ్రూప్ రుణ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు కూడా తాత్కాలిక సీఈఓను నియమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాత్కాలిక సీఈఓను బ్యాంకు నియమించాల్సి వస్తే, ఆయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ సందీప్ భక్షి ఉండొచ్చని సమాచారం. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న పరేఖ్ బాధ్యతలు చేపడతారు. ఆయన పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుంది. ఇకపై యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఇన్ఫోసిస్ తెలిపింది. పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ సారథ్యంలో ఇన్ఫోసిస్ పురోగమించగలదని కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. కీలకమైన సీఈవో పదవికి ఇన్ఫోసిస్ బయటి వ్యక్తిని తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో సీఈవోగా వ్యవహరించిన విశాల్ సిక్కా.. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితమే రాజీనామా చేశారు. నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు పరేఖ్ ఎంపిక జరిగినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫీ బాధ్యతలు చేపడుతున్న పరేఖ్.. పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
ఉబెర్ కొత్త సీఈవో ఎవరంటే..
శాన్ ఫ్రాన్సిస్కో: శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ కంపెనీ కొత్త సీఈవో నియామకం పూర్తి అయింది. ఇటీవలి అంచనాలకు భిన్నంగా అమెరికా ట్రావెల్ కంపెనీ ఎక్స్ పీడియాకు చెందిన దారా ఖోస్రోషాహిని సీఈవోగా ఉబెర్ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రావిస్ కాలనిక్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది. ఆదివారం రాత్రి కంపెనీ జారీ చేసిన ప్రకటన ప్రకారం అనూహ్యంగా రేస్‌లో లేని ఇరాన్ కు చెందిన ఖోస్రోషాహిని కొత్త సీఈవోగా ఎంపిక చేయడం విస్మయపర్చింది. జెఫ్ ఇమ్మెల్ట్, జనరల్ ఎలెక్ట్రిక్ మాజీ సీఈవో, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజెస్ అధిపతి మెగ్ విట్మన్ ఉబెర్ సీఈవో రేసులో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అయితే బోర్డుతో విబేధాల కారణంగా ఉబెర్‌లో జాయిన్ అయ్యే యోచన లేదని విట్మన్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా గుర్తింపు పొందిన ఉబెర్‌లో... పురుషాధిపత్య సంస్కృతి, మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఈవో రాజీనామా చేయక తప్పలేదు. ఉబెర్ మాజీ సైట్ ఇంజనీర్ అయిన సుసాన్ ఫౌలర్ తన సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్ లో తన మాజీ అధికారులపై లైంగిక ఆరోపణల చేయడం వైరల్ అయింది. దీంతో సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపు, వివక్షత, బెదిరింపు మరియు అనైతిక ప్రవర్తన తదితర 200 ఆరోపణలతో యుబర్ అప్పటికే 20 మంది ఉద్యోగులను తొలగించింది. కాగా 2015నుంచి ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండవ త్రైమాసికంలో యుబెర్ సేల్స్ గత త్రైమాసికం నుంచి 17 శాతం పెరిగి రెండవ త్రైమాసికంలో 1.75 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
బీసీసీఐకి కొత్త సీఈవో
ముంబై: బీసీసీఐ నూతన సీఈవోగా రాహుల్ జోహ్రీని నియమిస్తున్నట్టు భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ డిస్కవరీ నెట్ వర్క్స్ ఏసియా, ఫసిఫక్ కి ఉపాధ్యక్షునిగా, జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ ఏషియాగా సేవలందిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. రాహుల్ కి ఉన్న అపారమైన అనుభవం బీసీసీఐకి ఎంతగానో ఉపమోగపడుతుందని అన్నారు. రాహుల్ జోహ్రీ నియామకం పట్ల ఎంతో గర్వంగా ఉన్నమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బీసీసీఐ సీఈవోగా నియామకంపై రాహుల్ స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బోర్డు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.